సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
15 డిసెంబర్ 20182018 సంచికలుతరంగ

స్వేచ్ఛ కవితలు మూడు

స్వేచ్ఛ

వానలు

1
అప్పుడొకసారి
సాయంత్రాన్ని మూసివేయాల్సొచ్చింది
అంతే..
దడదడా రంగుల యుద్ధం..
విరహం
మట్టి వాసనయింది
రాలిపడినా ప్రవహించడం
ఇప్పుడు ఉనికి..
నీకోసం
నా ఎదురుచూపుల్లో పుట్టినవే
వానలంటే..
___________________________________________________
2

నీకు

రాయిని తొలుస్తున్నా
నీకో సముద్రాన్నివ్వటానికి..
అంతరాళంలో సుడులు
పొమ్మని విసిరి కొడుతున్నాయి..
అప్పుడో అలసిన క్షణంలో
అలనై ఎగిరిపడుతున్నా..
కెరటాన్ని చీల్చుకొనొచ్చి
ఒడ్డున గాయపరచబడుతూ..
రాయిని తొలుస్తున్నా
నీకో సముద్రాన్నివ్వటానికి..
పెయింటింగ్:  సత్యా  బిరుదరాజు
_______________________________________________________
3
పిల్ల
పిల్ల
సముద్రం నుంచి నీళ్ళు,ఇసుక తోడుకొస్తుంది
పాదముద్రలతో
 సముద్రానికి దారి చూపిస్తుంది..
అలల నేత
 ఒడ్డు వరకు మాత్రమే ఓ విఫలయత్నం
రాలేని సముద్రం…పోలేని తీరం..
ఎంతటి హోరైనా చీకట్లో కేవలం వినిపించగలదు
ఈ పిల్ల మళ్ళీ సముద్రంలోకెళ్ళింది
ఒడ్డుకిప్పుడు దారి తెలిసి నిశ్శబ్దంగా ఏడ్చింది
సముద్రపు పిట్ట రాతిరి వేటాడుతుంటే
నా నీడ మీద మట్టి పోసుకుంటున్నా..
*

స్వేచ్ఛ

View all posts
ఒకరోజు – కొన్ని దృశ్యాలు
యాజ్ఞి కవిత్వం మనకో ఆత్మీయ లేఖ

7 comments

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Kalyan says:
    December 14, 2018 at 5:04 pm

    I liked 3 rd pilla it’s very nice

    Reply
  • Prasadamurty says:
    December 14, 2018 at 11:17 pm

    పిల్లా..నీకు వానలు..
    మాకు రంగులు..అక్షరాలు..అలలు..కలలు..కలిసి చేసిన అద్భుతం. దాడి చేశావు స్వేచ్ఛ..హ్యాట్సాఫ్

    Reply
    • Swetcha says:
      December 15, 2018 at 10:04 am

      Thank u sir

      Reply
  • Jeela Tejaswini says:
    December 14, 2018 at 11:20 pm

    In the neeku,appudo alisina kshnana alani agiri paduthunna….superb….good….all the best

    Reply
    • Jeela Tejaswini says:
      December 15, 2018 at 1:16 am

      But one thing swecha garu,alany agisipaduthunna or agiripaduthunna…..

      Reply
  • డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ says:
    December 18, 2018 at 4:31 am

    నైస్ స్వేచ్ఛ

    Reply
  • సాయి గోరంట్ల says:
    February 9, 2019 at 7:09 am

    వానలు కవిత మరింత బాగుంది..మిగిలినవి కూడా 👍

    Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

హంస బేసర

మునిసురేష్ పిళ్లె

నా స్వరాన్ని గుర్తు చేసుకో అదీ గుర్తుంటేనే….

శాంతి ఈశాన్

అహం పూర్వమేవ జానామి!

మానస ఎండ్లూరి

మా అమ్మమ్మ గారి ఊరు సర్జాఖాన్‌పేట్

భరత్ కనికె

సురూపుడు

ముక్కామల చక్రధర్

పుస్తక శత్రువు 

ఏ.కె. ప్రభాకర్
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు