లెట్  మి  లివ్

కనపడీ, కనపడని పల్చటి పంటి గుర్తులు వాటి తాలుకు తడి ఇంకా ఆరని, చెక్కులు కడుతున్న సన్నని గాయాలు.

టీ తాగుతున్నప్పుడు అడిగింది, “సినిమా కెళ్దామా?” అని నీరజ.

“అబ్బా,ఇప్పుడొద్దే!  నాకు సినిమా చూసే మూడ్ లేదు,” అంది శ్రావ్యత కనుబొమలు ముడేస్తూ.  వాటితో పాటే ’కైలీ’ లిప్‌స్టిక్ తో నిండిపోయిన పెదవుల కొసలు కిందకి వంచింది.

“ఏ సినిమాకి?” అని అడిగాడు నిభిర్, ముక్కు మీదకి జారిపోతున్న ’ప్రాద’ కళ్లజోడుని, ఎడం చేతి చూపుడు వేలుతో పైకి నెడుతూ.

“ఏదో ఒకటి.  ఇక్కడే ఉంటే ఈ బోర్‍తో చచ్చి పోతానేమో,” అంటూ తను తాగుతున్న టీ మగ్‌ని తనకెదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ మీద పెట్టింది.

తను కూర్చున్న సెటీ మీదకి కాళ్ళు లాక్కునేటప్పుడు, బలమైన తొడలని కప్పేసిన, వెడల్పుగా ఉన్న పలాట్‌జో ట్రౌజర్స్ వాటి మధ్యకి లాక్కుంది.

బలంగా, నున్నగా ఉన్న ఆమె కాలి పిక్కల మెరుపుని నిభిర్ గమనించకపోలేదు. నీరజ బాడ్మింటన్ ప్లేయర్. అందుకనే అవి అంత బలంగాను, అందగాను ఉన్నాయి. ఈ మధ్య పెడిక్యూర్ చేయించుకున్నట్టు లేదు, గోళ్లు కాస్త పెరిగాయి.

“ఇక్కడే  కూర్చోరాదు? ఆ కబుర్లేవో ఇక్కడే చెప్పుకుందాం! మళ్ళీ బయటికి ఏం వెళ్తాం ఈ చలిలో? ” అని శ్రావ్యత గుణుస్తున్నప్పుడే ఆమె ఫోను మోగడం మొదలైంది.

ఆమె బాయ్ ఫ్రెండ్, అర్మాన్ నుంచి ఆ ఫోను.

ఎక్కడా  లేని ఉత్సాహంతో ఫోను అందుకుని, “హలో డార్లింగ్,” అంటూ అర్మాన్ ని పలకరించింది అరమోడ్పు కళ్ళతో, గొంతు నిండా హస్కీనెస్ ని నింపుకుని.

అవతల అర్మాన్ ఏదో అంటున్నాడు.

“ఎక్కడా?  ఎప్పుడు?” అని అడగటం ఇవతల వీళ్ళకి వినపడింది.  అతను మళ్ళీ ఏదో చెప్పాడు. “నువ్వు నా పక్కనే ఉండి, దూకమంటే కాఫీ మగ్గులోకి కూడా దూకేస్తాను, డార్లింగ్!” అంది కొంటెగా నవ్వుతూ!

నీరజ ఆమె వంక నవ్వుతూ చూస్తోంది. నిభిర్ కూడా వాళ్ల సంభాషణ వింటూ చిన్నగా నవ్వుకుంటున్నాడు.

“మరే ఇక్కడ నీరజ, నిభిర్ కూడా ఉన్నారు.  మరి వాళ్ళకీ…?” అంటూ అడిగింది.

అవతల అతను ఏదో జవాబు చెప్పాడు.

“సరే అయితే. మేము వెంటనే బయలుదేరుతాం,” అంటూ, “లవ్ యూ డార్లింగ్,” అంటూ, “హుమ్మా” అని ఫోనులో కి ఒకసారి నాలుగు ఫ్లయింగ్ కిస్ లని కుక్కింది.

“ఫ్రెండ్స్…అర్మాన్ దగ్గిర నాలుగు టికెట్స్ ఉన్నాయట,  ‘డెస్ట్రాయర్’ సినిమాకి. మీరు కూడా రెడీ అయితే మనం వెళ్దాం,” అంది వాళ్లతో.

“డెస్ట్రాయర్’ సినిమానా? కొత్తదా? ” అని అడిగింది నీరజ.

“నికోల్ కిడ్మన్ ది.  కొత్తదే. మంచి రివ్యూస్ వచ్చాయి దానిమీద. చూడొచ్చు,” అని అన్నాడు నిభిర్.

“నువ్వు చెబితే సరే. వెళ్దాం,” అంది నీరజ.

“గైస్…అర్మాన్ ఈజ్ కమింగ్ హియర్ టు పిక్ మి అప్. మరి మీరిద్దరూ…? ” అని వారిద్దరి వైపు ప్రశ్నార్థకంగా చూసింది.

“నీరజా, మరి నువ్వు?” అని అడిగాడు నిభిర్.

“నా కారుందిగా. నువ్వు నాతో పాటే వచ్చెయి.  మనిద్దరం కలిసివెళ్దాం.”

“మరి తను వెనక్కి ఎలా వెళ్తాడు?” అని అడిగింది శ్రావ్యత.

“మనిద్దరం కాబ్‍లో వచ్చేద్దాం లే! నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను,” అన్నాడు నిభిర్, శ్రావ్యతతో.

నీరజ తనలో తాను నవ్వుకుంది. ఆ రాత్రి శ్రావ్యత అపార్ట్‌మెంట్‌కి రాదు. నిభిర్‍కి ఇంకా తెలీదు ఇలాంటివి, పసి కూన ఆ విషయంలో.

నీరజ కూడా గుమ్మం దగ్గిరకు వెళ్ళి తన వెడ్జెస్ షూస్ ని వేసుకోబోతుంటే, తన ట్రౌజర్స్ ఎడం కాలి హెమ్ కుట్లు  ఊడిపోయి, నూలు పోగులలో చిక్కుకుని, అదుపు తప్పి కింద పడిపోబోయింది. మోచెయ్యిని గోడకి ఆనించి పడిపోకుండా నిలదొక్కుకుంది. ఆ చప్పుడికి తలెత్తి చూసిన నిభిర్ ఒక్క అంగలో నీరజ దగ్గిరకు చేరుకున్నాడు. ఆమె కుడి చేతిని అందుకుని సవరదీస్తూ చూసాడు. మోచెయ్యి దగ్గిర కొద్దిగా కమిలింది, అదృష్టవశాత్తు పెద్దగా గీరుకుపోలేదు.

నీరజ, శ్రావ్యత లిఫ్ట్ ఎక్కేంతవరకు ఆగి వాళ్ళ తరువాత తను అందులోకి వెళ్ళి, లెవెల్ టూ పార్కింగ్ బటన్ నొక్కాడు నిభిర్.

“ఏమైంది నీరూ, ఇందాక ? ” అంటూ నీరజు ని అడిగింది.

“అబ్బే , ఏమి లేదు, ఈ ట్రౌజర్ హెమ్ లైన్ త్రెడ్స్ ఊడి తెగి పడిపోయాను. ఈ లోపు నిభిర్ వచ్చాడు. ఏమి కాలేదులే,” అంది.

లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే, శ్రావ్యత గేట్ దగ్గిర సెక్యూరిటి ఫైపుకి పరుగు లాంటి నడకతో వెళ్ళిపోయింది వీళ్ళద్దరి కోసం ఆగకుండా.

“దీని కంగారు తగలెయ్య! మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా వెళ్ళిపోయింది చూడు, నిభిర్,” అంటూ తన కారు వైపుకి నడిచాడు.

తన ఫోన్ రింగ్ చేసి, “శ్రావ్యతా, ఎక్కడికి రావాలి మేము? చెప్పకుండా వెళ్ళిపొయ్యావు…? ” చికాగ్గా అంది నీరజు.

“అడయార్‌లోని ’ఫీనిక్స్’ కి,” చెప్పింది నీరజ.

సినిమా హాలు చేరుకోగానే,హాలులోకి వెళ్లి కూర్చోవడం, స్క్రీన్ మీద టైటిల్ కార్డ్స్ మొదలవ్వడం ఒకే సారి జరిగింది.

శ్రావ్యత, అర్మాన్‍లు కూడా సరిగ్గా అదే సమయానికి హాలులోకి చేరుకున్నారు.

సినిమా అయిపోయింది.  అందరూ లేచారు. శ్రావ్యత, నీరజ వెనక్కి చేరి, “నిభిర్‍ని నువ్వు డ్రాప్ చేస్తావా?” అని ఆమెకు మాత్రమే వినపడేటట్టు అడిగింది. “నాకు తెలుసు, నువ్వు ఇలా అడుగుతావని. అలాగే డ్రాప్ చేస్తాలే! కాని నువ్వు కేర్‌ఫుల్…” అని నవ్వుతూ అంది.

