అప్పుడప్పుడూ
ఒకడు నాదారుల్లో
లోకాల్ని పరిత్యజించిన
యోగిలా ఎదురవుతుండేవాడు!
బవిరి గడ్డంతో
చింపిరి జుట్టుతో
జాలి చూపులతో…
మాసిన బట్టలతో
అప్పుడప్పుడు వాడిలో వాడునవ్వుకుంటూ
ఒకడు తారసపడుతుండేవాడు!!
రెప్పల పొరల్లో తడిని తనఖా చేస్తూ
కందెన పెదాల పొడిగారాల ఆ పొగబాలుడు
తడబడుతున్న నడకను
సరిచేసుకుంటూ సాగిపోతుండేవాడు…!
నిప్పును వెతుక్కుంటూ
జేబుల్ని తడుముకుంటూ
బేలచూపులతో దారిని మరచిన వాడికిమల్లే
అక్కడక్కడే తిరుగుతుండేవాడు!
ఒకప్పటి ఖరీదైన
వాడి బట్టల్లో..
ఇప్పుడు ఆ ఖలేజా లేదు..!?
***
ఒకనాడు
సింధూర వైన్స్ లో
పక్క బెంచీలో ఒక్కడే రా తాగుతూ కనిపించాడు
కదిపి చూసాను..
కరిగిపోయాడు..
చేతులు తిరగేసి ఖాళీ ఆకాశాల్ని చూపుతూ..
శూన్యంగా నవ్వాడు…
ఎద గాయాలతో ఎగిరిపోయిన క్షణాలను
కుమ్మరించాడు…
భళ్ళున పగిలిన గాజు సీసాల్లాంటి కథ అది!
అతికించుకోలేని ఆ ముక్కల్లో మునకలేస్తూ
సాగిపోతున్న అగాధ గాధ అది!!
*
ఇప్పుడామె లేదు!
అతడూ తనలోతను లేడు!!
*
కవితను అనుభూతి తీవ్రతతో రాసి మధ్యలో వదిలేసినట్టు వుంది.అంటే ‘రా’ తాగుతూ ఒక ఆసక్తికరమయిన విషయం చెపుతూ మధ్యలో నిషా ఎక్కువయి పడిపోయినట్టు..ఒక మంచి ఫీల్ వుంది.
Thank you anna
ఎద గాయాలతో ఎగిరి పోయిన క్షణాలను కుమ్మరించాడు
Thank you sir
ఎద గాయాలతో ఎగిరి పోయిన క్షణాలను కుమ్మరించాడు… భళ్ళున పగిలిన గాజు సీసా లాంటి కథ…
—-
ఇప్పుడామె లేదు!
అతడూ తనలో తను లేడు!
వండర్ఫుల్ పోయెమ్ సర్.
అభినందనలతో…మీ ఆది ఆంద్ర తిప్పేస్వామి
Thank you so much sir