ఇది కొత్త కవులు ఎగరేసిన విజయపతాక!

ఆ నిబద్ధతే కవిత్వ సాయంకాలాల్ని గెలిపిస్తుంది. నిలబెడుతుంది.

“కవిత్వంతో ఒక సాయంకాలం” వరసగా జరుగుతూ రావడం వల్ల బెజవాడ కవిత్వ ముఖచిత్రమే కాదు, అటు హైద్రాబాద్ నుంచి ఇటు రాయలసీమ దాకా దృశ్యం మారింది. ఈ కవిత్వ సాయంకాలాల్లో పాల్గొనని పాత/ కొత్త తరం కవులు లేరు. అన్నిటికీ మించి, ideological shift అనే ఒక మా అప్పటి తరపు కవిత్వ కలని అది నిజం చేసింది. ఇవాళ బండ్ల మాధవ రావు, అనిల్, శ్రీరామ్ ఆ జెండాని గట్టిగా పాతుతున్నారు. దానికి కారణం యేదో సభలు నిర్వహిద్దామని కాదు, నిజంగా దృక్పథ బలమున్న కవిత్వం మీద వాళ్ళకి వున్న నిబద్ధత వల్ల! ఆ నిబద్ధతే కవిత్వ సాయంకాలాల్ని గెలిపిస్తుంది. నిలబెడుతుంది. ఈ సందర్భంగా అనిల్, శ్రీరామ్ లతో చిన్న సంభాషణ.

1.కవిత్వంతో సాయంకాలంతో ఇటీవలి మీ అనుబంధం?
దాదాపు ఐదేళ్ల క్రితం ఏర్పడింది నాకు సాహితీమిత్రులకి అనుబంధం. వాళ్ళు నన్ను కలుపుకున్నారా, నేనే దగ్గర అయ్యానా అన్నది సమాధానం లేని ప్రశ్న, విశ్వేశ్వర రావు గారు, ప్రమీల గారు ఎప్పుడు వాళ్ళ దగ్గరకి వెళ్లినా బాగా చనువుగా మాట్లాడేవారు, నేను నేర్చుకోవాలి ,కొత్త పుస్తకాలు చదవాలి అనే స్పృహలో మాత్రమే ఉండేవాడిని, అలా ఒక రోజు మే 1 కి వెళ్లి కవిత చదివాను, చాలా పెద్ద వేదిక ,అప్పటివరకు పుస్తకాల్లో చదువుకున్న పేర్లు నా కళ్ళ ముందు నిలబడ్డాయి, శివారెడ్డి, డా.వీ. చంద్రశేఖర్ , సీతారాం, దేవిప్రియ, సత్యవతి గారు,  ఇతర భాషల కవులు, విజయవాడలో ఉన్న అరసవల్లి కృష్ణ, చినుకు రాజగోపాల్ వంటి దిగ్గజాలని అక్కడే కలుసుకున్నా,వాళ్లు తరవతా  నన్ను అలాగే ఆదరించారు. నేను నా మొదటి కవిత చదివే సమయానికి సాహిత్యాన్ని చదవడం లో అర్ధం చేసుకోవడంలో నేను చాలా వెనకబడి ఉన్నాను,అప్పటికి ఏదో నా దగ్గర ఉన్న ఒకే ఒక కవిత చదివాను అక్కడి నుంచి ప్రతీ ఏడాది నేను ఆ కార్యక్రమంలో భాగస్వామిని, ఇది మా బాధ్యత అనుకున్నాం, మాతో శ్రీరామ్ చేరడం కొత్త మలుపు తీసుకుంది ఈ కార్యక్రమం. ఆ నాటి నుంచి ఈ 2020 వరకు అది కొనసాగుతూనే ఉంది.
2.మొట్టమొదటి సారిగా ఆన్ లైన్ నిర్వహణ ఎలా అనిపించింది?
ముందు ఈ క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తి మాధవరావు గారు మాత్రమే. ఆయన ఈ ప్రపోజల్ మా ముందు పెట్టినప్పుడు. నేను కాస్త ఆలోచన చేసి ఓకే చెప్పాను. మనం కవిత్వం పరంగా ఓకే కానీ టెక్నాలజీ పరంగా కుర్రాళ్ళు సరే , మరి పెద్ద వాళ్ళని ఎలా సమన్వయం చేయడం అనుకున్నా, మా దగ్గర టీమ్ వర్క్ ఉంది అనుకుని సరే అన్నా. ముందు ఒక ట్రయిల్ రన్ గా నేనూ,శ్రీరామ్, మాధవరావు గారు, విశ్వం గారు నామాడి శ్రీధర్ ఒక ట్రయిల్ వేశాం , సక్సెస్ అయింది.ఏప్రిల్ 30 న శ్రీశ్రీ జయంతి కార్యక్రమం అనుకుని ఒక పది మందితో చేశాం ,అవగాహన పెరిగింది, మే 1 న ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం సాగింది. మేము అనుకున్నట్టు ఎవరూ ఇబ్బంది పడలేదు.చిన్న చిన్న సాంకేతిక కారణాల వలన మిస్ అయిన వాళ్ళు ఉన్నారు తప్ప, దాదాపు 74 మంది హాజరు ఉంది , కార్యక్రమం ఐపోయే దాకా35 మంది దాకా ఉన్నారు, మొత్తం 40 మంది కి పైగా కవిత్వం చదివారు. సీతారాం అన్నట్టు మామూలు సభలో అయితే నిజంగా ఇంత మంది వచ్చే వాళ్ళు కాదేమో.ఇదో నూతన వర్చువల్  అనుభవం కదా.
3.ఈ ఆలోచన వేరే సందర్భాల కోసం కూడా కొనసాగిస్తారా?
ఇంకా ఏమి ఆలోచన లేదు. కొత్త కవులతో ఒకటి చేయాలని ఉంది. కార్యాచరణ చెబుతాం. కేవలం సాహిత్యం కోసమే చేయదగింది అయితే చేస్తాం.అయితే సాహితీ మిత్రుల బ్యానర్ లో మాత్రం కవి సమ్మేళనలు చేసే ఉద్దేశం ఉంది. ఈ జబ్బు ఇప్పట్లో సభల నిర్వహణ కి అనుమతి ఇచ్చేలా కనబడడం లేదు కాబట్టి ఒక నెల చూసి నెలకు ఒక కార్యక్రమం ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి.
4.ఈ కవిత్వంలో మీరు కొత్తగా గమనిస్తున్న అంశాలు ప్రత్యేకంగా చెప్పగలరా?
కొత్త అంశాలు అంటే . ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త కవులు వస్తున్నారు, సీనియర్లు కూడా వీళ్ళతో పోటీ పడుతున్నారు. కవిత్వం  మీద మాత్రమే  దృష్టి పెట్టి  రాసే కవితలు, కవులని తీసుకోవడం వలన కాస్త మెరుగైన కవితలు వస్తున్నాయి.ఇప్పటికి ఆ కార్యక్రమంలో ఒక కవిత చదువుతాము అవకాశం ఇవ్వండి అని వచ్చే రికమండేషన్లు ఎన్నో, కానీ విశ్వేశ్వరరావు గారు, ఒకపట్టాన ఒప్పుకోరు, నేనూ, శ్రీరామ్, మాధవరావు గారు కాస్త చూసి చూడనట్టు పోతాం ఈ విషయం లో, నా మట్టుకు నేను ఈ కార్యక్రమంలో నా కవిత చదవడానికి రెండేళ్లు వెయిట్ చేశా. శ్రీరామ్ నాకన్నా చాలా సీనియర్ తను మొదటి సభలోనే ఉన్నాడు శ్రోతగా.
5.ప్రతీ ఏడాది మే 1 లాంటి కార్యక్రమాలు మీకే ఎలా సాధ్యం అవుతున్నాయి.?
ఒకటే సమాధానం టీమ్ వర్క్, వేరే మాట లేదు.2018 మే 1 న సభ మొదలవడానికి ముందు పెద్ద గాలి వాన, కరెంట్ లేదు, శిఖర స్కూల్ లో అందరం దాదాపు 50 మందిమి అలాగే నిలబడ్డాం, ఏమి చేయడానికి లేదు. ఆ సమయంలో ఆ కార్యక్రమం కి ముఖ్య అతిధి గా వచ్చిన కవి , పోలీస్ ఆఫీసర్ కిల్లాడ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ డీజీ గా ఉన్నారు. ఆయన అప్పటికప్పుడు వాళ్ళ టీమ్ ని పిలిపించి మోటార్ పెట్టి పవర్ ఏర్పాటు చేయించారు, దాదాపు 3 గంటల పాటు సభ నడిచింది.ఆ రోజున కూడా కవిత్వం సభ నడిచింది.చాలా గొప్ప కవిత్వం వచ్చింది.
 నేను వచ్చాక ఇదొక్కటి నా అనుభవం లోది, విశ్వం గారిని , మాధవరావు గారిని కదిపితే ఎన్ని చెబుతారో ఇంకా, కాబట్టి మేము మా శక్తి కి మించిన పని చేస్తున్నామని అనుకోవడం లేదు.మా పరిధిలోనే మేము కలిసి కట్టుగా పని చేస్తున్నాం.ఎన్ని అవంతరాలు వచ్చినా ఈ జండా దింపే ఉద్దేశం లేదు.
విశ్వేశ్వర రావు గారు: ఒక స్ఫూర్తి, కవిత్వ సాయంకాలాల వెలుగు రేఖ
*

ఇంకా అద్భుతాలు జరుగుతాయ్: శ్రీరామ్ పుప్పాల

విత్వంతో సాయంకాలం తో అనుబంధం ప్రత్యక్షంగా 2014 నుండీ అయితే,  ప్రేక్షకుడిగా మొదటి సభనుండీ ఉంది.

విజయవాడలో అరసవిల్లి కృష్ణ చదువుతుండే ప్రతీ సభ కి వెళ్ళడం అప్పట్లో నాకు బాగా ఇష్టమైన పని. అలా ఈసభలమీద ఇంట్రస్టు ఉండేది. ఈ కార్యక్రమం కవిత్వమ్మీద ప్రేమ ఉన్న ప్రతీ ఒక్కర్నీ తనతో లాక్కెళుతుంది. నన్నూ అలానేప్రభావితం చేసింది. కవితా వార్షికలు నాలోని కవిత్వ దాహాన్ని మరింత పెంచాయి. ఈ కార్యక్రమం వెనుక చాలామందినిబద్దత కలిగిన మనుషులున్నారు. వాళ్ళ కృషికి ఫ్యానవడమే ఈ అనుబంధాన్ని మరింత పెంచింది.

కరోనా వల్ల సభ జరుపకుండా పోవడం చాలా బాధ కలిగించిన విషయం. బండ్ల మాధవ రావ్ గారు ముందు విత్తనంవేశారు. అనిల్ నేనూ పాదులు తీసి నీళ్ళు పోశామంతే. నామాడి శ్రీధర్ గారు కూడ ఈ థాట్ ప్రాసెస్ లో భాగంగా ఉన్నారు. ఈ అనుభవం విలువైనది. ఇంట్లోంచి కాలు తీసి బయటకికదపలేని పరిస్తితుల్లో ఉన్న కవులందర్నీ ఇంటర్నెట్ వేదిక మీద చూడటం థ్రిల్లింగ్ గా అనిపించింది. వాళ్ళు ఒప్పుకుని వెంటనే జూం. యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం, సాంకేతికంగా సిద్దపడటం కవిత్వమ్మీద ప్రేమ కాక మరేమిటి ? వాళ్ళందరికీ శిరసా నమామి. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి దాదాపు ఎనభై మందితో పాటు, బెంగలూరు నుంచి “ఆరోవర్ణం” కవి ఇక్బాల్ చంద్ –అమెరికా నుంచి అఫ్సర్, నారాయణ స్వామి కార్యక్రమం చివరంటా వుండడం మా అందరికీ సంతోషంగా అనిపించింది.

కొప్పర్తి సందేశంలో కొత్త ఆలోచనలు

వేరే సందర్భాల కోసం కూడా ఈ మాధ్యమాన్ని వినియోగించవచ్చు. కానీ మనిషిని కళ్ళెదుట కలిసే వీలుండి, చేతుల్లోచేతులేసి మాట్లాడగలిగే సభలుంటే వాటికేం ఇవి ప్రత్యామ్నయం కాబోవు. దూరాభారాల్లో ఉన్న వారు, వయసు రిత్యాపెద్దవారై ప్రయాణం చేయలేని సాహితీవేత్తలని ఇన్వాల్వ్ చేయడానికీ మాధ్యమం చాలా అనుకూలం.

ఆన్ లైన్ మాధ్యమాలు చాలా ప్రాధాన్యం పెంచుకుంటున్న రోజుల్లో ఉన్నాం. కవిసంగమం లాంటి ఫేస్బుక్ గ్రూపులు తెచ్చిన మార్పులు, అట్లాగే యూట్యూబ్ ఛానెల్స్ లో కవిత్వ  ప్రసారాలూ,  కొలిమి,  రస్త, ఈమాట, విహంగ, వాకిలి లాంటి ఆన్లైన్ పత్రికలు తమ ఉనికిని కాదు సాహిత్యమ్మీద బలమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. సారంగ లాంటి వెబ్ పత్రికల  తాజా సంచికలు చూస్తే ఎంతమంది కొత్త కవులు ఇప్పుడు కన్పిస్తారో గర్వంగా అనిపిస్తోంది. ఎక్కడో దూరాన వుండి కూడా సారంగ,  కొలిమి చేస్తున్న కృషి మాకు కొండంత  అండ.

అయితే, అసలు కవులకి సొంత పలుకు అంటూ లేకపోతే ఇవేవీ వుపయోగపడవ్. మేడే కవిత్వ సాయంకాలంలో కొత్త కవుల పదును ఇంకోసారి బలంగా తెలిసి వచ్చింది.  భవిష్యత్తు లో స్వీయ నియంత్రణ, సరైన సంపాదకనిర్వహణ ఉంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయని పూర్తిగా నమ్ముతున్నాను.

కవిత్వంతో సాయంకాలం సభలు విజయవంతం కావడంలో శ్రీ శ్రీ విశ్వేశ్వర్రవ్ కవిత్వ ప్రేమ అపారమైనది. ఈ మంచి పనిలో నాకొక అవకాశమిచ్చిన ప్రతీ సందర్భానికీ కృతజ్ఞతలు చెప్తాను.

*

చిన్నారి ఆదిత్య ప్రేమలేఖ

అనిల్ డ్యాని

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంతమంచి కార్యక్రమంలో నాకు అవకాశం దొరకడం… కవిత్వం చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు… అభినందనలు.

  • దీన్ని ఎలా కొనసాగించాలి అనే ఆలోచన చేయాలి. కనీసం చాలా ప్రత్యేక సందర్భాలలోనైనా…

  • డియర్ శ్రీరామ్ గారు..కొత్త ఆలోచన.. వినూత్న ప్రయోగం ..విస్తృతి పెరిగింది.. చిన్నప్పుడు చదివే ఆసక్తి ఉన్నవారు ఊళ్లో ఓ చిన్న గ్రంధాలయానికి వెళ్లి అక్కడ పరిమితంగా ఉన్న పుస్తకాలనే చదివేవారు. ఓ మంగలి షాప్ లో అద్దెకు (పూటకు పావలా) దొరికే డిటెక్టివ్ బుక్కుల్ని చదివేవాళ్ళం…ఇప్పటి సాంకేతిక విప్లవంతో ఖండాన్త్రాలను ఆవలి కవుల భావాలను ఆకళింపు చేసుకుంటున్నాం. మీ కృషికి జేజేలు అభినందనలు💐💐💐💐

  • అవగాహం లేకపోవడంతో ఆ రోజు సాయంత్రం వరకూ నేను యాప్ డౌన్ లోడ్ చేసుకోలేదు. కానీ పెద్ద పెద్ద కవిత్వం చదువుతారు వినాలనే కుతూహలం..మా అబ్బాయికి చెబితే యాప్ డౌన్ లోడ్ చేసాడు..చాలా సేపు ఎవరి మాటలూ వినిపించలేదు..చాలా ప్రయత్నం చివరకు ఎలాగో ప్రోబ్లం సాల్వ్ అయింది..అలా అందరినీ చూడటం చాలా సంతోషం కలిగించింది..నేను కవిత చదువుతానని అనుకోలేదు కూడా..ఇంత గొప్ప కార్యక్రమంలో నాకూ అవకాశం ఇచ్చిన శ్రీరాం గారికి ధన్యవాదాలు..కార్యక్రమం చాలా బాగా జరిగింది…విజయవంతం కావడానికి కారకులైన మాధవరావు గారికి..విశ్వేశ్వర్రావు సర్ కి.అనిల్ గారికి..శ్రీరాం గారికి నమస్సులు…

  • అవగాహం లేకపోవడంతో ఆ రోజు సాయంత్రం వరకూ నేను యాప్ డౌన్ లోడ్ చేసుకోలేదు. కానీ సీనియర్ కవులు కవిత్వం చదువుతారు వినాలనే కుతూహలం..మా అబ్బాయికి చెబితే యాప్ డౌన్ లోడ్ చేసాడు..చాలా సేపు ఎవరి మాటలూ వినిపించలేదు..చాలా ప్రయత్నం చివరకు ఎలాగో ప్రోబ్లం సాల్వ్ అయింది..అలా అందరినీ చూడటం చాలా సంతోషం కలిగించింది..నేను కవిత చదువుతానని అనుకోలేదు కూడా..ఇంత గొప్ప కార్యక్రమంలో నాకూ అవకాశం ఇచ్చిన శ్రీరాం గారికి ధన్యవాదాలు..కార్యక్రమం చాలా బాగా జరిగింది…విజయవంతం కావడానికి కారకులైన మాధవరావు గారికి..విశ్వేశ్వర్రావు సర్ కి.అనిల్ గారికి..శ్రీరాం గారికి నమస్సులు…

  • ‘కవిత్వంతో ఒక సాయంకాలం’ జీవితకాలం నిలిచే జ్ఞాపకం!
    నిర్వాహకులకు అభినందనలు, ధన్యవాదాలు!

  • విలువైన ప్రయత్నం చేశారు.మీ కృషికి జేజేలు. బలమైన గొంతుకల్ని ఎంపికజేసి,కవిత్వసాయంకాలాన్ని సుసంపన్నం జేసిన మీకు అభినందనలు. శ్రీరాం అన్నా మీ బాబుకి శుభాశీస్సులు. పెద్దల్ని గదమాయించినట్టే…హహ అనిలన్నా మీ తపన ఫలించాలి

  • నిజంగా ఇది మంచి ఆలోచన.కరోనా ప్రపంచాన్ని స్తంభింపచేయగలదేమో గాని కవిత్వంని కాదు.

  • గొప్ప ప్రయత్నం. అనిల్.. శ్రీరామ్…మాధవరావు.. విశ్వేశ్వర రావు అందరూ ఎంతో నిబద్ధతతో చేస్తున్న ప్రయత్నాలకు నా హృదపూర్వక అభినందనలు

  • Fantastic programme which i missed.. But heard it went very well and came to a conclusion that no one can stop poets to gather and read poetry! And congratulations to Sreeram for being an inspired father! I did not see him write any poem on his sons.. like Anil Dani, but little Aditya did it and made the show more perfect.

  • కొత్త తరం, స్వాగత గీతంగా..చిన్నారి ప్రేమలేఖ బాగుంది.👍babuki,అభినందనలు..!మీ అందరి కృషి బాగుంది.. dany సర్💐.

  • నేను కవిత్వం తో ఒక సాయంకాలం సమాచారం చూడగానే నిబద్ధతతో ప్రతియేటా కొనసాగిస్తూ న్న విషయం చాలా ఆనందంగా అనిపించింది. పాల్గొనడం కోసం జూమ్ డౌన్ లోడ్ చేసుకుని సమయానికి ఒక సభలో వచ్చి కూర్చు న్నట్లుగా కూర్చున్నా..అందరి అభిప్రాయాలు, కవితలు వింటూ ఉంటే పరమానందం కలిగింది మాధవ్ రావుగారు శ్రీరామ్ గారు అనిల్ గార్లు ప్రతి 40 నిమిషాలకు మీటింగ్ ఎండ్ అయినా తిరిగి రి కనెక్ట్ చేస్తూ కొనసాగించారు ..6 గంటలకు కూర్చున్న నేను 9.30 వరకూ వింటూనే ఉన్నాను ..సమయానికి నా మైక్రోఫోన్స్ పనిచేయక నా కవిత వినిపించలేకపోయినా కవిత్వాన్ని ఆసాంతం ఆస్వాదించాను..పాల్గొన్న వారిలో చాలామంది సీనియర్ కవులు తమ కవితలను వినిపించారు ..కొందరు ముఖతః పరిచయం లేదు ఈ సమావేశం ద్వారా వారిని చూసే అవకాశం కలిగింది..నా మట్టుకు నాకు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న మాలాంటి వారికి మంచి కవిత్వం రాయడం ఎలా ..సూచనలు ఇలాంటి ఆన్ లైన్ కార్యక్రమాలు నిర్వహిస్తు తెలియజేయవచ్చు అనిపించింది ..మరొక సూచన ( చేయొచ్చో లేదో తెలీదు) ..ఒక సమయం కొందరు కవులు అని నిర్దేశించి ఆ ప్రకారం ఈ కవిత్వం ఇలా (కరోనా కవిత్వాన్ని ఆపకుండా )కొనసాగించవచ్చు అనిపించింది. నిర్వాహకులకు వందనాలు .

  • మూడు తరాల కవుల్ని ఇట్లా ఒక దగ్గర అదీ ఆన్ లైన్లో చేర్చడం గొప్ప చారిత్రాత్మక సంఘటన.సాహితీమిత్రులతో ఏర్పడ్డ పరిచయంతో పాటు అనిల్ అన్నకు,శ్రీరాం సార్ కు కవిత్వం పట్ల వున్న ప్రేమ వలనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి.ఆదిత్య కలం పట్టడం నాకు బాగ ఆనందమనిపించింది.

  • Thank you so much Anil dany sir that is the best evening and a memorable moment ever . Thank you for supporting every time and giving best opurtinities to youth . All the members who participated boosted us with their poetry we learned a lot ❤️

  • కవిత్వం తో సాయంకాలం ఓ మరిచి పోలేని అనుభూతి మిగిల్చింది
    ఎందరో మేధావుల కవిత లు మా శ్రేయ లాంటి యువత వినగలిగేరు
    నిర్వాహకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలియదు కానీ కార్యక్రమం success అయిందనే చెప్పాలి
    నెల లేదా 2 నెలలకు ఒకసారి ఇలాంటివి పెట్టగలిగి
    మరికొంత మందికీ అవకాశం కలిపించ గలిగితే….. ఏదేమైనా నిర్వాహకులకు అభినందనలు

    • KAVI ANE VADU VEDIKA MEEDA CHADAVADAM NAKU ENDUKO ISHTAM UNDADU….ASALU OKA KAVITHA CHADAVADAANIKI INKO OORU VELLADAM NAAKU IPPATIKEE KOTTAGA ANIPISTUNDI…IPPATIKEE 5-6 AIR SAMMELANALU LO MATRAME PALGONNA NAA 30 ELLA POETIC CAREER LO…CORONA TARVATA IDI POPULAR KAVACHHU….BANDLA THO ADE ANNAANU…. K.SUDHERA, VIZAG

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు