ఆలోచనా నీవే  ఆయుధం నీవే !

దరహాసపు పెద్దపులి కి
పసిమొగ్గల ఫలహారం

లిగిన పూల రెక్కలు
పొద్దున్న నాకు
సాయంత్రం నీకు

 

రాలిపడిన ఇనుపరజను
సాక్షిగా మేకిన్ ఇండియా

 

దరహాసపు పెద్దపులి కి
పసిమొగ్గల ఫలహారం

 

ఆధునికతలోకి అంధకారం
జాతిశాస్త్రానికి శుభ సత్కారం

 

పేరేదైతే నేమ్ ?
అందులో నువ్వున్నావా లేదా ?

 

చరిత్రొక పరిశిష్టం
నరకడమే సజాతి రోగానికి దివ్యౌషధం

 

సార్వభౌమత్వానికి
పరాయి మానవ చీడ

 

పౌరసత్వాన్ని సవరించు
ఆ పార్శ్వాన్నీ కత్తిరించు

 

సామాన్యుడొక
లౌకికుడు
అవైదికుడు
సుఖ రోగి

నాస్తికత్వ కటకం ధరించి
తిరుగు వదరుబోతు

 

పట్టికలు సిద్ధం చేయి
ఆధార్ నెంబర్లను వడపోయ్

 

వెతుకు
ఇళ్ళూ
వాకిళ్ళూ

స్మశానాలూ
సభలూ
సమావేశాలూ

 

ఎరుపుకు కుల వైకల్యం
పెట్టుబడుల చీడ పీడలు

తెగులు విపత్తుకు
కీటక నాశనకారిక తప్పదు

 

కార్మిక కర్మచారీ
లంబ రేఖ లో ఎదురెక్కుతున్న క్షుద్రం

దృష్టి కోణం మార్చక తప్పదు

వక్ర వ్యాప్తిని అరికట్టే

ఆలోచనా నీవే
ఆయుధం నీవే
నీవే ..నీవే ..నీవే !!

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

వేణు గోపాల్ రెడ్డి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది , కరుకు పదాల వెనుక సత్యం చెంపచెళ్ళుమనిపించింది

  • వేణు మీరు పోయెమ్స్ రాస్తారని తెలీదు . క్లుప్త మైన పదాలతో , కొండంత భావాన్ని నిలిపారుగా .

  • సామాన్యుడొక లౌకికుడు,అవైదికుడు,సుఖ రోగి
    తెగులు విపత్తుకు కీటక నాసినీ తప్పదు👌👌👌👌💐💐💐 Overflow of volcano 👌👌💐💐💐 excellent Sir.. Kudos 💐💐

  • ప్రెసెంటేషన్ ఎక్సలెంట్. ఇలా కూడా చెప్పొచ్చా ! ఇంతందంగా…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు