స్పర్శరేఖ

నువ్వెంత గుండ్రంగా ముడుచుకుపోతున్నా

ఎక్కడో ఒకచోట నిన్ను స్పర్శించకుండా ఉండలేను

 

నన్ను నువ్వు ఎంత కాదనుకున్నా

ఒకే ఒక్క

స్పర్శ కోసమనే

నీకూ తెలుసు

నాకూ తెలుసు

 

ఆ క్షణమే అలా రాకపోతేనేం

అభినయంగా అది అనిపిస్తేనేం

అదే చోట అదే స్పర్శ కోసం

నువ్వూ నేనూ

మళ్లీ మళ్లీ

 

ఏ పాటి స్పర్శ అయినా

నిత్యం

నేను నీకు దూరం కాలేనని

నువ్వు నాకు దూరం కాలేవనే కదా

*

Avatar

ముకుంద రామారావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు