అనువాదం: యామినీ కృష్ణ
అణచివేయబడ్డ హిందూ వర్గం అన్న భావన సృష్టించడంలో ముఖ్య పాత్ర వహించిన సంస్థల్లో ఆర్య సమాజ్ ఒకటి. భారత చరిత్రలో హిందూ -ముస్లిం కథనం ఒక శతాబ్ది నుంచి ప్రచారం లో ఉంది. మతం అన్న రంగును దాటి చరిత్రను అర్ధం చేసుకోడానికి మనం కులం గురించి చర్చించాలి. ఇదే విధంగా నిజాం రాష్ట్ర చరిత్ర కూడా. ఇది ‘హిందువులను అణచివేసిన భూస్వామ్య, ఇస్లామిక్ మతపరమైన రాష్ట్రం’ గా ముద్రపడింది.
ఈ కథనాన్నీ దాటి చరిత్రను అర్ధం చేసుకోవాలంటే కులం గురించి, ఆర్య సమాజ్ చేసిన కుల సంస్కరణల గురించి మనం తెలుసుకోవాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మరొక సారి ప్రతిపక్ష రాజకీయ నాయకులను రజాకార్లుగా చిత్రీకరించి, సెప్టెంబర్ 17 ను విమోచన దినం గా ప్రకటించి, హిందూ ముస్లింల మధ్య విద్వేషం వెదజల్లే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఈ విషయాలను చర్చించడం మరింత అవసరం.
ఆర్య సమాజ్ సంక్షిప్త చరిత్ర
హైదరాబాద్ చరిత్ర కు, భారత చరిత్రలో ప్రముఖ కథనాలు హిందువులు ముస్లిములను వేర్వేరు ఏకరూప సమూహాలుగా, కులం వంటి అంతర్గత విభేదాలు లేనట్టుగా చూపిస్తాయి. రోజువారీ అనుభవాలు, సాంఘిక శాస్త్రం ఇటువంటి చిత్రీకరణను విభేదించింది. హిందువులు అణచివేయబడ్డ ఏకరూప సమూహంగా ఏవిధంగా చిత్రీకరించబడ్డారో మనం చూద్దాం.
నిజాం రాష్ట్రం లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఈ కథనం సృష్టించిన ఒక సంస్థ ఆర్య సమాజ్. ఎం ఎస్ అనే వంటి కాంగ్రెస్ వాదులు ఆర్య సమాజ్ పనిని అభినందిస్తూ “వీరు (ఆర్య సమాజ్ ) ముస్లింలు బహిరంగంగా ఇంకా రహస్యం గా చేస్తున్న మాత మార్పిడి ప్రచారానికి సరైన మందు” అన్నారు. ఆర్య సమాజ్ మొదటి కార్యక్రమాలు కుల సంస్కరణ, ప్రత్యేకం గా అణగారిన కుల సంస్కరణలు. ఈ సంస్థను పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే, అది హైదరాబాద్- దక్కన్ సమాజాన్ని ఏ విధంగా చూసిందో తెలుసుకోవాలంటే మనం ఈ సంస్థ రాష్ట్రం బయటి చరిత్ర తెలుసుకోవాలి.
గుజరాత్ లో ఆర్య సమాజ్ చరిత్ర గురించిన తన రచనల్లో డేవిడ్ హార్డీమన్ అనే చరిత్రకారుడు, ఆర్య సమాజ్ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టడానికి ఒక కారణం 1872 లో జరిగిన సెన్సస్ అని తెలిపారు. ఈ విధంగా సంవత్సరాలుగా హిందూ మతం మత మార్పిడి వల్ల ప్రమాదం లో ఉంది అన్న కథనం హిందూ కామన్ సెన్స్ లో భాగమైపోయింది. ఎక్కువ భాగం వీరి ప్రయత్నాలు క్రిస్టియన్ మతానికి విరుద్ధంగా పనిచేసినా, “అక్రమణవాది ముస్లిం” అన్న పాత్ర కూడా వీరి దృష్టికోణం లో భాగమే. చరిత్రకారుడు కెన్నెత్ డబ్ల్యు జోన్స్ ప్రకారం పంజాబ్ లో ఆర్య సమాజ్ తిరుగు మత మార్పిడులు ఎక్కువ శాతం ముస్లింల నుంచే. ఇది ఆర్య సమాజ్ ను ముస్లింల వ్యతిరేక శిబిరంగా మార్చింది, ముందు నుంచి ఉన్న మత పరమైన స్పర్ధలకు ఆజ్యం పోసింది.
పండిట్ లేఖి రామ్ ఆధ్వర్యం లో ఉన్న ఆర్య సమాజ్ లోని ఒక వర్గం తీవ్రంగా ముస్లిం వ్యతిరేక భావాలది. భారత దేశం లో ఇస్లాం మతం చరిత్ర “రక్తసిక్తమైన ఊచకోత… అంతా విధ్వంస చరిత్ర” అని వారి దావా. ఆర్య సమాజ్ కు బ్రాహ్మణ వైశ్య కులాలు నిధులు సమకూర్చితే, అది అణగారిన అంటరాని కులాలను తమ శుద్ధి కార్యక్రమాలతో “శుద్ధి చేసేది.” హైదరాబాద్ దక్కన్ లో ఆర్య సమాజ్ కార్యక్రమాల వల్ల చాల మంది అణచివేయబడ్డ కులాల వారు తమను హిందువులుగా గుర్తించుకున్నారు. విద్యాధర్ గురూజీ జీవితం కూడా ఆర్య సమాజ్ తో సంబంధం వల్ల నాటకీయ మార్పులకు లోనైంది.
ఒక ఆర్య సమాజి కథ
హైదరాబాద్-కర్ణాటక లో విద్యాధర్ గురూజీ ప్రముఖుడు. అనేక స్థానిక స్వాతంత్ర చరిత్రల్లో పాల్గొన్న వ్యక్తి. 2017 లో నేను ఆయనని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనకు వయసు పైబడింది. వినికిడి కొంచెం మందగించినా తన జీవన గ్యాపకాలు, స్వతంత్ర పోరాట గ్యాపకాలు ఎంతో వివరంగా చెప్పుకొచ్చారు.
గురూజీ మొదటి పేరు భిక్షప్ప, ఆయనను ఒక స్నేహితుడు ఒక ఆర్య సామాజి తో పరిచయం చేసాడు. అప్పటి వరకు గురూజీ కి మతం మీద పెద్ద ఆసక్తి లేదు, కాషాయం ధరించే స్వాములను చూసి సందేహపడేవాడు కూడా. నా స్నేహితుడు స్వామి రాంజీ కి నన్ను చాకలి (ధోబీ ) సమాజానికి చెందిన వాడిగా, మంచి విద్యార్థి గా పరిచయం చేసాడు. అప్పుడు స్వామి చాకలి నాకు అతను వశిష్ట కుల పుత్రుడు అన్నాడు. యే కాపాడె నహి ధోయేగా యే ఆద్మీయో కో ధోయేగా (ఇతను బట్టలుతకడు మనుషులను ఉతుకుతాడు) అన్నాడు. ఇది నన్ను పూర్తిగా మార్చేసింది, నేను అన్ని మంత్రాలూ హవనాలు నేర్చుకున్నాను. నా వీధి లోని యువకులందరిని సమీకరించి, వారికీ మంత్రాలూ నేర్పేవాడిని. వాళ్లకు నేను రాయడం చదవడం నేర్పించాను “, అని గురూజీ చెప్పాడు.
అణచివేయబడ్డ కులాల యువత ఆర్య సమాజ్ లో చేరితే తమ సామాజిక స్థితి మెరుగవుతుందేమోనన్న ఆశ. ప్రముఖ చరిత్రకారులు నేనిక దత్త చెప్పినట్టు గా కొన్ని బ్రాహ్మణ వ్యతిరేక పద్ధతులు అవలంభించడం వల్ల పంజాబ్ లో జాట్ లు కూడా ఆర్య సమాజ్ కు ఆకర్షితులయ్యారు, వారు తమను తాము క్షత్రియులుగా కూడా చెప్పుకున్నారు. ఇలాగె గురూజీ కి కూడా కుల హోదా లో ఎదుగుదల (వశిష్ట కుల) ఆయనను ఆర్య సమాజ్ కార్యక్రమాల్లో భాగస్తుడిని చేసింది. గురూజీ ఆర్య సమాజ్ దీక్ష తీస్కొని, జంధ్యం వెస్కొని, పేరు మార్చే కార్యక్రమం తో భిక్షప్ప నుంచి విద్యాధర్ గా మారాడు. పేర్లు మార్చడం కూడా కొత్త మెరుగైన స్థాయి ఇవ్వడం లో ఒక ముఖ్య భాగం. ఆర్య సమాజ్ మంత్రి గా తనను కలిసిన ఎంతో మందికి గురూజీ కూడా పేరు మార్చాడు.
గురూజీ, తన మొదటి ప్రయాణాల్లో అస్పృశ్యత నిర్మూలన గురించి, ఆలయ ప్రవేశం గురించి, కులాతీత సహ పంక్తి భోజనాల గురించి మాట్లాడారు.క్రమంగా ఆర్య సమాజ్ ఉత్తర భారతంలోలాగా బలవంతపు మత మార్పిడి అన్న ఆలోచనను హైదరాబాద్-దక్కన్ లో కూడా ప్రవేశ పెట్టింది. గురూజీ కూడా అందరి లాగే ‘మత మార్పిడి’ ని వ్యతిరేకించాడు. గురూజీ తన ప్రయాణాల్లో ప్రజలకు ముస్లిం రాష్ట్రం ఏ విధం గా ‘బలవంతం’ గా మత మార్పిడి ని ప్రోత్సహిస్తుందో చెప్పేవాడు. “మేము అమాయకులైన హిందువులను దృష్టి సారించి వారికి అవగాహన కల్పించేవాళ్ళం, ముస్లిములుగా మారకుండా కాపాడే వాళ్ళం. మెం వారికి గాయత్రీ మంత్రం నేర్పించే వాళ్ళం. ఎక్కడైతే హిందువులని ముస్లిములుగా మార్చారో, వాళ్ళని మళ్ళీ హిందువులుగా మార్చేవాళ్ళం,” అని గురూజీ చెప్పాడు.
బహదూర్ యార్ జంగ్ ఆధ్వర్యం లోని మజ్లీస్ ఏ ఇత్తహాదుల్ ముస్లిమీన్ కు, దళిత నేత బీ శ్యామ్ సుందర్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం, ఆర్య సమాజ్ కు కంట్లో నలకలా ఉండేది. ప్రజలను, ముఖ్యం గా అణగారిన కులాల ప్రజలను భయపెట్టి, బలవంతపెట్టి, లంచమిచ్చి, వాళ్ళు ఇస్లాం మతం లోకి మార్చారు అని గురూజీ ఆరోపించారు. “ఈ హరిజనులు ముందు చిన్న నేరస్తులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ముస్లింలు అయ్యారు, వాళ్ళకి రాష్ట్రం మద్దతుండేది. వాళ్ళేమైనా నేరం చేస్తే పోలీసులు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇట్లా చిన్న నేరాలనుంచి వాళ్ళు చాలా డబ్బే రాబట్టుకున్నారు,” అని గురూజీ ఆరోపించారు.
వారికీ ఇంకో ఆందోళనకర విషయం దీన్దార్ చెన్నబసవేశ్వర సిద్దికి కు పెరుగుతున్న ప్రజాదరణ, అతను లింగాయత్ లకు ముస్లింలకు సన్నిహిత సంబంధాలున్నాయన్నాడు.
ఇతనికి ఎద పై త్రిశూలం పచ్చబొట్టు ఉండేది, తనను తాను చెన్నబసవేశ్వర అవతారం గా చెప్పుకునేవాడు. అతని శిష్యులంతా బసవేశ్వర వచనాలు చెప్పేవాళ్ళు. లింగాయత్లు వారి అమాయక భార్యలు వీళ్ళని భక్తితో గురువులుగా చూసేవాళ్ళు. కానీ ఇది అగ్ర కులాలైన లింగాయత్లను ఇస్లాం మతానికి మార్చడానికి ఒక కుట్ర. దిగువ కులాల వారిని మతం మార్చడం సులువుగా ఉండేది కానీ ఈ విధంగా అగ్ర కులాల వారిని కూడా వాళ్ళు మార్చేవాళ్ళు” అని గురూజీ అన్నారు.
దీన్దార్ శాఖ ఇంకో విధంగా కూడా వారిని కలవర పెట్టేది – రెండు విభిన్న మతాలైన హిందుమతం, ఇస్లాం కలిసి ఒక్క మతం గ ఉండగలవు అని దావా చేసింది. ఇది ఆర్య సమాజ్ ముఖ్య ప్రాతిపదిక ఐన స్వచ్ఛతను సవాలు చేసింది.
పోలీస్ యాక్షన్
ఏదైతే బ్రాహ్మణాధిపత్య కుల క్రమంలో గౌరవం కోసం మొదలైందో అది 1940 వచ్చేసరికి గురూజీ లాంటి వాళ్లను ముస్లిం వ్యతిరేకంగా హిందువులను ‘కాపాడే’ సైనికులుగా మార్చింది. 1940 మొదట్లో తన పేరుమీద వచ్చిన అరెస్ట్ వారెంట్ ను తపించుకోడం కోసం గురూజీ హైదరాబాద్ వదిలి బైటకు పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ -దక్కన్ సరిహద్దు లో ఉన్న బొంబాయి ప్రెసిడెన్సీ లోని షోలాపూర్ లో గురూజీ నిజాం రాష్ట్ర ఆస్తులపై దాడి చేసే అనధికార సైన్యం లో భాగమయ్యాడు. దీంట్లో వాళ్ళకు స్థానిక కలెక్టర్, ధనిక వ్యాపారులు, మద్దతునిచ్చారు, వారికీ ఆశ్రయం, రక్షణ ఇంకా ఆహారాన్ని సమకూర్చారు. ఈ దాడులు ప్రతిదాడులు హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య ఉన్నటు గ చిత్రీకరించడానికి ఉపయోగపడ్డాయి. భారత యూనియన్ ఇదే కారణం చూపి హైదరాబాద్ ను పోలీస్ ఆక్షన్ ద్వారా బలవంతం గ విలీనం చేసుకుంది. ఆర్య సమాజ్ నిజాం రాష్ట్రాన్ని ఒక మతపరమైన హిందువులను అణచివేసే ముస్లిం రాష్ట్రంగా చిత్రీకరించ్చడానికి 1930నుంచి 1940 మధ్య కృషి చేసిన ఎన్నో సంస్థలలో ఒకటి.
సమాజ్ కు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కు, హిందూ మహాసభ కు, దగ్గర సంబంధాలుండేవి. ఇవన్నీ అసఫ్ జాహి రాష్ట్ర వ్యతిరేక భావాలను పంచుకునేవి. కానీ కేవలం ఈ సంస్థల రాజకీయాలను చుస్తే ఇవి ఏ విధంగా సమాజన్ని సమీకరించాయో పూర్తిగా అర్ధం కాదు. గురూజీ ఆర్య సమాజ్ తో మొదలు పెట్టినా మెరుగైన సామాజిక స్థితి కి ఆకర్షితుడై, సమాజ్ లో ఉత్సాహంగా పాలు పంచుకున్నాడు. కానీ చాలా మంది లాగా హైదరాబాద్-దక్కన్ విలీనం తరవాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోకి మారాడు. ఇది హిందూ సంప్రదాయవాదులు, కాంగ్రెస్ హైదరాబాద్ లో ఎంత దగ్గరగా పనిచేసాయో మనకు సూచిస్తుంది
మతిమరుపు రాజకీయాలు
హైదరాబాద్ – దక్కన్ లో హిందువుల పై ముస్లింల అణచివేత అన్న కథనం ఇంకా ప్రాముఖ్యత లో కొనసాగుతుందంటే దానికి కారణం ఈ వివిధ రాజకీయ శక్తుల మధ్య ఈ విషయం మీద ఉన్న ఏకాభిప్రాయం. కానీ మౌఖిక చరిత్రలు ఈ ఆధిపత్య కథనాన్ని తిరగరాస్తాయి. గురూజీ ని నేను ముస్లింల పై జరిగిన హింస గురించి అడిగితే అయన అది జరిగిందని చెప్పడానికి ఏమంత్రం జంకలేదు. “హిందువులు వారికీ జరిగిన దానికి పాగా తీర్చుకోవాలనుకున్నారు. నేను ఇది సరైనదని భావించలేదు. మిలిటరీ చర్య తరవాత నేను ఆరు నెలలు అక్కడే ఉండిపోయాను (షోలాపూర్ లో). ఎప్పుడు బయటనుంచి ఏ లీడర్ వచ్చిన ఒక జులూస్ తీసేవారు, వేడుక జరిగేది. ఆ సమయం లో ఈ గూండాలందరు కలిసి ముస్లిములను లూటీ చేసేవాళ్ళు. అందుకే నేను వెంటనే తిరిగి రాలేదు. నాకు ఇందులో పాలుపంచుకున్న చెడ్డపేరు రాకూడదని,” అని అన్నారు.
మరి ఇదెందుకు చారిత్రిక ఇంగిత జ్ఞానం కాలేదు? జిల్లా, రాష్ట్ర గాజీటీర్లను చుస్తే అవి కూడా పోలీస్ ఆక్షన్ సమయంలో జరిగిన దమన కంద గురించి ప్రస్తావించవు. వాటిల్లో ఆర్య సమాజ్ ఇంకా వాటి లీడర్లు స్వతంత్ర సమరయోధులుగా కనిపిస్తారు. ఈ మతిమరుపు రాజకీయాల్లో కేవలం ముస్లిముల పై జరిగిన హింస మాత్రమే కాదు, , నిజాం పాలనను దించడానికి ఉద్దేశ పూర్వకంగా హిందూ సమాజాన్ని ఏకరూపంగా మారడం వంటి చర్యలు కూడా తెరమరుగు అయ్యాయి!
*
డేంజర్స్ ఆఫ్ ఎ సింగిల్ స్టోరీ‘ సిరీస్ 1948 నాటి పోలీస్ యాక్షన్‌పై ప్రత్యామ్నాయ దృక్కోణాలను అందిస్తుంది. హైదరాబాద్ విలీనాన్ని హైదరాబాద్ ‘విముక్తి‘గా ప్రచారం చేస్తున్న ప్రధాన స్రవంతి కథనాలు ప్రస్తుతం నడుస్తున్న విభజన రాజకీయాలను మరింతగా పెంచడానికి ఉపయోగపడతాయ్ అన్న స్పృహ తో, దానికి విరుగుడు గా ప్రత్యామ్నాయ కథనాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఇది. చరిత్ర, రాజకీయాలు, సంస్కృతిపై బహిరంగ చర్చను బలపరిచే ఉద్దేశంతో ఏర్పడి వాటిని రూపొందించడానికి కట్టుబడి ఉన్న మేధావుల నెట్‌వర్క్ ఖిడ్కీ కలెక్టివ్ తరఫున స్వాతి శివానంద్, యామిని కృష్ణ, ప్రమోద్ మందాడే ఈ కథనాలకు సంపాదకత్వం వహించారు.
Add comment