ఓట్లు మావి సీట్లు మీవా అనే నినాదం ఒకప్పుడు రాజకీయాలలో బలమైన నినాదాలుగా వర్ధిల్లేవి. టిక్కట్లు కొని సినిమా చూసి మీకు సంపద ఒనకూరుస్తుంటే తెరమీద మా కథలేవి అంటున్నారు ఈ నాటి ప్రేక్షకులు. ఇవి రెండూ న్యాయబద్దమైన ప్రశ్నలే మరి అయినా తెలుగు తెరమీద న్యాయానికి చోటెక్కడ? మితిమీరిన ప్రాంతీయ ఆభిజాత్యం కుల అహంకారంతో కొట్టుమిట్టాడుతూ ఉంటది తెలుగు సినిమా ప్రపంచం. ప్రపంచం అని పెద్దగా ఊహలు వద్దు అది రెండున్నర జిల్లాల మూడున్నర కులాల కండకావర కలల ప్రపంచం.
పాతికేళ్ళ కింద తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిన ఒక అమానుష కథ ఆధారంగా నిర్మించిన ‘జై భీమ్’ సినిమా గురించి ఇటీవల ప్రతి ఒక్కరూ రాస్తున్నారు. రాసే క్రమం లో అటువంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావు ఎందుకు తీయరు అనే చర్చ బాగా జరుగుతోంది. మనదగ్గర ఉన్న చెంచు యానాదుల లాగానే బ్రతికే సంచార తెగ అయిన ఇరులార్ కులం మీద జరిగిన ఒక దొంగతనం కేసు ఇది. చంద్రుడు అనే ఒక న్యాయవాది చేసిన ధర్మ యుద్ధం ఈ కథకు ప్రేరణ.
సినిమా మొదటి నుంచీ కులాల తోకల మీద నిలబడ్డ లోకం. భాష పేరుతో యాస పేరుతో తమ పెట్టుబడికి తగినంత డబ్బు వస్తే చాలు వివక్షలూ ఉద్దారక పనులూ మనకి గిట్టవు అని గిరిగీసుకున్న ప్రపంచం.
కానీ తమిళ సినిమా ప్రపంచం కాస్త భిన్నమైనది. అక్కడ కులం లేదు అని నేను అనలేను కానీ అట్టడుగున కనపడని ఇతిహాసపు చీకటి కోణాలను అది అంది పుచ్చుకుంది. దానికి కారణం సాంస్కృతికంగా పెరియార్, అన్నాదురై వాళ్ళ తదనంతర తరం వేసిన పునాదులు బలమైనవి. ఆ బలం మరింత బలంగా ఉండడానికి కారణం అక్కడ యెర్ర జెండా కురీపులు తక్కువ. చెప్పాల్సినవి ఖుల్లమ్ ఖుల్లా. కనుకనే అక్కడ ఒక స్మశానంలో అడుక్కొని తినే పాత్ర అయినా సగౌరవంగా ఉంటది. సులభ్ కాంప్లెక్స్ పిల్లవాడు, లేదా బట్టల షాప్ లో వర్కర్ ప్రేమ కథను కూడా హృద్యంగా తీయగలరు. ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు కనుకనే అక్కడ అటువంటి సినిమాలు వచ్చాయి వస్తున్నాయి.
గుళ్ళో సన్నాయి పాడుకునే వాడు అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక మంగలి తెరమీద వెలుగు వెలిగాడు. ఒక అంటరాని కులంలో పుట్టిన పల్లార్, పరయా, చెక్కిలియార్ అక్కడ హీరో కాగలడు. తాటి చెట్టు ఎక్కి కల్లు గీసిన వాడు సూపెర్ స్టార్ అవుతాడు. నిర్మాణ సంస్థకు అధిపతి అవగలడు. బస్సు కండక్టర్ అక్కడ వెండితెర కు నిలువెత్తు కటౌట్ కాగలడు. అవసరం అయితే వెండితెర మీద ఉండాల్సిన వాడు గుడిలో విగ్రహం అవగలడు.
ఈ నేపథ్యం లో చూస్తే తప్ప మనకు ‘పరియేరుం పెరుమాళ్, పరదేశి, అసురన్, కాల, కబాలి, జై భీం లాంటి సినిమాలు అర్ధం కావు. అది అర్ధం అయితే తప్ప తెలుగు లో అటువంటి సినిమాలు ఎందుకు రాలేదో రాబోవో అర్ధం కాదు. జై భీం ఇంత ఆదరణ పొందడం కొందరికి నచ్చడం లేదు అది దళితేతరుల కథ అనీ దళితులకీ అంబేద్కర్ కూ సంబంధం లేని అంశం అనీ. అసలు దళితులు ఎవరు ? అంబేద్కర్ దృష్టిలో ఏ సమూహాలు దళితులు అనేది అర్ధం అయితే తప్ప జై భీం మనకు అర్ధం కాదు.
‘మై లార్డ్, బాధించబడిన వారికి లభించని న్యాయం వారికి జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది’.
‘నీతి వాక్యాలకంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థానం మౌనం చాలా ప్రమాద కరమైనది’.
‘ఈ దేశం లో తప్పు చేసేవాడికి కులమూ జాతి డబ్బు పరపతి చాలా ఉన్నాయి బాధింప బడ్డ వాళ్లకి మనమే కదా ఉన్నది’
అని నిజాయితీ గా కొట్లాడిన ఒక నిస్వార్ధ మనిషి చంద్రుడు. కూడూ గుడ్డా లేని అభాగ్యుల కోసం దిక్కూ మొక్కూ లేని జనం కోసం పోరాడ దానికి లా అనేది ఒక ఆయుధంగా స్వీకరించిన ఒక మహోన్నతుడి త్యాగం ఈ సినిమా.
ఈ దేశం లో పుట్టామో గిట్టామో తెలియకుండా ఉంటానికి ఇల్లు ఉన్నామని చెప్పుకోడానికి ఒక అడ్రెస్ లేని అలగా జనాల ఆక్రందన ఈ సినిమా. కాలం విసిరినా కుల కాటు నుండి బ్రతికి బయట పడ్డ ఒక నిండు చూలాలు పడ్డ వ్యధాభరిత పురిటినొప్పులు కథ ఈ సినిమా.
ఈ దేశం మొత్తం వలస పాలన నుండి విముక్తం అవుతోంది అని దేశం మొత్తం సంతోషంలో ఉంటె ఈ రాజ్యాంగం ఈ చట్టాలు ‘బాధించ బడుతున్న సమూహాలకి’ కొద్దిపాటి రక్షణ ఇవ్వగలిగినా చాలు రాజ్యాధికారం సంగతి తర్వాత ఆలోచిద్దాం, ఈ రాబందుల కాలంలో అణగారిన జాతులకి కొద్దిపాటి న్యాయం జరిగినా చాలు అను కున్నాడు.
ఇదొక సాధారణ కథ అయినా అసాధారణంగా తీసిన ప్రయత్నం. జీవితానికి కావాల్సిన బోలెడు తత్వం దాగుంది ఆ మట్టి మనుషుల సంభాషణల్లో.
ఏ సావి మనుషులకు దూరంగా ఉంటేనే నీకూ నీ ప్రాణాలకూ మంచిది ఏటి ! బ్రతుకు పో అంటాడు విషపు నాగుపాముని పట్టి అడవిలో వదిలే క్రమం లో ఒక చెంచు వాడు.
అంతకు ఒక నిముషం ముందు ఆ పాముని పట్టుకునే క్రమం లో ఇంటి యజమాని ఒక కటువైన మాట అంటాడు ‘ఎంటిరా దాంతో సోది చెబుతున్నావ్ కొట్టి బయట పారేయక’. ఆ ‘నాగరిక’ యజమాని తో ఆటవిక పాములు పట్టేవాడు
‘పాపం దానికేం తెలుసయ్యా ఆ పైన కూసున్నోడు దీని కోరల్లో విషం నింపేసాడు ఇది కంట పడితే కొట్టి సంపెస్తున్నారు. ఇదే లేక పోతే వూరు ఎలుకల వల్లకాడు అవుద్ది’
‘ఈ వ్యవస్థ సక్రమంగా ఉండాలి అంటే ఎలుకలు ఉండాలి పాములూ ఉండాలి.’
తన భర్తను అన్యాయంగా చంపేసిన హంతకుల నుంచి నష్టపరిహారం ఇప్పిస్తా అన్న పోలీసు అధికారితో అక్షరం ముక్క రాని ఒక నిషాని గిరిజన స్త్రీ ‘ నా పిల్లలు పెద్దయ్యాక ఈ డబ్బు అంతా ఎక్కడిది అని అడిగితే మీ నాన్నను చంపిన హంతకులు ఇచ్చిన డబ్బు అని చెప్పమంటారా మేము దిక్కు లేని అనాధలమే అలాగని హంతకులు ఇచ్చిన డబ్బుతో మేము కడుపు నింపుకోలేము’ అని నిలేసే ఒక అడవి బిడ్డ ఆక్రందన.
ఎలుకలు పట్టే వెట్టి బ్రతుకుల చీమూ నెత్తురు మీద బ్రతికే పందికొక్కులు ఈ నాగరికులు దొంగతనం నెపంతో కుల అహంకారం రాజ్య కాటిన్యం కలిసి చేసిన అమానుషం ఈ రాజు కథ. ఘనత వహించిన ఈ దేశంలో కూడు గుడ్డకూ నోచుకోకుండా దిక్కూ మొక్కూ లేని జనాలు. చానా చిన్న కథ పోలిమెర ల అవతల బ్రతికే వాళ్ళకీ నడిగడ్డ మీద తిష్టవేసిన పందికోక్కులకీ మధ్య జరిగిన చిన్న గర్షణ. దొంగతనం కేసులో అక్రమంగా ఇరికించబడిన నలుగురి చెంచుల చీకటి బ్రతుకుల్లోకి వెలుగులా వచ్చిన ఒక నిజాయితీ పరుడైన న్యాయవాది కథ. ఒక అన్యాయమైన కష్టోడియల్ హత్యమీద పోరాడిన ఒక ప్రజా న్యాయవాది పోరాటం.
రాజ కన్ను ఒక సంచార జాతి కి చెందిన గిరిజనుడు. ఒక బిడ్డ కడుపుతో ఉన్న భార్య తను. బ్రతుకు దెరువు కోసం ఎలకలు పట్టడం, పాములు పట్టడం పాముకాటుకి మందు వేయడం మాత్రమే తెలుగు. విష నాగులతో నిత్యం బ్రతుకు యుద్ధం చేసే రాజుకి నాగరిక కుల సమాజ కాటు ఎంత భయంకరంగా ఉంటాదో తెలియదు. వూరి కామందు ఇంట్లో పాము దూరింది అని దానిని పట్టడం కోసం వచ్చిన రాజు మీద దొంగతనం అభియోగం మోప బడి పోలీసు చిత్ర హింసలు అనుభవించి కనబడకుండా పోయి భర్త కోసం ఒక న్యాయవాది ఆమె భార్య సినతల్లి చేసిన యుద్ధం జై భీం. రాజుని లాకప్ లో చంపేసి శవాన్ని మాయం చేసే పని.
ఇదెక్కడో విన్న కథలా ఉందికదా బెజవాడ పక్కనే ఉన్న కంచిక చర్ల గ్రామం లో అరవై ఏళ్ళ కింద ఒక కమ్మ కామందు భార్య తన ఇంట్లో పాలేరుగా పని చేస్తున్న కొటేశు తన ఇంట్లో ఒక బిందెను దొంగిలించి దగ్గరలో ఉన్న హోటల్ లో కుదవ బెట్టి అన్నం తిన్నాడు అనే అభియోగం. ఆ నేరానికి జరిగిన శిక్ష తెలుసుకదా రచ్చబండ దగ్గర శిక్ష వేసి అక్కడే ఉన్న కరంటు స్తంభానికి తాళ్ళతో కట్టేసి కిరస్నాయులు పోసి తగల బెట్టి కేకలు పెడుతూ కోటేశు మండే అగ్గి గోళం లా ఉరుకుతూ ఆహాకారాలు పెడుతూ మాది మసి అయి పోయిన చరిత్ర గుర్తు ఉందా. అసలక్కడ తగువు బిందె కోసమే లేకుంటే బిలాంగు టం కోసం జరిగిన రాపిడి గొడవో తెలియదు గానీ ఒక ఉన్మాద స్త్రీ ఉరిమి కోటేశు అనే మంగళం మీద పడ్డది.
కంచక చర్ల, కీలవేన్మని, పదిరికుప్పం,చుండూరు,కారంచేడు, పదిరికుప్పం ఎంత మంది రాజకన్నులు కళ్ళముందే మెదిలి కనుమరుగు అయి ఉంటారు. ఎంత రక్తం పారి ఉంటది. ఈ కధలు వెండితెరకు ఎందుకు అంటరానివి అయ్యాయి మరి ?
సినిమా లో ఒక పోలీస్ ‘ఆ జాతివాళ్ళ లో చానా మంది దొంగతనం కేసులో శిక్షలు అనుభవించడం మామూలే’ అన్న వాడితో న్యాయవాది చంద్రుడు ‘దొంగలకు కూడా ఒక జాతి ఉంటుందా ? మీ జాతిలోనూ నా జాతి లోనూ పెద్ద పెద్ద దొంగలు ఉంటారు’ జాతి పేరు చెప్పి వాళ్ళు అలాంటి వాళ్ళు అనే ముద్రను వేయడం మానండి’ అంటారు.
తెలుగు సినిమా అంటే పొగరెక్కిన ఒంగోలు గిత్త లాంటిది. దానికి విచక్షణ వివేచన ఉండదు. దానికి కారణం కాళ్ళ కింద పారే నీళ్ళు కావొచ్చు. కంటి నిండా కనపడే పచ్చదనం ఇచ్చిన కావరం కావొచ్చు. కాటన్ కట్టిన ఆనకట్ట మూలంగా ఒనకూరిన సంపద మద్రాస్ మొదలు దేశం అంతా తమ సామాజిక సాంస్కృతిక అహంకార విస్తరణ కోసమే ఉపయోగపడ్డది. అందులో మొదట సినిమా ఆ తర్వాత పంపిణీరంగం, పత్రికలు, టివి డబ్బాల మీదుగా దండెత్తి సమస్త రంగాల లో తమ వికృతాన్ని జొప్పించారు. ఆ వికృత మిగులు విలువ కంచక చర్ల కోటేశు మీద అమానుషానికి పాల్పడ్డది. ఇప్పుడు కంచికచర్ల ఖామందు భార్య కోటేశు కథను సినిమా తీయాలి అని ఎందుకు అనుకుంటది మరి ?
తెలుగు తెర మీద కంచక చర్ల కోటేశు కథానాయకుడు కావాలి అంటే ఆయన్ని చంపిన హంతకుల హననం జరగాలి. అది జరిగినప్పుడు మరొక చుండూరు, కారంచేడు ఉత్పన్నం అవదు. న్యాయవాది చంద్రుడు అవసరమే ఉండదు. అప్పటి దాకా మన రక్త మాంసాలు మేక పొట్టేలు తలలా టిక్కెట్ లు తెంపుతూ కోటేశు హంతకుల జేబులు నింపుదాం.
చంద్రుడి చల్లని వెన్నెల. ఇది మట్టిని ముద్దాడిన కథ. జీవితం మీద భరోసా పెంచిన కథ. ఇది నిజానికి తెగులు పడ్డ తెరకు పున్నమి వెన్నెల. జై భీం జీవితాంతం వెంటాడే కథ. గుబులు లేపే వ్యధ.
*
గుర్రం సీతారాములు గారూ….
మీ ఆర్టికల్ చదివాను.
అక్కడ ఎర్రజెండా కురీపులు తక్కువ అనడం నాకు అభ్యంతరకరం.
కురీపులు అంటే పేచీలు(తగవులు) పెట్టేవారని అర్ధం ద్వనిస్తుంది.
అది మొత్తం కమ్యూనిస్టు సమూహాన్ని అనడం భావ్యం కాదు.
మీ ఆర్టికల్ బాగా రాశారు. అభినందనలు.
బాగా రాసావన్నా.. తెలుగులో ఇట్టాంటి సినిమా ఆశించడం అనవసరం.చాలా కాలం చాలా ప్రశ్నలు రేపే ఈ సినిమా కొంత మందిని అయినా బడుగుల పట్ల వారి చూపు మారిస్తే సినిమా ప్రయోజనం నెరవేరినట్టే…
లోతైన విశ్లేషణ, వివరణ…
తెలుగు సినిమా మార్పు అంత తొందరగా వచ్చేది కాదు…
కారణం తెలిసిందే., కాస్త కథలు ఐనా మారితే బాగుంటుంది.
#జాయ్
మనసు తడి కళ్ళలో చెమ్మగా మారే అవకాశాలు అతి వేగంగా కరువయిపోయిన కాలంలో ఇదుగో ” You have stopped being a human from long time , so wake up and accept the reality atleast for a freacking moment అంటూ వీపు మీద ఒక చరుపు లాంటిది ఈ జై భీం . చేతులకి అందని రాచపుండ్ల లాంటి యాంటిల్లాలు బాహుబలి బాహు మూలల ఆరాధింపులో గడుపుతున్న జనంకి నిజానికి ఇలా వీపుల మీద ఫ్రెండ్లీ చరుపులు కాకుండా మంచి నికార్సైన కొరడా చరుపే అనొచ్చు. అందుకే భయం, అందుకే ఎక్కువ మందికి చేరనివ్వకుండ “మీది , మాది , మనది కాదు ” లాంటి పిట్ట లాజిక్స్ ముందేసుకుని అసలు వీళ్ళు మా వాళ్ళు ఇదుగో ఈ సినిమా మా వాళ్ళది అంటూ అచ్చం అగ్రవర్ణ అస్తిత్వ బ్లా బ్లా అందరూ పుణికి పుచ్చుకొని (UN)Ethical blocking of intellegence ఇక్కడ కూడా మొదలు పెట్టారు అనిపిస్తుంది .
అసలు సత్యంగా మనకి బుద్ది అంటూ ఏడిస్తే , ఎలాగూ ఇలాంటి కథలు రాయడం , సినిమాలు తీయడం లాంటి దమ్ముగల వాళ్ళం కాదు కాబట్టి కనీసం క్రౌడ్ ఫండింగ్ అయినా చేసి చిన్నప్పుడు ఊరూరులో స్కూల్ పిల్లల కోసం స్పెషల్ మూవీస్ వేసే వారు చూడండి అలాంటి ఏర్పాటు చేయాలి
,లేదా ఒకరు ముగ్గురికి సాయం చేయండి అలా మానవత్వం చైన్ ముందుకు సాగాలి అన్న పిచ్చ పాపులర్ డైలాగ్ వాడుకొని కనీసం ఇంకో నలుగురికి ప్రైమ్ అకౌంట్ ఇవ్వాలి అందరం . ఇక్కడ కోట్ల వర్షం కురవాల్సిన పని ఎలాగూ ఉంది కానీ కోట్ల కోట్ల మనసుల్లో ఒక సెకనయినా నువ్వు రాజ్యాంగం గీత కి ఎటు పక్క నిలబడ్డావో కరెక్ట్ గా నీ స్టాండ్ అంతరాత్మలకి అయినా తెలియాల్సిన అవసరం ఉంది . అది ఇలాంటి movies చేయగలవు అని గట్టి నమ్మకం.
Vocalisation and movie vocabulary గురించి రాసిన మీరు, అలాగే విజువల్స్ లో ఒకో స్క్రీన్ చెప్తున్న individual కథ కూడా చర్చిస్తే ఇంకా భలే ఉండేది సీతే ! As usual bits and pieces కాకుండా ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా మీరు సినిమాని, mostly వ్యవస్థలను అర్థం చేసుకొని ప్రాక్టికల్ inputs తో ఫినిష్ చేస్తారు చూడండి అందుకే ఫిదా మీ రైట్ ఆప్స్ కి . Looking forward to read more articles from just like ever 🙂
నిశీధి !
థాంక్ యు డియర్.
దాదాపు యాడాదిన్నర సెల్ఫ్ ఎగ్జైల్ తర్వాత నోరు విప్పా. అదీ అఫ్సరన్న ఒకటికి రెండు సార్లు వెంటాడి మరీ అడిగాడు. నువ్వన్నట్టు “కనీసం ఇంకో నలుగురికి ప్రైమ్ అకౌంట్ ఇవ్వాలి అందరం” ఇప్పుడే ఖమ్మం నుంచి ఒక మితృడు అంటున్నాడు. ఒక పల్లెటూరు లో జై భీం సినిమా జైంట్ స్క్రీన్ మీద స్క్రీనింగ్ అని చెప్పాడు. వందలాది మంది కూర్చొని తీరిక గా చూస్తున్నారు. ఇది కదా మనం చేయాల్సింది అనిపించింది.
నువ్వన్నట్టు “విజువల్స్ లో ఒకో స్క్రీన్ చెప్తున్న individual కథ కూడా చర్చిస్తే ఇంకా భలే ఉండేది సీతే ! అనుకున్నా మొత్తం మనమే చెబితే సినిమా చూడరేమో అని క్లుప్తంగా రాసాను..
Thank you verymuch
Well ,it’s always enduring to read a scholars point of view hun, అందుకే సెల్ఫ్ ఎగ్జయిల్స్ , or హెబ్బే వీళ్ళకి నేను చెప్పేది ఏముంది ? వాళ్ళు నా నుండి చదివేది ఏముంది ?లాంటి చైనా గోడలు కట్టుకోవడం మీకు కూడదు. అవన్నీ మా బోటి సగం సబ్జెక్ట్ అర్థమై, కాక గోడ రాతలు రాసే వాళ్ళ భాష్యాలు. మీ వరకు వస్తే రాయడం, express చేయడం , చైతన్య పరచడం ఇలాంటివి బాధ్యత . మీరు కాకుండా ఇంకొకరు చేసినా దానికి authentic value పెద్దగా ఉండదు కుడాన్నూ . Ethnic groups లో సమాజం తాలూకా అన్ని వ్యవస్థలను సరిగ్గా అర్థం చేసుకొనే కెపాసిటీ ఉండి , వాటి నిజానిజాలను నిబద్ధత తో చర్చించే బలమయిన స్వరాలు చాలా అవసరం ఉన్న కాలం ఇది సో, మీకు తప్పదు అంతే. Your brain is like a responcibile big bro’ to a screwed up family 🙂 తప్పించుకు తిరిగే ఛాయిస్ మీకు లేదు సీతే ! Impossible .
పోతే అఫ్సర్ sir ఓపిక మాత్రం బాబోయ్, he waits , he waits and he waits… before striking his game and making most of us stubborn fella’s bend his way . ఆ క్యాలిటీ మాత్రం మైండ్ బ్లోయింగ్ .
పొగడ్తల ప్రహసనం ఇక్కడికి ఆపి చెప్పేది ఒకటే , Don’t let your blood and Ink drained up for non sencible people .
ఇప్పటివరకు జైభీమ్ సినిమా గురించి తెలుగు ‘వాదుల’ మాటల తూటాల గర్జనలే వింటున్నాం. సీతారాములు మామ వ్యాసం చిన్నదైనా చాలా ప్రశ్నలకి కచ్చితమైన వివరణలిచ్చింది. 👏👏👏
జైభీమ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవ పరిస్థితులను కళ్లకుకట్టినట్లు చూపించాల్సిన సినిమాలు రావాల్సిన స్థితిలో వాస్తవ పరిస్థితులను కళ్లకుకట్టినట్లు చూపించిన సినిమా గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. మామామూలుగా నిలదీయాల్సిన ప్రశ్నలను ఎవరైనా అడిగితే భలే ధైర్యంగా అడిగారండీ అనే మెచ్చుకోళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కనీసం ఈసినిమా అయినా నిలదీసి అడిగే సినిమాలు రావడానికి దారి ఏర్పరస్తుందేమో! సినిమాను బాగా విస్లేశించిన గుర్రం సీతారాములుగారికి అభినందనలు.
విల్సన్ సుధాకర్ తుల్లిమల్లి
చాలా మంచిగా రాశినవ్ అన్న
Thank you very much Suman
జై భీమ్
గత కొన్ని సంవత్సరాలుగా నేను సినిమాలు చూడడం మానేశాను.కారణం టైం లేక కాదు సినిమా కథలు నచ్చక.ఏ సినిమా చూసిన ఏమున్నది గర్వకారణం మూ డు ముద్దులు,ఆరు పైటింగ్లు.కానీ ఇటీవల సినిమా సరళి మారుతున్నట్లు నాకు స్పష్టంగా గోచరిస్తుంది.మార్పుని కోరుకొనే మాలాంటి చూపుడు వేల్ల వారికి ఈ పరిణామం చాలా సంతోషాన్ని ఇచ్చింది.సినిమా చాలా ప్రభావవంతమైన మాధ్యమం.సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుంది.ముఖ్యంగా యువతపై ఈ ప్రభావం ఎక్కువ.ఇటీవల పెరుగుతున్న మహిళల ఆత్యాచారాలు,మానభంగాలు వెనుక సినిమాల పాత్ర చాలా ఉందని నా ప్రగాఢ నమ్మకం.ఓటిటి లో పెరుగుతున్న భూతు సంభాషణలు వింటే మనం ఎలాంటి భయంకరమైన విషవలయం లోకి వెలుతున్నమో ఊహిస్తెనే భయం కలుగుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన జై భీమ్ నాకు చక్కటి ఆశను,భవిషత్తు పట్ల నమ్మకాన్ని కలిగించింది.రాబోయే రోజుల్లో సినిమా తలఎత్తి నిలబడుతుంది అనిపిస్తుంది.తెలుగు నిర్మాతలు,దర్శకులు ప్రజలనాడి పట్టుకొని ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు తీయాలి.
జై భీమ్
గత కొన్ని సంవత్సరాలుగా నేను సినిమాలు చూడడం మానేశాను.కారణం టైం లేక కాదు సినిమా కథలు నచ్చక.ఏ సినిమా చూసిన ఏమున్నది గర్వకారణం మూ డు ముద్దులు,ఆరు పైటింగ్లు.కానీ ఇటీవల సినిమా సరళి మారుతున్నట్లు నాకు స్పష్టంగా గోచరిస్తుంది.మార్పుని కోరుకొనే మాలాంటి చూపుడు వేల్ల వారికి ఈ పరిణామం చాలా సంతోషాన్ని ఇచ్చింది.సినిమా చాలా ప్రభావవంతమైన మాధ్యమం.సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుంది.ముఖ్యంగా యువతపై ఈ ప్రభావం ఎక్కువ.ఇటీవల పెరుగుతున్న మహిళల ఆత్యాచారాలు,మానభంగాలు వెనుక సినిమాల పాత్ర చాలా ఉందని నా ప్రగాఢ నమ్మకం.ఓటిటి లో పెరుగుతున్న భూతు సంభాషణలు వింటే మనం ఎలాంటి భయంకరమైన విషవలయం లోకి వెలుతున్నమో ఊహిస్తెనే భయం కలుగుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన జై భీమ్ నాకు చక్కటి ఆశను,భవిషత్తు పట్ల నమ్మకాన్ని కలిగించింది.రాబోయే రోజుల్లో సినిమా తలఎత్తి నిలబడుతుంది అనిపిస్తుంది.తెలుగు నిర్మాతలు,దర్శకులు ప్రజలనాడి పట్టుకొని ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు తీయాలి.
ఇది నువ్వు మాత్రమే రాయగల వ్యాసం అన్న. బయట ఇంత చర్చజరుగుతున్నా….
ఈ సినిమా గురించి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి చిన్న అభినందన రాకపోవడం గమనించాలి.
మార్పు తప్పదని తెలుగు సినిమా గుర్తించాలి.
థాంక్స్ అన్నా..
పూర్వ తెలుగు సినిమా మూలాలు మద్రాస్ లోనే ఉన్నాయి. తెలుగుచిత్ర పరిశ్రమ విడిపోయి హైదరాబాద్ మారింది కానీ అక్కడే ఉంటె కంటి చూపుతో కొనగోటి తో సుమోలు ఎగరేసి తమిళ సినిమానీ చెడగొట్టే వాళ్ళు . రెండూ విడిపోవడమే బాగుంది. జై భీం ని పొగిడే ఔదార్యం వాళ్ళకు ఉందా ఇమ్పాసిబిల్ ?
Thank you
జరిగినది అమానవీయ ఘటనే కానీ, దానిలో అక్రమన్ సంబంధాన్ని, అది చర్మాల రాపిడినీ చూసిన వూహించిన నీ గుల కీ, నీ చిల్లర మనస్తత్వాన్నీ చూస్తుంటే వెలపరం గా వుంది, నీ లాంటి సంస్కారం లేని లేకి జన్మాలు ఎందుకు,సాహిత్యం చదవడం మాని బూతు పుస్తకాల్య గానీ చదుతున్నావా, నీ కులం ఏంటో నాకు తెలీదు గానీ నాకు అనవసరం కూడా, నాకులాన్ని, నా కుల స్త్రీలని అవమానిస్తే సహించను, ఆత్మ గౌరవం ప్రతి కులానికీ వుంటుంది
ఇక ఆత్మగౌరవాల గురించి నీ దగ్గర నే నేర్చుకోవాలి. ఒక బిందె దొంగతనం జరిగితే అందునా హోటల్ లో కాసింత కూడు తినడానికి జరిగిన తప్పిదానికే ఒక మనిషిని అమానవీయంగా కరెంటు స్తంభానికి కట్టి తగల బెడితే ఇప్పుడు వేల కోట్లు అక్రమంగా సంపాదించి వేల తెలంగాణ భూములను ఆక్రమించిన సదరు కులపోల్లను తగల బెట్టడానికి స్తంభాలు సరిపోవేమో. ఒక హత్య జరిగితే అందులో రాజకీయ సామాజిక ఆర్ధిక లైంగిక అంశాల కూడా ఉంటాయి అని కేసు ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు చూస్తారు.
మా పిల్లల వైపు చూసాడు అని కండ్లు పీకేసిన మానవీయ వ్యవస్థ మా పిల్లను లగ్గం జేసుకున్నాడు అని శవాలను మాయం చేసిన కులాలు ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారు.
సిగ్గు లజ్జ మానం మర్యాద ఉన్నవాడు ఎవడూ కంచక చర్ల కొటేశును కాల్చి చంపడాన్ని సమర్ధించడు ఆ అమానయమైన సంఘటన మీద నా ఆగ్రహ ప్రకటన నాకే కులాన్ని తిట్టాల్సిన అవసరం లేదు అవమాన పర్చాల్సిన అవసరమూ లేదు
అటువంటి చర్చలకు ఊసేసిన ఉమ్మంత విలువ కూడా ఇవ్వను
ఇక నా గుల గురించి నా చిల్లర మనస్తత్వం గురించి వెలపరం పడాలి అంటే అలా పడేవాడికి ఒక విలువ విద్వత్ ఉండాలి అది నీలో లేదని ప్రూవ్ అయ్యింది..
నీ కులం చంపిన, చెరిచిన నా కులపు మనుషుల సంగతేంది? ఒక ఘటనను రాస్తున్నప్పుడు అది particular. దాన్ని genaralize చేసుకొని లేని మనోభావాలు గాయపరచుకోవడం బుద్దిలేనితనం. ఇంకా ఈ బెదిరింపు మాటలు దుర్మార్గం.
కంచికచర్ల కొటేశు విషయంలో జరిగింది వాస్తవం. దానిమీద సాహిత్యం వచ్చింది. వ్యాసాలూ, కవితలూ వచ్చాయి. “అంటరాని ప్రేమ” అని అదే ఊరుకు చెందిన కలేకూరి ప్రసాద్ రాసిన కవితలో కంచికచర్ల కోటేశే కనబడతాడు. ప్రేమను ప్రేమగా అంగీకరించలేక కోటేశు మీద మోపిన అబద్దానికి కొటేశు హత్య చేయబడ్డాడు. హత్య చేసింది కమ్మకుల భూస్వాములు. కారంచేడులో మాదిగలను ఊచకోత కోసింది కమ్మలు. ఇది చారిత్రక వాస్తవాలు. “అయ్యో! నా కులం సాటి మనుషుల పట్ల ఇంత దారుణం చేసిందా?” అని మనిషి అనేవాడుంటే దుఃఖపడాల్సిన ఘటనలు. దాన్ని వొదిలేసి ఈ బెదిరింపులు ఏమిటి?
ఆ లెక్కన చూస్తే మేము కదా సహించకుండా పరశురాములమై ఊచకోత మొదలెట్టాలి.
great post, thank you sir.
ఇది వెండి తెర కాదు..కులం బలుపు పట్టిన మొండి తెర.
తెలుగు ప్రేక్షక లోకానికి ఇన్నాళ్లుగా అలవాటు చేసిన కమర్షియల్ హంగులు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో లేకపోతే చూసే వీలు పడుతుందా.
జై భీమ్ తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆదరించారు అంటే తెలుగు ప్రేక్షకుల దృష్టి కోణం ఒకింత తెలుగు సినిమా దర్శకులు,నిర్మాతలు అర్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
గ్లిసరిన్ లేకపోతే ఏడుపు రాని మహానటులు ఉన్న తెలుగు సినీ వ్యాపారంలో జై భీమ్ లాంటి సినిమాలు వస్తాయా లేదా చూడాలి.
తెలుగు సినిమాకి కూడా ఒక బాల, పా రంజిత్, వెట్రి మారన్ లు కావాలి.