1
పడుకుని ఉన్నావు నువ్వు
పడుకుని ఉన్నావు నువ్వు. పసిపిల్లలా
ఉంది నీ ముఖం,
శాంతితో, రాత్రిలో గాలికి ఊగి ఆగిన
ఒక పసుపు గులాబీలాగా! పింక్ పసుపు …
పసుపూ గంధం
కలగలిసిన వాసన గదిలో. నీ చుట్టూ …
చెప్పు. ఎవరు నువ్వు? నిజంగా చెప్పిక
ఎవరు నువ్వు?
నిద్రలో, నీలో ఆ శాంతి ఎక్కడిది?
నిద్రలో, పాపాయివలే మెరుస్తుంది కదా
నీ ముఖం! అర్రే
ఆ చిన్ని చిరునవ్వు ఎల్లా వచ్చింది?
*
పడుకొలేను నేను. ఈ రాత్రిలో, మరిక
ఏ రాత్రిలో కూడా –
నిద్రలో, నీ ముఖంలో మెరిసే శాంతి
ఎక్కడో దూరంగా, మిణుకు మంటూ …
2
నా గాయత్రి
ఆవిడ కొంచెం strange. బయటకి మరి
ఎక్కడికి వెళ్ళినా
తిరిగి ఇంటికి వచ్చేదాకా మూత్రం
పోదు. ‘నాకు పాస్ వస్తుంది’ అని తను
Declare చేస్తే, ఇంట్లో
సెలబ్రేషన్. నాకూ, పిల్లలకీ మరి –
‘అమ్మా, పాస్ ఎందుకు దాచుకుంటావు
అమ్మా?’ అని చిన్నోడు
అడిగితే నవ్వుతుంది ఆవిడక మరి
Tom and Jerry లోని catలా ఉరుమురిమి
నావైపు చూస్తో –
అది సరే కానీ, మూత్రం ఆపుకోవడం
ఎందుకు ఇంటికి వచ్చేదాకా? అట్లా? ఆ?
ఆవిడ చూస్తుంది
నన్ను, గండు పిల్లి ముఖంతో ఇక –
*
ఆవిడ కొంచెం strange. చిన్నదీ, మరి
పసిపిల్ల వంటిదీ!
బుజ్జిది. ఊరికే నడుం గీక్కునేది –
*
నేను కూడా కొంచెం strange. నీలాగే –
మూత్రం ఆపుకోననుకో
నీలాగా కానీ, ఊరికే ఉంటాను
నీ పక్కన. నీ వేలు పట్టుకుని, నోట్లో ఒక
పీక పెట్టుకుని తిరిగే
నిక్కరు లేని పిల్లవాడిలాగా. నాలాగా!
*
వదిలిపోవు కదా నన్ను నువ్వు? పాల
వాసనతో, నిద్రలో
ఏదో కలవరించి ఉలిక్కిపడే, నన్ను?
3
గాయత్రి అనీ …
గాయత్రి అని, ఉంటుంది ఒక బుజ్జి పిల్ల –
బుజ్జిది. మేకపిల్ల
ముఖం ఆవిడది. కుందేలు తను!
మిడి గుడ్లేసుకుని చూస్తది తను నన్ను
గండు పిల్లి లాగా,
ముఖ్యంగా నేను బీర్లు తాగినప్పుడు!
పాపం, కంగారు పడతది. కిందా మీదా
అయితది. ఊరికే
కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటది. ఆపై
పిచ్చిగా నవ్వుతది, నన్ను ఇక కొడతది
కరుస్తది. ఏమన్నా
అంటే నిన్ను ప్రేమిస్తా ఆని అంటది!
**
గాయత్రి అని, ఉన్నది ఒక బుజ్జి పిల్ల –
ఉంటది, మేక లాగా
అడవిలో తిరిగే ఒక పులి లాగా –
*
ఏమన్నా అంటే, అటూ ఇటూ చూసిక
చటుక్కున కొరుకుతుంది
నా పెదాలు, జీవితం పండేటట్లు!
***
(for my companion)
Add comment