గాజుసీసాల కథ!

ప్పుడప్పుడూ
ఒకడు నాదారుల్లో
లోకాల్ని పరిత్యజించిన
యోగిలా ఎదురవుతుండేవాడు!
బవిరి గడ్డంతో
చింపిరి జుట్టుతో
జాలి చూపులతో…
మాసిన బట్టలతో
అప్పుడప్పుడు వాడిలో వాడునవ్వుకుంటూ
ఒకడు తారసపడుతుండేవాడు!!

రెప్పల పొరల్లో తడిని తనఖా చేస్తూ
కందెన పెదాల పొడిగారాల ఆ పొగబాలుడు
తడబడుతున్న నడకను
సరిచేసుకుంటూ సాగిపోతుండేవాడు…!

నిప్పును వెతుక్కుంటూ
జేబుల్ని తడుముకుంటూ
బేలచూపులతో దారిని మరచిన వాడికిమల్లే
అక్కడక్కడే తిరుగుతుండేవాడు!

ఒకప్పటి ఖరీదైన
వాడి బట్టల్లో..
ఇప్పుడు ఆ ఖలేజా లేదు..!?
***
ఒకనాడు
సింధూర వైన్స్ లో
పక్క బెంచీలో ఒక్కడే రా తాగుతూ కనిపించాడు
కదిపి చూసాను..
కరిగిపోయాడు..
చేతులు తిరగేసి ఖాళీ ఆకాశాల్ని చూపుతూ..
శూన్యంగా నవ్వాడు…
ఎద గాయాలతో ఎగిరిపోయిన క్షణాలను
కుమ్మరించాడు…
భళ్ళున పగిలిన గాజు సీసాల్లాంటి కథ అది!
అతికించుకోలేని ఆ ముక్కల్లో మునకలేస్తూ
సాగిపోతున్న అగాధ గాధ అది!!
*
ఇప్పుడామె లేదు!
అతడూ తనలోతను లేడు!!

*

కొత్తపల్లి సురేశ్

6 comments

Leave a Reply to సురేష్ కొత్తపల్లి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవితను అనుభూతి తీవ్రతతో రాసి మధ్యలో వదిలేసినట్టు వుంది.అంటే ‘రా’ తాగుతూ ఒక ఆసక్తికరమయిన విషయం చెపుతూ మధ్యలో నిషా ఎక్కువయి పడిపోయినట్టు..ఒక మంచి ఫీల్ వుంది.

  • ఎద గాయాలతో ఎగిరి పోయిన క్షణాలను కుమ్మరించాడు

  • ఎద గాయాలతో ఎగిరి పోయిన క్షణాలను కుమ్మరించాడు… భళ్ళున పగిలిన గాజు సీసా లాంటి కథ…
    —-
    ఇప్పుడామె లేదు!
    అతడూ తనలో తను లేడు!
    వండర్ఫుల్ పోయెమ్ సర్.
    అభినందనలతో…మీ ఆది ఆంద్ర తిప్పేస్వామి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు