నిర్మలారాణి తోట కరీంనగర్ వాస్తవ్యురాలు. కొత్త తరం కవయిత్రులలో ఆత్మీయ స్వరం. జీవన అనుభవాల పట్ల స్పష్టత ఆమె సొంతం.
ఎలక్ట్రిసిటి డిపార్ట్ మెంట్లో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తోంది. కవిసంగమం’ లో తన కవిత్వానికి పదును, మెరుగుపెట్టుకున్నాననే నిర్మలారాణి 2014 లో “లోపలి మెట్లు అనే కవితా సంపుటిని వేసింది.
ప్రతి మనిషి లోపలి లోకంలో కూడా కనబడని గజిబిజి మెట్లు చాలానే వుంటాయనీ, వాటిని తెలుసుకునే ‘ఎరుకను’స్పృశించాలనీ చాలా పరిణితితో చెప్పింది.
‘ఒక చినుకు కోసం ‘ అని రెండవ కవితా సంపుటిని 2017 లో వేసింది. పరిణితి నిండిన కవిత్వమిది. ముందుమాటల్లో రామాచంద్రమౌళి, ‘నిర్మలారాణి స్వాప్నికురాలు’ అని నిర్ణయిస్తే , ‘ప్రేమ చినుకుల కోసం తపనపడే రాత్రి కలల కవిత్వం అని ఎం. నారాయణ శర్మ అభిప్రాయపడ్డారు . ప్రసాదమూర్తి ‘ కన్నీ ళ్ళతో నవ్విన కవిత్వం అని విశ్లేషించారు. ఇదొక కొత్త‘హృదయవాదం ‘ అని కలిదిండి వర్మ భావించారు.
పచ్చనిచెట్టుకు గౌ।। కవి యాకూబ్ గారికి కవిసంగమం వినమ్రంగా…..అంటూ నిర్మలారాణి అభిమాన ప్రకటన చేసింది. కవిత్వమంటే ఆమె మాటల్లోనే చూస్తే….
అక్షరాలన్నీ ఒక జ్ఞాపకంగా అల్లుదామని చుక్కలన్నీ కలిసి చూసానా…. అది జీవితమయింది. జీవితం అక్షరమయిందో ..అక్షరం జీవితమయిందో తెలియదు గానీ వెలుతురుతో పోరాటం చేసీ చేసీ ఇక ఏమీ లేదనే ఒక నిట్టూర్పుతో ఆగిపోయిన క్షణాల వెనకే ఇంకేదో వుందనే ఆశ, చేరుకోవాలనే తపన నన్నూ నా కలాన్ని నడిపిస్తోంది. ఆమె కవిత్వ తీరంవెంట పయనిస్తూ పోతుంటే ఇంచుమించుగా మనకూ ఇలాంటి అనుభూతే కలుగుతుంది.
గతంలో నిర్మలా రాణికి అనేక అవార్డులు వచ్చినప్పటికీ,ఇటీవలే కొత్త అవార్డును ప్రకటించారు. ‘ఒక చినుకు కోసం’ కవిత్వసంపుటికి , నరేంద్రబాబు స్మారక సాహిత్య పురస్కారం ఇస్తున్నారు. నిర్మలకు అభినందనలు.నిజానికి ఈ అవార్డులు రావడమే రచయిత ప్రతిభకు నిదర్శనమని కాదు. కవికొక ఆత్మతృప్తి. వారి అస్తిత్వానికి, రచనాకృషికీ,నిదర్శనాలన్పిస్తుందొకొకసారి. వారి ఉనికి వెల్లడవుతుంటుంది. చాలా చిన్నప్పటినుంచీ కవిత్వాన్ని రాస్తూ రాస్తూ ఇన్నాళ్ళకు తెలుగు సాహిత్యంలో ఒక జాగాను ఏర్పరుచుకోగలిగింది.
*
ఇన్నాళ్లకు నిర్మల గారి కవిత్వం పై మంచి వ్యాసం…
ధన్యవాదాలు నరేష్ సూఫీ
క్రొత్తతరం కవయిత్రి నిర్మలరాణి గురించి చదివి చాలా సంతోషమేసింది. మీ మాటలు వెయ్యి ఏనుగుల బలం !
ధన్యవాదాలు సుశీల గారూ
ధన్యవాదాలు నరేష్ సూఫీ