ముస్లిం వాదం కేవలం ముస్లింలది కాదు: అఫ్సర్

ముస్లింల స్వరం వినాల్సిన సందర్భం ఇది.

హైదరాబాద్ లో ‘సాహిల్ వస్తాడు – మరికొన్ని కథలు’ ఆవిష్కరణకు కొన్ని గంటల ముందు ఆ కథల నేపథ్యం గురించి లోతుల గురించి రచయిత అఫ్సర్ మాతో పంచుకున్నారు. సమకాలీన ముస్లిం సామాజిక రాజకీయ అస్తిత్వ వేదనని, పరాయీకరణ మూలాల్ని అర్థం చేసుకోడానికి అవసరమైన పరికరాల్ని సమకూర్చుకోడానికి దోహదం చేసే సైద్ధాంతిక ఆలోచనలెన్నో అఫ్సర్ తో చేసిన ఈ ముఖాముఖిలో ప్రస్తావనకు వచ్చాయి.

జాతీయంగా అంతర్జాతీయంగా తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన ముస్లిం సమాజపు సగటు పౌరుడు యెదుర్కొంటున్న హింస మూలాల గురించి సాహిల్ వస్తాడు కథలు ప్రతీకాత్మకంగా చర్చించాయి. ఆ కథల్లోని పాత్రల అనేక ముఖాల గురించి భిన్న పార్శ్వాల గురించి  ముచ్చటించే అవకాశం కల్పించి తానూ స్వయంగా భాగం వహించిన సాహిల్ వస్తాడు పుస్తక ప్రచురణ కర్త ‘ఛాయా’ కృష్ణ మోహన్ బాబు కు కృతజ్ఞతలు.

 ఎ. కె. ప్రభాకర్

ఏ.కె. ప్రభాకర్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఆద్యంతమూ చాలా ఆసక్తిగా నడిచింది. మొదట్లో సౌండ్ క్వాలిటీ కొంచం అసౌకర్యంగా అనిపించినా త్వరగానే చెవులు అలవాటుపడ్డాయి.
  అఫ్సర్ గారిని మరింత తనను తాను విప్పుకునే అవకాశం ఇచ్చివుండాల్సిందేమొ.
  ఎలాగైనా ఈ ఇంటర్వ్యూలు సాహిల్ ఎప్పుడు వస్తాడా అని మరింత ఎదురు చూసేలా చేశాయి.

  • నిజమే, మేం మధ్యలో ఎక్కువగా చొరబడ్డాం. అంతా విన్నాకా అఫ్సర్ తోనే మరింతగా మాట్లాడిస్తే బాగుండేది అని నాకూ అనిపించింది.

 • Afsarji. ఇంటర్వ్యూ, బాగుంది, పరోక్షo, గా, వారిని, చూసిన అనుభూతి. కలిగింది. మోహన్ sir. మీకు అభివందనాలు !

 • అఫ్సర్,
  “సాహిల్ వస్తాడు” ఆవిష్కరణ సందర్భంగా ఏ.కె. ప్రభాకర్, కృష్ణమోహన్ బాబు గార్లతో పాటు మీరు పాల్గొన్న చర్చ సాంతం ఆసక్తిగా సాగింది . సమకాలీన సామాజిక రాజకీయ అస్తిత్వ వేదన, పరాయీకరణ మూలాలను మీ ముగ్గురూ కూలంకషంగా మాట్లాడుకోవడం మాలో పలు ప్రశ్నలు రేకెత్తించాయి.
  అన్నట్టు .. మీరు ఆ మూడు కథలూ రాసేయండి త్వరగా 🙂

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు