కులాల అడ్డుకట్టలు దాటుకొని…!

నభై ఆరేళ్లు నిండాయి.  జ్ఞాపకాలు జారిపోలేదు.  గొంతు జీర పోలేదు.  జీవితం మీద ఫిర్యాదులు లేవు.  ఏ  కమ్యూనిష్ట్ సిద్ధాంతాలనైతే ఆవిడ నమ్ముకున్నారో అవి ఎన్ని కష్టాలొచ్చినా వంగిపోకుండా నిలబెట్టాయి.  అందుకే ఈ వయసులో కూడా ఆవిడ నిటారుగానే ఉన్నారు.  ఆవిడే నంబూరి పరిపూర్ణ.

మాలదాస కుటుంబంలో పుట్టి, నాటక సంగీత జ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అన్న గారి కమ్యూనిష్ట్ భావాలతో ప్రభావితమయ్యారు.  ఆ రోజుల్లో హీరో లాంటి ఒక కమ్యూనిష్ట్ నాయకుడు ఇష్టపడ్డానంటే నిజమని నమ్మి కాపురం చేశారు.  సమాజోధ్ధారణ ముందు సంసార బాధ్యతలు తుచ్ఛమైనవని ఆ మహానాయకుడు తెంచుకు వెళ్లిపోతే చాలీ చాలని జీతంతో  ఏం కష్టాలు పడ్డారో యేమో సమాజానికి తెలియనివ్వలేదు.  పిల్లల్ని మెరికల్లా తీర్చిదిద్దడమే కాకుండా, వృత్తిరీత్యా  తాను కలుసుకున్న ఎంతో మంది ఆడవాళ్ళు  తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఆలంబనగా నిల్చి, సంసారాన్నైనా, సమాజాన్నైనా నిల్పడానికి నిబద్ధత ముఖ్యమని నిరూపించారు.

చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తి డిప్రెషన్ లోనికి వెళ్ళే వాళ్ళకీ, ఆత్మ హత్యా ఆలోచన్లు చేసుకొనే వాళ్ళకీ ఈవిడ జీవిత కథ “వెలుగు దారులలో ….” ఓ చక్కటి మందు. పరిపూర్ణ గారి జీవితం గురించిన మరిన్ని ముచ్చట్లు ఆవిడ మాటల్లోనే విందాం…ఇది పరిపూర్ణ గారి ఇంటర్వ్యూ చివరి భాగం!

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గొప్ప వ్యక్తి , గొప్ప వ్యక్తిత్వం
    చాలా గొప్పగా పాడారు.

  • సారంగలో అత్యద్భుతమైన శీర్షిక ఇది. ఒకప్పటి తరానికి సంబంధిచిన విషయాలు కళ్ళకు కట్టినట్టు చెబుతూ ఉంటే చాలా ఉద్వేగం కలిగింది. అమరేంద్ర గారి గురించి చిన్నప్పటి చందమామ రచయితగానే తెలుసును ఇంతవరకూ. జీవితంతో పోరాడే స్ఫూర్తిని కలిగించిన పరిపూర్ణ గారికి నమస్కారాలు. మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. Expecting more such interviews of great personalities.

  • ముందుగా అమ్మ పరిపూర్ణ గారికి నమస్సులు. జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఆమె నడిచిన దారి యే తరానికైనా స్ఫూర్తి దాయకం. ఇంత చక్కటి ముఖాముఖి నిర్వహించిన ఛాయ కృష్ణ మోహన్ గారికీ అందుకు వేదిక నిచ్చిన సారంగకూ అభినందనలు. పరిపూర్ణ గారి సాహిత్య జీవితం గురించి కూడా ఒకట్రెండు మాటలు వుంటే యింకా నిండుగా వుండేది.

    • మీరు చెప్పిన సూచన చాలా బాగుంది . థాంక్స్ సర్ .

  • అద్భుతమయిన పరిచయం. మోహన్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఓహో విభావరి పాత ఎంత గొప్పగా పాడేరో. పూర్తికా పాట సాహిత్యం అంతా ఇంకా జ్జ్ఞాపకం ఉండడం నిజంగా అబ్బురమే.

    పరిపూర్ణ గారి “వెలుగు దారులలో ..” కొండపల్లి కోటేశ్వరమ్మ గారి “నిర్జన వారధి..” స్వీయ చరిత్రలు చదివితిరవలసిన రచనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు