కొప్పర్తి కవిత్వం చదువుతున్నంత సేపూ పాతికేళ్ళనుంచీ ఈ చరిత్ర బోధించే కవిలో ఏం రసాయనిక చర్యలు జరిగితే ఇన్ని వైవిధ్యమైన కవితలు పుట్టాయన్న సందేహం వస్తుంది. అవును. అతనిలో అక్షరాక్షరానికీ మధ్య ఒక్కో నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అనుభవం కనిపిస్తుంది. కృష్ణాజిల్లా చిలకలపూడిలో పుట్టిన ఈ కవిప్పుడు విశ్రాంత చరిత్ర లెక్చరర్. ప్రిన్సిపాల్. పిట్ట పాడే పాట కోసం, విషాద మోహనం, యాభై ఏళ్ళ వాన ఆయన కవితా సంకలనాలు.
ఇతని కవిత్వాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డు (1991), ఉమ్మడిసెట్టి (2003), ఆంధ్ర సారస్వత సమితి అవార్డు (2003), సినారె (2004), ఫ్రీవర్స్ ఫ్రంట్ (2008), తిలక్ పురస్కారం (2010) వరించాయి. 17 వ తారీఖున పిఠాపురం లో డా: ఆవంత్స సోమసుందర్ కవితా పురస్కారాన్ని స్వీకరించారు. ఆ సందర్భంగా కొన్ని ముచ్చట్లు
భలే ఇంటర్వ్యూ శ్రీరాం…
మంచి ప్రశ్నలు,సమాధానాలు నూ
అభినందనలు
మంచి ప్రశ్నలు సంధించారు. ఇంకా మంచి జవాబులు రాబట్టారు. అభినందనలు.
ఆన్లైన్ పత్రికలు, కవిసంగమం, సోషల్ మీడియా – ఇన్నింటి మధ్య వస్తున్న వర్తమాన వచన కవిత్వాన్ని మీ రెట్లా వ్యాఖ్యానిస్తారు ?
good question and good answer also.
ilanti manchi interviews ma lanti readers ki chala manchidhi . thanks sriram sir
kopparthi sir.. this comments are great.. తొలిదశ లో కవిత్వం ఒక ఆయుధం. మలిదశ లో అదొక పనిముట్టు.
ఇప్పుడది ఔషధం.
కవికీ కవిత్వానికీ సంబంధించి వివరణ బాగుంది. ఒక కవికి కాలమాన పరిస్థితి కి సంబంధించిన అవగాహన విషయంపై వేసే ప్రశ్నలు సందేశాత్మకంగా అనిపించింది. ఏవో గుర్తింపు కోసం ప్రశ్నలు వేయటం వాటికి అలాంటి జవాబులు రాబట్టుకోవటం కాకుండా సాహితీ పరమైన ప్రశ్నలు వేయటం దానికి సరయిన సమాధానాలు బాధ్యత గా కొప్పర్తి గారు అందించటం వల్ల చాలా విషయాల్ని పాఠకులు తెలుసుకొనే అవకాశం కలిగింది. ఇద్దరు కవులకూ అభినందనలూ ధన్యవాదాలూ.
కవిని ఆవిష్కరించారు. మూడు సంకలనాల వృద్ధ యువ కవి ఆలోచనాలోచనాల్ని క్రోడీకరించి, అభిప్రాయాలను సమీకరించారు. ధన్యవాదాలు.
ఇంటర్వ్యూ, బాగుంది,సర్!👍💐!
విశిష్టమైన కవి కొప్పర్తి గారు వారికి సోమసుందర్ గారి పురస్కార సందర్భంగా వారి మనసులో మాటలు పంచారు… నాకు నచ్చిన వారి మాట”””’ కవి ఒక గుంపు లో ఉంటాడు. కవిత రాయగానే గోడకు తగిలిస్తాడు. ఆ గుంపు తక్షణ చర్చ చేసి నిగ్గు తేల్చేస్తుంది. ఆక్షణాన చూడకపోతే అది మాయమౌతుంది. స్థిమితమూ నిలకడా ఉండవు. ఆన్ లైన్ కవి తొందరగా అలసిపోయి నిష్క్రమించే ప్రమాదం ఉంది. గమనించండి. రెండు మూడేళ్ల క్రితం ఉధృతంగా రాసిన కవులు ఇప్పుడు లేరు””👌👌👌👌వ్యాసకర్త శ్రీరామ్ గారికి అభినందనలు💐💐💐💐
కొప్పర్తిగారితో ముఖాముఖిలో మీరు సంధించిన ప్రశ్నలు, రాబట్టిన సమాధానాలు ఎంతో ఉపయుక్తంగాఉన్నాయి.
కవి ముఖ్యంగా పురుషుడిగా స్త్రీ తర్వాత స్థానం స్వీకరించడానికి సిద్దపడ్డానని చెప్పడం,స్వానుభవ నిర్దిష్టత తొంభై తొమ్మిది శాతమైనా సహానుభూతి ఒక్కశాతం కలవకపోతే అది అసంపూర్ణమవుతుందంటూ తన వైఖరిని స్పష్టం చేయడం,
చరిత్ర,సాహిత్యం రెంటిలో తన జీవనాస్తిత్వం మాత్రం సాహిత్యంతోనే వుందని చెప్పిన తీరు,మరీ ముఖ్యంగా నేటి ఆన్‌లైన్ కవిత్వం, కవులపై చెప్పిన అభిప్రాయం ప్రతీకవి ఆలోచించుకునేలా చేసింది..ఇలాంటి ఇంటర్వ్యూల వల్ల
జరిగే సాహితీ చర్చలు నేటితరం కవులకు పాఠాలు..
ప్రశ్నలు, జవాబులు తెలుగు కవిత ప్రయాణం ను తేట పరిచాయి… కొప్పర్తి వారి కి నమస్సులు
మీకు ధన్యవాదాలు
ఆలస్యంగా చదివినందుకు చాలా చింతిస్తున్నాను. ఎంత సహజమైన ప్రశ్నలో అంతే ఆలోచనాత్మకమైనవి. ఆ ప్రశ్నలకు ఒక సీనియర్ కవిగా కొప్పర్తి గారి సమాధానాలు చాలా ఆలోచింప చేశాయి. నిజంగా కవిత్వం ఇప్పుడు ఇన్స్టంట్ వస్తువు అయిపోయింది. అనిపించడం, టైప్ చేయడం , కామెంట్స్ తీసేసుకోవడం గొప్ప కవినని మురిసిపోవడం. అంతా క్షణాల్లో లేదా రోజుల్లో. ఎవరికి వారితోనే పోటీ. అదీ అతి స్వల్ప కాలం. గిర్రున తిరిగే కాలంలో ఎవరూ శాశ్వతం కాదు అలాగే ఏ కవితా శాశ్వతంగా నిలబడటం లేదు.
ముక్తాయింపు గా కొప్పర్తి గారి సమాధానం “కవిత్వం కోసం ఎదురుచూస్తున్నాను. ఎదురెళ్లడం ఇష్టం లేదు” చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఎంత మంచి పేరు తెచ్చుకున్న కవి అయినప్పటికీ తనంతట తాను గా వచ్చే కవిత్వం కోసం ఎదురుచూడటం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నచ్చింది. కవిత్వం అంటే అదే కదా
” తన పుట్టుక తానే రాసుకోగల రసగంగా ప్రవాహం.
ఏ బలవంతాలకి, ఏ ప్రోద్బలాలకీ లొంగని సిసలు అక్షరామృతం”
శ్రీరామ్ సర్ మీకు శత సహస్ర ధన్యవాదాలు. మంచి కవి ని పరిచయం చేయడమే కాక మదిలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చూపారు.
అలాగే కొప్పర్తి గారికి మనఃపూర్వక అభినందన మందారాలు. మరలా కవిత్వం వారిని వెతుక్కుంటూ రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
ఎన్నో కొత్త ప్రశ్నలు..ఆసక్తికరంగా సాగింది సార్ ఇంటర్యూ…