ఇది అమృతకాలం
అద్భుతాల ఇంద్రజాలం
ఆకలుండదు
ఆశలుండవు
ఆవేశాల ఆనవాలుండదు
అమృత ఫలాల్ని జుర్రుకుంటూ
ఇక బతకటమే తరువాయి!
అమృతం తాగి
శరీరాలు కుళ్ళిపోనీ
ఆత్మలు మాత్రం వెలిగిపోనీ
చావు లేని దేశంలో
ఇక చల్లగా నిద్రపోండి
అమృతం కోసం
ఆధార్ కార్డులు జమచేసి!
ఓహో అమృత కాలమా!
ఆసుపత్రులును మూసేసాంలే
పిల్లలు బడులుకెల్లక్కర్లేదిక
పంటలు పండపోయినా ఫర్వాలేదు
చీకటితో ఇక పనిలేదులే
రోగాలతో ఆకలితో అజ్ఞానంతో
అంతమైన జనజాతి జీవితం
ఇక డిజిటల్లో పునర్జీవం!
ఆహా అకాలమా!
విషమ పాలనలా
అమృత అంగడి
కార్పొరేట్ సందడి
అమృత కుండలో పడి
ఊపిరాడని ఈగలు
కిందపడ్డ రెక్కల గుర్రం
అమృత మురుగులో!
అమృత అగాధంలో
ఆకలి ఆర్తనాదం
చిల్లుపడ్డ డిజిటల్లు
చెల్లని క్రిప్టో కరెన్సీలు
చెదిరిన దేశీయులు
అమృత విషవిరుగుడు కోసం!
*
Powerful poem, anna.
కేశవన్నా… సింప్లీ సూపర్. వర్తమాన ప్రభుత్వ తీరు, మనుషుల స్థాయి, స్థితులను… సీంబల్స్ తో కూడిన కవిత్వంగా మార్చావు.. అమృతాన్ని… ప్రయోగించిన విధానం బాగుంది.
అమృత కుండ లో పడి ఊపిరాడని ఈగలు