కవిత్వసినిమాలో నిషాసుందరి

చాలా మంది కవులు యాచకుల్లా ఆమె వెంటపడతారు. ఎవరికెంత రాసి పెట్టి వుంటుందో అంతే అనుభవాన్ని పురుష స్త్రీ కవులకు ఆమె విదిలించి పోతుంటుంది.

Romanticism is a Sex Crossing mode which adds femaleness to maleness – Camille Paglia

న 85వ జీవనవసంతంలో కూడా ఆమె ఇప్పటికీ యవ్వనవనంలో తలనూపే నీలి గన్నేరు పువ్వు. ఆమె నటించిన అతి కొద్ది మంచి సినిమాలు.. సృజన ప్రపంచంలో.. వాటి destiny ని అవి వెదుక్కున్నాయి. నిజవాస్తవ కల్పనా లోకంలో.. ప్రతీకళకూ ఒక కవిత్వతత్వం, అర్థం వొనగూడి వుంటుందన్నది తార్కొవిస్కీ వంటి మహా దర్శకకవి తన కాలచక్రాన్ని చెక్కుతూ కొన్ని కవిత్వ సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. అదెంత నిజం. గొష్ట Arts అన్నీ మన కొన్ని విభిన్న వినిమయానికి లొంగని జాతుల Spiritual ఆకలిని తీరుస్తూనే వుంటాయి. కాలచక్ర గతిని సరిచేస్తూనే వుంటాయి. ఆ forms లోని చేతనలన్నీ Inverted గా తలక్రిందులుగా వేలాడుతూ ప్రపంచ అధిపత్య శక్తుల దమనాన్ని, దహనాన్ని, ఓటమినీ వెక్కిరిస్తూనే వుంటాయి. మహా ఖాండవదహనంలో వొక్క చిన్న ఉడుతైనా కంజుపిట్ట అయినా బతికి బట్టకడుతుందన్నదే చెపుతుంది కదా.. మన అస్తిత్వం. కవిత్వ సినిమా.. అనేకార్థాలని ప్రేక్షకుడి వైపుకు వెదజల్లుతుంది. ఆ సినిమా, దర్శకుడు ప్రేక్షకుడు తీసుకున్న అర్థంలోకి తనను తాను కట్టేసుకోడు. వొక అనుభవ ద్రవ్యతనే అందజేస్తాడు. Meaning తనకు సంబంధించినది కాదు. If you looks for a Meaning you will miss everything that happens అంటాడు తార్కొవిస్కీ.

అటువంటి కొన్ని భారతీయ కవిత్య సినిమాలలో అరుదుగా వికసించిన ‘నీల కురింజి’ పువ్వు .. కథానాయిక వహీదా రెహ్మాన్. వహీదా తన 85వ వసంతంలో కూడా నిత్యజీవ యవ్వనశీలి.

అత్యాధునిక కవిత్యంలో సరిహద్దులో చెరిపేసుకుంటున్న sexual Personae ఆమె ఇప్పటెప్పటికీ.. వొక కవి అందుకోవాలనుకుంటున్న స్త్రీయే. ఆమె తొడుక్కున్న పాత్రలు, పాడుకున్న పాత్రలు ఆడుకున్నటువంటి పాత్రలు. ఇప్పటి మెట్రో, రెట్రో cult Classical సినీమాయ సూత్రాలన్నీ వినిర్మాణం అవుతన్న, లేదా చేస్తున్న కొత్త తరం సృజన కవి దర్శకుల ముంపుల్లో కూడా వహీదా రెహ్మన్’  చిత్రాస్తిత్వం సత్యచలనంతో కాలాతీతంగా కదులుతూనే వుంటుంది. మెదులుతూనే వుంది కూడా….

***

కలవాస్తవాలను కలిపి దుఃఖంలో పిసికి ఆత్మకు తినిపించి ఆకలిని తీర్చిన ప్యాసా ‘ వంటి కవిత్య సినిమా లో…. ఆమె నటన అంతా… సముద్రమూ, తుఫాను, చుక్కానీ పడవ కలెగలిపిన యాత్రా హేల. ఇటువంటి epiphany వంటి తటిల్లతనే, తగ్గిరే మెరుపునే Dreality అని సంభోదిస్తాడు వడ్డెర చండీదాస్ తన desire and Liberationలో…. ప్యాసా, కాగజ్ కే పూల్, చౌదివీ కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, నీల్ కమల్ వంటి చిత్రాలు.. అందులోంచి మరీ ప్రత్యేకంగా Guide వంటి జీవచలన చిత్రాలు. ఆమె అద్వితీయతకు బింబ ప్రతిబింబాలు…

***

అది వరకూ ఏ చిత్రకారుడూ కవీ పూర్తిగా వెదజల్లనటువంటి నవ్వు తనది. వొక మబ్బు సగంగా నవ్వి ఎండగా కురిసే వాన. కొన్ని శతాబ్దాల.. మాయిముంత దుఃఖం తాగి తూలుతున్నట్లు ఆమె చూస్తుంది. అచ్చంగా మా మందమల్లమ్మ వంటి స్నిగ్ద రూపిణి. ఏకాకి బహురూపిణిలా ఆమె. చాలా మంది కవులు యాచకుల్లా ఆమె వెంటపడతారు. ఎవరికెంత రాసి పెట్టి వుంటుందో అంతే అనుభవాన్ని పురుష స్త్రీ కవులకు ఆమె విదిలించి పోతుంటుంది.

ఆధునిక తెలుగు కవులు శివసాగర్  చలం గారితో సహా, శ్రీశ్రీ, గద్దర్ వజీర్ రహ్మాన్, ఇస్మాయిల్, దాశరథి, మోలతో  సహా అందరూ కవిత్వ సినిమా లో తడిసిపోయిన వారే.. కాముని పున్నమి నిద్రను నటిస్తూ….కాంచన మాల, రేఖ, కన్నాంబ, సావిత్రి, వహీదా రెహ్మాన్, స్మితా పాటిల్, అర్చన, శ్రీవిద్య మధుబాలల అలౌకక భౌతిక స్వప్నాలలో ఊయలూగిన వారేనని చెప్పక తప్పదేమో ….

Poetic film ఇప్పుడిక Local universal genre. ‘అత్యంత అవసరంగా post global, post corona, post world order మారుతూన్న నేపథ్యంలో ఎంతో అవసరమయిన genre అని తెలిసి వస్తుంది. అది మన అమానవ విమానవ మానసిక డొల్లతనాలకు Antidote లాగ పనిచేయగల్గుతుంది. అంటే .. కవిత్వమూ, సినిమా వొకే  పేగుబంధంలోకి, నిజకల్పనలోకి దిగి మనిగిపోతూ చిత్రచలనంగా perform చెయ్యగలుగుతాయి. ఇటువంటి సినిమాలు చదవ తగిన పుస్తకాలవుతాయి. మన పాత పెంకుటింటి కప్పులోంచి కొరివచ్చే దూళికాంతి మన aesthetics ని శుభ్రం చేస్తుంది. కవిత్వంలోని అసమ సత్యాలను, సగమే కొట్లాడే అబద్దాలను, మోనో డైలాగ్స్ నూ, ముచ్చట్లనూ జీవవంతం చేస్తుంది. మన దిడ్డిదర్వాజ తలుపులను  సగం తెరిచి పెడ్తుంది. వెనకనుంచి వచ్చి కూకునే గుంపులకూ ముంపులకూ గంజి పోస్తూ సేద తీరుస్తూ వుంటుంది.  కనురెప్పల కదలికలతో, చూపుల దేహాలతో, సంజ్ఞలతో.. మౌఖికాన్ని వాచకంగా మారుస్తుంది. ఇదంతా poetic సినిమాలోని అంతరంగ తతంగం. ఆ తతంగమే .. వహీదా రెహమాన్ .. నిశ్శబ్దంగా కొనసాగించే సంభాషణ ‘pyasa’ సినిమాలో గురుదత్ దేహంతో ఆమె మాట్లాడుతుంటుంది.

ప్యాసాలో.. ఆమె తన body language నంతా.. కనురెప్పలు కదిలికలతో అన్నం వార్చినట్టుగా వారుస్తూ, లోతుల్లోకి అడుగుల్లేని లోతుల్లోకి…దీర్ఘాంతరంగ వేదనలోకి మనను తీసుకుపోతుంది. కవిత్వ దారుల గుండా. ఇక్కడే ప్రేక్షకునికి వొక మహానుభవం తారసపడుతుంది. అర్థం absent అయ్యి అనుభవమే చివరికి మిగులుతుంది. వహీదాజీ నటించిన కొన్ని సినిమాలలో ప్రేక్షకుడికి ఇటువంటి అనుభవమే సొంతమవుతుంది.

అందుకే ఇప్పడు poetic film అన్నది వొక బలమైన భాష… కవులకూ, కవుల మానసం వున్న దర్శకులకూ వాటిలోని నాయిక/నాయకులు gender racial caste religion borders చెరిపేసుకుంటూ… కవిత్వాన్ని సినిమాని కలిపి… వినిర్మాణంలోకి…పాఠక ప్రేక్షకులను దగ్గరగా తీసుకుపోగలరేమో…..

***

సిద్ధార్థ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవి…. వాగ్గేయ… మీ వ్యాసం అజరామరం..

  • ఏమిటో ఈ మాయ. మెదడును ఎన్నిమెలికలు తిప్పినా వ్యాసకర్త చెప్పేది బోధపడలా.

  • ప్రతీ కళాకారుడు తన పోషించే పాత్రలో జీవిస్తాడు.. కథా, కథనం ప్రేక్షకులను రంజింపచేసినా.. చెయ్యకపోయినా వారి వారి పాత్రల్లో ఇమిడిపోతుంటారు.. ఒక్కోసారి వారి నిజజీవితమూ మరిచి పాత్రల్లోని జీవిస్తుంటారు. అది కళను జీవితం అనుకున్న కళాకారుల తాలూకూ అబినివేశం.

    అయితే.. పాతతరం మరిచిపోతున్న ఈ జనరేషన్ కి అద్భుతంగా అర్థమయ్యేలా చెప్పారు కవివాగ్గేయ సిద్ధార్థగారు.. వారి కళాతృష్ణకు, కవిత్వ, కళల పిపాసకు నా శుభాకాంక్షలు. వారి కలం నుంచి మరిన్ని అద్భుతమైన వ్యాసాలు రావాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను..

    * ఎందుకంటే “కలవాస్తవాలను కలిపి దుఃఖంలో పిసికి ఆత్మకు తినిపించి ఆకలిని తీర్చిన” వంటి పొయేటిక్ సైంటిఫిక్ పదాలను సందర్భనూసారంగా వాడగలిగే సత్తా ఉన్న రచయితలు తెలుగులో మీరు తప్ప ఇకెవరున్నారు..

    *”మన పాత పెంకుటింటి కప్పులోంచి కొరివచ్చే దూళికాంతి మన aesthetics ని శుభ్రం చేస్తుంది. కవిత్వంలోని అసమ సత్యాలను, సగమే కొట్లాడే అబద్దాలను, మోనో డైలాగ్స్ నూ, ముచ్చట్లనూ జీవవంతం చేస్తుంది. మన దిడ్డిదర్వాజ తలుపులను సగం తెరిచి పెడ్తుంది. వెనకనుంచి వచ్చి కూకునే గుంపులకూ ముంపులకూ గంజి పోస్తూ సేద తీరుస్తూ వుంటుంది”

    ఇంత సౌందర్యవంతంగా, ఇంత కవితాత్మకంగా, ఇంత లయబద్ధంగా.. ఇంత ప్రేమతో రాయగలిగిన నేర్పరి ఈ మధ్య కాలంలో అరుదనే చెప్పాలి.

    “కవిత్వాన్ని చదవడం.. జీవితాన్ని చదవడం.. రెండింటిని కలిపి చదవడం” చాలా అరుదుగా జరిగే ప్రక్రియ మీ వ్యాసాలతో పాఠకులకు ఆ అనుభూతుల్ని దేవుని పల్లారం పల్లెటూళ్లో పంచినట్టు పంచిపెడుతున్న మీ కవిత్వభక్తికి నా ధన్యవాదాలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు