అంబేద్కర్, నీ పుట్టిన రోజు…

 -నామ్ దేవ్ ధసల్ 

ఇంగ్లీషు: యోగేశ్ మైత్రేయ

 

రోజు శుక్రవారమ్
అమ్మ బజారులో
చాలా ఆతురతతో
వొక పాఠాల పుస్తకాన్ని
వొక పలకను
రాతితో తయారైన
వొక పెన్సిల్ ను కొన్నది
ఆరోజు అమ్మ బాగా అలసిపోయింది
లాంతరు వెలుగులో
ఆమె నాకు కాలుకు మసాజు చేయడమ్ నేర్పింది
నేను నిద్రపోయేంత వరకు
యీ పుస్తకాన్ని చదువుతూ వుండాలి అంది
నేను చదువుకోలేదు
అయితే నువ్వు వొక పని చేయాలి
‘బ’ అంటే బాబా సాహేబ్ అని
చదవడం ప్రారంభించాలి
ఆయన గణపతి కంటే చాలా అందగాడు
అందుకే శ్రీ గణేష అని పాడకు
ప్రజల నాయకుడు వికారమైన వాడు కాదు
ఆయన మాలో వొకడు
సత్యం శివం సుందరం
యీ సత్యం శవం సుందరమే
బాబా సాహేబ్ అంబేద్కర్
లేదంటే యీ పుస్తకానికి అర్థమే లేదు.
*
నీ పుట్టిన రోజు సందర్భంగా
                                      – అరుణ్ కాలే
సూర్యుడు కూడా తనను తాను
భీమ్ రావ్ అని పిలుచుకోవాలి
అలాంటిదే మీ వారసత్వమ్.
గ్రహాలు, నక్షత్రాలు సమానత్వ సైనిక బృందాలను స్థాపించాలి
భూమి రామి కొంగుతో
మానవత్వాన్ని వెచ్చగా వుంచాలి
నేను నీ పుట్టిన రోజున
నీ వెలుగుతో పాటు
యీ మిణుగురులు ప్రకాశిస్తున్నాయి
యే వుదయమూ వుండదని
నన్ను నేను మేల్కొల్పుకొంటున్నాను
వొక భ్రమలో
*
 బాబా సాహేబ్ & పుట్టిన రోజు
మేము, కాలం, వేగం, శ్రమ చేత
తీసివేయబడిన వాళ్ళం
మేము రాత్రింబవళ్ళు
చీకట్లోనే వుంటున్న వాళ్ళమ్
నీ పుట్టుకతో పాటు పుట్టిన వాళ్ళం
నీవు వర్ణమాల లోని ‘అ’ అనే అచ్చును యిచ్చావు
అలాగే ‘స’ అనే హల్లుతో సుజ్ఞానాన్ని యిచ్చావు
నీవు మాకు మా కాలక్రమాన్ని యిచ్చావు
మాకు యెప్పటికి ఆర్పలేని కొవ్వొత్తులతో
మా పుట్టిన రోజులలో వెలిగించావు
*

పఠాన్ మస్తాన్ ఖాన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 1st poem is very good one chosen for translation. Congrats to the Telugu poet who translated it.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు