‘‘అత్యాచారంలో తప్పేముంది’’ అన్నాడు ఆనంద్. ‘‘మగపుట్టుక పుట్టాక వీలుంటే అత్యాచారం చేయకుండా వుంటాడా ఎవడైనా’’.
ఆనంద్ యిలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. నేను అలవాటు పడిపోయాను. అదీకాక ఆనంద్ క్రిమినల్ బేక్‌గ్రౌండ్ నాకు ముందే తెలుసు.
ఆనంద్ అనాథ ఆడపిల్లల్ని ఉద్ధరించే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతుంటాడు. నేను అతని దగ్గర పని చేస్తుంటాను.
దేనికదే చెప్పుకోవాలి. ఆనంద్ నాకు డబ్బులు బాగానే ముట్టజెప్తాడు. చాలా అభిమానంగా ఉంటాడు. ఇంటికి వచ్చి కారులో ఆఫీసుకు తీసుకువెళ్తాడు.
ఇంతకు ముందు నేను ఎందరిదగ్గరో పని చేశాను. కాని ఆనంద్‌లో కనబడే ఆప్యాయత నాకు కనబడలేదు. జీతమే కాక అవసరమని అడిగితే ఎంత డబ్బైనా యిస్తాడు. అలాంటప్పుడు ఆనంద్ నేర నేపథ్యం గురించి నాకు ఎందుకు?
నాతో పాటు సుమతి అనే అమ్మాయి కూడా మా ఆఫీసులో పని చేస్తుంది. మేము కారులో ప్రయాణిస్తున్నపుడు వాళ్లిద్దరి వరస చూస్తే, వారి మధ్య సంబంధం వుందేమోననిపిస్తుంది. ఆ వికవికలూ, పకపకలూ, ఒకరిమీద మరొకరు పడడమూ…
అయితే నాకు అది అనవసరమైన విషయం. కాని నాకు సుమతిలో స్త్రీల లక్షణాలు కనబడవు. స్త్రీలు అంటే మృదు మధురమైన గొంతులో అందమైన మాటలు మాట్లాడేవాళ్ళు అనే నా అభిప్రాయం వల్ల కావచ్చు. సుమతి మాటలు చాలా మొరటుగా వుంటాయి.
‘‘వాడొక కొజ్జా…’’ ‘‘వాడమ్మ…’’ ఇలాంటి మొరటు పదాల్ని ఆమె అలవోకగా వాడేస్తుంది. అబద్ధాలాడడానికి, మాట మార్చెయ్యడానికి వెనుకాడదు. మాటలోనూ నడవడికలోనూ ఈ లక్షణాలన్నీ మగవాళ్ళకి మాత్రమే సంబంధించిన లక్షణాలు అని భావించడం వల్ల కావచ్చు. ఆమె స్త్రీలా కనబడదు నాకు.
…. వీళ్ళిద్దరి మధ్య నేను ఒకొక్కసారి బోర్ ఫీలయ్యేవాణ్ణి. ఏదో యాంత్రికత వుంది వాళ్లలో. సహజత్వం లోపించింది నిజమే కాని కూటికొరకు కోటి విద్యలు కదా. యిక్కడ పనిచెయ్యక తప్పదు.
నిజానికి ఆనంద్ ముందు మసలడం చాలా కష్టమైన పని. ఆనంద్ మనుషులని చేరదీస్తాడు. ఇతరులకోసం ఎంతైనా ఖర్చు చేస్తాడు. నవ్వుతూ మాట్లాడ్తాడు. ఆత్మీయత కనబరుస్తూనే యితరుల అస్తిత్వాన్ని హరించాలని చూస్తాడు. గదిలో వున్న కుర్చీలూ బెంచీల్లాగే మనుషులు కూడా వట్టి దృశ్యాలుగా ఘనీభవించాలని ఆశిస్తాడు. దానిలో భాగమే అతని స్నేహశీలత. అది భరించరానిదే కాని ప్రయోజనకరమైనది. మన అస్తిత్వాన్ని కించబరచుకొని, బానిసలా నిలబడి ఎంత అడిగినా యిస్తాడు. సాధ్యమైన సాయం ఏదైనా చేస్తాడు.
‘‘అత్యాచారంలో వున్న మజాయే వేరు అది మామూలు శృంగారంలో కనబడదు’’ అన్నాడు ఆనంద్. సుమతి కిసుక్కున నవ్వింది.
అత్యాచారం పట్ల మితిమీరిన ఆసక్తి కూడా యితరుల్ని వస్తువులుగా చూసే అతని స్వభావంలో భాగమా?
నిజానికి ఆనంద్ మితిమీరిన ఆత్మన్యూనతతో బాధపడ్తుంటాడు. అందుకే యితరుల ప్రతిమాటనీ ప్రతి కదలికనీ శాసించాలని చూస్తాడు. అందుకే అతనితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. మన ప్రత్యేకతని ఏమాత్రమైనా ప్రకటించాలని చూశామా, తీవ్ర ఉన్మాదస్థితిలోకి వెళ్ళిపోతాడు.
ఒకసారి సుమతి తను కాలేజీలో చదివేటప్పుడు ఒక విద్యార్థి తన వెంటబడడం, తనపై కవిత్వం రాయడం గురించి తన్మయత్వంతో చెప్పడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమెతో స్త్రీ సహజమైన సౌకుమార్యమూ, సౌందర్యమూ తొంగి చూశాయి. ‘‘ఈమె కూడా ఆడది లాగే వుందే’’ అని నేను ఆశ్చర్యపోతున్నాను. యింతలో ఆనంద్ ‘‘లంజా నోరుముయ్యవే’’ అని అరిచాడు.
‘‘నీ మిండగాడి గురించి చెత్త అంతా యిప్పుడు అవసరమా’’ అని గద్దించాడు.
ఆమె ముఖం మాడిపోయింది. తరువాత సుమతిని ప్రసన్నం చేసుకోవడానికి రెండు రోజులు బతిమాలాడు అనుకోండి.
ఎందుకంటే ఆనంద్ తానే కేంద్రంగా వుండాలనుకొంటాడు. మిగిలిన ప్రపంచమంతా మనుషులతో సహా తనచుట్టూ పరిభ్రమించే జడపదార్థాలుగా ఘనీభవించాలని ఆశిస్తాడు. నన్ను కూడా అంతే. నేను నా ప్రత్యేకతని చాటుకుంటానేమోనని భయమేమో, ఒకసారి: “నువ్వేదో కవిత్వమూ, కథలూ, పుస్తకాలూ రాస్తావట. అవన్నీ వేస్టు. ఎవరూ చదవరు. అనసరమైన అహంకారం పెంచుకోవడానికి తప్ప అవన్నీ ఎందుకూ పనికిరావు. కొందరు సాహిత్యంలో ఆత్మానందం వుందని బొంకుతారు. అది శుద్ధ అబద్ధం, ఆత్మవంచన. సంభోగంలో మాత్రమే ఆత్మానందం వుంది. అది కూడా అత్యాచారంలో మాత్రమే’’నన్నాడు ఆనంద్.
నిజానికి నేనెప్పుడూ అతని ముందు నా అభిరుచుల గురించి నోరుజారలేదు. ఎవరో నా గురించి అతనికి చెప్పారు. నాదైన ప్రత్యేక అభిరుచివుండడం నన్ను ప్రత్యేక వ్యక్తినిగా మారుస్తుంది అని ఆనంద్ సంకోచం. ఇతరుల అస్తిత్వాన్ని మొగ్గలోనే తుంచెయ్యాలని భావిస్తాడు ఆనంద్. అందుకేనేమో అత్యాచారం అంటే అతనికి అంత యిష్టం.
ఆనంద్ యింతగా సెల్ఫ్ సెంటర్డ్ గా మారడానికి అతని జీవితంలో సంభవించిన విషాద సంఘటనలే కారణం కావచ్చు. ఎవరినైనా జీవితానుభవాలే రూపొందిస్తాయి.
ఆనంద్‌కి మొదటినుంచి సంఘసేవ అంటే యిష్టం. అందుకే అనాథ పిల్లల కోసం స్వచ్ఛంద సేవ మొదలు పెట్టాడు. కాని ఆ పిల్లలు ఒకసారి ఆనంద్ పైనే ఎదురుతిరిగారు. తమపై చాలా సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడని పోలీసులని ఆశ్రయించారు. వాళ్ల తిరుగుబాటుకి నాయకత్వం వహించినవాడు త్రివేది.
‘‘విదేశీ నిధులు తీసుకువచ్చి యిలాంటి వాళ్ళందరూ చెప్పలేనన్ని నీచమైన పనులు చేస్తున్నారు. మన సంస్కృతినీ మతాన్నీ నాశనం చేస్తున్నారు’’ అంటూ ప్రచారం మొదలుపెట్టాడు త్రివేది.
ఆనంద్‌ని అరెస్టు చెయ్యడమేకాదు తీవ్రంగా చితకగొట్టారు పోలీసులు. ఆ దెబ్బలు యిప్పటికీ సలుపుతూనే వుంటాయి.
ఒకరోజున సుమతి నోరు జారింది. ‘‘త్రివేది అనే పెద్ద మనిషిని చూశాను. చాలా హుందాగా వుంటాడు. తేజస్సు ఉట్టిపడ్తూ వుంటుంది. మొన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అక్కడ కనబడ్డారు. ఆయన మాట్లాడ్తుంటే, ఎంత సేపేనా మంత్రముగ్ధుల్లా వింటూ వుండిపోయాము. ఎంత విజ్ఞానం! భగవద్గీత అంతా కంఠోపాఠం ఆయనకి.’’ అంది సుమతి.
