ఆశారాజు కవిత : నాకు ఇష్టమైన పాట పాడే పిచ్చిది

ప్రముఖ అనువాదకులు గణేశ్ రామ్ అనువేది ఎంపిక చేసిన తెలుగు కవితల హిందీ అనువాదాలు ఇవి-

కిటికీ దగ్గర నన్ను కూర్చోబెట్టీ
ఇప్పుడే వస్తానని చెప్పిన చందమామ
ఆ పక్క వీధి మేడ మీదికి వెళ్ళింది

నేను కాలిపోతున్నాను కాపాడమని
గదిలోని దీపం గాలిని వేడుకుంటోంది

రోడ్డు వెంట యెవరో పిచ్చిది
నాకు ఇష్టమైన పాట పాడుకుంటూ
చీకట్లోకి వెళ్ళి పోతోంది

జార్జెట్ చీరెలా వెన్నెల
మడతల గరుకులా జారుతోంది

రాత్రంతా అడుగుల శబ్దం,
దూరానా ఊహల్లా కదిలే దృశ్యం
వయోలిన్ తీగల అలికిడిలా వుంది

జీవితం మనిషి బొమ్మను గీసి
మాట్లాడడం నేర్పు తోంది

మనిషికి మాటలు వచ్చాకా
ప్రశ్నిస్తూ బతికితే బాగుండు !

 

बचाओ ! बचाओ !

मुझे खिड़की के पास बिठाकर
अभी आया कहकर गया चांद
बगलवाली गली के छत पर जा बैठा ।

बचाओ ! बचाओ !

मैं जलता जा रहा चिल्लाते हुए कमरे में दिया
हवा से गिरिया रहा।

सड़क चलती कोई बावली
मेरा पसंदीदा गाना गाती
अंधेरे में निकलती जा रही।

जार्जेट वाली साड़ी की तरह, चांदनी
तहोंवाले ख़ुरदरे की तरह फिसलती जा रही।

रात भर किसी के चलने की आवाज,
वहां.. दूर खयालों के विचलने का नज़ारा
वायुलीन की तारों की हलचल जैसा है ।

जिंदगानी, बंदे की तस्वीर आंककर
बातें करना सिखा रही ।

बतियाना आने के बाद बंदा
सवाल करते जीता तो अच्छा लगता!

*

तेलुगु मूल – आशा राजू
हिंदीकरण – डॉक्टर गणेश राम अनुवेदी

గణేశ్ రామ్ అనువేది

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు