అక్కడికి నేను
చాలా సార్లు వెళ్ళాను
పది సార్లో, నలభై ఏడు సార్లో,
నాలుగు వందల మూడు సార్లో…
లెక్కపెట్టలేదు ఎప్పుడు!!
దేనికోసం వెళ్ళావని అడిగితే
మినార్ పక్కన నెలవంక
తొంగి చూసినప్పుడో,
బాలాపూర్ నుంచి గణనాధుని
శోభాయాత్ర సాగిపోతున్నప్పుడో,
పాతబస్తీ గల్లీలో
నలిగిపోతున్న బతుకు చిత్ర
కథనాలు చేస్తున్నప్పుడో,
లాడ్ బజార్ గాజుల
గలగలలు మూట కట్టి
ఎవరికో
పంపాలి అనుకున్నప్పుడో…
లేని సందర్భం లేదు ఎప్పుడు!!
ఎప్పుడు వెళ్ళినా
చార్మినార్ తనువంత మనిషి వాసన
ఈద్ నాడు కొత్త బట్టలకు పులుముకునే
ఇత్తర్ లా…
ఎటు చూసినా
వందల గొంతుకల గానాలు
అరుపులో, కేకలో, హారన్ మోతలో
ఏవైతేనేం
జర్దోసి తీగలల్లే
అల్లుకున్న మనిషి అలికిడి
సందడి సందడిగా…!!
కానీ,
ఇవాళ నేనే కొత్తగా వెళ్లానో,
కొత్త నేనై వెళ్లానో
ఇత్తర్లు లేవు,
మెహేంది రంగుల్లేవు,
ఖడా ధుపట్టా మెరుపుల్లేవు,
తేట కళ్ళ సుర్మా రేఖల్లేవు
దస్ కే తీన్ పిలుపుల్లేవు
జీవం జాడ
కరోనా గడియల్లో బందీ అయింది
ఒంటరి యోధురాల్లా ఉన్న
చార్మినార్ వైపు నేను చూస్తూ నిలబడ్డాను.
రెహనాజీ ! ప్రస్తుత పరిస్థితిని కళ్ళకు కట్టారు. ఒక్క చార్ మినారే కాదు ఏ బురుజులు, ఏ చౌరస్తాలు ఏ ఊరు వాడ చూసినా ఇదే దృశ్యం.
సింప్లీ సుపర్బ్!!
Really super it’s show the beauty and silence of Charminar to me.
Thanks Rehana garu for the wonderful poetry.
Really appreciate your article sister. Great job during this Lock down..
జీవం నింపారు.
చిన్న చిన్న పదాలతో గంభీర్ పరిస్థితి నుంచి తెలిపేలా చక్కటి కవిత.చార్మీనార్ కి బదులు ఏ ఊరి లో ఏది పెట్టినా అన్వయిస్తుంది.అభినందనలు రెహానా
నిజమే చార్మినార్ ఎన్నిసార్లు చూసుంటామో ఒంటరిగా, జంటగా , చుట్టాల తో, స్నేహితుల తో మీ కవిత అవన్నీ ఓసారి జ్ఞప్తికి తెచ్చింది
ధన్యవాద్
Kotha nenai vellanoo…..bhagundhi padha prayogam..👏👏👏👏💐💐
దస్ కే తీన్ పిలుపుల్లేవు – poem bagundi
Bagundandi 👌
జీవం జాడ కరో నా గడియాల్లో బందీ అయింది….రెహీనా గారి నుంచి ..మరో మంచి కవిత
చాలా బాగుంది. నేటి పరిస్థితిని కళ్లముందుంచారు.