పద్యపు మొక్కను పెంచుతుంటే
విశేషణాల మిడతలు
గుంపులుగా వచ్చి వాలుతాయి
దాని కొమ్మల మీద
వాటిని పారద్రోలకపోతే
పద్యపు మొక్కకు పచ్చదనం చేకూరదు
మొక్కకు నీరు పెడుతుంటే
లెక్కలేనన్ని పదాలు ఊటలై వచ్చి
పాదును ముంచెత్తుతాయి
అనవసరమైన ఊటలను
ఆపు చెయ్యకపోతే
మొక్క వేర్లు మొత్తానికే నశిస్తాయి
మొక్కల పెంపకం
మొత్తం మీద కష్టమే
మెళకువల్ని తెలుసుకుని
జాగ్రత్తను పాటిస్తే తప్ప
***
painting: Satya birudaraju

 
            






Add comment