ఆమె మాట్లాడుతుండగానే రొప్పుతూ లేచాడు ఆనంద్. సుమతిని బూటుకాలితో ఒక తాపుతన్నాడు’’ ఆమె కుప్పకూలిపోయింది. ‘‘లంజా! త్రివేది మీ కులం కనుక ఆకాశానికెత్తుతున్నావు. వాడు ఉత్తరాదివాడు, హిందీవాడు. వాడి మీద అత్యాచారం, హత్యకేసులెన్నో… నేనెవర్నీ చంపలేదు. మగాడిని కనుక అత్యాచారం చేశానంతే. కాని వాడు ఎందరినో పొట్ట పెట్టుకొన్నాడు. అక్కడి రాజకీయనాయకులు అతన్ని దక్షిణాదికి పంపేశారు. దక్షిణాదిలో తమ జెండా ఎగరవేయడం కోసం పంపారు. తన బుద్ధి యిక్కడ కూడా పోనిచ్చుకోలేదు. ఎన్నో నేరాలు చేశాడు. కాని ఒక తెలుగమ్మాయిని వలలో వేసి పెళ్ళి చేసుకొన్నాడు. ఆమె కులం ఈ రాష్ట్రాన్నే ఏలుతోంది. దాంతో అతని కేసులన్నీ మాఫీ అయ్యాయి. కాని నన్ను పోలీసులు వీధిలో కొట్టుకొంటూ తీసుకువెళ్లారు. కుళ్లబొడిచారు. దీనికంతటికీ వాడే కారణం ఆ వెధవని మెచ్చుకొంటావా నా ముందు. వాడితో కులుకుతున్నావా ముండా’’ అని మరోసారి తన్నాడు ఆనంద్.
సుమతికి చేయి అందించి పైకి లేపాను. ఆమె ఏడుస్తూ ఉక్రోషంగా అంది. ‘‘త్రివేదీ నేరాలు చేశాడు, నువ్వూ చేశావు. నీకంటె మంచి నేరాలు చేశాడు త్రివేది. కాని నీలా తన్నులు తినలేదు. జైలుకి వెళ్ళలేదు. పైగా సమాజంలో ధర్మరాజులా గౌరవించబడ్తున్నాడు. ఆ సత్తా నీకు ఎందుకులేదు?’’
ఒక్కసారిగా రెచ్చిపోయాడు ఆనంద్. ‘‘అది నీకు తెలియదా? వాడి కులం, వాడి భార్య కులం యింకా వాడి వెనుకవున్న బలగం… యివన్నీ త్రివేదికి శ్రీరామ రక్ష. నాకేముంది, నాకెవరున్నారు? రెక్కల కష్టంతో పైకి వచ్చాను నేను. అయినా నా బతుకు నన్ను బతుకనివ్వకుండా ముప్పుతిప్పలు పెట్టాడు త్రివేది. వాడే నన్ను కేసుల్లో యిరికించాడు. వాడిని నేను ఒక్క మాట అన్నానా? వాడు చేసిన నేరాల గురించి నేను ప్రస్తావించానా? వాడు కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది నాకు. మళ్లీ సంఘసేవ చెయ్యడానికి ఎంతో కాలం పట్టింది. అయినా ఆ అనాథ పిల్లలకైనా బుద్ధి వుండద్దా? ఎవరు ఏం చెప్పినా రెచ్చిపోవడమేనా?’’
‘‘అత్యాచారం అబద్ధమా?’’ నోరు జారాను నేను.
‘‘బాస్టర్డ్! నోర్ముయ్. అత్యాచారం చేసినంత మాత్రాన ప్రేమ లేనట్లా? నీ భార్యని ఒకసారి కొడ్తే, నీకు ప్రేమ లేనట్లేనా? ఎంతో కష్టపడి ఎంతో మంది కాళ్ళు పట్టుకొని డబ్బు తెచ్చి వాళ్ళని పోషించాను. నా బలహీనతని అలా బయట పడెయ్యాలా?’’ అని ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆనంద్.
త్రివేది ప్రసక్తి ఆనంద్‌ని అస్వస్థపరిచింది. అసలే హార్ట్ పేషెంట్ అతని చొక్కాగుండీలు విప్పి నిమిరింది సుమతి. ఆనంద్ కోలుకొన్నాడు ఎంతైనా ప్రేమకి వున్న అపారమైన శక్తిని కాదనలేం.
ఎప్పటిలాగే అతని ముఖం వికసించింది చిరునవ్వు చిందాడింది.
‘‘ఇంత నింద, హింసని భరించాల్సిన కర్మ నీకేం పట్టింది,” అని సుమతిని ఒకసారి అడిగాను. ‘‘ప్రేమ’’ అంది.
నేను ఆశ్చర్యంగా చూశాను ఆమె వైపు.
‘‘ఔను ప్రేమ. అతనిలో పొగరు నాకు నచ్చింది. నేను అప్పటికే వివాహితని. మా పక్క వాటాలోనే ఆనంద్ వుండే వాడు. అతడు చూపులతోనే నన్ను తినేస్తున్నట్లు వుండేవాడు. నేను వొక్కదాన్ని వున్నపుడు నేరుగా లోపలికి వచ్చేశాడు. గట్టిగా కౌగిలించుకొన్నాడు. గడియ బిగించి అత్యాచారం చేశాడు. మొదట నేను అతన్ని అసహ్యించుకొన్నాను కాని ఆ అసహ్యం, జుగుప్స ప్రేమగా మారింది. అతని తెగువ, బలం నాకు నచ్చాయి. బలమే జీవలక్షణం అని నాకు తెలిసివచ్చింది. బలాత్కారం దాని అనివార్య పర్యవసారం. బలహీనతే మరణం. నేను జీవించాలని కోరుకొన్నాను. అది నాకు ఆనంద్‌లో సాక్షాత్కరించింది. అయితే ఆనంద్ అప్పటికే నిండా కష్టాల్లో కూరుకుపోయాడు. పోలీసు కేసుల్లో వున్నాడు. అతన్ని రక్షించడం కోసం నేను ఎమ్మెల్యే త్రినాథరావుతో సంబంధం పెట్టుకొన్నాను. అంతే కాదు త్రివేదితో కూడా సంబంధం పెట్టుకున్నాను. ఈ సంగతి ఆనంద్‌కి తెలియదనుకో’’
నేను ఆశ్చర్యంగా అరిచా ‘‘త్రివేదితో కూడానా?’’
‘‘అవును అదంతా ప్రేమ వల్ల చేశాను ప్రేమవల్లే చేశాను. ఆనంద్‌ని కేసుల నుంచి బయట పడేశాను. మళ్లీ అతడు యాక్టివ్ అయ్యాడు. అనాథ బాలల ఉద్ధరణ ప్రారంభించాడు’’ అంది సుమతి.
‘‘నువ్వు. అతడికి కొండంత అండ’’ అన్నాను. ‘‘కాదు అతడే నా అండ, నా బలం, నా జీవం’’ అంది సుమతి.
‘‘ఇంతగా ప్రేమించే నిన్ను అలా తన్నడం…’’
‘‘అదంతా ప్రేమే. నేను మరొక పురుషుడివైపు ఆకర్షితుడైతే ఆనంద్ తట్టుకోలేదు. ఆ ఈర్ష్య ప్రేమవల్లనే. ప్రేమలో హింస అనివార్యం. గాఢమైన ప్రేమ తీవ్రమైన హింసకి దారి తీస్తుంది’’ అంది సుమతి.
ఒకరోజు త్రివేది అనుకోకుండా మా యింటికి వచ్చాడు. స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు, నుదుట తీర్చిదిద్దిన నామం చేతిలో గోరఖ్‌పూర్ ప్రెస్ ప్రచురించిన హిందీ వ్యాఖ్యానంతో కూడిన భగవద్గీత. ఉత్తరాదివాడు కావడం తెల్లని మేని ఛాయ. గొప్పతేజస్సుతో ఉట్టి పడ్తున్నాడు త్రివేది.
‘‘నేను ఉత్తరాది, నువ్వు దక్షిణాది కావచ్చు. కాని ఉత్తర దక్షిణాలని మతం ఏకం చేస్తుంది, ధర్మం ఏకం చేస్తుంది. పొట్టకూటి కోసమైనా ఆనంద్ పక్కన చేరడం ఎంత తప్పు పని? వాడొక భ్రష్టుడు’’ అన్నాడు త్రివేది వచ్చీరాని తెలుగులో.
‘‘ఎవడు భ్రష్టుడు కాదు’’ అన్నాను నేను. త్రివేది అన్నాడు ‘‘యోగభ్రష్టుడు కావడం వేరు, మతభ్రష్టుడు కావడం అన్యాయం, యోగభ్రష్టుడు ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో మళ్ళీ పుట్టి మోక్షం పొందుతాడు అని భగవద్గీత చెప్తోంది. మతభ్రష్టుడికి దిక్కు లేదు’’ అన్నాడు త్రివేది.
త్రివేది తన బోధని కొనసాగించాడు. ‘‘భార్య చెడ్డది తిరుగుబోతు అని రోడ్డున పడెయ్యడం తప్పు. ఆమెను నయాన భయానా లొంగదీసి దారిలో పెట్టాలి. అలాగే మన ధర్మంలో మతంలో మన సోదరులలో ఎన్నో తప్పులు వుండవచ్చు. నాలో లేవా తప్పులు? నువ్వు నిలదీసేది అదే కదా? కాని నేను ధర్మాన్ని తప్పలేదు, మతాన్ని తప్పలేదు. అదే నాకు శ్రీరామరక్ష. కలియుగంలో ఎవరిబుద్ధీ వందశాతం సక్రమంగా వుండదు. అందువల్ల అత్యాచారాలూ హత్యలూ మామూలే. కాని ధర్మం, మతం… అవే మనల్ని రక్షిస్తాయి’’ అన్నాడు త్రివేది.
మా ఆవిడతో అన్నాడు ‘‘చూడు చెల్లాయ్, ధర్మపత్నిగా మీ ఆయనని దారిలో పెట్టవలసిన బాధ్యత నీదే’’ అన్నాడు.
తరువాత మా ఆవిడ అంది ‘‘త్రివేదిని నమ్ముకోవచ్చు కదా? బతుకు తెరువు ఆయనే చూపిస్తాడు. సమాజంలో గౌరవం కూడా దక్కుతుంది’’ అంది.
కాని నేను ఆనంద్‌ని విడిచిపెట్టి వెళ్ళదలుచుకోలేదు. అతడు చూపే ప్రేమ ఆత్మీయతలు అటువంటివి. అవసరానికి అతనిలా ఆదుకొనేవారు మరొకరు కనబడరు. చేతికి ఎముకలేదు అతనికి. తాహతుకి మించి ఆర్థిక సాయం చేస్తాడు. ఫలితంగా యితరులు తన చెప్పు చేతలలో వుండాలనుకొంటాడు. త్రివేదిలో కనబడే పెద్దరికం, లౌక్యం, హుందాతనం అతనిలో లేవు. సామాజిక నేపథ్యం ఆనంద్‌కీ త్రివేదికి దూరాన్ని నిలిపి వుంచుతుంది మరి.
నిజానికి ఆనంద్‌కంటే త్రివేదికి ఫారిన్ ఫండింగ్ ఎక్కువ. కార్పొరేట్లలో స్నేహం కూడా ఎక్కువ. అతని స్వదేశీలో బోళ్లంత విదేశీ వాసన.
కాని ఆనంద్ విదేశీ ధనంతో సంస్థల్ని నడుపుతున్నాడని, అది దేశభద్రతకి ముప్పు అని త్రివేది సులభంగా ప్రచారం చేయగల్గుతున్నాడు. అతని నేరాలని కూడా హైలైట్ చేయగల్గుతున్నాడు.
త్రివేది బలం ఆయన భార్య కూడా. త్రివేది ప్రేమించి కులాంతర వివాహం చేసుకొన్నాడు. అతని భార్య కులం ఆంధ్రాలో ఆస్తి అధికారం గల కులం. త్రివేది అనేక నేరాలకి సంబంధించిన కేసుల నుంచి సులభంగా బయటపడడానికి అది కూడా కారణం.
ఇంత బలమైన సామాజిక నేపథ్యం మా బాస్ ఆనంద్‌కి ఎక్కడ వుంది? అది కూడా ఆనంద్‌లో కసిని పెంచింది. ఉక్రోషాన్ని పెంచింది. అహంభావిగా మార్చింది. నిలకడ లేనివాడుగా చేసింది.
సుమతిపై అత్యాచారం, దానిని ప్రేమగా మార్చుకోడం… యిదంతా అతని సామాజిక బలహీనత నుంచి ఉపశమనం. మనుషులని తనతో పట్టి నిలుపుకోడానికి త్రివేదికి వుండే వెసులుబాటు ఆనంద్‌కి లేదు. ఆనంద్ సామాజిక నేపథ్యం అటువంటివి అందుకే అతడు మనుషుల పట్ల అంత అసహనాన్ని ప్రదర్శిస్తాడు.
సుమతిని కొట్టడం, తిట్టడం, ఆమెపై అత్యాచారం యివన్నీ అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఏ సామాజిక శక్తి తనని అణచివేస్తోందని భావిస్తున్నాడో, దాన్ని తాను లొంగదీసుకుంటున్నానన్న భావం ఆనంద్‌లో తీవ్రశక్తిని మేల్కొల్పుతుంది. యింతకీ సుమతి మా బంధువే.
కాని ఈ మొత్తం పక్రియలో సుమతి పొందగలిగినది ఏమిటి? అదే నేరుగా సుమతినే అడిగేశాను. ‘‘సుమతీ! ఆనంద్‌కి మానసికంగా నీ అవసరం వుంది. నీ వల్ల ప్రయోజనమూ వుంది. సామాజిక వర్గంగా తాను సాధించలేనిదానిని నీ మాధ్యమంగా సాధించుకొంటున్నాడు. కాని నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? భ్రష్టురాలైపోయావన్న చెడ్డ పేరు తప్ప…’’
‘‘స్టుపిడ్’’ అని అరిచింది సుమతి ‘‘ఆనంద్ లేనిదే నేను లేను. ఆనంద్ నా ఆత్మ. అతడు శక్తికి మారు రూపు. అతడే నా బలం’’.
‘‘మరి త్రివేది?’’ అని సణిగాను నేను.
‘‘వాడో కొజ్జా’’ అని అరిచింది సుమతి. “సమాజం, వాడి తరతరాల నేపథ్యం, వాడి కులం, వాడి భార్య కులం యివన్నీ వాడి బలాలు. నిజంగా వాడు సంపాదించుకొన్న సాధించిన బలం కాదది. వాడు ధైర్యంగా ఎవరినైనా చంపగలడా, కొట్టగలడా, కనీసం గిచ్చగలడా? అందర్నీ రెచ్చగొట్టి బతుకుతాడు వాడు. స్వయంగా బలప్రదర్శన చేసే శక్తి వాడికి లేదు. ఇతరుల బలం మీద పడిబతికే పరాన్నభుక్కులు వాళ్ళు.
“నేను నేరప్రవృత్తిని ప్రేమిస్తాను. మానవనాగరికతే యుద్ధం, హింస, ఆక్రమణల మీద ఆధారపడింది. ఆ రాజుకి వెయ్యి మంది రాణులు అని కథలుగా చదువుకొంటాం. మనం. రాజు నిజంగా యుద్ధం చెయ్యడు. వాడు నపుంసకుడు కూడా కావచ్చు. భటులే యుద్ధం చేస్తారు. జయిస్తారు. రాణులు కూడా భటులనే యిష్టపడ్తారు. అందుకే రాణి వాసాల చుట్టూ అంత నిఘా, ప్రజలు, బలవంతులని, అత్యాచార పరులని నాయకులుగా ఎన్నుకొంటారు. దున్నే వాడిదెప్పుడూ భూమిగా ప్రకటించబడదు. భూస్వామి అరుగు మీద తిని కూర్చుంటాడు. వాడొక సోమరి.
“హత్యలూ, అత్యాచారాలూ, యుద్ధాలూ తెగించి చేసేవాళ్లు ఒకళ్లు. దాని ఫలితం అనుభవించేవాళ్లు, పైన కూర్చొని ధర్మపన్నాలు, దేశభక్తిగీతాలూ పాడేవాళ్లు మరొకళ్లు. నా ఆనంద్ ఏపనైనా ధైర్యంగా చేస్తాడు. చేసినపని పైకి ధైర్యంగా ప్రకటిస్తాడు. దానికి ముసుగులు కప్పడు’’ అంది సుమతి.
‘‘నువ్వే అతని ముసుగు కావచ్చు’’ అన్నాను నేను.
‘‘పోరా లంజకొడకా పో ఇక్కడి నుండి. నేను ఆనంద్ ముసుగుని కాదు, అతని ఆత్మని. ఆ త్రివేది దగ్గరికే పో’’ అంటూ ఆవేశంతో ఊగిపోతూ పేపర్ వెయిట్ విసిరేసింది సుమతి. కొద్దిలో తప్పించుకొన్నాను నేను.
ఉత్తమ పురుషలో కథ చెబుతున్నప్పుడు అందులో పాత్రలు- కథకుడు గీసిన గీతలకు లోబడి పరిచయం అయితే, అది సాధారణ రచనా స్థాయి. Narrator కేవలం నెపంగా మాత్రమే మిగుల్తూ, అతను చెప్పిన దాని కంటే విస్తృతంగా, ఇంకా చెప్పాలంటే, ఆ నేరేటర్ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా, వైవిధ్యంగా, వైరుధ్యంగా కూడా పాత్రలు, వాటిని అంటిపెట్టుకొని కథనం ఉంటే, అది మంచి కథ.
రాణీ శివశంకర శర్మ గారు – అతడే ఓ సైన్యం- అక్షరమే అతని ఆయుధం – అన్న చందంగా ఒక ఉద్యమస్ఫూర్తితో అందిస్తున్న మరో కథ.
నేర మైదానంలో ప్రేమ మైదానం…ఎప్పుడు ద్వేషంలో ప్రేమ ప్రేమలో ద్వేషం వ్యక్తీకరింప బడుతుందో…అసలు ప్రపంచ నాగరికత లోనే యుద్ధం హింస అంతా ప్రేమే గదా…విభిన్న కథనం చాలా బాగుంది సార్ కథ
చదివించింది. వేగంగా. అంతస్సారాన్ని జీర్ణించుకోవాలంటేనే……ఆలోచన ముందుకడుగేయనివ్వట్లేదు.
ఆలోచింపచేసే కథ. రెండుసార్లు చదివాను…ఆగకుండా.
ప్రేమలో ద్వేషం ఉండదు. ఎక్కువ ప్రేమను పంచితే అది వెగటుగా మారి ద్వేషిస్తారేమో. సాధారణమైన కథ కాదు ఇది. అనేక వ్యక్తిత్వాలతో నిండి ఉంది.
Narrative syle bagundi…politics, crime, sadistic love, inner feelings,….ila anni points touch chesaru…e story lo chaala points chaala mandi life lo jarigayi jaruguttunnayi.. super story😊😊
కర్రు కాల్చి వాత పెట్టారు సర్!
కర్రు కాల్చి వాత పెట్టారు మహోదయా!
రాణి శివ శంకర్ గారి ఒక భీభత్సుని ప్రేమకధ చాలా బాగుంది జీవితంలో హింస వుంది హింస ను సహించడం హింసను సమర్ధించడం వెనుక మనం శక్తివంతులం అనే భావన వుంది అదికొందరికి తమ స్వీయ న్యూనతల నుండీ బయపడి తామూ సమర్ధులమే ననే నమ్మకాన్నీ విశ్వాసాన్నీ ఇస్తుంది వాస్తవమే ఎందుకంటే ఉదా మతమే తీసుకుంటే అది బాహ్యంగా ఎంత శాంతిని బోధించినా దాని సారంలో హింసా,అణిచివేత,పీడనలు వున్నాయి ఆ అంశాలే అధికసంఖ్యాకులు ఏదో ఓ మంతం ఆచరిస్తూ తమ హింసా ప్రవృత్తిని సంతృప్తి పరుచుకోగల అవకాశాలను వెదుక్కుంటున్నారు అహింసని నపుఃసక నీతిగా హింసని శక్తికీ,సమర్ధతకీ చిహ్నంగా భావిస్తారు అ అతః కారణాలే నరహంతకులు ధరాధిపతులై చరిత్రలో ప్రసిధ్ధులవడానికి కారణంగా కనబడుతుంది నా చిన్నఆలోచనా పరిధికి మీరు ఫెడ్రిక్ నీషే భావాలను ఆపాత్రల రూపంలో అభివ్యక్తీకరించారని అనిపించింది కధలో పాత్రలు ముసుగులేని మానవ నైజాన్ని ప్రదర్శించాయ మంచి ప్రయోగం
రాణి శివ శంకర్ గారి ఒక భీభత్సుని ప్రేమకధ చాలా బాగుంది జీవితంలో హింస వుంది హింస ను సహించడం హింసను సమర్ధించడం వెనుక మనం శక్తివంతులం అనే భావన వుంది అదికొందరికి తమ స్వీయ న్యూనతల నుండీ బయపడి తామూ సమర్ధులమే ననే నమ్మకాన్నీ విశ్వాసాన్నీ ఇస్తుంది వాస్తవమే ఎందుకంటే ఉదా మతమే తీసుకుంటే అది బాహ్యంగా ఎంత శాంతిని బోధించినా దాని సారంలో హింసా,అణిచివేత,పీడనలు వున్నాయి ఆ అంశాల కారణం గానే అధికసంఖ్యాకులు ఏదో ఓ మంతం ఆచరిస్తూ తమ హింసా ప్రవృత్తిని సంతృప్తి పరుచుకోగల అవకాశాలను వెదుక్కుంటున్నారు అహింసని నపుఃసక నీతిగా హింసని శక్తికీ,సమర్ధతకీ చిహ్నంగా భావిస్తారు అ అతః కారణాలే నరహంతకులు ధరాధిపతులై చరిత్రలో ప్రసిధ్ధులవడానికి కారణంగా కనబడుతుంది నా చిన్నఆలోచనా పరిధికి మీరు ఫెడ్రిక్ నీషే భావాలను ఆపాత్రల రూపంలో అభివ్యక్తీకరించారని అనిపించింది కధలో పాత్రలు ముసుగులేని మానవ నైజాన్ని ప్రదర్శించాయి మంచి ప్రయోగం
కథ చదివి ఉద్వేగానికి లోను కావడం, కథలోని ఏ పాత్రతో మమైకమయ్యేమో తెలియకుండా లీనం కావడం ఆశ్చర్యంతో కూడిన జుగుప్స. తిట్లుతిన్న సుమతి,తిట్టిన సుమతి,పొగిడిన సుమతి, కథకుడు,త్రివేది,ఆనంద్ అందరూ కనిపించే పాత్రలే. సమాజంలో ఉండే భీభత్సం అదే. నాకు మణిరత్నం సినిమా చూసినట్టుంది. చదివి, అల్లకల్లోలమయి, అసహ్యపడి,దుఃఖపడి, ఇంత అరాచక సమాజంలో మనము ఉన్నాం-అందర్ని కీర్తిస్తూ వాళ్ళ సామాజిక గౌరవాలని కాపాడుతూ అత్యాచారాల బారిని పడుతూ.
తమ అభిమతాన్ని నెరవేర్చు కోవటానికి సమాజోద్ధరణని అడ్డు పెట్టుకున్న నాయక ప్రతినాయకులు. ఆ ఇద్దరిలోనే ధీరత్వాన్ని వెతుకున్న నాయిక పాత్ర. అవసరానికి తీర్చుకోవడమే పరమావధిగా కథకుని పాత్ర. నేటి సమాజంలో అందరివీ ముసుగులే! ఏ పాత్రకీ ఆత్మ(ఏ అర్థంలో అయినా)లేదు. వాస్తవాన్ని చిత్రీకరించారు. అభినందనలు.
ఇంటరెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్
ఏం చెప్పదలచుకొన్నారు అని ఆలోచిస్తే
ఒక మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
కులం
మతం
సమాజిక సేవ
రాజకీయాలు
ప్రేమ
బానిసత్వం
సోషల్ మొబిలిటీ
సెక్స్
అన్ని విషయాలూ ఉన్నాయి. తెలిసీతెలియకుండా దోబూచులాడుతున్నాయి
చివరకు అర్ధమైంది ఏమిటంటే
ప్రేమలో అనిబద్దత ఉంటుందని
మతంలో రాజకీయాలు ఉన్నాయని
నిచ్చెనమెట్ల మొబిలిటీలో కసి,మంచితనం కూడా ఉంటాయని
ఈ కథ ఒక చిక్కులువడిన దారపుండ
ఏ కొసను పట్టుకు లాగినా మరిన్ని చిక్కులు పడుతోన్నాయి
ఆలోచింపచేసిన కథ. సాహిత్యపరమార్థం అంతకు మించి ఉంటుందని అనుకోను.
అభినందనలు శివ శంకరశర్మ గారు
బొల్లోజు బాబా
ప్రియమైన రాణీ శివశంకర శర్మ గారూ!
దున్నే వాడిదెప్పుడూ భూమిగా ప్రకటించబడదు అని అరుస్తున్న సుమతి లంటే నాకు భయం.
దున్నే వాడిదే భూమి, భూమికి రైతే యజమాని అన్న భావాలు…. జమిందారీ ప్రాంతాలలో భూమిపై హక్కుల సాధన కొరకు,… భూమికోసం, భుక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం …. social and economic upliftment of the poor with inclusive growth measures గురించి ఓ విప్లవ రచయితగా మీరు మరో కధలో, మరో పాత్ర ద్వారా వినిపిస్తారని ఆశిస్తూ …..
ప్రియమైన రాణీ శివశంకర శర్మ గారూ!
As per the findings of the Oxfam report, India’s top richest 1% owns half of national wealth; top 10% holds 77.4% of the national wealth; in contrast the bottom 60% ( 67 crores of Indians ) owns just 4.8% of national wealth.
In the year 2017, the collective wealth of India’s richest ( 101 numbers of billionaries ) was estimated as Rs. 20,67,600 crores. India’s top 10 per cent population holds 77.4% of the total national wealth; where as the bottom 60% population ( of 67 crore Indians ) comprising the poorest of Indian population saw just one per cent increase in their wealth ( which holds a mere 4.8% of the total national wealth ).
It is no surprise that India is the second most unequal region in wealth distribution, as revealed by the World Inequality Report 2018.
“If this obscene inequality between the top 1 per cent and the rest of India continues then it will lead to a complete collapse of the social and democratic structure of this country,”
To overcome this problem, Land reforms ( which include regulation of ownership, operation, leasing, sales, and inheritance of land ) are one of the remedial measures.
కొంచెం భయం వేసింది ,సత్యాన్ని జీర్ణించుకోవటానికి సమయం కూడా పట్టింది.మంచి కథ.
కథ బాగుంది. పాత్రల పాత్రచిత్రణ బాగుంది. ముఖ్యంగా ఆనంద్, సుమతి లది.
శివశంకర్
ఏదైనా ఇలా మైక్రో స్కోప్ లోంచి చూపించే బ్రహ్మవిద్య మీదే. ఎవరికివారు ఒప్పుకోలేని అందరి బలహీనతలూ కథ నిండా పరిచారు. నిజమే భయపడేలాగే ఉంది. వ్యంగ్యం పుష్కలంగాఉం ది కథంతా.
మీరు ఇదే నాకు మొదటి పరిచయం.. ఇంత గొప్పగా వ్రాయగలరా? Accidentally,I’ve touched through your wall,,read this story,,it’s the real scenario Today..voka సామాజికవేత్త, వొక పచ్చి స్వార్థ పరుడు,వొక స్త్రీ, ముగ్గురూ వారి వారి వావి వరుసలు మలిచారు,, రచయిత వొక ప్రక్క ఆనంద్ బలహీనతలు ఎత్తి చూపుతూనే, అతనితో కలిసే వుంటున్నాడు,,is it dependency or opportunism? ఏమైనా భ్రష్ఠు పట్టిన సమాజ గమనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు,, మీరు గొప్ప రచయిత..
వి వరుసలు మరిచారు
బోర్లేసి మరీ పురాణ సత్యాన్ని నిరూపించిన శివశంకర శర్మగారికి అభినందనలు. నాటి సుమతి రోగిష్టి మగని వేశ్య వలపు తీర్చి పతివ్రతగా సుప్రతిష్ఠితురాలయిన్ది. నేటి సుమతి మిండ మగనికోసం లోకాన్ని ధిక్కరించే వెలలేని సాహసం చేసి సతీ వ్రతాన్ని నిరూపించుకుంది. పేపర్ వెయిట్ ఏ ఆయువు పట్టునో తాకి అర్ధాయుష్కుడు కాకండా కథకుడు మిగిలి మనకి కధ చెప్పగలగడం తెలుగు పాఠకులు చేసుకున్న అదృష్టం.
కథ మొదలు పెట్టినప్పుడు ఒక బలహీనుడి వ్యక్తిత్వాన్ని చిత్రించబోతున్నారు రచయిత అనుకుని చదివాను .చదువుతున్న కొద్దీ బలహీనులు నెరేటర్ ,సుమతీ అనిపించింది .త్రివేది పాత్రకు నైతిక విలువలు ఉన్నాయి అనుకున్నాను .పూర్తిగా తెర తీశాక ఇది నిజంగానే భీభత్సుని ప్రేమకథ అనిపించింది .కాని కథలో పాత్రలందరివీ భీభత్సమైన ప్రేమలే ,ప్రేమ ఏ లాభాన్ని పొందటం కోసమైనా కలగవచ్చు కదా.?
Superiority complex of a person whom we love is tolerated for any length of time but once the selfish ego fills the entire frame a silent departure occurs.Sumati here behaves opposite to this too.she herself must be having
1. Selfish ego pampered by that Anand
2.still time to go until she is also exhausted by the selfish ego of Anand of her persona and physical self.
Had a probing read all through.this story is inspiring me to become realistic with expression beyond the regular Written language, to be BOLD..
అభిప్రాయాలని వ్యక్తం చేసినవారు అందరికి ధన్యవాదాలు.
ఆ పేపర్ వెయిట్ మీకు తగిలి ముక్కు పగిలితే(కథలో మాత్రమే స్వామి) బావుండేది. కథ చాలా డెప్త్ గా ఉంది. ధన్యవాదాలు.