కాకినాడ నుంచి హ్యూస్టన్ దాకా…

కాకినాడ నుంచి హ్యూస్టన్ దాకా…

వంగూరి చిట్టెన్ రాజు-….క్లుప్తంగా రాజు వంగూరి.
ఈ పేరు వినని తెలుగువారు అతితక్కువంటే అతిశయోక్తి కాదు.  
నలభయయిదేళ్ళ క్రితం ఈ అమెరికా దేశానికి వలసవచ్చి, హ్యూస్టన్ వాస్తవ్యులుగా స్థిరపడిన  వీరు తొలితరం తెలుగు  డయాస్పోరా కథా రచయితల్లో అగ్రగణ్యులు. రెండొందలకు పైగా వీరు రచించిన రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, ఆపై వారు స్థాపించిన  “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ” అనే సాహితీ సంస్థ ద్వారా తొమ్మిది పుస్తకాలుగా వెలువరించబడ్డాయి. 
స్వదేశానికీ, విదేశానికీ మధ్య సంస్కృతీ, సంప్రదాయాల్లో ఉండే విభిన్నతలు, జీవనపరిస్థితుల్లో వైరుధ్యాలు,  విలువల చట్రాల్లోని వ్యత్యాసాలు, వీటన్నిటినీ వీరి రచనలు చిత్రిక పడుతుంటాయి. రోజూవారి సంఘటనలనించి పుట్టే ఈ రచనలు చిత్రమైన అనుభవాలని చూపిస్తూ నవ్విస్తూనే, వాటిని మొదలుకంటా పట్టుకుని ఉండే సగటు ప్రవాస భారతీయుని ఆత్మని పట్టించేస్తూ ఉంటాయి.
 
వీరి రచనల్లో సునిశిత హాస్యం తొలుత పాఠకులని నవ్విస్తుంది. ఆపై ఆలోచింపచేస్తుంది. ఆ మార్చగలిగేవాటిని మార్చేందుకని చేసే ప్రయత్నమూ, మార్చలేని వాటిని హుందాగా అంగీకరించే సగటు ప్రవాస భారతీయుని వ్యక్తిత్వమూ గమనింపుకి తెచ్చి మెప్పిస్తుంది. హాస్యరచనలకి పేరెన్నిన చిట్టెన్ రాజు గారితో ముఖాముఖి మీరిప్పుడు చూడనున్నారు.
.

దీప్తి, శ్రీనివాస్ పెండ్యాల

9 comments

Leave a Reply to G. Praveen Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Wonderful video. Everything about it is so pleasant and awesome. Good to know vanguri Garu’s humongous efforts for telugu literary world in such a presentable and effective voice.

  • Oree Snehithuda, Chaalaaaaa perigi pooyaavuraa. Intha adbhutamayina vyakhyanamu !!!! Mana Bhashani intha gowravinchinanduku Naa Abhinandanamulu. . . Keep it up. We are proud of you Nee Video anthaa choosaanu. Mee paatha snehithudu. Saidas Malladi.

  • ఈ వీడియో ద్వారా వంగూరి చిట్టెన్ రాజు గారిని మరలా తెలుగు ప్రజలకు పరిచయం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నేటి గందరగోళ దైనందిక జీవితాన్ని కొంచెం సేపు ప్రక్కన పెట్టి, కడుపారా నవ్వుకు నేలా చేసే మంచి మంచి హాస్య కథలు మనకు అందజేస్తున్న వంగూరి గారి సేవలు చాలా అమూల్యమైనవి. వారి సేవలకు బదులుగ ఆయనకు మరియు ఆయన కుటుంబానికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని, ఇహపరలోకాలలో శాంతినిచ్చే దివ్యజ్నానాన్ని ప్రసాదించమని సకల లోకాల సృష్టికర్తను కోరుతున్నాను. ధన్యవాదాలు. ముహమ్మద్ కరీముల్లాహ్.

  • వంగూరి గారి కధలు చదివాను. ఆయన 2016 ఆగష్టు 23 నా మా బారిష్టర్ పార్వతీసం నాటకం విశాఖ లో చూసి చాలా ఆనందించారు.

  • చాలా బాగుంది. రాజు గారు తెలుగు భాష కు చేస్తున్న సేవ కు చాలా కృతజ్ఞతలు. వంగూరి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు చాలా అభినందనీయం. వారి సేవలు స్ఫూర్తి దాయకం. రాజు గార్కి దీర్ఘాయుష్మాన్భవ, అఖండైశ్వర్యాభి వృద్ధిరస్తు, ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు

  • అమెరికాలో తెలుగు దిక్కు ఆయన. తెలుగు వారి పట్ల, తెలుగు భాష పట్ల వారికున్న అభిమానం తెలిసిన వారు ఆయనని మరచిపోలేరు. వారి ఇల్లు ఎందరికి ఆతిథ్యం ఇచ్చిందో? అలాంటివారిని ఇలా భద్రపరచుకోవడం ఎంతయినా ఆనందించదగ్గది, అభినందించదగ్గది. వారికి వారి కుటుంబానికి, ఇంతగా ఆయనని గుర్తుచేసిన అందరికీ వందనాలు, అభినందనలు.

    – ముకుంద రామారావు
    హైదరాబాద్
    23 జూన్ 2020

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు