ఎవరి దుఃఖమదుఃఖమో
ఆకు దోనేలో ఇంకా బతికే ఉంది
తప్పిపోయిన పిట్ట ఒకటి
చీకటి మింగిన కాలం వద్ద
వెలితిగా అరుస్తోంది
సీతాకోక
ముళ్ళ తీగకు రంగులను తగిలించి
దిగంబరంగా ఎగిరిపోయింది
కొన్ని పూలు
మునిమాపున రాలి
సాయంత్రాన్ని దోషిగా నిలబెట్టాయి
వెలగని ప్రమిద వద్ద
దీపం పురుగు
ఇంకా కళ్ళు తెరవలేదు
కల కంటోన్న పాము వంట్లోంచి
గాలి బయటకు వచ్చి
స్వప్నాన్ని దొంగిలించుకెళ్ళింది
దేవ దేవుని వద్ద
అగరు గాయపడి
నివురై కుమిలింది
ఏటి మీద నావికుడు
చివరి చేవ్రాలు అచ్చొత్తి వెళ్ళాడు
పడవ కనులనిండా
మరణ వాసన.
——
మాటలకందని విషాదపు వయొలిన్ స్వనం మీ కవనం…. Hats offffff….
థ్యాంక్యూ మేడమ్….
మంచి పద్యం సార్.
తాత్విక వాసన
థ్యాంక్యూ సర్…..
ఈ పద చిత్రాలెక్కడినుండి తెస్తారు సర్ ? వాటిదగ్గరే మనసు తన్నుకులాడుతుంది
మహా ప్రభు …
మీరేం తక్కువా చెప్పండి………..
ఫిఫ్టి ఫిఫ్టి కవిత చదివాక జెలసిగా ఫీలయ్యాను.