“… వుయ్ ఆర్ కేర్‍ఫుల్ నీరూ. ఐ ఆల్ఫేస్ టేక్ దోజ్ ప్రికాషన్స్.” అని నీరజ‍ కి మాత్రమే కనపడేటట్టు, కొంటెగా నవ్వుతూ తన పర్సు‍ని తెరిచి చూపించింది శ్రావ్యత. అందులో మిగతా వాటితోబాటు

’మై-వే’ టాబ్లె‍ట్స్, కండోమ్స్, జెల్ ట్యూబ్ చూసింది నీరజ.

“నువ్వు మళ్ళీ నన్ను డ్రాప్ చేసి వెనక్కి ఏం వెళ్తావు? నేను కాబ్ బుక్ చేసుకుని వెళ్తాను లే,” అంటూ తన మొబైల్ ఓపెన్ చేసాడు నిభిర్. “భలే వాడివి, ఏమంత ఆలస్యం అయ్యింది? ఏం ఫరవాలేదు, నేను డ్రాప్ చేస్తాను,” అని అంటుంటే వాలె కుర్రాడు ఆమె దగ్గిరకి వచ్చి, కార్ కీ ఆమెకి అందించాడు.

వెళుతుండగా రాతి పలకల మధ్య ఉన్న ఖాళీలలో ప్రత్యేకమైన గడ్డిలో  షూ హీల్, సరిగ్గా ఆ పలకల మధ్య ఖాళీలో పడి బాలెన్స్ తప్పి పడిపోయింది.

రెండు చేతులు గాల్లోకి వెళ్లిపొయ్యాయి.

వెనకే వస్తున్న నిభిర్ ఇవన్నీ గమనించేలోపు నీరజ తన శరీరం మీద అధీనం కోల్పోయింది.  ఆ పడటంలో ఎడమ కాలు చీలమండ మెలి తెరిగింది. ఆ పడడం కాస్తా నిభిర్ మీద పడింది.

“బాగా నెప్పిగా ఉందా?” అని ఆదుర్దాగా అడిగాడు నిభిర్.

బలవంతంగా నవ్వుతూ, “పెద్దగా లేదులే,” అంటూ లేచి నిలబడటానికి ప్రయత్నించింది నీరజ. ఈ లోపు దగ్గిర్లో ఉన్నవాళ్లందరూ తలో చెయ్యి వేసారు ఆమె లేచి నిలబడటానికి.

“అడుగు వెయ్యగలవా? ” అని అడుగుతూ, “ఎత్తుకోనా?” అని పొడిగించాడు నిభిర్.

“వద్దులే… మరి చిన్న పిల్లని చేసేటట్టున్నావు! కాస్త అవతలికి వెళ్ళి కూర్చుంటే ఒక రెండు నిముషాలు ఎలా ఉంటుందో చూద్దాం” అని అంటూ, వాలె వైపుకి తిరిగి, “థాంక్స్. ఐ కెన్ మానేజ్,” అని అంది.

“పరవాలేదు. మనం ఆ సైడ్ వాక్ దాకా నడవగలం,” అంటూ నిభిర్ కళ్లలోకి చూసింది.  ఆమె నడుం చుట్టూ చెయ్యేసి ఆమె భారాన్ని దాదాపుగా పూర్తిగా మోస్తూ  సైడ్  వాక్ వేపు ఆమెని నెమ్మదిగా నడిపించాడు. ఇద్దరూ అక్కడికి చేరేటప్పడికి ‘ఫీనిక్స్’ ఉద్యోగస్తుడు ఒక చిన్న మినరల్ వాటర్ బాటిల్‍తో అక్కడ నిలబడ్డాడు. బాటిల్ అందుకుని, “ధాంక్స్,” చెప్పింది నీరజ.  డబ్బులిద్దామని చూస్తుంటే, క్లచ్ కనపడలేదు.

ఆమె వెతుక్కోవడం గ్రహించిన ఆ ఉద్యోగస్తుడు, డ్రైవ్ లోకెళ్లి, అక్కడ పడిపోయిన ఆమె క్లచ్‍ని, కారు కీ తో పాటు ఆమె షూస్ ని కూడా తీసుకువచ్చి, క్లచ్‍ని, కార్ కీని ఆమెకిచ్చాడు.  షూస్ ఆమె కుర్చీ పక్కనే పెట్టాడు.  ప్రతిగా థాంక్స్ చెప్పింది నీరజ.

కాసేపు నిభిర్, నీరజల మధ్య నిశబ్దం నృత్యం చేసింది.  నీరజ ఆలోచనలు వారం క్రితం ఆమె ఆఫీసులో జరిగిన టీమ్ మీటింగు సంఘటన దగ్గిరకి వెళ్లాయి.

-0-

ఆ రోజు ఉదయం లేచి చక్కగా డ్రెసప్ అయ్యి ఆఫీస్‍కి బయలుదేరింది.

నీరజ ఉత్సాహానికి కారణం, తన కంపెని చేస్తున్న ప్రాడక్ట్‌కి కొత్త పాకింగ్, పాకేజింగ్ డిజైన్‍ని రూపొందించడం.  దానివల్ల తన కంపెనికి ఒక ప్రాడక్ట్ లైన్ మీద సంవత్సరానికి కనీసం ఒక లక్ష డాలర్లు ఆదా చేసినట్టవుతుంది.  ఇంపెక్స్ కంపెని కాబట్టి అన్ని లెక్కలు డాలర్లలో ఉంటాయి. ఆ ఆదా తక్కువేమీ కాదు. ఒక చిన్న యూనిట్‍‍లోని ఉద్యోగస్తులకి సంవత్సరానికి ఇచ్చే జీతాలకి, బోనస్‍లకి, ఇన్సెంటివ్‍లకి సరిపోయ్యేంత.

మధ్యాహ్నం వైస్ ప్రెసిడెంట్ సమక్షంలో తన ప్రెజెంటేషన్.  స్క్రీన్ మీదకి మొదటి స్లైడ్ ప్రొజెక్ట్ చేసారు. అక్కడి నుంచి ప్రాజెక్ట్ మీద ప్రెజంటేషన్ వారనుకున్న రీతిలో సాగింది. క్యు ఏ సెషన్ తరువాత ప్రాజెక్ట్ మేనేజర్ అందరికి ధాంక్స్ చెప్పి, వైస్ ప్రెసిడెంట్‍తో వెళ్ళిపొయ్యాడు.

కాస్త రిలాక్స్ అవుదామని కాఫేటిరియాలోకి వెళ్లి లాటే కలుపుకుని ఒక కార్నర్ చూసుకుని, కూర్చుని తాగుతుంటే, “హల్లో, నీరజ,” అంటూ ఇందాక కాన్ఫెరన్స్ హాలులో కలిసిన ప్రాజెక్ట్ మానేజర్, విష్ చేస్తూ వచ్చి ఆమె ముందు కూర్చున్నాడు. అతని పేరు బాలన్.

“ఎలా వుంది, నా ప్రెజంటేషన్…?” అని అడిగింది నీరజు.

“గో గ్రీన్ ఇనిషియేటివ్ తో నీ ప్రాజెక్ట్ ని కాస్ట్ ఎఫెక్టివ్‌గా చూపించావు. అంత వరకు సరిపొయింది. కాని, టెక్ టీం వాళ్ళ అశ్రద్ద మూలంగా ‘విన్ని’ లాస్ట్ హార్ జాబ్,” అని చెప్పాడు.

‘విన్ని’ ఎవరన్నట్టుగా చూసింది నీరజు.

“టెక్ టీం ప్రెజెంటర్…’వినీల’…విన్ని ని పంపేసాడు, వీపి, ఆమె ప్రెజెంటేషన్ బాగోలేదని…!”

“పంపెయ్యడం అంటే?”

“షి వజ్ ఆస్క్‌డ్ టు క్విట్.”

“అయ్యో, అంత చిన్న తప్పిదానికా?” వినీల ప్రెజెంటేషన్ లో, ఒక క్రమంలో రావాల్సిన స్లైడ్స్ తారుమారయ్యి, అటూ, ఇటూ వచ్చాయి.

“యెప్. మనం చేస్తున్న ప్రోడక్ట్స్ కాని ఇస్తున్న సర్విసెస్ కాని ప్రెసెసన్‌‌ (p r e c i s i o n)తో పని చెయ్యాలి.  ఎటువంటి ఇన్‌టాలరన్స్ ఉండకూడదుకదా! అందుకనే ఒక టె‍క్స్ట్ మెసేజ్ తో షి వాజ్ ఆస్క్‌డ్ టు గో! సో యు బెటర్ బి కేర్‌ఫుల్ నీరజ, విత్ యువర్ టీమ్‌,” అని హెచ్చరించాడు బాలన్.

మనసంతా పాడై పోయింది నీరజకి.

ఆ రోజు సాయంత్రం ఆపార్టుమెంట్‌లో పరధ్యాన్నంగా ఉండేటప్పడికి శ్రావ్యత నిలదీస్తే ఆఫీసులో జరిగిందంతా చెప్పింది.

“మనమేం చెయ్యలేక పోయాం విన్నికి…? నువ్వే జాగ్రత్తగా ఉండాలి, నీరూ. ఆ ఉద్యోగం నీకు చాలా చాలా అవసరం…” అని తేల్చి చెప్పింది.

ఆ హెచ్చరిక గాఢంగా నాటుకు పోయింది నీరజ మనసులో.

-౦-

ఆ ఆలోచనలనుండి బయటపడి, నిభిర్ మొహంలోకి చూసేటప్పడికి తనకేసి కంగారుగా చూస్తున్నాడనిపించింది. అతను చిన్నబుచ్చుకున్నాడని తెలిసిపోయింది నీరజకి. విన్నీ లాగా తాను పొరబాట్లుచెయ్యకూడదు. తనకి ఆ ఉద్యోగం ఉండాలి. కాదు కావాలి. దానిమీదే తన భవిష్యత్తు ఆధారపడిఉంది.

తన పక్కనే నిలుచున్న నిభిర్ ఎడం చేతిని అందుకుని “ఏమి అనుకోకు,” అంటూ మృదువుగా ఒత్తింది.

“సరే లే. పద, కారు ఎక్కు. నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను,” అని అన్నాడు.

“అబ్బా, నిభిర్! నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లగలను లే. నువ్వేమి ఇబ్బంది పడకు,” అంటూ లేచి కారు కీని తీసుకుని ఒక అడుగు వేసింది.

చనువుగా ఆమె చేతిలోని కారు కీ తీసుకుని కారు తలుపు తెరిచాడు. క్లచ్ ని, కారు కీని నీరజకి అందించాడు. నీరజ ఇగ్నిషన్‌లో కీ పెట్టి కారుని స్టార్ట్ చేసింది.

“ఇంకో సారి ఆలోచించు, నీరజ. నేను నీతో వస్తాను. నిన్ను డ్రాప్ చేసి వెళ్లిపోతాను. లేదూ, నువ్వన్నట్టే రేపు పొద్దున వస్తాను. నువ్వు ఆఫీసుకి వెళ్లొద్దు. ఇద్దరం కలిసి డాక్టరు దగ్గిరకి వెళ్దాం,” అని దాదాపుగా అభ్యర్ధించినట్టు అడిగాడు నిభిర్.

“సారి, నిన్ను వదిలేసి వెళ్తున్నందుకు,”అంటూ, “నీ కాబ్ బుక్ చేసుకో. గుడ్ నైట్, నిభిర్,” అని నవ్వుతూ కారుని నెమ్మదిగా పోనిచ్చింది. నిభిర్ ఆమెకి వీడ్కోలు పలికాడు.

అప్పుడు గుర్తు వచ్చింది అతనికి శ్రావ్యత. నీరజ కి జరిగిన ఆ చిన్న ప్రమాదంలో శ్రావ్యతకి ఫోను చెయ్యాలన్న ఆలోచనే కలగలేదు.

క్లుప్తంగా జరిగింది వివరిస్తూ, వాట్సాప్‍లో శ్రావ్యతకి మెసెజ్ పంపాడు.

నిరుత్సాహంగానే తను అపార్ట్‌మెంట్ వెళ్లడానికి కాబ్ బుక్ చేసుకున్నాడు.

-౦-

మరుసటి రోజు నిద్రలేవగానే నిభిర్ చేసిన మొదటి పని, నీరజకి ఫోన్ చెయ్యడం.  జవాబు లేదు. కాసేపు ఆగి చేసాడు. అతనిలో ఆందోళన పెరిగి పోతోంది. ఇక ఆగలేక శ్రావ్యతకి ఫోను చేసాడు.

ఒక ఆరేడు రింగ్స్ తరువాత తను లైన్‍లోకి వచ్చింది. నిద్ర మత్తులో ఉంది ఆమె.

“శ్రావ్య, నీరజ ఫోన్ తియ్యడంలేదు!” అన్నాడు.

“నీకు తెల్లారిందని అందరికి తెల్లవారదు,” అని నిద్రమత్తులో విసుగ్గా జవాబిచ్చింది శ్రావ్యత.

“అలా కాదు, శ్రావ్యా! రాత్రి గుర్తుందా! నీరజ కింద పడింది…పాపం కాలు ఎలాగుందో?”

“నీ వాట్సాప్ మెసెజ్ చూసాను, నిభిర్. నీరజ ఏమి చిన్నపిల్ల కాదు. తనకు తెలుసు ఏం చెయ్యాలో. నువ్వు కంగారు పడుతూ అందరిని కంగారు పెట్టకు, నిభి!” అని కొంత అసహనంగానే జవాబిచ్చింది.

“శ్రావ్యా…తన కాలుకి ఏమైనా అయితే, జీవితాంతం కష్ట పడాల్సి ఉంటుంది. దాన్ని గురించి ఏమైనా ఆలోచిస్తావా?”

“నిభిర్, నీరజ తెలివిగలది. తనకి తెలుసు…ఏం చెయ్యాలో. ఇంకోమాట చెప్పనా? నా అనుమానం కరెక్ట్ అయితే నీరజ ఈ పాటికి ఆఫీస్‍కి వెళ్ళే దారిలో ఉండి ఉంటుంది.”

“అదేమిటి… అప్పుడే…?”

“ఔను. నీకు తెలీదేమో! వాళ్ళమ్మ, నాన్నలది లవ్ మారేజ్. చాలా ఆలస్యంగా పుట్టింది. వాళ్ళిద్దరు ఇప్పుడు పెద్దావాళ్ళైపొయ్యారు. నీరజకి ఉద్యోగం చాలా అవసరం. తన అవసరాల కన్నా, వాళ్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చులకోసం ఉద్యోగం చెయ్యాలి. నీరజ బాస్ కూడా దుర్మార్గురాలు. అమ్మాయిలకి పురుషులే కాదు, కొన్ని సందర్బాలలో స్త్రీలే పెద్ద శత్రువులు. #మీటూ లో ఈ రోజు వీళ్ళందరూ చెబుతున్నదానికంటే దారుణమైన పరిస్థితులని ఎదుర్కొంది, నీరజ.  అవన్నీ దాటి పైకి వచ్చింది తను. కానీ ఈ రోజు తను ఆఫీస్ కి వెళ్లకపోతే, ఆ బాస్ పెట్టే నరక యాతన ఎవరూ పడలేరు! మనం విన్నా, చూసినా లాభం లేదు. మనకి అర్ధం కాదు, తెలియాలంటే అనుభవించాల్సిందే. కష్టమైనా ఆ కంపెనిలో అనుభవం కోసమే, నీరజ తాపత్రయపడుతోంది.

ఈ కంపెని అనుభవంతో తనకి ఇంకొంచెం మెరుగైన ఉద్యోగం, దొరుకుతుందన్న తాపత్రయంతోనే అక్కడే కంటిన్యూ అవుతోంది. ఓర్పుగా, తెలివిగా ఆ పాములమధ్య జాగ్రత్తగా మెలుగుతూ కష్టపడుతోంది. మొన్నామధ్య వాళ్ల ప్రెసిడెంట్ కూడా వార్నింగ్ ఇచ్చాడంట. సెలవులు పెడితే పంపిచేస్తానని! చిన్న టెక్స్ట్ మెసేజ్ చాలు, ఉద్యోగం ఊడడానికి, నిభిర్! యూ నో ఇట్, రైట్!” అంటూ నీరజ ప్రెజెంటేషన్, వినీల ఉద్యోగం ఊడి పోవడం గురించి  చెప్పింది.

ఒక్కసారిగా మబ్బులు వీడిపోయినవి నిభిర్ కి.

“ఓహ్… అలాగా, సరే లే.  వుయ్ విల్ కాచ్ అప్ లేటర్…,” అంటూ, కాల్ ని అర్ధాంతరంగానే ముగించినా, నీరజ ని తన ఆలోచనల నుండి తప్పించలేకపొయ్యాడు.

-౦-

మరుసటి రోజు ఉదయం, నీరజ ఆఫీసులో పనిచేసుకుంటుంటే, “ఏమిటి, కుంటుతూ వచ్చావు ఆఫీస్‌కి?” అని అడిగాడు, విహార్‌.   అతను అదే కంపెని‍లో లాజిస్టిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ ఎక్జిక్యూటివ్. నీరజ అంటే అభిమానం.

“నువ్వెక్కడ చూసావు?” అని అడిగింది, తన ముందున్న కంప్యూటర్ స్క్రీన్ మీదనుంచి అతని వైపు తన కళ్ళని తిప్పుతూ.

“ఇందాక నువ్వు లిఫ్ట్ నుంచి బయటకి వస్తున్నప్పుడు. నేను ఫ్రంట్ ఆఫీసులో ఏవో వెండార్ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వచ్చాను. అప్పుడు చూసాను. ఈ లోపు నువ్వు నన్ను దాటుకుని వెళ్లిపోయ్యావు…,” అని అన్నాడు.

“ఆమ్ సో సారి, విహార్‌. నిన్ను చూడలేదు. నిన్న ఫ్రెండ్స్‌తో ’ఫినిక్స్‌’లో నికోల్ కిడ్మన్ సినిమా ’డెస్ట్రారాయర్’
(D e s t r o y e r) చూడటానికి వెళ్ళాను. అక్కడ కింద పడ్డాను. పెద్దగా దెబ్బలు తగల్లేదుకాని, ఎడమ పాదం కొంచెం నెప్పిగా ఉంది,” అని అంది.

“అరే, నువ్వు డాక్టర్ దగ్గిరకి వెళ్లి చూపించుకుని రెస్ట్ తోసుకోవాలి కదా? మరి ఆఫీస్‌కి రావడం ఏమిటి?” అని అన్నాడు విహార్‌.

“వెళ్దామనే అనుకున్నాను, కాని ఈ ప్రాజెక్ట్ పని పెండింగ్‌లో ఉండిపోయింది.  పూర్తి చేసేసి వెళ్దామని,” అంటుంటే, “అలా కాదు నీరజ. ఆఫీస్ పనులెప్పుడూ ఉండేవే. నేను మన ’వెల్‌నెస్’ వాళ్లతో మాట్లాడుతా నుండు,” అని అన్నాడు.

ఇంతలో  టక టక మని షూస్ చప్పుడుతో, హెవి పర్ఫూమ్ సువాసనతో పాటు ఒక మధ్య వయసు స్త్రీ నీరజ డెస్క్ దగ్గిరకు వచ్చింది.  భుజాల దాకా ఒత్తుగా ఉన్న జుత్తు, ఎంబ్రాయిడర్ చేసిన తెల్లని లినెన్ టాప్ ని, డార్క్ బ్లూ కలర్ లాంగ్ స్కర్ట్‌లోకి టక్ చేసుకుంది. చెవులకు డిజైనర్ ఇయర్ డ్రాప్స్. ఎడం చేతిలో లాప్‌టాప్ బాగ్.

కుడి చేతికున్న ఐ-వాచ్ చూసుకుంటూ, “ఎంత వరకు వచ్చాయి, డియరీ, నీ డిజైన డీటెయిల్స్. మళ్ళీ ప్రెసెడెంట్, రివ్యు చెయ్యాలంటారేమో? … ” అంది, విహారి వైపు అదోలా చూస్తూ.

“ఐ యామ్‌ వర్కింగ్ ఆన్ ఇట్ మామ్‌!  ఇట్ విల్ బి డన్ టుడే ఫర్ ష్యూర్!…” భయపడుతూ అంది నీరజ.

“ఇట్స్ ఆల్రెడి లేట్, యంగ్ లేడీ…డొంట్ మిస్ ద టార్గెట్… ” అందావిడ విహారి వైపు కాస్త వంకరగా నవ్వుతూ.

“ఐ జస్ట్ డ్రాప్డ్‌ ఇన్ టు సే హాయ్! మామ్, నీరజ నిన్న కింద పడిందట. కెన్ యు ప్లీజ్ టాక్ టు ’వెల్‌నెస్’  పీపుల్?  షీ నీడ్స్ అసిస్టెన్స్,” అని అన్నాడు విహారి.

ఒక చూపు చూసింది విహారిని కూడా.  “షీ నోస్ హెర్ ప్రైయారిటీస్…!  ఆమ్ ఐ నాట్ రైట్?” అని నీరజ ‍తో అంది.

అవునన్నట్లు ఇబ్బందిగా తలూపింది నీరజ.

“దెన్ హవ్ యువర్ రిపోర్ట్స్ ఇన్ ఏన్ అవర్, అండ్ డోన్ట్ వేస్ట్ యువర్ టైమ్‌…” అంటూ విస విసా వెళ్లిపోయింది.

విహార్‌ ఆమె వైపే చూస్తు భుజాలెగరేసి తన డిపార్ట్‌మెంటు వైపు‍కి కదిలాడు.

నీరజ కుర్చిలో కూలబడింది.

విహార్ వెళ్ళీ వెళ్ళగానే నీరజ బాస్ వెనక్కి తిరిగి వచ్చింది.

హేండ్ బ్యాగ్ లోంచి పోస్ట్‌-ఇట్ స్టికర్ తీసి, నీరజ గుప్పిట పెడుతూ, “డొన్ట్‌ మిస్‌…” అనేసి గిర్రున వెళిపోయింది.

దాన్ని తెరిచి చదువుకుని, బాగ్‌లో పడేసి గట్టిగా నిట్టూర్చింది నీరజు.

-౦-

హాల్లో లైట్లన్ని ఆపేసి, సైడ్ టేబుల్ మీద ఒక చిన్న లాంప్ వెలుతురు‌లో, టీవి చూస్తున్న శ్రావ్యత, డోర్ బెల్ మోగిన చప్పుడుకి లేచి తలుపు తీస్తే, ఎదురుగుండా జుత్తు చెదిరిపొయ్యి, మొహం వాడిపొయ్యి, భుజాలు కుంగిపోయి, బట్టలు నలిగిపోయిన నీరజు కనబడింది.

“ఏమైంది, నీరూ? యూ లుక్ సో డామ్ టైయర్డ్..?” అని అడిగింది శ్రావ్యత.

నీరజ జవాబివ్వకుండా కొంచెం కుంటుతూ సోఫా దగ్గిరకి చేరి, నిస్సత్తువగా అందులో కూర్చుండిపోయింది.

శ్రావ్యత తలుపు దగ్గిరకేసి, లోపల డైనింగ్ టేబుల్ మీదున్న వాటర్ జగ్ నుంచి, ఒక గాజు గ్లాసులోకి నీళ్ళు వంపి, దాన్ని నీరజకి అందించింది. నీరజ అందుకుని నెమ్మదిగా గుటకేస్తూ తాగుతోంది.

గుటకేస్తున్నప్పుడు కనపడింది శ్రావ్యతకి, నీరజు గొంతు దగ్గర చిన్న గాయం.

కనపడీ, కనపడని పల్చటి పంటి గుర్తులు వాటి తాలుకు తడి ఇంకా ఆరని, చెక్కులు కడుతున్న సన్నని గాయాలు.

ఆందోళణగా నీరజ కళ్ళలోకి చూస్తూ, “ఏమైంది నీరజ? ఏమైందసలు? చెప్పు…నిభిర్…” అంటూ భుజాలు కుదిపెయ్యడం మొదలుపెట్టింది.

నీరజ నీసంగా నవ్వి – “నువ్వనుకుంటున్నది ఏమీ కాలేదులే…,” అంటూ శ్రావ్యత చేతులు పక్కకి నెట్టింది.

తన హేండ్ బ్యాగ్‌లోంచి ఒక పోస్ట-ఇట్  స్టికర్‌ని తీసి శ్రావ్యత చేతిలో పెట్టింది.
తన బాస్ ఆఫీసులో ఇచ్చిందది.

ఆ స్టిక్కర్ విప్పి చూసి నీరజ నోరెళ్ళబెడుతూ అప్రయత్నంగా పైకి చదివింది, శ్రావ్యత.

“డొన్ట్ మిస్ ఇట్…కమ్‌ హోమ్‌ దిస్ ఈవినింగ్!”

*

Avatar

అనిల్ అట్లూరి

అనిల్ వున్నచోట ఉత్సాహం. సాహిత్య ఉత్సవం. తక్కువ రాసినా వాసికి పెద్ద పీట. అభ్యుదయానికి ఇవాళ్టి బాట.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • కైలీ లిప్‌స్టిక్, ప్రాద కళ్ళజోళ్ళు, వెడ్జెస్ షూస్, డిస్ట్రాయర్ సినిమా, మై వే టాబ్లెట్స్, ఐ-వాచ్… ఇవన్నీ చూస్తుంటే… అనిల్ గారు ఒక కొత్త ఆలోచనకు తెర తీసినట్టుంది… సినిమాల్లోలాగా కథల్లో కూడా ప్రాడెక్ట్ ప్లేస్మెంట్‌ చేసి డబ్బులు సంపాయించుకోవచ్చునేమో రాబోయే కాలం రచయితలు…… ఇంతకీ Destroyer ని డెస్ట్రారాయర్ అని పలకాలా!

  • డెస్ట్రాయర్ అని చదువుకోవాలండి. అచ్చు తప్పు నాదే. టైపింగ్ లో పొరబాటు. కధని చదివి ఓపికగా మీ అభిప్రాయాన్ని తెలియజేసారు. ధన్యవాదాలు.

 • చదిచదివి పాత భావాలతో అలసి పోయిన మాకు కొత్త కధ తొలకరిలా ఉంది. రండి కొత్త తరానికి అంటూ
  అభినందనలు

 • Quick thoughts:

  1. The detailed look of the modern generation and the complexities of it is captured well. Yet, the first part, which sets the stage and introduces the characters is tenuously connected to the office.

  2. I think the best thing that stories do is to introduce you to people that you do not meet otherwise. To that extent, these characters are new and interesting. Perhaps they would not judge themselves by your standards. That is a good thing.

  3. The ambiguity in the end left my imagination in overdrive.
  What happened to her at Boss’es home? Obvious answer? Something more?

  4. The draconian modern companies: I think most of them operate on profit basis. Training a new employee (and hiring also) is costly. Therefore, they do not fire a person so easily. Most people do not understand the value of their work. The lack of such awareness makes the working experience exactly like the previous generation’s labor situation. I contend that it is substantially different.

  In fact, this difference is what people need to understand. Most rural people who join these modern jobs do not understand these new rules of the game.

  5. The main theme: There is a the painting of a mileu (good). The drifting of focus(weak). The office atmosphere (incorrect, but good). The denouement (unclear). [Btw, when I said unclear, I meant, the tying of two parts.]

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు