అనివారిత…

వాగ్గల్పిత స్వప్నాగాధం

         స్వప్నాయుధం

         కలకత్తి

కాళ్ళు పాతేసుకుని

         కలజువ్వని

నింగికి సారించే

ఎర్రచీమలపుట్ట

ఈ బుర్ర

                           పోగుల..

                            .. కల

   బొజ్జోని మాటలమూట

బహిరంతర్నిరంతర్ప్రవాహ

                     సదృశాకాశ గమనం

                    ఏ కుహరంలోకి డాలీ…

వాసనకు రిక్కించని చెవిటికన్ను

                     అస్పర్శి కూడా

ముకుపుటాల పాదాలకి

తోవ తొలగిన కడలి

నిజ శరీరాంగాల బేరగాళ్ళు

ఆస్పత్రి ఆత్యయిక చలివొళ్ళో

         ఉంచిన అంగాంగం

…ఆనక

విమాన పదిజాముల

         లుప్తవిరామం

అగరు మబ్బుల

ఒంటరి కొడికోలదివ్విటీ ముందు

…అచ్చలిపెట్టెలో కూడా

కోటిచిక్కుల దారపుండపుడమి

                     నిన్నటిది

సాలిగూటికొమ్మ లేతెమ్మెరకే

         రేపటి ములుకంప తగిలెనా…

వొక మూగ అక్కరంలో

         అచ్చుపిచ్చ నొక్కితే

వొఠ్ఠిహల్లు…

…పొల్లు కేకలా

అరవడం తప్ప…

                                 •••

చిత్రం: రాజశేఖర్ చంద్రం

కె.రామచంద్రా రెడ్డి

2 comments

Leave a Reply to Murali Mallareddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు