మూలం: ఉత్తరన్ చౌథురి ,బెంగాలి కవి
పద్యం ఎప్పుడూ ఏమీ చెప్పదు.
అది ఒక తలుపు తెరుస్తుంది,నిశ్శబ్దంగా
ఒంటరి శీతాకాలపు రాత్రిలో
నిద్రరాక,వంగిపోయి
నా కోసం ఎదురు చూస్తున్న
నా వృద్ధ తండ్రిలాగే
చేతినిండా నీరు
– సుకుమారన్, మలయాళ కవి
నేను తీసిన నీళ్లు
ఇప్పుడు నదికి అపరిచితం.
ఆకాశం దానితో అలలు ఆడుతుండగా
అది నిశ్చలంగా కూర్చుంటుంది.
నేను నీళ్ళని వెనక్కి విసిరాను.
ప్రవహించే నదిలో నా నీరు ఏది చెప్పు?
*
చాలా బాగున్నాయి రెండు కవితలు.
తెలుగు కవితల్లాగే….