ఇది యుద్ధం
ఆకలితో పోరాడుతున్న జనం
గెలిస్తే బతుకు
ఓడితే చావు
ఇది ప్రయాణం
సావుకూ సొంతూళ్లకూ మధ్య
సగంచచ్చిన జనం
ఇదో కాలం
మార్కెట్లో సరుకైన మనిషి
మట్టిని ముద్దాడుతున్న సమయం
ఇప్పుడు
గాలి వీస్తుంది
వలస బతుకులు గుండెలపై
నేలతల్లి పురిటి వాసన వస్తుంది
నీరు పారుతుంది
పట్నం తరిమేసిన మనుషుల గొంతులో
అమ్మ చనుబాల ధార జారుతుంది
ఊరూ భూమి
నేల తల్లీ
ఎక్కడ మొదలు పెట్టారో
మళ్ళీ అక్కడే ఆగారు
మిత్రమా…
ఈసారి సంచి సద్దితే
మళ్ళీ పట్నం పిలిస్తే
ఆ ఊరి మట్టిని
అమ్మ ప్రేమని
మూట కట్టుకోండి
తిరిగి రాకపోతే
ఈలోపే ఆ తల్లి చనిపోతే
చివరిగా ఆమెని తిట్టిన తిట్లే
నిన్ను తూట్లు పొడుస్తుంటాయి
*
చిత్రం: చంద్రం
బాగుంది శేషు. ఇప్పుడే చూస్తున్నా 🙂
బాగుంది అన్న💐💐👌
చాలా బాగుంది అన్న