రచయితలకు సూచనలు

‘సారంగ’ పక్ష  పత్రిక  ముఖ్య లక్ష్యం ఉత్తమ స్థాయి  సాహిత్యాన్ని ప్రచురించడం, ప్రోత్సహించడం!

మీ రచన పంపే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఎడిట్ చేసుకోండి. అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా ఫార్మాటింగ్. కామాలు, ఫుల్ స్టాప్ లు, పదానికి పదానికి మధ్య స్పేస్ లు అన్నీ సరి చూసుకొని పంపండి. ఫార్మాటింగ్ చేయాల్సిన రచనలను ఖచ్చితం గా తిరస్కరిస్తాము.

ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

మీరు రచన పంపిన వెంటనే మేము ఆ రచనని పీర్ రెవ్యూకి పంపిస్తాం. కొన్ని సూచనలు ఇస్తాం. ఆ సూచనల మేరకు మీరు మీ రచనని తిరిగి మార్చవలసి వుంటుంది. కాబట్టి, మార్పులూ చేర్పులకు మీరు సిద్ధంగా వుండండి.

అలాగే, ‘సారంగ’లో  ప్రచురితమయిన ప్రతి రచన పైనా మీరు కేవలం ప్రశంసలే కాదు, సునిశితమయిన/ అర్థవంతమయిన విమర్శ కూడా చేయండి.

 

రచనలు/ వీడియోలు  పంపే పద్ధతి:

‘సారంగ’ కోసం మీ రచనలు యూనికోడ్ లో టైప్ చేసి editor@saarangabooks.com ఈమెయిలుకు పంపండి.  ఈ మెయిలుకు జోడింపుగా కూడా పంపవచ్చు.

ఆడియో/ వీడియో విభాగానికి కూడా మీరు మీ క్లిప్స్ పంపించవచ్చు. అయితే, వాటి నాణ్యత విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి.

 

మరికొన్ని ముఖ్య గమనికలు:

  • గతంలో ప్రచురించబడిన, లేదా వేరే పత్రికలలో ప్రస్తుతం ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు ప్రచురణకి స్వీకరించబడవు.
  • స్వంత బ్లాగులలోగాని వెబ్ పత్రికలలోగాని ప్రచురించబడిన రచనలు కూడా ప్రచురించబడవు.
  • రచనలు తమ స్వంతమనీ, గతంలో ఎక్కడా ప్రచురించ లేదనీ, వేరే పత్రికల వద్ద పరిశీలనకు లేవనీ రచయితలు హామీ పత్రం ఇవ్వాలి.
  • రచనలను ప్రచురణకు స్వీకరించే విషయంలో తుది నిర్ణయం ‘సారంగ’దే!
  • ‘సారంగ’లో  ప్రచురించబడిన రచనలను రచయితలు  ఒక వారం తర్వాత తమ స్వంత బ్లాగులలోనో, ఫేస్ బుక్ లాంటి చోట  ప్రచురించుకోవచ్చు. అప్పటి వరకూ కేవలం లింక్ మాత్రమే షేర్ చేసుకోండి.
  • ‘సారంగ’లో  ప్రచురించిన రచనలు/వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఆయా రచయితలవే కాని ‘సారంగ’వి కాదు. ఆయా రచనలపై పాఠకులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయాలే కాని అందులో ‘సారంగ’కి ఎటువంటి సంబంధము లేదు.

ఎడిటర్

25 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి మంచి పాత కథలు ప్రతి సంచికలో ఒకటి ప్రచురిస్తే ఈ యువతరానికి ఎంతో మేలు చేస్తుంది . కొన్ని మంచి కథలు ఎంత వెదికినా మాకు దొరకడం లేదు . దయచేసి ఎవరిదగ్గరున్న మీరు సేకరించి మీరు నేటి నూతన రచయితలకు ఔత్సాహితులకు అందించే ప్రయత్నం చేయండి . సారంగంను తిరిగి ప్రారంభించడం హర్షించదగ్గ విషయం . చాల మంచి మంచి శీర్షికలతో మా ముందుకు తీసుకువస్తున్న సారంగా బృందానికి అభినందనలు .పది కాలాపాటూ ఎంతో మంది రచయితలకు పాఠకులకు మార్గదర్శిలాగా నిలుస్తుంది .

    పాపులర్ అనువాద కథలు కూడా అందించండి .మొదటి తరం రచయితలూ ఆంగ్ల సాహిత్యం విరివిగా చదివారు .ఇప్పటి వారు చదవడం లేదు .

  • Dear Editor
    I am Anumula Sreedevi , I have sent 2 Telegu poems for consideration of publication in your Saranga. but I have not sent writer’s authorization letter. Can I send it now.
    please clarify
    thanking you

  • नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം

    ‘ఒక దేశం .. ఒక లిపి’ / ‘జాతీయ సమైక్యత కోసం భారతి లిపి’

    . వివిధ భారతీయ భాషలు వివిధ లిపులతో వ్రాయటము వలన ప్రజల మధ్య కొంత ’దూరం’ ఏర్పడుతున్న సంగతి మీకు తెలుసు. వ్యవహారాలు సులభమయ్యేందుకు ’శాస్త్రీయ పద్ధతిలో ’భారతి లిపి’ (www.bharatiscript.com) రూపకల్పన జరిగినది. ఈ లిపిలో భారతీయ భాషలు వ్రాయటము వలన ప్రయోజనాలు చాలా వున్నవి.

    మచ్చుకు…రైల్వే స్టేషన్ లో నామ ఫలకముపై…మూడు లిపులలో పేరు వ్రాయనవసరము లేదు! తెలుగువారు తమిళనాట బస్సు బోర్డ్ చదవటానికి సమస్య వుండదు (విదేశీయులకు కూడా వ్యవహారం తేలిక!). (సంగణక/) యంత్రములను ఉపయోగించి..భారతి లిపి అక్షరాలు చదవటం సులభము.. అందుకు అనుగుణమైన మొబైల్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చినవి. గూగుల్ మరియు అమెజాన్ ప్లే స్టోర్ల నుండి ఉచితముగా ఆండ్రాయిడ్ ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకొని సులభముగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు (1) ‘bharati transliterator’ ఉపయోగించి ‘ సాధారణ భారతీయ లిపులలో వున్నా అక్షరాలను/ పదాలను/ వాక్యాలను ఒక్క మీట నొక్కి ‘భారతి లిపిలోకి’ మార్చుకోవచ్చు
    (2) bharati keyboard ఉపయోగించి నేరుగా భారతి లిపిలో టైపు చేసుకోవచ్చు …వెంటనే మనకు కావాల్సిన ‘సాధారణ భారతీయ భాషా లిపులలో కూడా ఆయా అక్షరాలు ప్రత్యక్షమౌతాయి (భారతి లిపితోపాటు)

    ఇదివరకేఒక భారతీయ లిపి తెలిసినవారు …సుమారు 20నిమిషాల్లోపే అక్షరమాల/ గుణింతాలు నేర్చుకోగల సౌలభ్యమున్నది…పదాలు కూడా చదువగలరు & వ్రాయగలరు!! పూర్తిగా భారతీయ భాషలకు కొత్తవారు సైతం స్వల్ప వ్యవధిలోనే నేర్చుకోవచ్చు

    ఇప్పటికే కొన్నిచోట్ల అసలిలాంటి లిపి ఒకటి మనదేశానికి అవసరమని గతములో దేశభక్తులెందరోఆలోచన చేసిరి…అందులో గత శతాబ్దములో ‘రామ్ మనోహర్ లోహియా & వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లు ‘ ప్రముఖులు. ప్రస్తుతము ప్రాచుర్యములోకి వస్తున్న భారతి లిపి రూపకర్తలు ఐఐటీ మద్రాస్ ఆచార్య శ్రీనివాస చక్రవర్తి గారు. 21వ శతాబ్ది మొదటి దశకంలో కొత్తగా రూపుదాల్చిన భారతిలిపి క్రమక్రమముగా పలువురికి పరిచయమౌతూ వస్తున్నది… 2018నుండి దీని ఉదృతి పెరిగి దేశములో వివిధప్రాంతాల్లో ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన ఏర్పడినది .. ముఖ్యముగా .. తెలుగునాట. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో /వివిధ ఐఐటీల్లో కూడా దీని గురించి అవగాహన పెరుగుతున్నది… బి. టెక్ / ఎంటెక్ సంబంధిత ‘సాంకేతిక ప్రాజెక్టులు చేసుకునే అవకాశం ఉండటంతో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా దీనిని నేర్చుకుంటున్నారు. ప్రభుత్వపరంగా దీనిని అమలు చేయటానికి ఇంకొంతకాలము పట్టును కానీ ఎవరికి వారు స్వీయ ఆసక్తితో నేర్చుకొని తమతమ జీవితాలలో నేరుగా దీనివలన లబ్ది పొందవచ్చు. ‘కొద్ది మందికే తెలిసినప్పుడు.. ఆ కొద్దిమంది ఈ లిపిని ‘సంకేత సమాచార పంపిణీకి ‘ ఉపయోగించుకోవచ్చు !
    పంచతంత్రము / గీతాంజలి తదితర బహుభాషా పుస్తకాలు భారతి లిపిలో లభ్యమౌతున్నాయిప్పుడు (www.bharatiscript.com నుండి ఉచిత డౌన్లోడ్ కూడా సాధ్యమే) సాంకేతికత సహాయము తీసుకొని వివిధ Apps/ఆటలు/ అభ్యాసాలు/ పోటీలు తయారయ్యాయి/ఔతున్నాయి..ఇది నిరంతర ప్రక్రియ. ఈ బృహత్కార్యములో ఔత్సాహికులు వివిధ రూపాల్లో పాల్గొనవచ్చు… ఆసక్తి వున్నచో bharatiscript@gmail.com ని సంప్రదించవచ్చు.

    ప్రస్తుతమున్న లిపితోపాటు ఇదీ నేర్వగలరు. దేని లాభము దానిదే.

    —-
    భవదీయ
    పింగిళి విక్రమ్ కుమార్
    8500386163(always BSNL)
    ప్లాట్ – 15, గణేశ్ నగర్ కాలనీ, మారేడుపల్లి, సికింద్రాబాద్ -500026, ఆంధ్ర ప్రదేశ్

  • మీ సంచిక ఎప్పుడు వస్తుంది డేట్ తో సహా నాకు పంపించరా ప్లీజ్

    • వేణు గారు: ప్రతి నెలా ఒకటీ, పదిహేను తేదీలు.

  • The Editor,
    Saaranga ..
    Can I send manuscript as donot know Telugu Typing ..
    Kindly inform Sir…
    Sambasivarao Thota

  • సంపాదకులకు,

    మీరు, ఫార్మాటింగు నియమాలలో రాసినవన్నీ బావున్నాయి, ఒకటి తప్ప.

    ⇒ ​Put punctuation marks (. , ? !) inside the closing quotes.
    Example (Wrong): ఆ సినిమా పేరు “పారిజాత”. తన దర్శకత్వంలో “రూపవతి”, “ధర్మదేవత” …
    ​Example (Correct): ఆ సినిమా పేరు “పారిజాత.” తన దర్శకత్వంలో “రూపవతి,” “ధర్మదేవత” …

    పై పాయింటు తప్పని, నేను భావిస్తున్నాను.
    డబుల్ కోట్సులో వున్నది, ఒక పేరు. విరామ చిహ్నం, దానితో కలిసి వుండదు. ఒక లిస్టు రాసినప్పుడు, కామా అనేది, డబుల్ కోట్సులో వుండకూడదు.

    ఇక్కడ, కామా నియమం: Use commas to separate items in a series.
    ఇక్కడ, “రూపవతి”, “ధర్మదేవత” అనేవి items. కామా అనేది, item లో భాగం కాదు.
    కాబట్టి, కామా, డబుల్ కోట్సులో వుండకూడదు.
    “a”, “b”, “c”, and “d”. ==> correct
    “a”, “b”, “c” and “d”. ==> also correct
    “a,” “b,” “c,” and “d.” ==> wrong.

    అలాగే, ఆ సినిమా పేరు “పారిజాత”. ==> అన్న చోట, ‘ఫుల్ స్టాపు’ అనేది వాక్యం చివర వుండాలి గానీ, ఒక ఐటమ్‌లో భాగంగా కాదు. ఇలా రాయడమే, కరెక్టు. ఆ సినిమా పేరు “పారిజాత.” అని రాయడం, తప్పు.

    ప్రశ్నార్ధకమూ, ఆశ్చర్యార్ధకమూ, అనేవి డబుల్ కోట్సులో వుండటం వేరు. అది మీరు కరెక్టుగానే చెప్పారు.
    ఎందుకంటే, అవి, ఆ డబుల్‌ కోట్సులో వున్నా వాక్య ముగింపుని చూపించేవి.
    వాక్యం, డబుల్ కోట్సులో వున్న ఒక ఐటంతో ముగిసినప్పుడు, ఫుల్ స్టాపు అనేది, ఆ ఐటంలో భాగంగా వుండదు. ఫుల్ స్టాపు అనేది వాక్యానికి చివరనే వుండాలి.

    మీరు, ఒక సారి పరిశీలిస్తారని ఆశిస్తాను.

    Please refer to: ENGLISH GRAMMAR and COMPOSITION by John E Warriner.

    ప్రసాద్

  • కొన్ని రచనలు పంపాలి, అయితే యూనికోడ్ గురించి పూర్తి వివరాలు తెలియటం లేదు.

  • సారంగలో ప్రచురించిన కథలకు పారితోషికం ఇస్తారా?

    పి. వి. ఆర్. శివకుమార్

    • ప్రస్తుతానికి లేదు, శివకుమార్ గారూ. ఇది వ్యాపార పత్రిక కాకపోవడం వల్ల సరైన వనరులు లేవు!

  • 🖤నిన్ను చూడాలని ఉంది🖤

    ఈ ప్రపంచం లొనే బెస్ట్ ఫీలింగ్ ఒక్కరిని మిస్ అవుతున్న ఫీలింగ్……….
    నేను తనని మిస్ అయిపోయి 5 ఇయర్స్ అయిపోయింది ఈ 5 ఇయర్స్ లో తాను గుర్తు రాని క్షణమే లేదు…….

    5ఇయర్స్ బాక్

    నా పేరు అర్జున్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ అమ్మ నాన్నలకి దూరంగా హాస్టల్ లో ఉన్న…………..
    నా డిగ్రీ వన్ ఇయర్ అయిపోయింది కానీ నాకు ప్రెండ్స్ లేరు……….నా ప్రపంచం నది నా ప్రపంచం లోకి ఎవరిని రనివ్వను……..నాకు నచ్చారు ఎవరు అందుకేనేమో నాకు ఫ్రండ్స్ ఇప్పటివారు ఎవరు లేరు…….బహుశా
    చూడడానికి బాగుంటనేమో మరి మా క్లాస్ గర్ల్స్ ప్రపోజ్ చేసేవారు…….వారికి ఎం చెప్పాలో కూడా తెలీదు నాకు సైలెంట్ గా వెళ్లి పోయివాడిని……..వీడికి ఆటిట్యూడ్ ఎక్కువ అని నా ముందే తిట్టుకొనే వారు……
    కానీ ఎవరిని ఎప్పుడు ఏమి అనలేదు……….

    రేపు ఫ్రెషెస్ డే……..

    కాలేజ్ ఫ్రెషెస్ డే ఈ రోజు నాకు నచ్చని బ్లాక్ కలర్ షార్ట్ వేసుకున్న ………. బ్లాక్ నాకు నచ్చదు కానీ వేసుకోవడానికి ఏమి లేవు అదే వేస్కోవాల్సివచ్చింది……….ఆ బాడ్ ఫీలింగ్ తోనే కాలేజ్ కి వెళ్లిన……..అక్కడ కూడా పిచ్చ బోర్………బేసిక్ గా నాకు ఎవరు నచ్చారు అదే నా ప్రాబ్లమ్ ……అందుకే అక్కడ ఉండాలి అనిపించలేదు బయటకి వచ్చేసా……….నా ఎదురుగా ఒక్క అమ్మాయి వాస్తు ఉంది కాలేజ్ లోకి……….బ్లాక్ సారీ వేసుకొని……….ఆ అమ్మాయి ని అలా చూస్తూ ఉంది పోయా……….ఎంత అందం గా ఉందొ ఆ అమ్మాయి…….. నాకు నర్చని బ్లాక్ ఆ కలర్ అంత అందం గా ఉంటది అని అమ్మాయి ని చూసాక తెలిసింది…..ఆ అమ్మాయి ని చూస్తుంటే మతి పోతుంది……….టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు…….ఆ రోజు అంత ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్న ఆ అమ్మాయి వెళ్ళిపోయింది …..ఎందుకో మరి చాలా కష్టం గా అనిపించింది……తాను వెళ్లిపోతుంటే ఏంటో మరి ఆ ఫీలింగ్………..నైట్ అంత నిద్దర పట్టలేదు రేపు ఎప్పుడు అవుతుంది అనే ఆలోచనే…….
    కాలేజీ డోర్స్ ఓపెన్ చెయ్యకు ముందే కాలేజ్ లో ఉన్న……..ఆమె కోసం వైట్ చూస్తూ ఉన్న…..ఆమె వచ్చింది ఓహ్ మై గాడ్ ఎంత అందం గా ఉందొ……అసలు ఆ అమ్మాయి……
    1స్ట్ డే ఆమె 1స్ట్ ఇయర్ ఎంపీసీ అని తెలిసున్న కానీ…..ఆమె నేమ్ ఏంటో తెలియలేదు……..

    1మంత్ పట్టింది ఆమె నేమ్ తెలుసుకోవనికి……అదికూడా వల్ల ఫ్రండ్ పిలుతుంటే తెలిసింది ఆమె పేరు పల్లవి అని……….

    తనని చూడం లొనే వన్ ఇయర్ అయిపోయింది ……..ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్………..తనకి నా ఫీలింగ్ చెప్పాలి అనుకున్న……..కానీ ఏదో తెలియని భయం ……… ఎలాగైనా ఆమె కళ్ళలోకి చూస్తూ నా ఫీలింగ్ చెప్పాలి అని ఆమె ని కలవడానికి వెళ్లిన తనని కలవకముందే తెలిసింది…….. తన లైఫ్ లో ఆల్రెడీ ఒక్కరు ఉన్నారు………అని
    అది తెలిసిన వెంటనే ……..ఆ కాలేజ్ లో ఉండాలి అని అనిపించలేదు………..నాకే తెలియకుండా యాడుపు వచ్చేస్తుంది………..ఆగట్లేదు యాడుపు ఎందుకో మరి……….భాద అంటే ఇదే నేమో మరి నాకు తెలీదు ఇప్పటివరకు……….ఆ కాలేజ్ ని ఆ ఊరు ని వదిలి వచ్చేసి……..

    ____________________

    5 ఇయర్స్ అయిపోయింది…….నేను తన ని చూడక………
    తాను ఎలా ఉందో ఎక్కడ ఉందో ఎం చేస్తుందో……….
    తాను తనకి తెలియకుండా నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ పెయిన్
    ఈ 5 ఇయర్స్ లో పెయిన్ తగ్గాలి కానీ ఎందుకు పెరిగిపోతుంది ?……..ట్రూ గా ప్రేమించేసాను కధ అందుకేనేమో ఇంత పెయిన్………..

    ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఏంటి ఇప్పటి వారికు పెయిన్ అని ఇప్పుడు హ్యాపీ అంటున్న……అనుకుంటున్నారా..?

    అవును

    నేను హ్యాపీ తాను నా సొంతం కానందుకు………ఒక్కవేల తాను అప్పుడు నా సొంతం ఐఉంటే ఇప్పుడు తాను నా వల్ల భాద పడవలసి వచ్చేది…………ఎందుకంటే నేను ఇంకా కొన్ని రోజులులే బతికి ఉండేది…………..తాను నా సొంతం అయిఉంటే నేను ఈ 5 ఇయర్స్ పడిన భాద తాను లైఫ్ లాంగ్ పడేది……….

    నేను చివరి సరిగా ఒక్కసారి అయిన తనని చూడగలనా….?

    ఈ రోజు చాలా భయం గా ఉంది పల్లవి నిన్ను చూడలేను ఏమో అని……..

    బాగా మిస్ అయిపోతున్న……. యాడుపొచ్చేస్తుంది…………..పల్లవి ఒక్కసారి కనిపించవా…..ఈ రోజే నా లాస్ట్ డే నాకు అర్థం అయిపోయింది ……….¡¡¡¡¡¡

    (మనం అనుకుంటే జరిగిపోవు కదా…….అందుకే అర్జున్ కోరిక కొరికగానే మిగిలిపోయింది తనను కలవకుండానే చనిపోయాడు…………తన చివరి శ్వాస వరకు తన ప్రేయసిని ప్రేమిస్తూనే చనిపోయాడు

    అర్జున్ ఆమెను సొంతం చేస్కోవడం లో ఫైల్ అయిఉండొచ్చు కానీ…….. ప్రేమించడం లో ఫైల్ అవ్వలేదు అవ్వడు కూడా………ప్రేమ అంటే సొంతం చేసుకోవడం లొనే కాదు…………తాను సొంతం అయిన కాకపోయిన………… ప్రేమించం లొనే అసలైన ప్రేమ ఉంటుంది……….🖤)

    ………………..తేజు✍️

  • Sir/Madam,
    సారంగ లో కధ ప్రచురణ అవటానికి word/ character count కి limit ఏదైనా ఉందా? కొద్దిగా తెలియ చేయ గలరు.

    • word/ character count కి limit లేదు. మీ రచన పంపించండి. అయితే, రెవ్యూ ప్రాసెస్ వల్ల రచన ప్రచురణ కొంచెం ఆలస్యం కావచ్చు.

      • ప్రస్తుతానికి లేదు, పరిమితమైన ఆర్థిక వనరుల వల్ల!

  • Good evening Sir/ Madam
    I have come to know about your magzine through some of my friends. After going through it I am really become a fan to it. I am interested in writing stories in English and telugu also. Got some published in online telugu magzines.
    Is there any specific date to send writings for your condidetstion.
    Please clarify.

  • Dear sir
    I have sent a translation story “A LODESTAR”, from Telugu to English. Would you inform if it is accepted?
    Please…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు