వెలితి

చేజారిపోయిన

విస్మృత‌జాడ‌ల అస్ప‌ష్ట నీడ‌లు
నీలో నింపిన వెలితిని

దేనితో పూడ్చ‌గ‌ల‌వు?

వ‌ర్చువ‌ల్ స్ప‌ర్శ‌లూ,

ఇమోటికాన్ల ఎక్స్‌ప్రెష‌న్లు
తీర్చ‌లేని ఆవేద‌న‌ల ఆర్తిని

అక్ష‌రాల‌లో పొద‌గాల‌ని అనుకుంటుంటావు
కానీ–

ఎక్క‌డినుండో సంజీవ‌నీ మూలిక తెస్తూ

ఎగిరొచ్చే బాహుబ‌లి కోసం
సౌమిత్రి లా స్పృహ‌త‌ప్పే ఉంటావు!

నీ వెలితి
నిన్ను

మ‌ళ్ళీ మ‌ళ్ళీ పిలిచే మెట్లు లేని దిగుడుబావి!
క్రిక్కిరిసిపోయిన బ‌తుకు

నిన్నందులోకే తోస్తూంటుంది!

నీకు స‌మ్మ‌తం కాని
కులాల మ‌తాల విద్వేషాలు

పాకుడు రాళ్ళ‌గోడ‌లై నిన్ను పైకెక్క‌నీయ‌వు!
పైకి రానిదే వెలితిని పూడ్చ‌లేవు!

ఎక్క‌డో మిణుగురులు చేసే

వెలుతురు రెక్క‌ల‌ స‌వ్వ‌డి
నిన్ను సేద‌దీరుస్తుంటుంది!

అస్ప‌ష్టంగా మిగిలి ఉన్న ఆశ
ఏనాటికైనా

వేద‌నా మేఘాల్ని

ఛేదించుకుని వ‌చ్చే
సౌభ్రాతృత్వ‌ కిర‌‌ణాల‌ కోసం

వేచి ఉండేలా చేస్తుంది!

ఇంకెవ్వ‌రూ దిగ‌కుండా

ఆ వెలితిని

పూడ్చేయాలంటే
నువు పైకొచ్చాకా
ఎంత‌కాల‌మైనా

బావి గ‌ట్టు మీద‌నే

అటూ ఇటూ కాకుండా ఉండాలి.

*

Avatar

గీతా వెల్లంకి

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • పాకుడు రాళ్ళ గోడలపై నిన్ను పైకెక్క నీయవు

  • కులమత విద్వేషాలు పాకుడు రాళ్ళ గోడలై… అన్నాను సర్.. 🙂 థాంక్యూ సో మచ్

 • కవిత,బాగుంది..గీతజీ. కులమత విద్వేషాలా పాకుడు రాళ్లు, గురించిబాగా రాశారు!.

 • వెలుతురు రెక్కల సవ్వడి
  నిన్ను సేద తీరుస్తుంటుంది….వాహ్ గీత గారు…

 • కవితలో చాలా విషయముంది. రాసిన నేపధ్యం భిన్నం కావచ్చు… అయినా నాకు సౌభ్రాత్రృత్వ కిరణాల కోసం ఎదురు చూసే వేదనా మేఘమే కనిపిస్తోంది😀😀😀
  కవిత మటుకు అద్భుతం 👌👌👌

 • ముగింపు వాక్యాలు కవితకు నిండుదనం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు