ముస్లిం స్వరాలన్నీ ఒకే గొంతుక అవ్వాలి: నబీ

నిర్లక్ష్యానికి గురై నిస్సహాయంగా కార్చే ప్రతి కన్నీటి చుక్కా అక్షరం అవ్వాలి.

న్నడు లేనంత ఉక్కబోత..దేశంలో ఎప్పుడూ లేనంత వలబోత..ముస్లింల వలబోత.
ఇటీవల దేశంలో ముస్లిం సమాజాన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక పక్కగా జరపడం ఉద్దేశ పూర్వకంగా జరుగుతోంది.జాతీయవాద మితవాదులు మిక్కికిలిగా ప్రబలి ముస్లిం విద్వేష విష బీజాలు దేశం ఎల్లెడలా జల్లుతున్న పరిస్థితి వేగవంతం అవుతోంది.
దేశమంతా చూస్తున్న అనుమానపు చూపులకు సమాధానం చెప్పుకొని, తమ దేశభక్తిని చాటుకోవాల్సిన దుస్థితిలోకి ముస్లిం సమాజం జారిపోయింది.
వైరస్ వ్యాప్తికి కూడా మతం అంటగట్టి మర్కజ్ వైపు చూపుడు వేళ్లు ఎక్కుపెట్టి ..ముస్లిం సమాజాన్ని ఒంటరి సమూహం చేసి, వారి ఉనికిని ‘రెడ్ జోన్’ చేసి, ఎవరూ పట్టించుకోని క్వారంటైన్ లో పడేసే ఈ ఇరుకు కాలంలో– ఈ కాలచక్రాల కింద నలుగుతూ.. పెనుగులాడుతూ..సాటి మానవుడి ‘అలాయి బలాయి’ కోసం, అజా చేస్తున్న అతి మామూలు ముసల్మాను ఆక్రోశ అంతరంగం ఏమిటి..? అతడు పంటి కింద భరిస్తున్న నొప్పి ఏమిటి?ఈ వేదన ముస్లింలందరదా..?
తెలుసుకుందాం  మన కాలపు ముస్లిం వాద స్వరం నబీ కరీం ఖాన్ నుంచి!

మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మీ కుటుంబంలో సాహిత్యం ఒంటపట్టిన వాళ్లు ఎవరైనా వున్నారా?

మాది కమ్యూనిస్టు కుటుంబం  చిన్నతనం నుంచి ఉద్యమగీతాలు వినటానికి మించి మా కుటుంబంలో ఎవరికి సాహిత్యం లొ ప్రవేశం లేదు..
కమ్యూనిస్టు సాహిత్యం ఎక్కువగా అందుబాటులో వుండేది మా ఇంట్లో.

మీ అసలు పేరు కరీముల్లా ఖాన్ కదా..మరి నబి.కె.ఖాన్ పేరు మీద ఎందుకు రాస్తున్నారు..?

   మా పెద్దన్నయ్య నబీఖాన్  కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఒంగోలు నగరంలో నిర్మాణం లొ కీలకమైన పాత్రపాత్ర పోషించారు, తనకోసమో తన కుటుంబంం కోసమో కాక సమాజం కోసం బతికిన మనిషి ఎంత సంపాదించినా కుటుంబ అవసరాలకు కొద్దిగా ఉంచి సింహభాగం నిరుపేదలకు పంచే నిఖార్సయిన కమ్యూనిస్టు అతను మాకు ప్రతి అడుగులలొను భాద్యతగా బతకడం ఎలానో నేర్పిన   మా పెద్దన్నయ్య  ఇప్పుడు లేరు అనారోగ్యం తో 90 లొనె మరణించారు ఆయన పంచిన మంచి ఎప్పటికీ బతికుండాలని నా కలం పేరు నబి కరీమ్ ఖాన్ గా మార్చుకున్నాను,నిజానికి నాపేరు కరిముల్లా ఖాన్ మా ఊర్లో అంతా కరిముల్లా ఖాన్ అనే పిలుస్తారు…

నిషిద్దాక్షరాలు..ఒక వేకువ కోసం కవితా సంపుటాల తర్వాత మీ కవిత్వం ఎందుకు ప్రకటించలేదు..?

నిషిద్దాక్షరాలు “రఫీ” అనే మిత్రుడితొ కలిసి 2003లొ తెచ్చాము,వేకువకోసం  పదహారు పేజీల పుస్తకం ఒక దీర్ఘకవిత మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పట్లొ  మూడేళ్ల క్రితం ఒంగోలు లొ జరిగిన “బాబ్రీ విధ్వాంసానంతర ముస్లిం సాహిత్యం” సదస్సు సందర్భంగా  “ధోకా” దీర్ఘ కవిత తీసుకొద్దామని ప్రయత్నం చేసాను సమయం లేక అది సాద్యపడలేదు, ఇప్పుడు “గవాహ్” పేరుతో ఒక సంకలనం తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నాను  ‘ధోకా’కవిత కూడా ఇందులో ఉంటుంది. ఈ సంకలనం ద్వారా ఈ దేశానికి ముస్లింల పక్షాన “సాక్ష్యం” చేప్పాలనుకుంటున్న.

చెప్పాలంటే ఒంగోలులో దాదాపు ఒంటరి గొంతుకతో ముస్లిమ్ బతుకుల్ని ఎలుగెత్తుతున్నారు..ఈ సందర్భంలో మీ అనుభవాలు

బాబ్రీ విద్వాంసాలను,గుజరాత్ ఊచకోతలను, ఆసిఫా… ఆయేషా అత్యాచారాలను.హత్యలను, అఖ్లాక్.పెహ్లుఖాన్,తెబ్రెజ్ అన్సారీ లపై మూకహత్యలను……
జె యన్ యూ విద్యార్థి నజీబ్ అదృశ్యాన్ని….చెప్పుకుంటూపోతే, నిడలా వెంటాడే అనుమానాలను,అవమానాలను పంటిబిగువున దాచుకున్న దుఃఖాన్ని మాత్రమే నేను రాసుకుంటున్నా. కవిత్వం అయినా కథయినా అది నా దుఃఖ్ఖం నుంచి వచ్చేదె.

ముస్లిం బతుకులు అంటేనే చాలా కఠినమైన వాతావరణం ఎందుకంటే పేదరికం, స్థోమత లేక చదువుకు దూరమై ఏదో కార్ఖానాలొ కూలీలుగా చితిపోయే జీవతాలే కనబడతాయి ఇలాంటి సందర్భంలో స్వీయసమాజపు గాథల్ని మనం బయటి ప్రపంచానికి చెప్పాలి, ఈ బాదల్లొ కొన్ని కన్నీల్లయినా సాహిత్యంలో రికార్డు కావాలని నా భావన.    నిజానికి  ఇక్కడ బహుజన సాహితీ మిత్రుల సహకారం చాలగొప్పది ముఖ్యంగా నూకతోటి రవికుమార్,పెద్దలు మల్లవరపు రాజేశ్వరరావు మాస్టరు(ఈ మద్యే మానుంచి దూరమయ్యారు), ఒకప్పుడు     ఇస్లాంపేటలొ నాతో తిరుగాడిన మా  నరేష్కుమార్ సూఫీ, కవిమిత్రడు సయ్యద్ ఫిరోజ్, మంచికంటి,శ్రీనివాస్ గౌడ్ సహకారం, మా జిల్లావాసి తనగొంతుకను బలంగా ముస్లిల వెతల్ని వినిపిస్తున్న కవి రసూల్‌ ఖాన్‌ కూడా ఉండటంతో నేనెప్పుడూ ఒంటరితనం అనిపించలేదు

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇ్లస్లామోఫోబియాని మీరెట్లా చూస్తున్నారు..?

  మతం పేరుతో మనుషులను వేరుచేసే కుట్ర ఈ ఇస్లామోఫోబియా మిగతా సమాజం నుండి ముస్లింలను ఒంటరి చేయడానికి జరుగుతున్న ప్రయత్నం లొ భాగమే ఇస్లాం అంటే అదేదో అతివాదమని ఇస్లాం టెర్రరిజం సృష్టింసుందని మెజారిటీ సామాజిక వర్గాలను ఏకంచేసి మైనారిటీ సామాజిక వర్గాలమీదకు ఉసిగొల్పటానికి జరుగుతున్న ప్రయత్నం నుంచి వచ్చిందే ఇస్లామోఫోబియా..

కరోనా నేపథ్యంలో దేశంలో చాలా చోట్ల ముస్లింలు డాక్టర్ల మీద..పోలీసుల మీద తిరగబడ్డారని వీడియోలు వైరల్ అయ్యాయి. ముస్లిం ఆలోచనాపరులు చాలా మంది దీన్ని ఖండించారు కూడా..దీనిపై మీరేమంటారు?

     ఇది కష్టకాలం ఈ కష్టకాలంలో  డాక్టర్ లు శానిటేషన్ కార్మికులు , ఆశా వర్కర్లు,పోలీసులు పడుతున్న కష్టం ఎవరూ కాదనలేనిది అందులో డాక్టర్ లు కరోనా రోగికి అతి సమీపంనుంచి వైద్యం అందించడమంటే తమ‌ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే ఈ సందర్భంలో డాక్టర్ల మీద దాడిని తీవ్రంగా ఖండించాలి అంతేకాదు దాడికి పాల్పడిన వారిమీద ఖటినంగా చర్యలు తీసుకోవాలి.

    అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి కరోనా కు మతం రంగు పులిమిన సమాజం లొ మనం జీవిస్తున్నాము, ఒక ముస్లిం వ్యక్తి బజారుకు వెళ్ళి ఏదైనా వస్తువు కొనాలంటేనే కరోనా కారకుడని ఛీత్కరాలకు గురవుతున్నారు ,అనేక హాస్పిటల్స్ కూడా ముస్లింలను వైద్యం చేయడానికి నిరాకరిస్తున్న పరిస్థితులను చూస్తున్నాం, ఇంతవరకూ టెస్ట్ లు స్కాన్ లరూపంలొ వేలరూపాయలు గుంజి ఇప్పుడు కష్టకాలంలో పురుడుపోయటాని ముస్లిం మహిళలకు నిరాకరిస్తున్న సందర్భం,కాలూ చేయి విరిగినా అత్యవసర వైద్య సహాయం అందించాలన్నా ముస్లింలనే నెపంతో తిరస్కరిస్తున్న అమానుషల గురించీ సమాజం ఎందుకు విస్మరిస్తుందో  తెలియడంలేదు ఇలా వైద్యమందక పోయిన ప్రాణాలు ఇక్కడ వున్నాయి, తమకు అత్యవసరవైద్యం అందించడానికి చాలా మంది వైద్యులు నిరాకరిస్తున్నారని అధికారుముందు కన్నీరుమున్నీరయిన ఉదాంతాలకు నేను నా నిస్సహాయతా ప్రత్యేక సాక్షి…

అలాగని నేను ఎట్టి పరిస్తితిలోను డాక్టర్ల మీద దాడి ని సమర్దించను విద్యావంతులైన డాక్టర్ లు మతం ప్రాతిపదికన చూడొద్దని రెండు చేతులెత్తి అర్దిస్తున్నాను.

తబ్లీజ్ విషయంలో ముస్లిం సమాజం వివక్షకు గురయిందని మీరు భావిస్తున్నారా..? మత విషయంలో ముస్లింలు ఛాందసంగా వుండటం వల్లే ఈ పరిస్థితి అని కొందరు చేస్తున్న ప్రచారం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?

ఈ విషయంలో చాందసం ఎక్కడా కనిపించడం లేదు తబ్లిగ్ జమాత్ గత డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్న రెగ్యులర్ కార్యక్రమాలలో భాగమే అక్కడ జరిగిన ఇస్తెమా.. ఈ ధార్మిక సమావేశం తాలూకా పూర్తి సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వుంది ఆ మాటకొస్తే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఒక అధికారి,రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుండి ఒక అధికారి కేవలం మర్కజ్ కార్యక్రమాల మీద  పర్యవేక్షణ కొసమే ఉన్నారు మర్కజ్ లొ ఏ ఏ ఆహార పదార్థాలు ఎంత మందికి వండుతున్నారో ,ఎవరెవరు ఎక్కడనుంచి వస్తున్నారో ఎక్కడికి వెలుతున్నారొ , ఎన్నిరోజులు ఉంటున్నారో పూర్తి సమాచారం వారి వారి ఆధార్ నంబర్ లు ,పోన్ నంబర్లు ,విదేశీయ అన్ని వివరాలు సేకరించడమే వారిపని ఇంతకాలం  ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఇస్తూనే వారు కార్యక్రమాలు నిర్వహించారు,నిజాముద్దీన్ పోలీస్ స్టేషను సైతం ఆ బిల్డింగ్ కి ఆనుకొని ఉందన్న విషయం కూడా మనకు తెలుస్తుంది ఒక సంవత్సరం కాలం షెడ్యూల్ పోలీసులకు ముందుగా అందచేస్తారని కూడా తెలిసింది ఈ సమావేశం తారీఖ సైతం ఏడాదికింద నిర్ణయమై ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉన్న విషయాన్ని ప్రభుత్వం దాచి కేవలం తబ్లిగీ జమాత్ వలన కరోనా విస్తరిస్తుందని ప్రచారం చేయటం , దీన్ని మీడియా పేరుతో కొన్ని దళారి సంస్థలు అదే పనిగా ప్రచారం చేయడమే ఇంతటి వివక్ష కారణం. నిజానికి తబ్లిగ్ జమాత్ వారికి సామజిక విషయాలు అవగాహన లోపం  , ముస్లింల మీద విషం కక్కే మీడియా, దీన్ని అదునుగా తీసుకుని అల్లుకునే కుట్రలకు ధీటైన సమాధానం చెప్పలేకపోవడంలొ కూడా దేవుడు చూసుకుంటాడు అనే ధోరణి లేకపోలేదు.

ప్రస్తుత పరిస్థితులలో  ముస్లిం రచయితలు ఏం చేయాలని మీరు భావిస్తున్నారు?

సామాజిక హక్కుల ఉద్యమ నిర్మాణం లొ అయినా సాహిత్యం పెద్ద పాత్ర పోషిస్తుంది. అయితే  ఉద్యమ నిర్మాణానికి కావలసిన సాహిత్యం వస్తుంది కానీ   ప్రయత్నం ముస్లిం సామాజిక ఉద్యమాలలో సాహిత్య ప్రభావం పెద్దగా కనబడటం లేదు. అసలు దీర్ఘకాలిక ఉద్యమాలే నిర్మాణం కాని మన తెలుగు రాష్ట్రాలలో  ముస్లిం సాహితీకారులు చొరవతీసుకొవాల్సిన అవసరం కూడా ఉంది, కవులు రచయితలు క్షేత్రస్థాయిలోకి రావాలి చాలా బాగా రాస్తున్నారు ఇంకా రాయాలి, పుస్తకాలూ రావాలి నిర్లక్ష్యానికి గురై నిస్సహాయంగా కార్చే ప్రతి కన్నీటి చుక్కా అక్షరం అవ్వాలి, ఈ దేశం కొసం ఇంకిన ప్రతి నెత్తుటి బొట్టూ చరిత్ర కావాలి,  నూటికి ఎనభైమంది శ్రామికులుగా చేస్తున్న కష్టం రికార్డు కావాలి అలాంటి ప్రయత్నం అనేక మంది చేస్తున్నారు , చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అవి పెద్దగా ముస్లిం సాహిత్యం మీద ప్రభావం చూపదు అదృష్టం ఏమిటంటే తెలుగు ముస్లిం సాహిత్యం నిరంతరాయంగా వస్తుంది ,ముస్లిం సాహిత్యం లొ పెద్దగా భిన్నాభిప్రాయాలు లేకపోవడం గొప్ప విషయం.

    ఒక రచయితగా  మీ ప్రణాళికలు ఏమిటి?
మైనారిటీ సమూహపు  అభద్ర   బతుకుల్లొ ఎప్పుడు ఏదో ఒక వెంటాడే సమస్య పుట్టుకొస్తూనే  ఉంటాయి , కొన్ని సార్లు దేశభక్తి ని నిరూపించుకొమని,ఇంకొన్ని సార్లు పౌరసత్వం నిరూపించుకోమని …

పెరిగే గడ్డాం మీద
వేసుకున్న పైజామా మీద అనుమానంగా డేగ కళ్ల నిఘాలో …
తినే తిండిమీద  ,
అల్లాహ్ హు అక్బర్ అజా మీద ఆంక్షలు
జీవితం నిండా వెంటాడాన్ని అనుభవించడం సాధారణమైపోయి అవమానాలకు అలవాటపడిపోయిన ముసల్మాన్ మొహల్లాల్లొని బతుకులను  కథలుగా రాయాలని  ఇస్లాంపేట కథలు రాసే ప్రయత్నం చేస్తున్నాను, అలాగే ” గవాహ్” కవిత్వం ఈ ఏడాదే తీసుకుని రావాలనుకుంటున్న.  రాయడం ఒకటే కాదు మనం రాసింది ఎవరికోసమో వారి చేత చదివించాలని ప్రయత్నం,  హక్కుల కొసం ప్రశ్నించగల కొన్ని గొంతుకలతో నిరంతరం కలిసి ఉద్యమిస్తూనే వుండాలన్నది నా ఆకాంక్ష

*

శ్రీనివాస్ గౌడ్

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • నబీ కరీం ఖాన్ గారు గొప్ప కవి
  సహృదయులు.
  He is a true poet.
  కష్టం, కన్నీళ్ళ నుండి ఉబికిన కవిత్వం ఆయనది.
  ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు ఈ interview dwara తెలిసాయి. “సారంగ ” కి ధన్యవాదాలు
  🙏🌷👌

 • ప్రతి కన్నీటి చుక్క అక్షరం కావాలి, ప్రతి నెత్తుటి బొట్టు చరిత్రకావాలి అంటూ మీ ఆవేదనను అక్షరీకరించారు. ముస్లింల మనసులో దాగున్న భయాలను, అవమానాలను కళ్లముందు ఉంచారు. శ్రీనివాస్ గౌడ్ గారికి, నబీ కె ఖాన్ గారికి అభినందనలు. … పుట్టా శ్రీనివాస్

 • ప్రతి అక్షరం లో ముస్లిం జీవితాలలో ఎదుర్కొంటున్న అభద్రతా భావం,అవమానాలు
  మానసిక సంఘర్షణకు రూపంగా నభిఖాన్ గారి కవితా వస్తువు గా కనిపిస్తాయి.
  కరోనా సమయం లో ముస్లిములను ఒక అంటరాని భావం చదువుకున్న వారే దీనిని ఎక్కు వగా ప్రచారం చేయటం చాలా షాక్ కు గురి చేసింది . ప్రత్యేకించి డాక్టర్లు ముస్లిం రోగులను చూడటానికి నిరాకరించిన సందర్భం మా ఉర్లో కూడా జరిగింది. కానీ వీరందరి కి వాస్తవాలు తెలుసు.
  ముస్లింలకు అండగా అంబేద్కర్ వాదులు, వామ పక్ష మరియు సెక్యులర్ భావాలున్న ఎంతో మంది అండగా నిలిచే మీడియా దుష్ప్రచారాన్ని ఖండిచారు.
  ఒకపక్క కరోనా. మరో పక్క వలస కార్మికుల రక్తపు మడుగులో రహదారుల వెంట ప్రయాణ బాధలు మనసున్న ప్రతి మనిషిని కన్నీరు పెట్టిస్తే
  మరో పక్క NRC CAA లకు మద్దతు ఇచ్చిన ఢిల్లీ విద్యార్థులను అరెస్ట్ చేయటం కూడా ముస్లిము ప్రజలకు అండగా నిలిచే వారిని భయపెడుతున్నారు.
  అఫ్సర్ అన్న గారికి శ్రీనివాస్ గౌడ్ గారి ధన్యవాదాలు.

 • అట్టడుగు స్థాయి- గ్రౌండ్ లో పని చేసుకునే- ముస్లిం పాత్రే ముందుకొచ్చి తన వెతనంతా వలబోసినట్లు నబీ కరీమ్ ఖాన్ దిల్ నుంచి మాట్లాడారు.
  ముఖ్యం గా సారంగ పాఠకులకు ముస్లింల, ముస్లిం రచయితల పెయిన్ ని అందించగలిగారు. 
  ఇంటర్వ్యూ బాగుంది శ్రీనివాస్ గౌడ్ భాయ్! మంచి ప్రశ్నలు వేశారు. ముస్లింవాద సాహిత్యం కోణం నుంచి ఒకటో రెండో ప్రశ్నలుంటే మరింత బాగుండేది.

 • మంచి ఇంటర్వ్యూ అన్నా. కథామినార్ లో నబి కె ఖాన్ మంచి కథ రాశారు. ఇస్లాం పేట కథలు కొత్త తలుపులు తెరుస్తాయని అనిపిస్తోంది.

 • నబీ కె.ఖాన్ ఇంటర్వ్యూ చాలా సంక్షిప్తంగా నైనా మతవాదుల విద్వేష ప్రచారానికి మితవాదుల మౌన సహకారాన్ని, తద్వారా పక్కకు నెట్టబడిన ముస్లిం సమాజ సహజమైన, న్యాయమైన అస్తిత్వ ఆకాంక్షలకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా స్పష్టం చేశారు.

  ముస్లిం సమాజం కలిసి పనిచేయాల్సిన సమూహాన్ని కూడా వాచకంగా కాకుండా ఆచరణాత్మక సహజీవన, సమిష్టి సహకార స్ఫూర్తిని అంతర్లీనంగా అందించారు.

  ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న మెజారిటీ మత దౌష్టాన్ని, సమాజం అసంకల్పిత దుష్టత్వాన్ని సరియైన దృక్పథంతో మాట్లాడారు.

 • నబిగారి సాహిత్య నేపధ్యం గురించి సరిగ్గా తెలీదు. గౌడ్ మంచి ప్రశ్నలు అడిగారు. కరోనా కాలంలో విషం చిమ్ముతున్న హిందూత్వ ఫాసిజం దాడికి గురైన ముస్లిముల పెయిన్ ను నబి కవిత్వం వ్యక్తీకరిస్తోంది. అట్లాగే ముస్లిం సమాజానికి చెందిన ఆలోచనా పరుడిగా , కవిగా తాను ఏంచేయవాల్సింది చాలా స్పష్టత కనిపించింది నబి గారి మాటల్లో

 • నబిగారి సాహిత్య నేపధ్యం గురించి సరిగ్గా తెలీదు. గౌడ్ మంచి ప్రశ్నలు అడిగారు. కరోనా కాలంలో విషం చిమ్ముతున్న హిందూత్వ ఫాసిజం దాడికి గురైన ముస్లిముల పెయిన్ ను నబి కవిత్వం వ్యక్తీకరిస్తోంది. అట్లాగే ముస్లిం సమాజానికి చెందిన ఆలోచనా పరుడిగా , కవిగా తాను ఏంచేయవాల్సింది అనేదాంట్లో స్పష్టత కనిపించింది నబి గారి మాటల్లో

 • ఇప్పుడు ఉన్న గడ్డు పరిస్థితులలో అస్తిత్వ వాద రచయితలు అంతా అలవర్చుకోవాల్సిన ఒక మంచి లక్షణం ఈ ఇంటర్వ్యూ విశదం చేస్తుంది.
  ఇద్దరికీ అభినందనలు,
  తమ్ముడు నబిఖాన్ ఇంటర్వ్యూ వేసినందుకు సారంగ నిర్వాహకులకి కృతజ్ఞతలు.

 • నిస్సందేహముగా సత్సాహిత్యం సమాజంలోని పలు రుగ్మతలను నిర్మూలించింది, యికపై నిర్మూలిస్తుంది కూడా. కానీ నేటికీ 30% కంటే ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు, వీరికి సాహిత్య ఫలాలు అందే మార్గం లేదు. లక్ష్యం దెబ్బతినడానికి యిది ప్రధానకారణం.
  అందువలన సమాజహితం ఆశించే సాహిత్యకారులు దీనిని తక్షణావసరంగా గుర్తించాలి.

 • god inneview sir

  ఏ సామాజిక హక్కుల ఉద్యమ నిర్మాణం లొ అయినా సాహిత్యం పెద్ద పాత్ర పోషిస్తుంది. అయితే ఉద్యమ నిర్మాణానికి కావలసిన సాహిత్యం వస్తుంది కానీ ప్రయత్నం ముస్లిం సామాజిక ఉద్యమాలలో సాహిత్య ప్రభావం పెద్దగా కనబడటం లేదు. అసలు దీర్ఘకాలిక ఉద్యమాలే నిర్మాణం కాని మన తెలుగు రాష్ట్రాలలో ముస్లిం సాహితీకారులు చొరవతీసుకొవాల్సిన అవసరం కూడా ఉంది, కవులు రచయితలు క్షేత్రస్థాయిలోకి రావాలి చాలా బాగా రాస్తున్నారు ఇంకా రాయాలి, పుస్తకాలూ రావాలి నిర్లక్ష్యానికి గురై నిస్సహాయంగా కార్చే ప్రతి కన్నీటి చుక్కా అక్షరం అవ్వాలి, ఈ దేశం కొసం ఇంకిన ప్రతి నెత్తుటి బొట్టూ చరిత్ర కావాలి, నూటికి ఎనభైమంది శ్రామికులుగా చేస్తున్న కష్టం రికార్డు కావాలి అలాంటి ప్రయత్నం అనేక మంది చేస్తున్నారు , చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అవి పెద్దగా ముస్లిం సాహిత్యం మీద ప్రభావం చూపదు అదృష్టం ఏమిటంటే తెలుగు ముస్లిం సాహిత్యం నిరంతరాయంగా వస్తుంది ,ముస్లిం సాహిత్యం లొ పెద్దగా భిన్నాభిప్రాయాలు లేకపోవడం గొప్ప విషయం.

 • చాలా విలువైన ఇంటర్వ్యూ.
  ఇస్లాంపేట కథలు చాలా చాలా లోతుల్ని తడుముతాయి. ఆ కథల కోసం ఎదురుచూస్తున్నాను. శ్రీనివాస్ గౌడ్ అన్నా.. మంచి ప్రశ్నలు వేశారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు