ఎదురు చూస్తున్న ఆ వేకువ,
కొత్త ఆశనందిస్తుందా,
భయాన్ని మోసుకొస్తుందా?
ముఖాలపై ఆందోళన,
ఎటు చూసినా ఆర్తనాదాలు, చెదిరిపోతున్న ఆశలు,
చిగురించకముందే
రాలిపోతున్న కలలు
నిర్లక్ష్యపు నీడల్లోంచి పుట్టింది ఇది.
సామూహిక బాధ్యతల కన్నీటి చిహ్నమిది.
కొందరికే ఈ వేదన, పరీక్షలెందుకు?
ఈ కన్నీటి గోడు పెద్ద ప్రాసాదాలను ఎందుకు తాకట్లేదు?
వారి మనసులు గడ్డకట్టుకుపోయి శిలాకృతిగా మారాయా?
కానీ
ఒక చిరునవ్వు… చీకటి జీవితాలను వెలుగుకి పరిచయం చేయాలి.
ప్రతి మనసూ మేలు మార్గంగా,
ప్రతి చేయి ఆధారంగా,
చీకటి మొదళ్లను పెకలించాలి.
మార్పు కోసం ఎదురు చూస్తే సరిపోదు —
మార్పుకి మనమే కవాతు గీతికగా
మారాలి
మార్గం కనిపించకపోయినా, మొదటి అడుగు వేస్తే చాలు,
అది తనంతట తానుగా పరచుకుంటుంది.
*
Add comment