1.
ఇంకేమీలేదు ఇదంతా …
నా దేశపు ఆకాశంమీంచి నెలవంకను దూరం చేసే కుట్ర !
ఆకుపచ్చని దీపకాంతిని అవనతంజేసీ
ఒక ఉన్మాదపతాకాన్ని ఎగరేయాలన్న పన్నాగం !
దేశపుధ్వజస్తంభం మీంచి
అమాంతం రెక్కలువిప్పి ఆకాశాన్ని కమ్మేస్తోంది గరుడ !
2.
నీలాపనిందల నిప్పుకణికల మధ్య
అనుమానపుచూపుల కంచికముళ్ల మధ్య
తరాలగుమ్మటాల చరితల్ని తవ్విపోస్తూ …
వాళ్ల ఉనికినివాళ ప్రశ్నిస్తోంది వర్తమానం !
కబేళాకు తోలుకుపోతున్న పశువులకు వేసినట్టు
వాళ్ల నొసట ద్రోహులని ముద్రవేసీ
దేశంనుండి తరిమిగొడుతోంది !
3.
ఎక్కడే తూటాపేలినా – ఇక్కడ నెత్తుటికడవలు పగిలిపోతాయి !
ఎక్కడే గోవు చచ్చినా – ఇక్కడ కన్నీటిమడుగులు కడతాయి !
నేరాల మర్రివేళ్లన్నీ వాళ్ల దేహాల్లోంచే పాకుతాయి !
ఇక్కడ కన్నీళ్లు ఖద్దరుచొక్కాలమీద పన్నీటిపరి మళాలు !
ఇక్కడ శవాలు ఎర్రకోటమీద ఎగిరే నెత్తుటిజెం డాలు !
చీకటిలో పుట్టి చీకటిలో కలసిపోయిన జీవితాలకు
ఈ దేశంలో వెలుగు ఓ పురాజ్ఞాపకం !
4.
పచ్చనిచెట్టు ఫక్కున నవ్వటం యిక్కడ ద్రోహం !
గాయపడ్డ పిట్టపిల్ల రెక్కలుకొట్టుకోవటం దేశద్రోహం !
పుట్టిపెరిగిన నేలమీద వాళ్లు కాందీశీకులు !
అపనమ్మకపు బోనులో…
అనునిత్యం దోషులుగా నిలబడుతున్న దౌర్భాగ్యులు !
విహ్వల విస్పోటనాలలో …
నెత్తుటిముద్దలై తుళ్లిపడింది నేనేనా…వాళ్లు కూడా !
తమ బతుకుఅస్థిత్వాన్ని నిరూపించుకునేటందుకు
ఇంకా ఎన్ని ఆధారాలు చూపించాలి వాళ్లు ?
ఆత్మను కోల్పోయినవాడే అనుమానపు చూపులు చూస్తాడు !
దేశభక్తి ఎవడబ్బ సొత్తుకాదు
తరాల గుండెల్లో యింకిపోయిన ప్రాణగంధం !
అమ్మలా కొలుచుకునే అమూర్తభావన !
దారి ఎప్పుడూ మంచిదే …
దారితప్పి నడుస్తున్న మనిషితోనే అలజడి !
5.
ఈ దేశం ఒక అందమైన పూలతోట !
చుక్కల్లాంటి మొక్కలమధ్య మంటలు పెడుతున్నది నువ్వు ?
మువ్వన్నెల ఆకాశాన్ని ముక్కలు చేస్తున్నది నువ్వు ?
నా దేశపు మీనార్లమీంచెపుడూ దయావర్షమే కురుస్తుంది !
సుర్మా పూసుకున్న కళ్లు రెండూ, నాకు సూర్యచంద్రుళ్లు !
దుఆ దోసిళ్లనిండా ప్రేమధారలు !
సిజ్దా చేసేటపుడు నుదుటాకాశంమీద
నేలతల్లి ప్రేమతో పెట్టిన ముద్దు చెదరని దేశభక్తికి ప్రతీక !
సమస్త మతాలూ ఈ నేలలో యింకిపోయి
ఒకే ఏకాత్మగా రెపరెపలాడే సమైక్య జనగీతం మాది !
పాయలు పాయలుగా ప్రవహిస్తున్నా … ఒకే ప్రాణధార మాది !
6.
వాళ్లూ…ఈ మట్టిలోనే పుట్టారు ! కలోగంజో కలిసే తాగారు !
మరణాన్ని పూమాలగా ధరించి
కడకీ మట్టిలోనే నాతో కలసిపోతారు ఒకే జెండానీడలో…!!
*
CAA npr NRC la pai ettina dhvajam
మహా మానవతా వాద తెలుగు సెక్యులర్
కవి గారి కవిత పత్రికలో ఒలికిపోతుంది
భళ్లున ఆక్రోశాలు బద్దలవుతాయి
మతదురహంకారాన్ని దునుమాడుతాయి
మృగ్యమయిపోతున్న కారుణ్యం పట్ల విలపిస్తాయి
బ్రద్దలైన ఆక్రోశాలకు ఒకే పార్శ్యం వుంటుంది
రెండో పార్శ్వం 70 ఏళ్ల నుండీ కనబడక
గురివిందలు కూడా సిగ్గుతో నల్లబడిపోతాయి
గురు మంద భావజాల సమతూకం కొరకై
చారిత్రక ప్రతిక్రియా ప్రక్రియకు మళ్లీ వగస్తూ
మళ్లీ మళ్లీ కవితలు ఒలికి ఒలికి
అడుగంటే సమయానికి
ఎక్కడినుండో నేనొక బంగ్లాదేశ్ ని, నేనొక పాకిస్తాన్ ని,
నేనొక భైంసాని, నేనొక బషీర్ హాట్ ని,
నేనొక ఠాకూర్ పురాని, నేనొక మోప్లాని,
నేనొక నోవాఖళీని, నేనొక అమ్నెస్టీ త్రవ్విన
రోహింగ్యాల హిందూ మాస్ గ్రేవ్ ని,
అంటూ గతంలో నుండి వర్తమానానికి
పయనించిన కంకాళాల
లౌకికనూతిలోని గొంతుకల
రోదన ధ్వని వినిపిస్తూవుంటుంది
ఛీ యే యే , జిన్నావాలీ ఆజాదీ జోలపాట
హమ్ దేఖేంగే బ్రహ్మజ్ఞాన మోక్షం
కన్వర్షన్ పిశాచాల పాలినబడ్డ ఈశాన్య
రాష్ట్రాల స్థానిక బ్రూల మహాభినిష్క్రమణం
ముద్దొచ్చే భక్ హిందూత్వ బుగ్గ
జడకు చుట్టుకున్న జెఎన్ యూ డోమ్ కారం
ఖిలాఫత్ గూండాగిరీ
దేశయవనికపై తాండవనృత్యం
బమియన్ బుద్ధుడి శూన్య డొల్లలో
విరిసిన శాంతియుత సలాఫీ రోజా
అది వాళ్ల మతం పట్ల వారికున్న ప్రేమ
వారు చంపితే మౌనంగా అనుభవించండి
అిని మోప్లా, నోవాఖళీ హత్యాకాండ గురించి
అమృతవాక్కులు వెలిబుచ్చిన రెండో చెంప
జాతిపిత, ఫలితం లక్షలాది విభజన మారణహోమం
నేటివ్ అమెరికన్, నేటివ్ ఆఫ్రికన్
నేటివ్ ఏషియన్, నేటివ్ ఆస్ట్రేలియన్,
నేటివ్ ఇండియన్
సాంస్కృతిక విధ్వంసంలో
పరిశుద్ధాత్మల జోషువా ప్రణాళిక
మ్యాపులతో సహా విన్నవిస్తుంది
వేలాది గుడారాల లోయ ద్వేష ఆర్తి
మై మూన్ హ్యాజ్ బ్లడ్ క్లాట్స్…….