వీడ్కోలు సవ్వడి ..మరికొన్ని హైకూలు

నీళ్ల బిందె
నిద్రలేపింది
పల్లెటూరి చెరువుని


దీపం
ట్రెకింగ్
చీకటి

 మొగ్గ
వొళ్ళు విరుచుకున్నట్టు
పువ్వు 

 
నిన్నటి వెన్నెల
కొట్టుకొచ్చినట్టు
మెరుస్తూ తీరం 
 

కాయితప్పడవా
పసి నవ్వూ అదృశ్యం
వాన నీళ్లలో
ప్రయాణం
యాత్ర అయింది
నదిలో పడవ బోల్తా

 

మంచుపొరల
పొట్లాలు విప్పుతూ
సూర్యుడు

  
వీడ్కోలు సవ్వడి

నది
పొడవునా

  
విది
డ్యూయల్ రోల్
కష్టజీవికి అటూ ఇటూ


  
పా

గొడుగుని జయించింది
వానలో తడిసి

*
చిత్రం: స్వాతి శ్రీకర్

గోపరాజు రాధాకృష్ణ

పుట్టింది.. ఎక్కడో తూర్పుగోదావరి లో.. మోరి. ఇప్పటివరకు రెండు పుస్తకాలొచ్చాయి. ఒకటి - హైకూలు పుస్తకం.. ఆల్బమ్. రెండు - బాగా నచ్చిన మనుషుల గురించి కవితాత్మక వర్ణన.. వర్ణం. ఇంకోటి దార్లో వుంది.. పేరు ప్రస్తుతానికి 'తీగె చాటు రాగం" లేదా "ఓ అందమైన సాయంత్రం".

అసలు వ్యాపకం కథా రచన. 89 లో శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి సంపాదకత్వంలో తొలి కథ ఆంధ్ర జ్యోతి వీక్లీ లో అచ్చయ్యింది. పేరు "గాడ్.. ది శాడిస్ట్". ఈ మధ్య రాసిన కథ ఆదివారం ఆంధ్రజ్యోతి లో "విభూతి". ఈ రెండిటి మధ్య కథల సంఖ్య సుమారు ఓ వంద. అప్పుడప్పుడు పాటలు. రెండు సినిమాల్లో. ఇంకా టెలివిజన్ ప్రచార చిత్రాల కోసం.

(నేను రాసిన ఓ సినిమా పాటని బాలు గారు ప్రశంసించడం మరపురాని అనుభూతి.) దర్శకుడు వంశీ గారి సినిమా అనుభవాలకు 52 వారాలపాటు స్వాతి వీక్లీ లో డిజైనింగ్ (సత్యసుందరమ్ పేరుతో). వంశీ గారి కథా సంకలనాల్లో టైటిల్స్ రాయడం.. కవిత్వం అంటే ఇష్టం. ఇవి.. అప్పుడప్పుడు అలా రాసినవి.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు