జీవితంలో మొదటిసారి ప్రేమ – కొంచెం ఆలస్యంగా!
ఓ పదేళ్ళ కిందట పరిచయమై ఉండుంటే మీతో ఒక కొడుకునో కూతుర్నో కని ఉండేదాన్ని – అంది ఆమె నివ్వెరపోయి మరి సమాజమో అన్నాడు.
నాకు మీరంటే ఇష్టం అదొకటే ముఖ్యం నాకు – నేను సమాజాన్ని పట్టించుకోను అని మీకు తెలుసు – అందామె!
అవునూ ఎప్పుడంటే అప్పుడు నాకెప్పుడు కావాలంటే అప్పుడు రెడీ అయిపోతావు నీకేమీ అడ్డంకులు లేవా అనడిగాడు ఓసారి ఓ శుష్కహాసం చేసి – లేవు హిస్ట్రెక్టమీ అయిపోయింది అంది క్లుప్తంగా!
నేను మీ మీద ఫైనాన్షియల్ గా డిపెండ్ అయి లేను కాబట్టే మన రిలేషన్ ఇంకా బాగుంది అందామె
అవును నిజమే అన్నాడు నిజాయితీగా!
ఇంతకుముందు వచ్చినట్లుగా ఇప్పుడు రావడం లేదు మీకు నా కోసం సమయం లేదు అంది కినుకగా
మొదట్లో ఉన్న తొందర ఇప్పుడు ఉండదు కదా మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే అన్నాడు పరాకుగా!
ఫోన్ లో అలకలు, కన్నీళ్ళు, బెదిరింపులు ఏవీ ఉండవు నిరాశ తప్ప, వస్తా వస్తా అనే ఆశ్వాసనా, వస్తాడనే నమ్మకం తప్ప!
నాకు కుటుంబమే ప్రయారిటీ, నా కుటుంబం తర్వాతే ఇంకేదైనా అని ఖచ్చితంగా అన్నాడు
సరే మీ కుటుంబమే నా ప్రయారిటీ కూడా… మీరు బాగుండాలి!
అతను బాగున్నాడు!
ఆమె కూడా బాగుంది – ఎదురుచూస్తూ!
*
కొత్తగా ఉంది
థాంక్యూ అండీ
థాంక్యూ వెరీ మచ్ సారంగ 🙏
కథలో నిజాయితీ స్పష్టంగా వుంది
థాంక్యూ నాగక్కా
Loved it!❤️
థాంక్యూ డార్లింగ్
ఇమేజినరి ఆఫ్ లైవ్ లైఫ్ సెషన్ బావుంది
థాంక్యూ రూపీ
నిజమైన సంబంధంలో కన్నా, ఈ ఇద్దరి మధ్యా కావాల్సిన నమ్మకం, నిజాయితీ ఉంది.
ముసుగు వేసిన అసలైన బంధంలో కన్నా నిజాయితీగా, క్లారిటీతో ఉన్న సంబంధం
చాలా బాగుంది క.కొత్తగాఉంది.నవ్యతతో రాశారు.
bold and beautiful theme. excellent narration.