జగత్ జేయమైన వీధులన్నీ నిర్మానుష్యం
పాదాచారుల సంచారమూ సమాప్తం
రోడ్లు భవనాలు కాయిదం మీది డయాగ్రమ్ బొమ్మలు
నగరం ఒకానొక ఆగిపోయిన చిత్రం
ప్రవాహమైన రహదారులన్నీ
పొడవుగా పరుచుకున్న ఖాళీ మైదానాలు
ఆగిపోయినట్టున్న దూర తీరాలు
నిశ్చలమై నిలిచిపోయిన
ఉరుకులు పరుగుల చక్రాలు
త్వరణ వేగాలన్నీ మౌన విశ్రాంతం
వాహన వాహనానిదీ ధ్యానముద్ర
ఆగిపోయినా కార్బన్ మోనాక్సైడ్ల వ్యాపనం
ఆకాశంలో పెరిగిన ఆక్సిజన పరిమళం
చెట్టు చెట్టుకు తాకిన కొత్తగాలి
పచ్చని ఊపిరి లో లేచిన చిగురుటాకు
వాయులీనంలోనూ ప్రాణప్రదం
రాత్రిళ్లు నక్షత్రాలూ తళుక్కుమంటున్నాయి
మరింత కాంతిలో చందమామ దరహాసం
నిద్రాణమైన ఆ నిద్ర ,ఎన్ని ఏండ్ల నాటిదో
హోటళ్లు రెస్టారెంట్ల గాఢమైన గురక
ఆటోలు బస్సులకు తనివి తీరా రికాం నిశ్శబ్దం భయంతో నిద్రపోతంది
రోజు తిరిగే అరికాళ్లకూ భయోమయం
ఇంటి గోడ కే అతుక్కున్న దేహ గడియారం
నడకలు నడతలు పనుల లాక్ డౌనులు
అధ్యయనాలు అలుకలు గురకలు
జరంత మొఖం కొడుతున్న రోజులే ఇవి
ఇప్పుడు గృహమే కారాగారవాసం
*
Inti godake athukkunna deha gadiyaaram. Excellent