దేవరకొండ బాల గంగాధర్ తిలక్… మన తెలుగు రవీంద్రుడే అనిపిస్తుంది నాకు. కవిత్వంలో గాఢత, ఎంత చదివినా ప్రతిసారీ కొత్తదనం.
అమృతం కురిసిన రాత్రి, సైనికుడి ఉత్తరం ఇప్పుడు చదివిన రెండు కవితలు.
ఒక రాత్రి అమృతం కురిస్తే మరొక రాత్రి బూట్ల చప్పుడు పెట్టే కలవరం అనుభూతిచెందుతాం. మనసు చెప్పే మాటలు వినడానికి ఏకాంత రాత్రుళ్లే అనువైన సమయాలు.
“నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు”
“ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అంటారాయన. ఆ రెండులక్షణాలు ఈ రెండు కవితలలో మనకు కనిపిస్తాయి. అమృతం కురిసిన రాత్రిలో సౌందర్యమూ, సైనికుడి ఉత్తరంలో విషాదమూ!
కలల పట్టు కుచ్చులున్న కిరీటం ధరించి మనల్ని అనుభూతుల ఓలలాడిస్తాడు. గుండెలమీద ఏ క్షణమైనా దిగడానికి సిద్దంగా వున్న కత్తితో వేలమైళ్ల కావలనున్న సహచరి దేహపు వెచ్చదనంతో nostalgia లోకి జారిపోయే సైనికుడి బాధను మన గొంతులోకివొంపుతాడు.
ఎక్కువశాతం పద్య శైలిలో వుండే ఆయన కవితలు సాహితీ ప్రేమికులకు అక్షరామృతాలు. వినండి మరి.
❤️❤️🙏👍👌.మీ గళం లో,రెండు..!మేడం.చదవడానికి, ఎంత ఇష్టపడతానో,.. వారికవిత్వం., మీ గొంతుకు తో విన్నా అంతే భావన కల్గింది.. ధన్యవాదాలు.!
చానా బాగ చదివినేరు మేడం రెండు కవితల్ని.
మీ గొంతుకి వెనుక తోడైన మంద్ర సంగీతం కొత్త సొగసులద్దింది
Lovely
మంచి ఆబ్సర్వేషన్