ఇప్పుడు మనం వినబోయే కథ ” అయిదో గోడ ” రచయిత్రి కల్పన రెంటాల.
ఆమె కవిత్వానికి అజంతా అవార్డు అందుకున్నారు. రాసిన కథలు కొన్నే అయినా, అవి చాలా మటుకు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. స్త్రీవాద సాహిత్యం మీద అనేక వ్యాసాలు రాశారు. సారంగ అంతర్జాల పత్రిక నిర్వహకురాలు. అమెరికాలో నివాసం.
ఈ కథ లో ఆమె ఎంచుకున్న అంశం …వితంతు స్త్రీ పునర్వివాహం.
అయితే ఆ పునర్వివాహం వీరేశలింగం పంతులుగారు ప్రోత్సహించిన…. సంఘసంస్కరణ గా కొనసాగిన బాల వితంతువుల పునర్వివాహం లాంటి సంస్కరణ వివాహం కాదు. జీవితపు మలిదశలో భర్తను కోల్పోయినా , ఒంటరిగా జీవించాల్సిన అవసరం లేదు. అలవాట్లు , అభిరుచులతో పాటు వయసుకి , మనసుకి తగ్గ సహచరుడు లభిస్తే తిరిగి అక్కడి నుండి జీవితాన్ని పునర్ నిర్మించుకుని , రసభరితం చేసుకోవచ్చు అని ధైర్యం చేసే ఒక స్త్రీ ప్రయత్నం ఈ కథలో చిత్రించబడింది.
ఆ ప్రయత్నాన్ని ఆమె కుమార్తె , ఏ విధంగా చూసింది….అసలు కథ రాసిన రచయిత్రి ఏ కోణంలో చూడాలి అని భావించింది ఈ కథకు ప్రత్యేకత చేకూర్చింది. అరుదైన అమెరికన్ తెలుగు కథ ఇది. అనేక భారతీయ భాషల్లోకి అనువదింపబడింది. ఈ కథని నౌడూరి మూర్తి గారు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లోని ఒక విద్యార్థిని కూడా ఆంగ్లంలోకి అనువదించారు.
వినండి ఈవారం కథ కల్పన రెంటాల గారి “అయిదో గోడ ”
Katha baagundandee!alochimpa jesthundi.