ఇంతే నా ఆత్మకథ!

ప్రతిక్షణం ఊపిరితో పీల్చే ఉనికి జ్ఞాపకం అవగలదా?

………

ప్రేమిస్తే అందులోనే జీవించటం తెలుసు

జీవిస్తూ కూడా ప్రేమించవచ్చని తెలీదు.

చేసే ప్రతి పనిలో నిన్ను చూడటమే తెలుసు లేదా

ఏపనీ చేయకుండా నీ ఆలోచనల్లోనే బ్రతకడం తెలుసు. కానీ

వాళ్లంతా చెప్తున్నట్లు

చేయాల్సిన పనులన్నీ అయ్యాక మిగిలిన కాస్త ఖాళీ లో మాత్రమే నీ గురించి ఆలోచించడం ఎలానో తెలీ టంలేదు.

అన్యమనస్కంగా బ్రతికేస్తూ ఉంటానా?

అప్పుడప్పుడూ వీలు చూసుకుని నిన్ను పలకరించాలని తెలీదు

.ఎలా మరి .

నన్ను మరిచి నీలోనే గడపటం అలవాటైన దాన్ని

నిన్నుమరిచి నాపనుల్లో పడటం ఎలానో రావట్లేదు.

అలా….ఎలా…ఉండాలో కూడా తెలీదు.

ఒక మనిషిని ప్రేమిస్తే తను ఎప్పటికీ జ్ఞాపకం కాకుండా ఉండాలి కాదూ?

ప్రతిక్షణం ఊపిరితో పీల్చే ఉనికి జ్ఞాపకం అవగలదా?

Can you ever become a memory?

మనుషులు అర్థం అవుతారు

మనసులు కావు

నీలో కోల్పోయిన నన్ను

వెతుకతూనే ఉన్నా….

ఇంకా కంటపడట్లేదు –

ఒకప్పటి నేను.

 

ఒక నువ్వు

ఒక నేను

ఇంతే నా ఆత్మకథ.

రెండు భాగాలు.

నీ పరిచయం ముందు –

తరువాత.

 

నామటుకు నాకు….నువ్వొక అద్భుతం.

అపురూపం.

ఎందుకూ …ఎలా అంటే …

Listen to my silence

It has so much to say …

 

 

 

 

 

 

 

శ్రీరంగవల్లి

చదవటం ఇష్టం. ఇలాంటివి అని చెప్పడం కష్టం - వాతావరణాన్ని బట్టి( బయటా లోపలా) ఏదైనా కావచ్చు: టాగూర్, రూమి, చలం ఇంకా చాలా. మనుషుల్ని చదవటం ఇంకా ఇష్టం - రోజువారీ జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి ప్రభావం మనమీద అంతో ఇంతో లేకుండా ఉండదు అని నమ్ముతాను. ఇలాంటి చాలా అద్దాల్లో కనిపించే మనల్ని పరీక్షగా చూసుకోవడానికి జె.కె ఫిలాసఫీ ఇంకా ఇష్టం. వృత్తి రీత్యా మాధమ్యాటిక్స్ ఫాకల్టీ, అప్పుడప్పుడు రాసుకున్న లైన్లు ఎప్పుడైనా ఇలా..బయట పడుతూ ఉంటాయి-

ఆమె( ఇమ్మే) చ్యూరు గా…..

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దూరమయినా
    చేరువయినా
    నిజమయిన ప్రేమ. ….
    ఊహ కానే కాదు
    ఊపిరి
    ఉనికి
    మౌనం
    ధ్యానం
    త్యాగం
    జీవిత కాలపు నిరీక్షణ
    అంతే….
    అంతే

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు