తేరిపార జూస్తుంది గానీ
కదులుతున్న దాని గుండె గడియారాన్ని ఏమార్చింది.
జారిపడి మెట్ల మీద దొర్లుతున్న నిశ్శబ్దం అలికిడికి
గదిలోని సర్వ ప్రపంచం తెల్లబోయి
చేతులెత్తింది.
నేల
నేలకేసి ముఖాన్ని రుద్దుకుంటుంది.
కాగితం మీద ఒంటరి కవితొకటి ఒలికిపోయింది
పురిటి పదమేదో గదంతా బంతాడుతుంది.
అలంకు : లేని దాన్ని ఉన్నట్లుగా, జరగని దాన్ని జరిగినట్లుగా భ్రమకు లోను కావటం. అది భ్రమే నిజం కాదు అని తేలినప్పుడు ఖంగు తినటం.
ఇంత జరుగుతున్నా
పడిన చినుకును పడినట్లు కాజేస్తుంది కాలం
పొడిచిన ప్రతి చుక్కనూ రాలగొట్టి అమ్మకానికి పెడుతుంది రాజ్యం
రోజుల్ని బలవంతాన గుహలవైపుకు ఈడ్చుకుపోతుంది
పరిసరాలు మనలోపలి సుడిలో తిరుగుతున్నాయి
ఇంత జరుగుతున్నా అద్దాలు మాత్రం అద్దంలో చూసుకోవు
అంతమాత్రాన ఆముదం ఒడిలో నవ్వుతున్న దివ్వెను వడగాలి ఆకలికి వదిలెయ్యాల్సిన పనిలేదు
చెట్లను తొడుక్కున్న పక్షులు ఏక్షణంలోనైనా
మన సుదీర్ఘ నిద్రనుంచే రెక్కలు ఊపుకుంటూ
ఎగిరి బయటికి దూకొచ్చు
మనం పారేసుకున్న కలలు మనల్ని వెతుక్కుంటూ రావొచ్చు
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
నమస్తే సర్…చాలబావున్నాయి
బాగున్నాయి సార్.. లో గొంతుతో మాట్లాడుతున్నాయ్…