1
అనామకుడి
గది నిండా గంధకపు వాసన
గది చుట్టూ
లెక్కలేనన్ని వాయులీనాల
వేదనామయ వాద్యగోష్టి
లోహ వాక్యాల చివర
పూల చిహ్నాల కోసం
గాలికళ్ల గూఢాన్వేషణ
చమురు ఒలికిన
దేహపు మారుమూలల్లో
ఎక్కడో సిరా కోశం
జిడ్డుగాలి
బతకనివ్వదు
చావనివ్వదు
అప్పులిచ్చి అంతుజూసే లోకంలో
అనామకుడి అంతిమయాత్ర
సమాధి మైకంలో
మరణానంతర శిలాధ్యానం
గది నిండా గంధకపు వాసన
గది చుట్టూ
లెక్కలేనన్ని వాయులీనాల
వేదనామయ వాద్యగోష్టి
లోహ వాక్యాల చివర
పూల చిహ్నాల కోసం
గాలికళ్ల గూఢాన్వేషణ
చమురు ఒలికిన
దేహపు మారుమూలల్లో
ఎక్కడో సిరా కోశం
జిడ్డుగాలి
బతకనివ్వదు
చావనివ్వదు
అప్పులిచ్చి అంతుజూసే లోకంలో
అనామకుడి అంతిమయాత్ర
సమాధి మైకంలో
మరణానంతర శిలాధ్యానం
2
దృశ్యాంతరం
తోటలో నడుస్తున్నా
ఒక ఉడుత
నా ముందు నడుస్తోంది
నేను ఉడుతను
అనుసరిస్తున్నానా?
లేక తనే నాకు
దారి చూపుతోందా?
ఉడుత ఆగింది
నా ఉనికి వల్ల
దానికి చర్యాభంగం
కలగకూడదని
నేనూ ఆగాను
నిశ్చలంగా
కొన్ని క్షణాలు…
మౌన భాషణ తర్వాత
తను పొదల్లోకి మాయమైంది
నేను ముందుకి కదిలాను
మాటలకందని
మంతనమేదో
మా మధ్య
జరగనే జరిగింది
ఏదేమైనా
నడకలోనూ
ధ్యానముందని
ఒక పాఠం
చెప్పకనే చెప్పింది
చిట్టి ఉడుత.
*
చిత్రం: స్వాతి పంతుల
Add comment