కాలా  ‘రజనీ సినిమా’  కాదు!

స్పష్టమైన కులతత్వ వ్యతిరేక రాజకీయాలు కేంద్రంగా ఉంటూ, ప్రతీదీ వాటిచుట్టూనే తిరుగుతూవుండగా, ‘కాలా’ దళిత బహుజన జీవితాన్నీ వాళ్ళ ప్రపంచాన్నీ చూపిస్తుంది. పవిత్రత, అధికారం, స్థానం లాంటి బ్రాహ్మణీయభావజాలానికి ఎదురుగా నిలబడి, వాటినన్నిటినీ పక్కకు తోసేస్తుంది. 

సుమీత్ సామోస్ (ఇంగ్లిష్)   (తెలుగు అనువాదం ల.లి.త.)

(పా. రంజిత్ సినిమాలోని కులతత్వ వ్యతిరేక రాజకీయాల గురించి ఓ దళిత బహుజన పరిశీలన)

‘ప్రధాన స్రవంతి అంటే మేమే’ అని దర్శకుడు పా. రంజిత్  చెప్తున్నట్టుగా వుంది కాలా సినిమా. ‘మేమే’ అంటే ఇక్కడ భూమి, చదువు వనరులూ ఏమీ లేకపోయినా వాటికోసం సంఘటితం అవుతూ పోరాడుతున్న ఈ దేశపు అధిక సంఖ్యాకులైన బహుజనులు.  ఈ కథను చెప్పటానికి ముంబై లోని ధారావి (ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ) ని నేపథ్యంగా తీసుకున్నాడు దర్శకుడు.

సామాన్యంగా ధారావిలో ఎలాంటి సామాజిక వర్గానికి చెందిన మనుషులు వుంటారూ అందులోనూ ప్రత్యేకంగా ఈ సినిమా లొకేషన్ ఎటువంటిదీ అని ఊహించటానికి పెద్దగా ఏం లేదు.  ఆ బస్తీ పేరు భీమ్ వాడా. గౌతమ్ బుద్ధ నగర్. గోడమీద బుద్ధుడూ, మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ల పటాలు. ‘నికల్ నికల్’ పాటలో కోలి వాడా, కుంభార్ వాడా అనే పేర్లు రావటం, సినిమా ప్రారంభంలోనే తమను అక్కడినుండి తరిమేయటానికి ప్రయత్నిస్తున్న ఆ ప్రాంతపు రాజకీయ నాయకులూ అధికారులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేసే చాకలివాళ్ళు.  ఇంతేకాదు. ఆ ప్రాంతానికి దగ్గరలోనే పెరియార్ చౌక్..  ఇయోతీ థాస్, మార్క్స్, లెనిన్ ల ఫోటోలు,  ఇంకా కాలా ఇంటి దగ్గరలోనే బలి చక్రవర్తి  చిన్నసైజు విగ్రహం, అణచివేయబడిన రిపబ్లికన్ పార్టీ  చిన్నజెండాలు (మధ్యలో అశోక చక్రంతో), ఆ దగ్గరే గొడ్డుమాంసం  అమ్మే దుకాణం, అక్కడే ఆకుపచ్చ జెండాలు. సూటిగా చెప్పాలంటే తమిళనాడులో జరుగుతున్న కులతత్వ వ్యతిరేక పోరాటాల కారణంగా ఎగసిపడుతున్న సామాజిక రాజకీయ అలలకు సృజనాత్మక చిత్రణ ఈ సినిమా. దీనివెనుక ధారావిలో బ్రతుకుతున్న దళిత బహుజన వలసజీవులున్నారు. మహారాష్ట్ర లోని కులతత్వ వ్యతిరేక పోరాటాలూ వున్నాయి.

అగ్రవర్ణాలవారు గుత్తకు తీసుకున్న డాక్యుమెంటరీలు, సినిమాలు, న్యూస్ రూములూ.. ఇవన్నీ పట్టణాల్లోని మురికివాడలను వంచనకు గురయినవాటిగా చిత్రీకరిస్తాయి.  దీనికి వ్యతిరేకంగానూ, ఇంకా అశుభ్రత, నేరం లాంటి అభిప్రాయాలకు వ్యతిరేకంగానూ  ‘కాలా’ లో అణచివేతకు గురైన పాత్రలు మామూలు మనుషుల్లాగా సహజంగా చిత్రించబడ్డాయి. వాళ్ళెలా ఉంటారో అలాగే చూపించారు. సర్వసాధారణత్వం, సంబరాలు, దుఖం, వాదులాటలు,  ప్రేమ, సంబంధాలు, మరీ ముఖ్యంగా వాళ్ళ చరిత్రలో భాగమైన రాజకీయ చట్రాలు.. వీటన్నిటితో కూడిన దళిత బహుజన నిత్యజీవిత సత్యాలను మన దృష్టినుంచి దాటిపోకుండా ‘కాలా’ సజీవంగా మనముందు వుంచుతుంది.

భారతీయ సినిమా చరిత్రను చూస్తే ‘రాజా హరిశ్చంద్ర’ నుంచీ నేటి ‘వీరే దీ వెడ్డింగ్’ వరకూ అగ్రవర్ణాల జీవితాలనూ వాళ్ళ ప్రపంచాన్నీ ఎన్నో రకాల కథల్లో ఇమిడ్చారు. ‘సంజూ’ పేరుతో సినిమా తీస్తూ సంజయ్ దత్ వంటివాళ్ళను హీరోలు చేస్తున్నారు. వాళ్ళ దుఖాలూ, వాళ్ళ నవ్వులూ, ప్రేమలూ, వాళ్ళ చారిత్రక కథలూ, విజయాలూ, దయ్యం కథలూ.. ఇవన్నీ వెండితెరను అలంకరిస్తున్నాయి. సినిమా సత్యాన్నే నమ్మాలంటే, అగ్రవర్ణాల వారే బీదలు. వాళ్ళే ధీరులైన ప్రేమికులూ, వీరులైన ఉద్ధారకులూ. దళిత బహుజన శ్రామికుల శ్రమను దోపిడీ చేసే పీఠంమీదే కల్పిత చరిత్ర మొత్తం  నిర్మించబడింది. మనుషులుగా ఈ శ్రామికుల అస్తిత్వమే అగ్రవర్ణాలవారికి పట్టదు.

అగ్రవర్ణాల అధికారంలో వున్న సినిమారంగం చేసే చరిత్ర కల్పనా, వక్రీకరణా లాంటి వాటికి భిన్నంగా ఈ దేశపు దళిత బహుజనుల చారిత్రక అస్తిత్వాలను పైపై పూతలు లేకుండా చూపించిన ఏకైక సినిమాగా ‘కాలా’ నిలబడుతుంది.

సవర్ణ ప్రపంచం దృష్టికి అసలేమీ కనిపించని విషయాలే ఈ సినిమాకు ప్రధానమైనవీ, దీనిని నిలబెట్టేవీ. అవి బహుజనుల జీవితాలూ కథలూనూ. వాళ్ళ ఉనికీ, చర్మం రంగూ, బట్టలూ, ఆఖరుకు వాళ్ళ పేర్లు కూడా సవర్ణుల నిత్యజీవితంలో అసహ్యానికీ నిరాదరణకూ గురైనవే.  హిందూ కులతత్వ విలువలను నీచంగా ప్రదర్శించే హరిదాదా అనే క్రిమినల్ రాజకీయ నాయకుడు కాలాను కలవటానికి వచ్చి, సెల్వి యిచ్చే మంచినీరు తాగటానికి ఇష్టపడని సీన్ లో కులతత్వం అనే సామాజిక సత్యం స్పష్టంగా చిత్రించబడింది. ఇంకొక సీన్ లో హరిదాదా ఇంటికి కాలా వెళ్ళినపుడు అతను కాలాను హీనంగా చూస్తూ తన కాళ్ళమీద పడమని అడగటం బ్రాహ్మణీయ గ్రంథాలలో వర్ణవ్యవస్థకు చెందిన సామాజిక ఆధిపత్యశ్రేణి  బ్రహ్మ శరీరంగా ఊహించబడటాన్ని గుర్తు చేస్తుంది.

అసలు ఉనికే లేనివాళ్ళుగా చూడబడేవాళ్ళూ  లేదా అసహ్యకరంగా చూడబడేవాళ్ళే ‘కాలా’ లో మాట్లాడతారు. వాళ్ళే పారాయ్, హిప్ హాప్ లను ప్రదర్శిస్తారు. వాళ్ళే జాగరూకులుగా సంఘటితులై, ఉద్యమిస్తారు. అవినీతితో పిరికితనంతో మోసపూరితంగా తమ భూమిని ఆక్రమించి లాక్కునే చిన్నచిన్న సమూహాలకు చెందిన అగ్రవర్ణాలవారికి వ్యతిరేకంగా పోరాడతారు.

‘క్యారే సెట్టింగా?’ అని కాలా చెప్పిన డయలాగ్ దళిత బహుజనులను అణచివేయటానికి ఉపయోగించే పైన చెప్పిన మార్గాలను సూచించేదే. హరిదాదా స్టేజి మీద మాట్లాడుతున్నప్పుడు రెండు ముఖ్యమైన పదాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి.  అవి ‘మను రియల్టీ’, ‘దండకారణ్యనగర్’.  ఈ మాటలకు సవర్ణుల లోకంలో, మతంలో, గ్రంథాలలో చాలా ప్రాముఖ్యత వుంది.  ఉపమానంగా చెప్పాలంటే శూద్రులకూ, అతిశూద్రులకూ, స్త్రీలకూ కనీసమైన మానవహక్కులను, భూమి, ఆయుధాలు, వనరులు, ఆఖరుకు విద్యను కూడా ఇవ్వటానికి తిరస్కరించే, అణచివేసే కులవ్యవస్థను అమల్లోకి తెచ్చిన ప్రాచీన స్మృతి మనువుది. ఎవరైనా వీటిలో దేనిని అతిక్రమించినా వారిని హింసించటానికి వికృతమైన దండనలను రూపొందించారు.  బ్రాహ్మణ/ సవర్ణ పురాణాల్లో దండకారణ్యం రాక్షసులది.  దండకారణ్యం, అంటే నేటి ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ల లోని కొన్ని ప్రాంతాలలో, రామాయణంలోని కొన్ని ఘట్టాలు జరిగినట్టుగా చెప్పబడింది.

సినిమాలో ‘నవభారత రాష్ట్రవాది పార్టీ’ అనే జెండాతో దండకారణ్యనగర్ ను అభివృద్ధి నమూనాగా తయారుచేసేపనిలోవున్న ‘మను రియల్టీ’  భీమ్ వాడా ను ఆక్రమించి, అక్కడి భూమిని బహుజనులనుండి లాక్కుని, వారిని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. దీనిని ప్రతీకగా చూస్తే, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ ఒడిశాలలో కొంత భాగమైన దండకారణ్య ప్రాంతం గుర్తుకు వస్తుంది. అక్కడ మనుస్మృతి భావజాలాన్ని ఆచరణలో పెడుతున్న పెద్దపెద్ద కార్పొరేట్ లు, మైనింగ్ మాఫియాలు, కాంట్రాక్టర్స్ కలిసి ఆదివాసీలనుంచి భూమిని లాక్కోవటంతో వారి జీవితాల్లో మహా వినాశనకరమైన పరిణామాలు ఎదురౌతున్నాయి.  ఈ సినిమాలో హరిదాదా చేసే ప్రయత్నం కూడా అటువంటిదే. సినిమా మొదల్లోనూ తరువాతా అభివృద్ధి పేరుతో చేసే హంగామా ఒకపక్క – కాలా, హరిదాదాల మధ్య జరిగే తీవ్రమైన వాగ్యుద్ధంలో బహుజనులు భూమికి ఇచ్చే ప్రాముఖ్యత మరోపక్క. “నీకు భూమి అధికారాన్నిచ్చేదయితే, మాకు అది జీవితం. మీ దేవుళ్ళు మనమధ్య అడ్డం వచ్చినా సరే వాళ్ళనూ వదలం” అని కాలా హరిదాదాతో చెప్పే మాటలు మామూలు మాటలు కావు. అది కులవ్యవస్థపై శక్తివంతమైన ఖండనే కాదు. దళిత బహుజనుల అభ్యుదయానికీ  సంతోషానికీ అడ్డుపడుతున్న బ్రాహ్మణీయ భావజాలాన్ని తోసిపుచ్చమనే పిలుపు కూడా.

ఈ సినిమాలోని స్త్రీ పాత్రల విషయానికి వస్తే,  తూఫానీ, జరీనా, సెల్వీ .. ఇంకా బస్తీలోని చాలామంది స్త్రీలు.. వీళ్ళంతా  సమాజంలో మార్పును తీసుకొచ్చేవాళ్ళు. పోరాటాన్నీ ఆందోళనలనూ ముందుండి నడిపిస్తూ స్థిరంగా తమ గొంతును వినిపిస్తూ ధారావిలో ముఖ్యమైన నిర్ణయాలు కూడా తామే తీసుకోగలిగే సత్తా ఉన్నవాళ్ళు. జరీనా హరిదాదాను కలిసినప్పుడు తననుంచి ఏదో సాయాన్ని ఆశించివచ్చినట్టుగా ఆమెను చులకనగా చూస్తాడు. అతనేదో  పితృస్వామ్య ఆధిపత్య భావాన్ని ప్రదర్శిద్దామనుకుంటే, ఆమె దాన్ని సాగనివ్వదు. పోలీసులనూ రాజకీయనాయకులనూ ఎదుర్కోవటంలోనూ  ధారావి భవిష్యత్తుగురించి నిర్ణయాలు తీసుకోవటంలోనూ తూఫానీ ముందువరసలో ఉంటుంది. ఉమాదేవి రచించగా ప్రదీప్ కుమార్, ధీ లు పాడిన కణ్ణమ్మా పాట శాంతంగా ఉంటే, రాప్ పాటలు సామాజిక రాజకీయ విమర్శ చేస్తాయి. ధారావి పాటల్లో సహజమైన కమ్మదనం, ప్రాంతీయ నుడికారం ఉంటాయి. వెనుకబడ్డ జాతుల యువకులకు చోటు కల్పిస్తూ హిప్ హాప్ ను ప్రదర్శించే ధారావి యునైటెడ్, కాస్ట్ లెస్ కలెక్టివ్ లాంటి ప్రముఖ గ్రూపులవి.

సినిమాలోని ప్రధాన స్రవంతి రాజకీయాల దగ్గరకు మళ్ళీ వస్తే, ఒక సీను నాకు తోచింది. ఈ శ్రామికులు, అంటే అణచివేయబడిన కులాలవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఒకరోజు పని చేయటం మానేసినప్పుడు, సోషల్ మీడియాద్వారా ఆ వార్త అందరికీ చేరుతుంది. ఇది నాకు ఎస్సీ ఎస్టీ  ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసనగా ఏప్రిల్ రెండవ తేదీన జరిగిన భారత బంద్,  భీమా కోరేగావ్ కు వచ్చిన దళిత బహుజనుల మీద జరిగిన హింసకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో జనవరిలో అంబేద్కర్ వాదులు చేపట్టిన నిరసనలను గుర్తుకు తెచ్చింది. ఈ రెండు నిరసన ప్రదర్శనలూ కూడా శక్తివంతమైన సోషల్ మీడియా ద్వారా జనాన్ని కూడగట్టి నిరసనల క్రమాన్ని అందరికీ ఎప్పటికప్పుడు తెలియజెప్తూ జరిపారు.

సినిమాలో న్యూస్ చానెల్స్, ధారావిలో దళిత బహుజనులు ప్రారంభించిన నిరసన ప్రదర్శనను ఏదో అపరాధంలాగా చిత్రీకరిస్తాయి. నిరసన కారణంగా ట్రైన్ లో ప్రయాణం చేయాల్సివచ్చిన ఉన్నతవర్గపు మహిళ నిరసనకారులమీద తన కోపాన్నంతటినీ వెళ్లగక్కుతుంది. వాళ్ళ సౌకర్యం తప్ప ఇంకేమీ పట్టని మధ్యతరగతి, అధికార కులాల ఉదాసీనతను ఇది పట్టిచూపిస్తుంది. మరోవైపు ఈ సీన్, బహుజన ప్రధానస్రవంతే సవర్ణుల చిన్న ప్రపంచపు అస్తిత్వానికీ కొనసాగింపుకూ వీలు కల్పిస్తోందన్న నిజాన్ని నొక్కిచెప్తోంది.

కొన్ని ప్రతీకలూ పురాణగాథలూ ఎలాంటివంటే అవి సవర్ణ ద్విజులూ బహుజనుల సామాజిక సాంస్కృతిక సంభాషణలలో చాలా భిన్నమైన అర్థాలను కలిగివుంటాయి. వాటిని పక్కపక్కనే వాడటం నన్ను చాలా ఆకర్షించింది.  అలాంటిది ఒకటి ఏమిటంటే, హరిదాదా ఇంటి గోడమీద పరశురాముడి ఫోటో ఉంటే, కాలా టేబుల్ మీద ‘అసుర’ పుస్తకం ఉంటుంది.  మరొకటి, గణేశ నిమజ్జనం జరుగుతూ ఉంటే హరిదాదా అనుచరుడూ, నేరస్తుడూ అయిన రాజకీయనాయకుడు విష్ణును కాలా జీప్ నడుపుతూ చంపేస్తాడు. జీప్ లైసెన్స్ ప్లేట్ మీద BR 1956 అని ఉంటుంది. సంస్కరించవీలుగాని సనాతనధర్మమని పిలవబడేదానిని వదిలి అంబేద్కర్ లక్షలమంది అనుయాయులతో బుద్ధిజంలోకి మారిపోయిన సంవత్సరం అది. ఇంకోసారి హరిదాదా ఇంట్లో యజ్ఞం జరుగుతూవుంటే బ్రాహ్మణపూజారి ‘జై సియారాం’ అంటాడు. అదేసమయంలో ధారావిలో జనం చంపబడతారు.

స్పష్టమైన కులతత్వ వ్యతిరేక రాజకీయాలు కేంద్రంగా ఉంటూ, ప్రతీదీ వాటిచుట్టూనే తిరుగుతూవుండగా, ‘కాలా’ దళిత బహుజన జీవితాన్నీ వాళ్ళ ప్రపంచాన్నీ చూపిస్తుంది. పవిత్రత, అధికారం, స్థానం లాంటి బ్రాహ్మణీయభావజాలానికి ఎదురుగా నిలబడి, వాటినన్నిటినీ పక్కకు తోసేస్తుంది.

ఈ సినిమాను చూస్తున్న, రివ్యూలు రాస్తున్న, అభిప్రాయాలు తెలుపుతున్న చాలామంది సవర్ణులు ఇదింత స్పష్టంగా దళితబహుజన హక్కులకోసం పట్టు పడుతూ ప్రతిపాదనలు చేయటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎక్కువమంది ఈ కథలో తమకోసం ఎక్కడో ఓ చోటు వెదుక్కోవటానికి కష్టపడి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళూ, వాళ్ళ కులప్రపంచమూ ఇలా  ఎదిరించబడటం చూసి, వాళ్ళ సవర్ణ ప్రపంచజ్ఞానం చిరాకు పడుతోంది. తాము ఈ కథలో అసలే లేకుండా అయినా అయిపోయారు లేదా సమస్యలు సృష్టించే చిన్న గ్రూప్ గా ఎక్కడో ఒకచోట ఉన్నారని అర్థం చేసుకున్నారు.   అందువలన వాళ్ళవైపునుంచి కేకలు మొదలయి క్రమంగా పెరిగిపోతున్నాయి. మరికొంతమంది ‘కాలా’ సినిమాను రాజకీయాలు, ముఖ్యంగా కులతత్వ వ్యతిరేక రాజకీయాలు లేని సినిమాగా ముద్రవేయటానికి ప్రయత్నిస్తూ దీనిని రజనీకాంత్ సినిమా అనేస్తున్నారు.  దర్శకుడు పా. రంజిత్ (ఈయన అంబేద్కర్ వాది) చేసిన మేథోశ్రమనూ శారీరక శ్రమనూ, సినిమాను సాధ్యం చేయటంలో చేయివేసిన ఎంతోమంది దళితబహుజనుల శ్రమనూ సహకారాన్నీ కనబడనీయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు.  మరికొంతమంది ఈ సినిమాను రైట్ వింగ్ ఫాసిజాన్ని ఎదిరించినందుకుగాను ప్రగతిశీలమైనదని మెచ్చుకుంటూనే, కులతత్వ వ్యతిరేక, విప్లవ అనుకూల శక్తిని కలిగివుందని అంగీకరించటానికి ఇష్టపడటం లేదు. ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళు ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటారో!

వీళ్ళందరికీ కాలా లాగే నేనొక మాట చెప్తాను. “కాలా బహుత్ భారీ హై, చల్ తెరే నికల్ నికల్”

కాలా: కొన్ని నిజాలు:

ల.లి.త

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బ్రాహ్మణులే ఈ కులతత్త్వానికి మూలం అనే విద్వేష, బూటకపు భావజాలాన్ని, మనువే కులవ్యవస్థకి మూలం అనే తప్పుడు అవగాహనని, సమాజంలో కులాల కుంపట్లు మరింత ఎగదోయడానికి తప్పితే పీడితజనోద్ధరణకు, స్వావలంబనకు హేట్రెడ్ రాజకీయ లక్ష్యాలతో తీసిన ఏ సినిమా ఉపకరించదు. ఈ అమానుష కులవ్యవస్థకు కారణం బ్రాహ్మణులు కారు, మనువూ కాదు, ఏ స్మృతీ కాదు, ఏ రాజూ కాదు, శాసనమూ కాదు అని అంబేడ్కర్ తాను కొలంబియా యూనివర్శిటీకి సమర్పించిన తన పెిహెచ్ డి పరిశోధనా పత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అంబేడ్కర్ పరిశీలన: కులవ్యవస్థకి మూలం మనువు కాదు, బ్రాహ్మణులు కాదు. ఇంత మహావిస్తారమైన కులవ్యవస్థని ఏర్పాటు చేయడం ఏ ఒక్క మనిషి వల్లనో, ఏ ఒక్క గ్రంథం వల్లనో, ఏ ఒక్క స్మృతి వల్లనో, ఏ ఒక్క కులం, పురోహితవర్గం వల్లనో అయ్యే పని కాదు. ఈ విషయమై ఆయన కొలంబియా యూనిర్శిటీకి యిచ్చిన థీసిస్ పేపర్….

    One thing I want to impress upon you is that Manu did not give the law of Caste and that he could not do so. Caste existed long before Manu. He was an upholder of it and therefore philosophised about it, but certainly he did not and could not ordain the present order of Hindu Society. His work ended with the codification of existing caste rules and the preaching of Caste Dharma. The spread and growth of the Caste system is too gigantic a task to be achieved by the power or cunning of an individual or of a class. Similar in argument is the theory that the Brahmins created the Caste. After what I have said regarding Manu, I need hardly say anything more, except to point out that it is incorrect in thought and malicious in intent. The Brahmins may have been guilty of many things, and I dare say they were, but the imposing of the caste system on the non-Brahmin population was beyond their mettle. They may have helped the process by their glib philosophy, but they certainly could not have pushed their scheme beyond their own confines. To fashion society after one’s own pattern! How glorious! How hard! One can take pleasure and eulogize its furtherance; but cannot further it very far. The vehemence of my attack may seem to be unnecessary; but I can assure you that it is not uncalled for. There is a strong belief in the mind of orthodox Hindus that the Hindu Society was somehow moulded into the framework of the Caste System and that it is an organization consciously created by the Shastras. Not only does this belief exist, but it is being justified on the ground that it cannot but be good, because it is ordained by the Shastras and the Shastras cannot be wrong. I have urged so much on the adverse side of this attitude, not because the religious sanctity is grounded on scientific basis, nor to help those reformers who are preaching against it. Preaching did not make the caste system; neither will it unmake it. My aim is to show the falsity of the attitude that has exalted religious sanction to the position of a scientific explanation.

    Castes in India: Their Mechanism, Genesis, and Development, by Dr. B. R. Ambedkar
    columbia.edu
    http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/txt_ambedkar_castes.html
    Castes in India: Their Mechanism, Genesis, and Development, by Dr. B. R. Ambedkar
    columbia.edu

  • ఇక రెండవ విషయం… మూలవాసులు, ఆర్యులు, ద్రావిడులు, ఆర్యులు విదేశీయులు, ఆక్రమించారు, మేము మూలవాసులము అని ముంబై ముసుగులో “తిరునల్వేలి” కుల పిచ్చను , శ్రీలంక “మూర్ఖపు ప్రత్యేక తమిళ నేల పిచ్చను” కలిపి ఇచ్చిన నల్లటి కలరింగ్ మాత్రమే ఇది. ఆర్యులు, ద్రావిడులు, దస్యులు అన్న బూటకపు విభజనని ఖండిస్తూ అంబేడ్కర్ తన హూ ఆర్ ది శూద్రాస్ అనే గ్రంథంలో స్పష్టంగా యిలా వ్రాసారు. మరి, ఈ సినిమా అంబేడ్కర్ మౌలిక విశ్వాసాలను, సిద్ధాంతాన్ని ఖండిస్తున్నట్లా లేక సమర్థిస్తున్నట్లా?
    (1) The Vedas do not know any such race as the Aryan race.

    (2) There is no evidence in the Vedas of any invasion of India by the Aryan race and its having conquered the Dasas and Dasyus, supposed to be natives of India.

    (3) There is no evidence to show that the distinction between Aryans, Dasas and Dasyus was a racial distinction.

    (4) The Vedas do not support the contention that the Aryans were different in colour from the Dasas and Dasyus…………..

    http://indiafacts.org/dr-b-r-ambedkar-shudras/

  • కులతత్వ వ్యతిరేక రాజకీయాలు, దళిత బహుజన జీవన పరిశీలనతో దర్శకుడు పా. రంజిత్ చేసిన
    మేథోశ్రమ ‘కాలా’ సినిమా అంటూ రివ్యూ రాస్తూ “కాలా బహుత్ భారీ హై” అన్న ల.లి.త గారికి వొందనాలు. ల.లి.త గారి “కాలా సినిమా రివ్యూ భీ బహుత్ భారీ హై” అని అనాలనీ ఉంది.

    ప్రియమైన శ్రీనివాసుడు గారూ! అమానుష కులవ్యవస్థకు మూల కారణాలు గురించి వాదులాడుకోకుండా; పీడితజనోద్ధరణ ఆవశ్యకత, వాటి మార్గాల గురించి మాట్లాడుకుందాం.

    The preamble to the Constitution set out the philosophy on which the political system of our country rests.

    “We, the people of India, having solemnly resolved to constitute India into a SOVEREIGN, SOCIALIST, SECULAR,DEMOCRATIC, REPUBLIC and to secure to all of its citizens;

    JUSTICE social, economic and political;
    LIBERTY of thought, expression, belief, faith and worship;
    EQUALITY of status and of opportunity;and to promote among them all;
    FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the nation;

    • ప్రియమైన రామయ్యగారూ, మూలకారణాల అధ్యయనం చేయకుండానే అంబేడ్కర్ పీడిత జనోద్ధరణకు కృషిచేసాడంటారా? అయితే, మరి తన పిహెచ్ డి థీసిస్ కులాల పుట్టక గురించి ఎందుకు సమర్పించాడంటారు? పోనీ, అలాగే అనుకున్నా, కులాల కుంపట్లు మరింత రేపే కాలా లాంటి సినిమాలు పీడిత జనోద్ధరణకు ఏ విధంగా పాడుపడతాయో చెప్పగలరా?
      ఆ సినిమా ప్రజలపై చూపించే వేర్పాటువాద, కులాల కుంపట్లు ఎగదోసే ప్రభావం. చాలా స్పష్టంగా ఆ దర్శకుడే పీడితులు, పీడకులకు రంగు, జాతి అని అంటగట్టి, దళితులను అణగద్రొక్కింది అగ్రవర్ణాలవారే, నల్లటివారిని అణగద్రొక్కింది తెల్లటివారే అని జాతివివక్ష భావజాలాన్ని పైకెత్తానని తానే స్వయంగా చెప్పినా అది అంతర్లీనమని మీరెందుకు ఈ సినిమాని సమర్థిస్తున్నారో నాకర్థంకాలేదు. కష్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వున్న సోకాల్డ్ పీడితుల ఫేస్బుక్ పేీజీలు మీరు చూస్తే ఈ సినిమాని కుల దృక్కోణంతో చూస్తున్నారని, అగ్రవర్ణాల ప్రజలందరూ దోపిడీ, పీడకులేనని, వాళ్ల మీద విజయమే కాలా చూపించిందని ఆ సినిమా ఫోటోలుతో సహా పెట్టుకోవడం మీకు కనిపిస్తుంది. సినిమాలో కులకలం గురించి మీరు ఒక్కమాట మాట్లాడడంలేదు. ఈ అస్తిత్త్వం ఉద్యమాలన్నీ ముక్తకంఠంతో మా విముక్తికి అంబేడ్కర్ చెప్పిందే వేదం అని ఘోషిస్తూ వుంటే మీకు వినంబడలేదా? అలాంటప్పుడు అంబేడ్కర్ ఏనాడూ సమర్థించని, బూటకం అని చెప్పిన ఆర్య, ద్రావిడ విభజననలు, ఆయన నిర్ద్వందంగా ససాక్ష్యంగా ఖండించిన ఆర్యులు, ద్రావిడుల రంగు తేడాలను పైకెత్తే భావజాలంతోనే నేను సినిమా తీసాను, నేను దళితుల విముక్తికోసమే పాటుపడుతున్నానని దర్శకుడే స్వయంగా చెప్పిినా ఈ సినిమా లక్ష్యం కుల ఘర్షణలో అన్న విషయం మీకెందుకు అర్థంకాలేదు? రంజిత్‌ సినిమాలన్నింటిలోనూ కులానిదే ప్రధాన పాత్ర. కాలాలో కులాన్ని ముఖ్య భూమికలో చూపి స్తారు. క్లైమాక్స్‌లో నీలి రంగు దళితుల విజయానికి, గౌతమ బుద్ధ విహారలో కూడా ఈ రంగు దళితుల తిరుగుబాటుకు చిహ్నాలుగా కనిపిస్తాయి,, విలన్‌ హరిదాదా తెల్ల దుస్తులే వేసు కుంటాడు. అతని ఇంటి హాల్లో రాముడి విగ్రహం ప్రముఖంగా కనిపిస్తుంది. సోఫా సెట్లు కూడా తెల్లని రంగులో కనిపిస్తాయి. అతను రామాయణంపై ఒట్టేసి మరీ మాట్లాడతాడు. అందుకు విరుద్ధంగా కాలా నల్లని బట్టలే ధరిస్తాడు. దుమ్మూధూళి అంటే అతనికి ఇష్టమేగాని చిరాకు లేదు. కాలాను రావణ్‌ అని విలన్‌ హరి పిలుస్తాడు. కాని, పెరియార్‌ ఈవీ రామసామి నాయకర్‌ ప్రకారం రావణుడు నలుపే గాని చెడ్డవాడు కాదు. కాలా తనను యమునిగా పిలుచుకుంటాడు. తనను రామునిగా భావించే హరి దాదాను యముని రూపాన్ని ప్రతిబింబించే కరికా లన్‌ తుదముట్టిస్తాడు. హరిదేవ్‌ తన కత్తి తుప్పు పట్టకుండా ఉండడానికి నూనె రాస్తూ దాన్ని పూజి స్తాడు. ఎప్పుడైనా కత్తిని ఇతరులను చంపడానికి వాడడమే అతని లక్ష్యం. అయితే, అందుకు విరు ద్ధంగా భీమ్‌రావు అంబేడ్కర్‌ పుస్తకాలను కాలా చదు వుతాడు. కాలాలో రజనీ భార్యగా నటించిన ఈశ్వరీరావు, సామాజిక కార్యకర్తగా కని పించిన అంజలీ పాటిల్‌ ఇద్దరూ నల్లగానే ఉంటారు. అంతర్లీనంగా కాదు, నా ఉద్దేశ్యమే రంగు, జాతి అని దర్శకుడే గొొంతెత్తి చెప్పినా ఈ ప్రమాదకర కుల కుంపట్లు రెచ్చగొట్టే సినిమాలవల్ల సమాజంలో మిగతావారి దృష్టిలో ఆత్మగౌరవం పెరగకపోెగా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆత్మవిశ్వాసం కోసం ఏ ఆధారాలూ లేని, వారు దేవుడిగా భావించే అంబేడ్కర్ కూడా ఒప్పుకోని రంగు, జాతి భేదాలనే మూలద్రవ్యంగా సినిమా తీసి అది వారి అభ్యున్నతికి పాటుపడుతుందనుకోవడం పెద్ద బ్లండర్. నేను పా రంజిత్ ఫేస్ బుక్ ఖాతాకి, ట్విట్టర్ ఖాతాకి ఈ విషయాలే చెబుతూ కామెంట్లు పెట్టాను. సమాధానం లేదు. అయితే, అన్నీ అతడు చదవకపోవచ్చు కూడా.

    • సినిమా రివ్యూ ‘సుమీత్ సామోస్’ దండీ ! నేను చేసినది అనువాదం మాత్రమే.

      • మీకు ఆ సినిమా వెనుకవున్న మౌలిక భావజాలం అర్థంచేసుకోలేరని నేను భావించడంలేదు. అలాగే పా రంజిత్ భావజాలాన్ని, అతడు ఈ సినిమా తీయడంలోని లక్ష్యాన్ని కూడా మీరు అర్థంచేసుకునే వుంటారు. మీకు వాటితో ఏకీభావం, ఆ అవగాహన లేకుండానే మీరు అనువాదం చేసారా? లేదు కదా. అలాగే, ఈ వ్యాస రచయితే పరిశీలనతో కూడా మీకు ఏకీభావం వుంటేనే అనువదించి వుంటారు. ఆ భావజాలంతో మీకు ఏకీభావం వున్నప్పుడు మీ అభిప్రాయం ఈ విషయంలో చెప్పండి. ఈ చిత్రం కులాల కుంపట్లు మరింత ప్రేరేపిస్తుందా లేక ఘర్షణలను తగ్గిస్తుందా? మూలవాసులు, ఆర్యులు అనే తప్పుడు బూటకపు భావజాలం, బ్రాహ్మణులు, మనువే ఈ కులవ్యవస్థకు మూలం, మా దౌర్భాగ్యానికి వాళ్లే కారణం అనే తప్పుడు ప్రాతిపదిక ( ఇవి రెండూ అంబేడ్కర్ కూడా ఖండించారు. పైన ఆయన రచనలే యిచ్చాను) ఆధారంగా అంబేడ్కర్ అవగాహనకి వ్యతిరేకంగా సాగించే దళిత పోరాటాలు ఫలిస్తాయా? మరింత వికటిస్తాయా? ఒకవేళ ఈ వ్యాసం వ్రాయకముందు ఇది అంబేడ్కర్ భావజాలానికి వ్యతిరేకం, మూలవాసులు, ఆర్యులు, బ్రాహ్మణులు, మనువు గురించి చెప్పినదంతా బూటకపు సమాచారం అని మీకు తెలిసివుండక అనువదించినట్లయితే ఇప్పుడు నేనిచ్చిన ఆధారాలని బట్టి అతడి పరిశీలన ఎంత సత్యదూరమైందో మీకు అర్థమైతే ఆ విషయమే చెప్పండి. లేదా అతడే సరియైన సమాచారం, అవగాహన ప్రదర్శించాడు, నీదే తప్పుడు అవగాహన అని నన్ను ఖండించండి.

      • ‘లలిత గారి కాలా సినిమా రివ్యూ’ అని రామయ్య గారు అన్నదానికి నా స్పందన అది. క్రెడిట్ నాకు కాదు సుమీత్ సామోస్ కు దక్కుతుందని చెప్పటం. సుమీత్ చేసిన దళిత బహుజన పరిశీలనలో వున్న తప్పువొప్పులన్నీ అతనివే.

        అగ్రకుల అహంకారానికీ కార్పోరేట్ ఆక్రమణకూ ఎదురుగా ‘దళిత బహుజన ఆదర్శవాదాన్ని’ నిలబెట్టిన సినిమా అని కాలా గురించి నా అభిప్రాయం. ఏ సినిమా చూసినా అగ్రవర్ణాల హీరోలు జనాన్ని ఉద్ధరించే కథల మధ్య దళిత హీరో ఆదర్శవాదం, నిబ్బరం అభినందించదగినవే. దళిత ప్రతీకలతో నిండిన దీనిని దళిత సినిమాగా ఫేస్బుక్ పేజీలలో పెట్టుకుంటే మనకు అభ్యంతరం దేనికి? రావణుడు రాముని జయిస్తే మాత్రం వచ్చిన బాధ ఏమిటి? ఇద్దరూ రాజులే. ధారావి గౌతమబుద్ధ నగర్ కు ‘కాలా’ రాజు మరి. కాకపొతే సహృదయుడైన రాజు. రావణ బ్రహ్మను రామ క్షత్రియుడు జయిస్తే, పరశురాముడు క్షత్రియుల తలలు తెగ్గోడితే, అది అగ్రకులాల మధ్యనే జరిగిన పోరు అవుతుంది కదా. ఈ సినిమా కులాలమధ్య చిచ్చు రేపుతుందంటే నవ్వు వస్తుంది. ఎంతమంది దళితులు అగ్రవర్ణాల వారిమీద దాడి చేసి విజయం సాధించారో లెక్కలు చూడాలి. మూలవాసులు ఆర్యులు అని మనం పేర్లు పెట్టుకోకపోయినా, గుంపుల మధ్య ఆధిపత్యపోరు అన్న వాస్తవాన్ని కాదనలేము కదా. ఓడినవారిని అణగదొక్కటం చరిత్రలో లేదా?
        బ్రాహ్మణీయ భావజాలం అని చెప్పబడేదానిని బ్రాహ్మణులే కాదు మిగతా అగ్రకులాలు కూడా మరీ ఎక్కువగా మొయ్యటం, పైకెగబాకిన దళితులు (ముఖ్యంగా దక్షిణభారతంలో) ప్రదర్శించే బ్రాహ్మణీయ భావజాలం … అన్నీ కళ్ళముందే కనిపిస్తూవుంటే, ఆ భావాలకు కారణం బ్రాహ్మణుడా కాదా అని చర్చించటం సమస్యను వదిలి వేరేవేవో వెదకటం కాదా? మీరన్నట్టు బ్రాహ్మణుడికీ బ్రాహ్మణీయ భావజాలానికీ మధ్యవున్న తేడాను అందరూ అర్థం చేసుకోవలసినదే. సౌత్ లో బ్రాహ్మణులకు భూమి, వ్యాపారాలు, రాజకీయాల్లో ఆధిపత్యం లేకపోయినా, నార్త్ లో భూములూ, మైనింగ్, రాజకీయాల్లో వాళ్ళు చాలా బలమైనవాళ్ళే. అందుకే హరి ‘అభయంకర్’ లు కార్పోరేట్ లు అవగలరు. ఇవన్నీ తెలియకుండానే రంజిత్ సినిమా తీశాడనుకోవటానికి వీలులేదు. కులాధిపత్య భావజాల నిర్మూలన
        మన ఆదర్శంగా ఉండటం ముఖ్యం నా దృష్టిలో. దానికి అంబేద్కర్ కాకపోతే ఆరెస్సెస్ నుంచి మరో మహానుభావుడు వచ్చినా మంచిదే. కాలా కాకపోతే మరో గోరా అయినా సరే. కాసేపు పా.రంజిత్ తో పాటు మనమూ తెలుపును చెడుకూ నలుపును మంచికీ ప్రతీకలుగా తీసుకుంటే వచ్చిన నష్టం ఏమిటి?

      • **కులాధిపత్య భావజాల నిర్మూలన
        మన ఆదర్శంగా ఉండటం ముఖ్యం నా దృష్టిలో**.
        కులాధిపత్య భావజాలం నిర్మూలనకై చెడుకు తెలుపును, మంచికి నలుపును తీసుకోవడం (ఆయా దేహాల రంగును) తీసుకోవడం కులవివక్షను ఎలా, ఎంతవరకు రూపుమాపుతుందో చెప్పగలరా? దళిత ప్రతీకలకు మూలభావజాలం ఏది? ఆర్య, ద్రావిడ విభజన, ఆర్యులు ద్రావిడులపై విజయం సాధించి బానిసలను చేసుకున్నారు, అనేది బూటకపు విద్వేష భావనలు కాదా? గుంపుల మధ్య ఆధిపత్యపోరులో కులాలని బట్టి గుంపులున్నాయి. కొన్ని కులాల గుంపులు మరికొన్ని కులాల గుంపులను దోచుకుంటున్నాయి అని సాధారణీకరణ చేస్తున్నారు కదా? మరి, దోచుకుంటున్న, దోచుకున్న ( మీ దృష్లిలో) కులాల గుంపులున్నింటినీ ఏం చేద్దాం? చంపేద్దామా? లేక ద్వేషించి దూరంగా పెడదామా? ఈ సినిమా ఏం సూచించింది? నిజ సమాజంలో నిజంగా అలా కులాలనిబట్టి దోపిడీ వున్నదా? ఒక కులం వాళ్లందరూ సామాజిక స్మగ్లర్లని చెప్పినట్లుగా మరొక కులం వాళ్లందరూ దోపిడీ దొంగలా? కార్పోరేట్ పారిశ్రామిక వేత్తలా?
        ‘‘మీరన్నట్టు బ్రాహ్మణుడికీ బ్రాహ్మణీయ భావజాలానికీ మధ్యవున్న తేడాను అందరూ అర్థం చేసుకోవలసినదే‘‘

        ఈ సినిమా ఆ తేడాను స్పష్టంగా తెలియజెప్పుతుందంటారా? లేక తేడాలేదని ముద్రగుద్ది వదిలిందంటారా?
        ‘‘కాసేపు పా.రంజిత్ తో పాటు మనమూ తెలుపును చెడుకూ నలుపును మంచికీ ప్రతీకలుగా తీసుకుంటే వచ్చిన నష్టం ఏమిటి?‘‘
        అంటే, మనిషి చర్మపు రంగుని బట్టి మంచీ, చెడులుంటాయా? మరి, రాముడు నల్లనివాడేగా, కృష్ణుడూ నల్లనివాడేగా? వాళ్ల మంచి ఎంతో పా రంజిత్ కి తెలిసేవుండాలే.

        నష్టమేమిటో మీరు ఓడిపోయినవారు అని మీరు అనుకుంటున్న భారతదేశ ఓటర్లయిన, మీరనుకుంటన్న దోపిడీ నాయకులను స్వయంగా ఎన్నుకుంటున్నవాళ్లయిన దళిత యువత ఫేస్ బుక్ పేజీలు ఓ నూరింటిని యాదృచ్ఛికంగా పరిశీలించండి. బ్రాహ్మణ వ్యక్తులపైన, కులంపైన, మా దుస్థితికి, దౌర్భాగ్యానికి వాళ్లే మూలకారణం అన్న విద్వేషం (మూలకారణం బ్రాహ్మణులని అంబేడ్కర్ కూడా అంగీకరించకపోయినా), ‘మూలవాసులం మేము, ఈ అగ్రకులాలు విదేశీయులు, మమ్మల్ని ఓడించి తరిమేసి, సామాజికంగా వెలివేసారు’ అన్న తప్పుడు భావన ఏ స్థాయిలో వుంటుందో తెలుస్తుంది. కులాలని బట్టి విద్వేషాలు పెంచుకుంటూ ఘర్షణలు పెరగడానికి ఆజ్యం పోస్తుందీ సినిమా. నేనొక నాస్తికుడిని, హేతువాదిని అని స్వయంగా చెప్పుకున్న పా రంజిత్ ఏం చెప్పాడు? The film also incorporates the Ramayana in the narrative, in an attempt to show the opposition between fair and dark, between Aryans and Dravidians, Mr. Ranjith revealed. Mr. Ranjith said that Kaala’s narrative also touches upon the problem of how ‘dark’ colour has been deemed unworthy by the Indian mainstream. ఈ రంగు విభజనకి శాస్త్రీయ చరిత్రా లేదు, అంబేడ్కర్ కూడా ఒప్పుకోలేదు. తెల్లరంగు చర్మంవారిపై నల్లరంగు చర్మంవారు విజయం సాధించడమే దళితులు విముక్తికి మార్గం అనబడే రేసిజం ప్రకోపింపజేసే సినిమాకు సామాజిక ప్రయోజనం వుంటుందా?

  • ప్రియమైన శ్రీనివాసుడు గారూ!

    మూలవాసులు, ఆర్యులు, ద్రావిడుల చర్చలోకి వెళ్లకుండా . . . సిగ్గుతో తలవంచుకుంటూ . . . మీకు తెలిసినవే అయినా మళ్ళీ ఈ గణాంకాలను ( దళితులపై జరిగిన నేర గణాంకాలను ) చూడమని అర్థిస్తున్నా.

    Into that heaven of freedom my Father, Let my country Awake అని గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ప్రార్ధించింది ఇలాంటి సమాజం కోసమేనా ?

    A crime is committed against Dalits every 15 minutes in India. And six Dalit women are raped every day, according to official statistics that register a 66% hike in atrocities in the past ten years 2007-2017.

    Data from the National Crime Record Bureau (NCRB)

    33,655 cases of crimes against SC and ST in 2012,
    39,408 cases of crime against SC and ST in 2013
    47,064 cases of crime against SC and ST in 2014
    44,839 cases of crime against SC and ST in 2015
    47,338 cases of crime against SC and ST in 2016

    The sad part – even in 2018, Indian society doesn’t seem to have moved on from caste-based oppression and violence. The rising cases of atrocities on Dalits show that India doesn’t treat more than the substantial chunk of its population well.

    https://www.indiatimes.com/news/india/11-major-incidents-of-violence-against-dalits-which-show-how-badly-we-treat-them-258944.html

    • ప్రియమైన రామయ్యగారూ, ఎస్.సి., ఎస్.టి. ల పైన జరిగే అత్యాచారాలకు ఈ కాలా సినిమా ఎలా ఉపయోగపడుతుందో, కులవివక్షను ఎలా రూపుమాపుతుందో తమ అవగాహనను నాతో పంచుకోగలరు. వాళ్ల మీద అత్యాచారాలు చేస్తున్నది అగ్రకులాలా లేక అగ్రకులాలవ్యక్తులా? లేక అగ్రకులాల భావజాలమా? అగ్రకులాలే అయితే ఆ కులాలకు చెందిన ప్రజలందరినీ గంపగుత్తగా ద్వేషిస్తూ నిర్మూలిద్దామా? లేక అగ్ర కుల వ్యక్తులే అయితే వారిపై చర్యలు తీసుకోకుండా ఆపుతున్నదెవరు? ఆపుతున్నది నాయకులే అయితే ఆ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తున్నదెవరు? అగ్రకులాల భావజాలమే అయితే ఆ భావాజాలాన్ని రూపమాపడానికి ఆ కులాలనే లక్ష్యంగా చేసుకుని, అగ్రకులాల వాళ్లందరూ క్రూరులే అన్న భావాన్ని పెంచి పోషించే కాలా లాంటి సినిమాలు సమాజానికి అవసరమా? అసలివన్నీ కాదు, కాలా సినిమా కుల తత్త్వాన్ని పెంచుతుదా లేక తగ్గిస్తుందా?

  • ’’ధళిత బహుజన ఆదర్శ వాదం‘‘ … ఒక గొప్ప అమూర్త పదబంధం. వారిద్దరూ కలసి ఎవరి మీద పోరాడతారు? ఆ పోరాడే శత్రుపక్షం తమిళనాడులో వున్నదా? ఉన్నట్లయితే ఈపాటికి నాస్తిక పెరియార అనుయాయులైన ద్రవిడపార్టీలు ఎప్పుడో రూపుమాపి సమసమాజం సాధించివుండాలే. నిజంగా దళితులకు తమిళనాడులో మేలు జరగిందా? అసలు తమిళనాడులో ఆరెస్సెస్ భావజాలంగానీ, బ్రాహ్మణ ఆధికత్య, దోపిడీగానీ నిజంగా వున్నదా? ఉన్నట్లయితే గత యాభై ఏళ్లుగా నాస్తిక పార్టీల ధాటీకి మాయమైవుండాలే? మతోన్మాద పార్టీలనబడేవాటికి తమిళనాడులో ఏ కాసిన్ని ఓట్లయినా ఎప్పుడయినా వచ్చాయా? పా రంజిత్ తమిళనాడు వ్యక్తి, స్వయంప్రకఠిత నాస్తికుడు, హేతువాది.అతడికి ఇవన్నీ తెలియదా? తెలిసి, తన రాష్ట్రంలో ఏమాత్రం ఉనికిలోని అగ్రవర్ణ బ్రాహ్మణ క్రూర కార్పోరేట్ ని ఎలా ఊహించాడు? తమిళనాడులోని మురికివాడలని కబ్జా చేస్తున్నది అగ్రవర్ణ బ్రాహ్మణ, వైశ్య, క్ష్రతియులా? As per the 2011 Census of India, Scheduled Castes and Scheduled Tribes accounted for 20.01 percent and 1.10 percent of Tamil Nadu’s 72 million population. The Other Backward Classes (OBCs) formed 68% of the state’s population. హిందూమతోన్మాదం ప్రభావం ఏమాత్రం లేని, అసలు హిందూమతాన్నే తిరస్కరించిన పెరియార్ అనుయాయ పార్టీలు రాజ్యమేలిన, ఏలుతున్న తమిళనాడులో దళిత, ఆదివాసీల శాతం 20 శాతం. బిసిల శాతం 68 శాతం. కానీ, దళితుల పరిస్థితి ఏమైనా బాగుపడిందా? బాగుపడినవారు బిసిలు. అగ్రవర్ణాలూ కారు, దళితులూకారు. ఉదాహరణ ఏమంటే, భారతదేశంలో 13 లక్షలమంది సఫాయీ కార్మికులు (మలాన్ని శుభ్రంచేసేవారు) అందరూ దళితులు, గిరిజనులే వున్నారు. ఈ కార్యంలో దేశం మొత్తంమీద ప్రాణాలు కోల్పోతున్నవారిలో 45 శాతమంది తమిళనాడులోనే వున్నారు. మరి, ఏ నాస్తికత్వం వారి పరిస్థితిని బాగుచేయగలిగింది? ఇక్కడ రాముడు, అతడి భావజాలం లేదు కదా? తమిళనాడులో నాస్తిక పార్టీల వల్ల, హిందూ వ్యతిరేక భావజాలం వల్ల బాగుపడింది బిసిలు. అంతేగాని దళితులు కాదు కుల గజ్జి ఎక్కడకీ పోలేదు. దానికి కారణం బిజెపి కాదు. దళితులలో అత్యధికశాతం మంది క్రైస్తవులుగా మతం మార్చుకున్నారు. వారిలో 70 శాతం మంది క్యాథలిక్కులు. కానీ, చర్చి ఫాదర్లు, పాస్టర్లు అత్యధికభాగం దళితులు కారు. మరి, ఇంకెక్కడకి పోయింది కుల వివక్ష? మనదేశంల మతం లేదు, కులం మాత్రమే వున్నదన్న విషయం ఇప్పటికీ అర్థం కావడంలేదా? మరి, అలా కులం మాత్రమే వున్నప్పుడు కులాలమధ్య సయోధ్యకు ఈ సినిమా ఎలా ఉఫకరిస్తుంది. జోషువా ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో, మిగతా దేశాలలో ప్రజలందరినీ క్రైస్తవులగా మార్చాలని కంకణం కట్టుకున్న సంస్థ. దాని ప్రభావం తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఇరవై ఏళ్లలో 17500 చర్చిలు, 9700 మసీదులు తమిళనాడులో నిర్మించారు. అదే సమయంలో నిర్మించిన హిందూ దేవాలయాలు 370 మాత్రమే. అంటే, వీరనాస్తికత్వం వలన ఇబ్బడిముబ్బడిగా పెరిగేవి క్రైస్తవ, ముస్లిం మతాలన్నమాట. పోనీ, అలా మారినందువలన అమానుష వర్ణవ్యవస్థ కోరలనుండి తప్పించుకున్నారా అంటే అదీ లేదు. భారతదేశంలోని ముస్లింలలో 303 కులాలున్నాయి. దళిత బహుజన ఐక్యత ఆదర్శం అనేది ముందు తమిళనాడులో మొదలుపెట్టి (ఎందుకంటే అక్కడ బ్రాహ్మణ, ఆరెస్సెస్, బిజెపి ఏమాత్రం లేదు గనక) అక్కడి దళితుల పరిస్థితిని బాగుచేయండి. ఆ తరువాత భారతదేశంపై, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలమీద పడవచ్చు.

    • https://timesofindia.indiatimes.com/india/Tamil-Nadu-passes-anti-conversion-Bill/articleshow/26865966.సిమ్స్
      అందరి కంటే ముందే తమిళ ద్రావిడ పార్టీ ఇటువంటి బిల్లు తెచ్చి , హిందుత్వ కి బాసట గా నిలిచింది.దాని నాస్తికత్వం లో బోల్డంత హిందుత్వ.అందుకే కరుణానిధి కుటుంబాన్ని అవినీతి కేసులనుండి రక్షించింది కేంద్ర ప్రభుత్వం.
      హిందువులు దొంగలు అన్న కరుణానిధి హృదయాన్ని దొంగిలించేవారు అనేది అంతరార్థం అని మాట మార్చారు.ఇంత గొప్ప అర్థాన్ని నాస్తికుడే కూర్చగలిగాడు. దీని భావమేమి తిరుమలేశా,యివైరుధ్యానికి అర్థమేమిటి?

      • ఇంతకన్నా మూర్ఖ వితండవాదం ఇంకొకటి లేదు. అదే వ్యాసంలో Mahatma Gandhi as having said that “conversions are harmful to India. If I had the power and could legislate, I should certainly stop all proselytising” అని వుంది కదా? మరి, హిందూత్వ కి ప్రప్రథమంగా బలం చేకూర్చి బాసటగా నిలచింది మహాత్మా గాంధీనా? రాజకీయ ప్రయోజనాలకి విలువలతో తాత్కాలికంగానైనా రాజీపడని పరిశుద్ధాత్మం పార్టీలు ద్రవిడ పార్టీలనే పిచ్చి భ్రమ ఏదైనా వుంటేనే ఇలా బోడిగుండుకీ, మోకాలుకీ ముడిపెట్టేది. ఏ ప్రయోజనాలుండి 2002 లో కరుణానిధి పార్టీ ఆ ఓటింగ్ లో పాల్గొనలేదు. నిజంగా హిందూత్వకే బాసటగా నిలిచేటట్లయితే ఓటింగ్ లో పాల్గొని ఆ బిల్లును సమర్థించేవాడేగా? బాసటగా నిలుస్తున్నది బిజెపికి. తమ తక్షణ, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసమనే ఇంగితజ్ఞానంకూడా లేకుండా బిజెపికి బాసటగా నిలిస్తే హిందూత్వకి బాసటగా నిలవడమనే రొడ్డకొట్టుడడు వామ నినాదాన్నే అనుకరించడం ఇది.
        వలస క్రైస్తవం ప్రలోభాలు, విదేశీ విరాళాలు, ఓ పెద్ద జోషువా ప్రాజెక్ట్, ఇత్యాది మతమార్పిడి విధానాల గురించి ఈ కోరా లంకెలో వివరంగా వుంది. చదువుకోవచ్చు.. ఈ వ్యాసం ప్రక్కనే ఈ విషయం గురించే మరిన్ని పేజీలు వలస క్రైస్తవం విధానాల గురించి చాలా వివరంగా వుంది. అది కూడా చదివి తెలివి తెచ్చుకోవచ్చు…

        https://www.quora.com/Is-there-mass-conversion-of-Hindus-into-Christians-in-India

      • వలస క్రైస్తవ మిషనరీలు చేస్తున్నది మతమార్పిళ్లా లేక మత బలాత్కారాలా? అనేది ఈ హఫింగ్ టన్ పోస్టులో వచ్చిన వ్యాసంలో స్పష్టంగా వుంది, చదువుకోవచ్చు…
        https://www.huffingtonpost.com/philip-goldberg/missionaries-in-india_b_4470448.html
        వలస క్రైస్తవం దారుణాలు, నీచత్వం, నికృష్టత, అమానుషం గురించి భారతదేశంలో ఇంతవరకెవ్వరూ వ్రాయని విధంగా అతి గొప్పగా, తాత్త్వికంగా ఖండించి ‘పురాణవేదం’ అనే గొప్ప పుస్తకమే వ్రాసిన ‘ది లాస్ట్ బ్రాహ్మిన్’ వంశోద్ధారకులైన శ్రీశ్రీశ్రీ రాణిశివశంకరశర్మగారు ఇప్పుడు పూర్తిగా తిరోగమించి, ఆ మతమార్పిడి దారుణాలను అరికట్టే బిల్లును హిందూత్వకు ఊతమిచ్చేదిగా చూపడం ఎంత దివాలాకోరు రాజకీయమో చదువరులు గ్రహింతురుగాక. …..ఓం మెన్….

  • ప్రియమైన శ్రీనివాసుడు గారూ!

    ‘తమిళనాడులో మొదలుపెట్టి (ఎందుకంటే అక్కడ బ్రాహ్మణ, ఆరెస్సెస్, బిజెపి ఏమాత్రం లేదు గనక) అక్కడి దళితుల పరిస్థితిని బాగుచేయండి’ అన్న మీ వాదనను కొద్దిగా సమర్ధించేలా ఉన్న ఈ క్రింది వ్యాసం మీరు చూసే ఉంటారు.

    మేము ( వామపక్ష వాదులమూ ) కోరుకునేది – – – జాతి పీత బాపూ నుండి పెద్దలందరూ ఆశించినదే, తపించినదే – – – సమసమాజ నిర్మాణం, సకల జనుల సౌభాగ్యం.

    DALITS IN DRAVIDIAN LAND — Frontline Reports on Anti-Dalit Violence in Tamil Nadu 1995-2004: S. విశ్వనాథన్

    The deprivations and discriminations of Dalits are not just economic; they are also social, cultural and political. Illiteracy among Dalits is very high and this is exploited. There is very little solace for a Dalit in religion or even in death.

    The fact that Dalits have to face such deprivation, discrimination, and violence — in all their intensity and range — from `caste Hindus’ is perhaps explicable in terms of the central role caste plays in our society.

    The Dravidian movement and the Dravidian parties have to share a large part of the blame for the situation of the Dalits in the State ( of Tamil Nadu ) today. But one also would have to recognise the fact that the Dravidian movement in the State provided socio-political and cultural space for the deprived sections to assert themselves.

    While it is undeniable that the gainers in this process were largely the middle castes, the assertion by the deprived — including the Dalits — could hardly be divorced from this movement.

    https://www.thehindu.com/br/2005/08/23/stories/2005082300471500.htm

    • నెనరులు రామయ్యగారూ, బహుశా ఇదొక్కటేనేమో మీరు నాతో ఏకీభవిస్తున్న విషయం. నేను వ్రాస్తున్న విషయాలకు పూర్తి ఆధారాలు సేకరించి మాత్రమే నేను వ్రాయడానికి ప్రయత్నిస్తాను. విషయాన్ని వాదనకు అనుకూలంగా త్రిప్పుకోడానికి మాట్లాడే ‘వాక్చాతుర్యం, వచో నైపుణ్యం’ అంటే రెటోరిక్ తో గాక, ఆధారాలతో సహా మాట్లాడే పద్ధతిని అవలంబించడమే సరయిన విధానమని నా భావన. నిజానికి నేను సేకరించిన సమాచారం వేయి పేజీలకు సరిపోతుంది. అదంతా ఇక్కడ యివ్వడం భావ్యం కాదు.

      • సావర్కార్ కు దేశవిభజలో నమ్మకూ లేదు, ప్రోత్సహించలేదు, సమర్థించనూ లేదు. ముస్లింల పట్ల అతడి అభిప్రాయాలు స్పష్టంగా యిందులో వున్నాయి… సావర్కార్ కు దేశవిభజనలో నమ్మకంలేదు, ప్రోత్సహించలేదు. ప్రభుత్వంలో ముస్లింలకు ఎలాంటి హక్కులున్నాయో, వారికంటే హిందువులకు ఎలాంటి అధికమైన హక్కూ లేదో ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. Savarkar did not believe in 2 nation theory, at least his statement on the partition of India conveys so.

        Mr. Savarkar… insists that, although there are two nations in India, India shall not be divided into two parts, one for Muslims and the other for the Hindus; that the two nations shall dwell in one country and shall live under the mantle of one single constitution;…. In the struggle for political power between the two nations the rule of the game which Mr. Savarkar prescribes is to be one man one vote, be the man Hindu or Muslim. In his scheme a Muslim is to have no advantage which a Hindu does not have. Minority is to be no justification for privilege and majority is to be no ground for penalty. The State will guarantee the Muslims any defined measure of political power in the form of Muslim religion and Muslim culture. But the State will not guarantee secured seats in the Legislature or in the Administration and, if such guarantee is insisted upon by the Muslims, such guaranteed quota is not to exceed their proportion to the general population

      • దీన్నిబట్టి మనకు బోధపడునదేమనగా పెరియార్ నాస్తికుల, హేతువాదులు హిందూత్వ వేరు. సంఘపరివార్ హిందూత్వ వేరు. సంఘపరివార్ నాస్తికుల హిందూత్వని అనుకరించెను, స్ఫూర్తిగా తీసుకొనెను. సావర్కార్ పనిచేయని చోట పెరియార్ పనిచేసెను. పెరియార్ నాస్తికులలో మత భావనలేదుగానీ కులభావన మిక్కుటముగా నుండెను. ఇదన్నమాట విశ్లేషణ. సరే. పై లింకులోని రెండు విషయాలు శుద్ధబూటకాలు. ఒకటి వీరసావర్కార్ నాస్తికుడు అనేది విషయం. కాదన్న వివరణ యిక్కడ వుంది. చదివి తెలివి తెచ్చుకోవచ్చు. https://www.quora.com/Was-Veer-Savarkar-an-atheist రెండవ విషయం దేశ విభజనని సావర్కార్ మొదట ప్రతిపాదించడాని కదా? ఇది కూడా భయంకరమైన బూటకం. దాని గురించి వివరాలు వస్తున్నాయి…

      • వీరసావర్కార్ దృష్టిలో దేవుడంటే ఎవరో ఈ లంకెలోని వ్యాసంలోని యానిమేటెడ్ వీడియోలో స్పష్టంగా వుంది. విని తెలుసుకోవచ్చు… మిడి మిడి జ్ఞానం అనేది ఏకపక్ష, రాగద్వేష ప్రేరిత విశ్లేషణకే దారితీస్తుంది. దాన్ని తగ్గించడానికి ఇతరులు చెప్పేది కూడా విని, చదువుతూవుండాలి. లేకపోతే రాగద్వేషాలు జడమూర్ఖత్వానికి, అది పర్వర్షన్ కు దారితీసి ఫానటిక్ గా మారుస్తాయి.
        https://www.quora.com/Was-Veer-Savarkar-an-atheist-If-yes-how-is-he-the-poster-boy-of-Hindutva

      • Rani SivaSamkara శర్మ.

        ఇంతక్రితం వివిన మూర్తి తో జరిగిన చర్చలో మీరడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పాను. హిందువులు ఎప్పుడు దేశాన్ని రెండుగా విభజించాలని కోరుకోలేదు. అది గాంధి అయినా లేక సావర్కర్ అయినా. దేశ విభజన గలకారణాలను అంబేడ్కర్ రాసిన పాకిస్థాన్ లేదా దేశవిభజనలో చాలా స్పష్టంగా విపులంగా చెప్పాడు. దేశ విభజన వరకు అదొక ప్రామాణిక గ్రంథం. దానిని ఆధరాం చేసుకొనే గాంధి, జిన్నాల మధ్య చర్చలు జరిగాయి. ఆ రోజుల్లో గాంధితో పోలిస్తే సావార్కర్ ప్రముఖ ప్రజానాయకుడా? లేక ఎమైనా బలవంతుడా? ఆయనను పదే కోట్ చేస్తావు?

        భారత పాక్ విభజన అచ్చంగా రెండు బలమైన వర్గాల మధ్య ఇగో క్లాష్ (జిన్నా వర్సెస్ నెహ్రూ, కాంగ్రెస్ వర్సెస్ ముస్లిం లీగ్ ) అయితే ఎప్పుడో కలసి పోయి ఉండేవాళ్ళు. మధ్యలో వాళ్ళ మతనిబంధనలు దూరబట్టే సుమారు 70ఏళ్లు అయినా విభేదాలతో కొట్టుకొంట్టుండేది.

        యూట్యూబ్ లో టీండెర్ బాక్స్ – యమ్.జె. అక్బర్ Tinderbox mj akbar
        ********************

        వీరమణి పెద్ద నాయకుడా ? ఆయనతో ఆనంద్ ఇంటర్వ్యు చేయటం.ఈయన తీసుకొచ్చి మనకు చూపటం. ఒకసారి 1980లలో వీరమణి యం.జి.ఆర్. పై నోరుపారేసుకొంట్టే, అయనని సాటి ద్రవిడ ఉద్యమకారులు కొట్టిన దెబ్బలకి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. అప్పటినుంచి తెరమరుగై పోయాడు.

        ఈ మధ్య టివిలో చేరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూంటాడు. కరుణానిధి కుటుంబ సభ్యులు మంగళ సూత్రాలు కట్టుకొని పెళ్ళిళు చేసుకొంటే మూసుకొని కూచొంటాడు. అమాయక పేద మహిళలచేత పెద్ద పుడింగిలా మంగళ సూత్రాలు తీయించుతాడు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు