| వానలు1 అప్పుడొకసారి సాయంత్రాన్ని మూసివేయాల్సొచ్చింది అంతే.. దడదడా రంగుల యుద్ధం.. విరహం మట్టి వాసనయింది రాలిపడినా ప్రవహించడం ఇప్పుడు ఉనికి.. నీకోసం నా ఎదురుచూపుల్లో పుట్టినవే వానలంటే.. ______________________________ 2 నీకురాయిని తొలుస్తున్నా నీకో సముద్రాన్నివ్వటానికి.. అంతరాళంలో సుడులు పొమ్మని విసిరి కొడుతున్నాయి.. అప్పుడో అలసిన క్షణంలో అలనై ఎగిరిపడుతున్నా.. కెరటాన్ని చీల్చుకొనొచ్చి ఒడ్డున గాయపరచబడుతూ.. రాయిని తొలుస్తున్నా నీకో సముద్రాన్నివ్వటానికి..  ______________________________ 3 పిల్ల పిల్ల సముద్రం నుంచి నీళ్ళు,ఇసుక తోడుకొస్తుంది పాదముద్రలతో  సముద్రానికి దారి చూపిస్తుంది.. అలల నేత  ఒడ్డు వరకు మాత్రమే ఓ విఫలయత్నం రాలేని సముద్రం…పోలేని తీరం.. ఎంతటి హోరైనా చీకట్లో కేవలం వినిపించగలదు ఈ పిల్ల మళ్ళీ సముద్రంలోకెళ్ళింది ఒడ్డుకిప్పుడు దారి తెలిసి నిశ్శబ్దంగా ఏడ్చింది సముద్రపు పిట్ట రాతిరి వేటాడుతుంటే నా నీడ మీద మట్టి పోసుకుంటున్నా.. * | 

 
        		 
        	






I liked 3 rd pilla it’s very nice
పిల్లా..నీకు వానలు..
మాకు రంగులు..అక్షరాలు..అలలు..కలలు..కలిసి చేసిన అద్భుతం. దాడి చేశావు స్వేచ్ఛ..హ్యాట్సాఫ్
Thank u sir
In the neeku,appudo alisina kshnana alani agiri paduthunna….superb….good….all the best
But one thing swecha garu,alany agisipaduthunna or agiripaduthunna…..
నైస్ స్వేచ్ఛ
వానలు కవిత మరింత బాగుంది..మిగిలినవి కూడా 👍