ముఖాముఖి

సంవత్సరం దాకా వొకే కప్పుకింద బతికినా ఆమెను గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. యిప్పుడీ యింటర్వ్యూ అయిపోయాక గూడా ఆమె గురించి నేను తెలుసుకున్నది యెక్కువేమీ గాదని అర్దమైపొయ్యింది. మొగుడూ పెళ్లాలే రెండు చీకటి గుహల్లా బతుకుతారంది గదా! యీ మధ్యలో సెటయిర్లు పదునెక్కి నట్టున్నాయి.

దిలోకి వస్తున్న మనిషిని చూడగానే వులిక్కిపడ్డాను. అతనూ లోనికొస్తూనే నన్ను చూసి కంగారుపడి వెనక్కో రెండడుగులేశాడు. ముఖం చాటుచేసుకోవడం కోసం చూపుల్ని పక్కకు తిప్పాను. వెయిటింగ్రూం గోడపైన బూజు వేలాడుతున్న గోడగడియారంలో ముండ్లు రెండూ అయిదుపైన కలుస్తున్నాయి. ‘లేటుగా వచ్చే వాటు మారినట్టు లేదుఅనిపించింది వెంటనే.

బ్లూ రు జీన్సు పాంటుపైన రోజూ రంగు మందారిన్కార్చొక్కాముఖంపైన లైట్మేకప్పుకెమెరా ముందుకు రావడానికి రెడీ అయివచ్చినట్టు తెలిసిపోతోందివెంట్రుకలు  చబడ్డాయి. మీసాలు జుట్టూ కొత్తగా వేసిన డైతో తుమ్మెద రెక్కల్లా నిగనిగలాడుతున్నాయి. కళ్ల కిందికి చారలొచ్చాయి. వుక్కుతో చేసినట్టు బింకంగా వున్న పెదాలు ..

అతను పనేదో వున్నట్టుగా చరచరా బయటికెళ్లిపోయాడు. యివ్వాళ నన్ను యింటర్వ్యూ చేయబోయే యాంకరుగా యితనిక్కడ యిలా తారసపడతాడని నేను కలలో  కూడా అనుకోలేదు.  

సరిగ్గా వారం క్రితం యాక్సిడెంటల్గా ఆకు చంద్రప్రకాష్ఆటోస్టాండులో కనబడి, నా కోసమే వెతుకుతున్నాననడంతో యీ యింటర్వ్యూ తతంగం షురూ అయ్యింది. మనిషెప్పుడు నిజం చెప్తాడో, యెప్పుడు కోతలు కోస్తాడో చెప్పలేం. తానిప్పుడేదో టీవీ చానల్ప్రోగ్రాం డైరెక్టరుగా వున్నానన్నాడు. తానా చానల్ని వొక సంవత్సరంలో నెంబర్వన్చానల్గా డెవలప్చేసేశానన్నాడు. తాను డైరక్టు చేయబోయే సినిమా స్క్రిప్టు రెడీ అయిపోయిందనీ, వేరే సినిమాలో తగులుకున్న ప్రొడ్యూసరు యింకో సిక్సు మంత్స్వెయిట్చెయ్యమని బంగపోతున్నాడనీ, యీ ఆరు నెల్లో యీ చానల్యింకా పైకి లేపేస్తాననీ అన్నాడు.

‘‘నీలాంటి అప్కమింగ్ఆర్టిస్టు కోసంచెప్పాని వుందిఅనే ప్రోగ్రాం డిజైన్చేశాను. ఫ్రాంక్లీ స్పీకింగ్అనేది టాగ్లైన్‌. యిప్పటికి యెనిమిదయ్యాయి. ట్రెమండస్ఫాన్పాలోయింగ్‌. యూ ట్యూబ్లో రికార్డు బ్రేకింగ్లైక్స్‌… యింటర్వ్యూ కొచ్చిన వాళ్లంతా వోవర్నైట్లో సెలెబ్రెటీయిపోతున్నారు. … సిక్సు తౌజండ్పేమెంట్వెడ్నస్డే ఫోర్వోక్లాక్షూటింగ్‌… యిదీ అడ్రస్సు’’ అంటూ విజిటింగ్కార్డు యిచ్చాడు.

సిక్స్తౌజండ్స్‌… నెరెంటుతక్కువ పేమెంటేంగాదు ఛానల్పేరు నేనంతవరకూ విననైనా లేదు. అయినా డబ్బు అవసరం. అడ్రస్సు వెతుక్కుంటూ యిక్కడికొచ్చేసరికి గంట ఫోర్తర్టీ అయింది.

ముందు గదిలో ఛానల్లోగో ముందున్న కౌంటర్లో ప్రెంచిగడ్డం ల్లటి లావాటి మనిషి, టైట్టీషర్టు తొడుక్కున్న వాడు, చంద్రప్రకాష్యిచ్చిన విజిటింగ్కార్డు నిర్లక్ష్యంగా తీసుకుని ‘‘హావ్యువర్మేకప్‌… యాంకర్విల్బికమింగ్‌’’ అన్నాడు. మసకబారిన మిర్రర్ముందు కూర్చుని రోజ్పవుడరద్దుకుని బయటపడ్డాను. గంటపైగా వెయిట్చేశాక యిలా అనూప్కుమార్యాంకరు అవతారంలో పూడిపడ్డాడు. చూసీ చూడగానే పారిపోయాడు.యెంత ఘోరం! వొక నాటి పరిచయమా? దగ్గరదగ్గర సంవత్సరం…. వొకే హవుస్లో వొకే రూఫ్కింద, ఆల్మోస్ట్మారీడ్కపుల్లాగాదానికి లివింగ్టు గెదరని రెస్పెక్టబుల్నేమ్‌… అది మాకిద్దరికీ మాత్రమే తెల్సిన రహస్యం.

యేదో సినిమాలో రోల్కోసం వెళ్లినప్పుడు అనూప్ను మొదటిసారిగా చూశాను. వొక ఆర్టిస్టూ, వొక డైరక్టరూ నువ్వెంతంటే నువ్వెంతని కొట్టుకోబోతూ సీన్క్రియేట్చేశారు. వాళ్ళిద్దర్నీ బవంతంగా దూరంగా లాగారు. బస్టాండులో బస్సు కోసం వెయిట్చేస్తుంటే ఆర్టిస్టు అక్కడికొచ్చాడు. నన్ను గుర్తుపట్టి నవ్వి ‘‘ డైరెక్టరుగాడ్ని మార్చేస్తారని నాకు తెలిసింది. రాబోయే వాడు మా ఫ్రెండే!’’ అన్నాడు బింకంగా.

‘‘మీ ఫ్రెండుతో చెప్పి నాకూ రోలిప్పించండి’’ అని అడిగాను.

‘‘మీ నెంబరివ్వండి’’ అన్నాడతను.

అక్కడతో మొదయ్యింది మా పరిచయం. ఫోన్లూ, కబుర్లూ.హైద్రాబాదు వొంటరితనంలో మాట్లాడుకోడానికో మనిషి. లంచ్ లూ, డిన్నర్లూ, పార్కుల్లో వడాలూ . అతనుంటున్న వన్బెడ్రూం అపార్ట్మెంటుకెళ్ళినప్పుడు వర్కింగ్వుమెన్స్హాస్టల్లో యిబ్బందుల్ని నెమరేయడాలూ అతడింటి కిచెన్ను కూడా బెడ్రూంగా మారిస్తే యిద్దరూ అక్కడే వుండొచ్చునని మాట వరసకనుకోవడంతీరా అదే గత్యంతరంగావడంఅంతా సినిమాల్లో చకచకా జరిగపోయే సంఘటనల్లా తిరిగిపోవడం.

యిద్దరికీ రెండు కీలుయెవరి షూటింగులూ , యెవరి స్ట్రాటజీ లూ వారివియెవరి పరుగు వాళ్లదిచాలా వరకూ టీవీ సీరియల్లేమధ్యలో అప్పుడప్పుడూ సినిమాల్లో చిన్న పాత్రలూ  –పేమెంటు వచ్చినప్పుడు ట్రీట్లూ . తీరిగ్గా కబుర్లు చెప్పుకున్న సందర్భాలు చాలా తక్కువమిగిలే ఆ కాసిన్ని కబుర్లూ సినిమా గురించేయివ్వాల్టి గురించెప్పుడూ పట్టింపు లేదులన్నీ రేపటి గురించేసెలెబ్రెటీ అయిపోయి, పాపులారిటీ వచ్చేసినట్టు భ్రమలోనే జీవించడంవొకటే రాత్రివేర్వేరు లుఆగని పరుగుపక్కవాడు రొప్పడం వినే ధ్యాస లేదుచెప్పుకోలేని వుద్వేగాలూ నిర్వేదాలూరేపు తినబోయే విందును చుకుంటూ యివ్వాళ పస్తుండటాలూరకరకా ఆకళ్ళు.. సగం సగమైనా తీరని కోర్కొలూకాంట్రాసెప్టివ్స్‌… ఆశానిరాశ మధ్య వూగిసలాడుతూ ఆద మరచిన వేళల్లో తనతో తాను మాట్లాడుకుంటున్నట్టుగా సాగే మాటలూకొంత ప్రేమా కొంత సానుభూతీ చాలా చిరాకూ, వెగటూ, వెటకారమూతనును గురించే పట్టించుకోని పరుగులాటలో యితరును పట్టించుకోలేని యిరుకు తనంలో

అనూప్ది ప్రకాశం జిల్లాలో అద్దంకి దగ్గరేదో విలేజ్అట. వొంగోల్లో చదువుతున్నప్పుడే నాటకాల్లో పడ్డాడటసినిమాల్లో ట్రై చేయమన్న హా.. యింట్లో చెప్పకుండా హైద్రాబాదు చెక్కేయడంకృష్ణానగర్లో ప్రదక్షిణాలు  చేస్తూ బ్రేక్కోసం యెదురు చూడ్డంపేరెంట్స్‌, బ్రదర్స్‌, సిస్టర్స్గురించి పొంతనలేని సమాచారంపెళ్లి గూడా అయ్యిందేమోనని నా అనుమానంయిండస్ట్రీలో షైను అవడం కోసం కాస్టు గూడా తప్పు చెప్పాడని చెవులు కొరుక్కోవడం విన్నాను.

వోసారి రెండు వారాలు యేకంగా మాయమైపోయాడు. తర్వాత పెరిగిన గడ్డం, లోతుకు పోయిన కళ్ళతో వూడిపడ్డాడు. కదిపితే యేడ్చేస్తాడేమోనని భయమేసింది. రెండు రోజులు మూడీగా వుండిపోయాడు. తర్వాత పగబడి నవ్వాడు. పిచ్చి పట్టిందేమోనని భయమేసిందిబ్రేక్వచ్చినట్టే వచ్చి పోయిందన్నాడు. రాదేమోనన్న భయం వల్లే ముందుగా నాకేమీ చెప్పలేదన్నాడు. కాదు, వస్తే వెంటబడతానని భయపడి వుంటాడని తోచింది. నా అనుమానం అతడి కర్థమయినట్టే అనిపించింది. నేనెప్పుడైనా రెండు రోజులు కనబడకపోతే అనుమానంగా చూసేవాడు. వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడేవాడు. కేవలం జంతువుల్లా జీవిస్తున్నామనే అసహ్యాలూ , అసహనాలూ గమ్యం చేరలేని నీరసాలూ …. చివరికతను చాలా రోజు దాకా రానప్పుడు వెతకడాలూ అతడి పేరు కూడా స్వంతంగాదని తెలుసుఅక్కడ అనూప్లాంటి వాళ్ళు వందలూ , వేలూ నేటివ్ప్లేస్కు పారిపోయాడేమోననే అనుమానం…  యిల్లు మారమన్న వోనరు గొడవఅడ్రస్సు మారినా కొంత కాలం  పాటూ వస్తాడేమోననే చిన్న ఆశవెనక్కు తిరిగి చూడ్డామంటే భయంచివరికిప్పుడుయిలా

టీ షర్టు ప్రెంచి గడ్డం వాడు ‘‘కమాన్‌… వుయ్విల్షూట్‌…’’ అన్నాడు, తుపాకీతో కాల్చబోయే వాడిలా

చిన్న గదినే స్టూడియోగా మార్చుకున్నారు. చిన్న స్టేజీవెనక చానల్లోగో. ముందు రెండు కుర్చీలు . సీలింగ్పైన వేలాడే కరెంటు తీగలు రెండు కెమెరాలు …

వో కెమెరా వెనకా ప్రెంచి గడ్డం వాడూ, యింకోదాని వెనక యింకో కుర్రాడూఅనూప్వో కుర్చీలో కూర్చుని కాగితాలేవో తిప్పుతున్నాడు.

‘‘మా అనూప్వెటరన్‌… యిది రొటీన్స్టఫ్గాదుట్వంటీ మినిట్స్వన్యెపిసోడ్‌…’’ అన్నాడు ప్రెంచి గడ్డం వాడు నాకేసి యెక్స్రే చూపుల్ని తిప్పి. ‘‘సెన్సేషనల్గా వుంటే యెక్సెటెండ్చేస్తాంలాస్ట్యింటర్వ్యూ తన్వితతోసెన్సేషనల్‌… ఫోర్యెపిసోడ్స్గా ప్లాన్చేశాంపేమెంట్‌ డిపెండ్స్ …ఫ్రాంక్స్పీకింగ్‌… క్వశ్చన్స్విల్బీ యింట్రీగింగ్‌… యూ షుడ్నాట్గెట్డిస్ట్రబ్డ్‌…. బీ కూల్‌… నోటాబూస్‌… నో రిస్ట్రిక్షన్స్‌… రివీల్అండ్వోపన్యువర్సెల్ఫ్‌…’’

‘‘ యామ్రెడీ!’’ అన్నాడు అనూప్‌.

నేను సిద్దంగా వున్నానో లేదో యెవరికి కావాలి?

యింటర్వ్యూ మొదలైపోయింది.

“`

‘‘సెన్సేషనల్‌, మైండ్బ్లోయింగ్‌, హార్ట్రెండరింగ్ప్రోగ్రాం ‘‘చెప్పాని వుంది’’కి స్వాగతంఅప్కమింగ్స్టార్ల తెర వెనక జీవితాను పరిచయం చేస్తున్న యీ వెరయిటీ యింటర్వ్యూ కార్యక్రమానికి మా అభిమాన ప్రేక్షకులందరికీ సుస్వాగతంతన మనసులోని విషయాను యెలాంటి రిజర్వేషన్లూ లేకుండా షేర్చేసుకోటానికి పాపులర్సినిమా టీవీ యాక్ట్రెస్శ్రీ సంధ్య మన స్టూడియోకొచ్చారు. నమస్కారం శ్రీ సంధ్యగారూ! చెప్పండి,’’ యెలాగున్నారు?

‘‘బావున్నా…’’

‘‘బాగా అంటే పర్వాలేదనా, లేక బ్రహ్మాండంగానా?’’

‘‘ఆరెండుకూ మధ్యలో అనుకోండి’’

‘‘మీరు యాక్టింగ్ప్రొఫెషనెందుకు యెన్నుకున్నారు? మీ బ్యాక్గ్రౌండు చెప్పండి.’’

‘‘మాది అనంతపురం జిల్లా బళ్లారిదగ్గర చిన్న వూరు. మా ఫాదర్ఫార్మర్‌…. అమ్మ హౌస్వైఫు. నేనే జ్యేష్ట సంతానం. హైస్కూల్లోనే ఆనవర్సిరీల్లో నాటకాల్లో చేశాను. అందరూ హీరోయిన్లాగున్నాననే వాళ్ళు. యెప్పటికైనా హీరోయిన్కావానే ఆంబిషన్అప్పుడే పుట్టింది. మా పేరెంట్సును వొప్పించి డాన్సులో చేరాను. మా డాన్సు టీచరుకు సినిమా ఫ్రెండ్సుండే వాళ్ళు. వాళ్ళ ఫ్రెండొకాయన హైద్రాబాదు కొస్తూంటే నేనూ యింట్లో చెప్పకుండా వచ్చేశాను

‘‘మగ ఫ్రెండేనా?’’

‘‘అవును. అయితే మీరనుకుంటున్నట్టుగాఅఫయిరేం గాదు. ఆయన నన్ను కృష్ణానగర్దాకా తీసుకొచ్చాడు. పీజీ వర్కింగ్వుమెన్స్హాస్టల్లో చేర్చాడు. నా వొంటిపైన పది సవరా గోల్డు వుండేది.  అది సంవత్సరం దాకా సరిపోయింది.’’

‘‘ఫస్టు ఆఫర్యెలా దొరికింది?’’

‘‘  లక్కీగా మా డాన్సుసారు ఫ్రెండు నన్నో సినిమా ఆఫీసుకు తీసుకెళ్లాడు. వాళ్లేదో సినిమా లాంచింగ్లో వున్నారప్పుడు. టెన్మినిట్స్వుండే చిన్న రోల్యిచ్చారు…. అలా అలా టీవీ దాకా కూడా రీచ్అయ్యాను…’’

‘‘యింతవరకూ యిన్ని  రోల్స్ చేశారు? యిప్పుడు చేతిలో యెన్నున్నాయి? యీ జర్నీలో సాటిష్ఫాక్షన్గా వున్నారా?’’

‘‘ఆర్టిస్టుకు సాటిష్ఫాక్షన్వుంటుందా? యింకా నాక్కావల్సిన బ్రేక్మాత్రం రాలేదు. నా గోల్సినిమానే. మధ్యలో ఖాళీగా వుంటం యిష్టంలేక, మంచి రోల్స్ వదుకోలేక టీవీలో చేస్తున్నాను. నేను పనిచేసిన సీరియల్లు కొన్ని హిట్అయ్యాయి. ఆడియన్సు రికగ్నయిజ్చేస్తున్నారుఅది సినిమాకు గూడా యూజవుతుందని…’’

‘‘శ్రీ సంధ్య మీ నిజం పేరేనా?’’

‘‘కాదు.. నేను యిండస్ట్రీకొచ్చేటప్పటికి నా పేరుతో యింకో హీరోయినుండేది. అందుకని నేను పేరు మార్చుకున్నా….’’

‘‘మార్చిందెవరు? మీ గాడ్ఫాదరా?’’

‘‘నాకు గాడ్ఫాదరెవరూ లేరు’’

‘‘నిజంగా?’’

‘‘లేరు. అందుకే నాకు బ్రేక్యింకా రాలేదనుకుంటానాకొచ్చిన రోల్సం తా నా ఫెర్మామెన్స్ను చూసి వచ్చినవే!…’’

‘‘మీకు గుర్తుండే హెల్ఫ్వొకటి చెప్పండి’’

‘‘చిన్న చిన్న హెల్ఫ్ను గూడా మరవన్నేను’’

‘‘వొక యెగ్జాంపుల్చెప్పండి…’’

‘‘యిప్పుడు గుర్తుకొస్తున్న సంగతి చెప్తాను. చాలా రోజు ముందు, మేబీ టూ యిర్స్బాక్‌… అప్పుడు ఫైనాన్సియల్క్రయిసిస్లో వున్నాఫాదర్అప్పుడు పోయారు. అమ్మ యిబ్బందుల్లో వుంది. మా బ్రదర్ను యింజెనీరింగులో చేర్పించాలి. నేనప్పుడు ప్రాబ్లంలో వున్నానని తెలుసు కుని, వొక ప్రొడ్యూసరు పిలిచి కొత్త టీవీ సీరియళ్లో బుక్చేసి పది యెపిసోడ్ల పేమెంటు అడ్వాన్సుగా యిచ్చాడు. మేలు నేనెప్పటికీ మరవలేను…’’

‘‘ ప్రొడ్యూసరు పేరు చెప్పొచ్చు గదా!’’

‘‘వద్దలెండి. ఆయన మంచి మనిషి. పేరు చెప్పి మీడియాలో గాసిప్సు పుట్టించడం నాకిష్టం లేదు.’’

‘‘సరే, మీరు మరచిపోలేని బిట్టర్యెక్స్పీరియన్సు వొకటి చెప్పండి’’

‘‘యిండస్ట్రీ అంతా కొందరు సెబ్రిటీలే చుట్టే తిరుగుతోంది. చిన్న ఆరిస్టునెవరూ పట్టించుకోరు. నాలాంటి వాళ్లకు బిట్టర్యెక్స్పీరియన్సు చాలానే వుంటాయి. వాటిని యెప్పటికప్పుడు మరచిపోవడమే మంచిది.’’

‘‘అయినా కొన్ని మరపుకురావు. అలాంటిదొకటి చెప్పండి. మచ్చుకు…’’

‘‘మనకు పెయిన్కలిగించే యిష్యూ అవతలివాళ్లకు చిన్నదిగానే కనిపించొచ్చుమరీమరీ అడుగుతున్నారు కాబట్టి రీసెంట్గా జరిగిన సంగతి చెప్తాను. లాస్ట్మంత్కొత్త పిక్చరొకదాంట్లో రో లు దం టే వెళ్ళాను. ప్రెగ్నెంట్వుమెన్రోల్‌… పి ప్టీన్మినిట్స్వుండేరోలు. నీకెప్పుడూ ప్రెగ్నెన్సీ రాలేదు గదా, నువ్వు చెయ్యలేవు పొమ్మన్నారు. చెయ్యగనని పట్టుపట్టాను. ప్రెగ్నెన్సీ యెలాగుంటుందో నీకు తెలుసా అయితే అని అతను క్రాస్యెగ్జామినేషన్చేశాడు. యింతకుముందో సినిమా షూటింగ్లో మనిషి అడ్వాన్సవ్వటానికి ట్రై చేశాడు. నేను వార్నింగిచ్చా. అది గుర్తుపెట్టుకుని నన్నిప్పుడు కార్నర్చేస్తున్నాడని అర్దమయ్యింది. చాలా బాధేసింది. తిరిగొచ్చేశాను…’’

‘‘యిది యే సినిమా కాస్టింగ్లో…’’

‘‘పేరొద్దులెండి.. అనవసరంగా కాంట్రవర్సీ లెందుకు?’’

‘‘యీ డిప్లొమసీ మీరెప్పుడు నేర్చుకున్నారు? ఫీల్డు లోకొచ్చేకేనా, లేకపోతే…’’

‘‘దాన్ని డిప్లామసీ అనాలా? కేర్ఫుల్గా వుండటం అనచ్చు గదా!’’

‘‘యింకో యింపార్టెంట్కొశ్చన్‌…. మీరు యిండస్ట్రీకొచ్చి టెనియర్స్అయ్యాయేమోహీరోయిను రోల్సొచ్చే టయిం దాటిపోయింది. మారేజ్చేసుకుని సెటివ్వాని యెప్పుడూ అనిపించలేదా?’’

‘‘లేదు…’’

‘‘కంఫర్టునూ, స్టెబిలిటనీ పోగొట్టుకుంటున్నానన్న ఫీలింగెప్పుడూ లేదా?’’

‘‘నా ఫోకస్సంతా స్టార్కావానే విషయాలు ఆలోచించే తీరికే లేదు..’’

‘‘వుమెన్యీజ్ది క్వీన్ఆఫ్ది హౌస్అంటారు గదా! స్త్రీగా వుండి కెరీర్కోసమని లైఫ్తో యిలా యెక్స్పెర్మెంట్చెయ్యడం తప్పని గానీ, యిబ్బందిగా గానీ అనిపించలేదా?’’

‘‘యిది యెక్స్పెర్మెంటని నేనుకోటం లేదు. ది సీజ్మై లైఫ్‌…’’

‘‘మగాళ్లయితే పెళ్లీగిల్లీ అనుకోకుండా కెరీర్పైన కాన్సెన్ట్రేట్చేసే వీలుOటంది. మగవాళ్లకు లేటుగా బ్రేక్వచ్చినా డేంజరులేదు. యెంత లేటయినా వాళ్లకు పెళ్లి సమస్య గాదు. విమెన్కు లేటయితే పెళ్లి కుదరడం చాలా కష్టమైపోతంది.’’

‘‘అంటే విమెన్కు మేరేజ్తప్పయింకో గోల్వుండగూడదా?’’

‘‘యింటర్వ్యూ చేయాల్సింది నేను! మీరు నన్ను ప్రశ్నడుగుతున్నారు. నేను మిమ్మల్ని క్రిటిసయిజ్చేస్తున్నాననుకోవద్దు. మీ దగ్గరి నుంచీ సమాధానాలు రాబట్టి మీ ఆడియన్సుకు లైఫ్లో వుండే కొత్త యాంగుల్స్నూ, డైమెన్షన్లనూ పరిచయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నానంతే! ఫిజికల్గా మగాళ్ళకుండే అడ్వాంటేజెస్స్త్రీలుకు వుండదు. కానీ మీరెలా మేనేజ్చేస్తున్నారన్నది నా ప్రశ్న…’’

‘‘డేంజరులో పడకుండా గోల్ను చేరడం మాకూ తెలుసుమీకు మాత్రమే డేంజరుందని బెదిరించి, మేమేదో అన్సోషియల్యాక్టివిటీస్లో పబ్బంగడుపుతున్నామని నా నోటితోనే చెప్పించి, దాన్ని సెన్సేషనల్చేద్దామనుకుంటున్నారా మీరు?’’

‘‘ప్లీజీ, డోన్డ్మిస్అండర్స్ట్రాండ్మీ! మీకూ తెలుసు, యిండ్రస్ట్రీకొచ్చిన వాళ్లల్లో కొందరు విమెన్కు బ్రేక్వెంటనే వచ్చి హీరోయిన్లయిపోతారు. కొందరు బ్రేక్కోసం కొంతకాలం   వెయిట్చేశాక, పేరెంట్స్చెప్పినట్టు బుద్దిగా మారేజ్చేసుకోని వెళ్ళిపోతారు. కొందరు దీపముండగానే ఇల్లు  చక్కబెట్టుకుంటారు. అంటే మంచి ప్రపోజ్ల్రాగానే వొప్పుకుని అడ్జెస్టయిపోతారు. యిలా కాని వాళ్ళు బ్రేక్కోసం చూసీచూసీ, యెప్పుడో వీక్మూమెంట్లో పూర్తిగా మునిగిపోతారు. వొకరిద్దరు పిల్లలు  కూడా పుట్టేస్తారు. బిడ్డల్ని పెంచుకోడానికి నానా కష్టాలు  పడతారు. పతనానికి భయపడేవాళ్ళు సూయిసైడ్లు చేసుకుంటారు. యిదంతా మనం రోజూ చూస్తున్న సంగతే గదా!’’

‘‘నిజమే! బ్రేక్కోసమని హద్దు దాటని వాళ్ళూ, డేంజరులో పడకుండా కేర్ఫుల్గా వుండేవాళ్ళూ కొందరుంటారు?’’

‘‘అదెలా సాధ్యమనేదే నా ప్రశ్న!’’

‘‘నేనున్నాను గదా, అదే నా ఆన్సరు’’

‘‘అదే, అలా యెలా వుండగలిగారు? దానికోసం మీరు పోగొట్టుకున్నదేమీ లేదా?’’

‘‘యేదయినా వొకటి సాధించాలంటే యింకేదోవొకటి పోగొట్టుకోక తప్పదు. దాంట్లో మగాళ్లకైనా, ఆడవాళ్లకైనా పెద్దతేడా వుండదు.’’

‘‘ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్కుండా చెడతారు ` అంటారు’’

‘‘అది యీనాటి మాటగాదు. నాకా సంగతులు  పట్టించుకునేటంత తీరికగూడా లేదు…’’

‘‘నేచురల్గా బతక్కుండా, మెడికల్గా సేఫ్టీ మెజర్స్తీసుకుంటే ఫిజిక్పాడవుతుంది గదా! ప్రాబ్లం వుమెన్కే గానీ మెన్కుండదు…’’

‘‘వయస్సు పెరిగే కొద్దీ మగాళ్లకైనా ఫిజిక్మునపట్లా వుండదు…. హీరో స్పాన్గూడా యిప్పుడు తగ్గిపోయింది…’’

‘‘అదే నేనూ అంటున్నాను. ఆడవాళ్ళతో కంపార్జేస్తే మగాళ్ళ స్పాన్పెద్దది…’’

‘‘సినిమాల్లో ఆడవాళ్ళు కేవలం హీరోయిన్రోల్స్చేయడం లేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్లకంటే యింపార్టెంట్రోల్సు O డే మిడిల్యేజ్డ్వుమెన్రోల్సు  గూడా వుంటాయి. ‘‘సరే, యింటర్వ్యూ మరీ జనరల్అయిపోతోంది. కొన్ని స్పెషిఫిక్యిష్యూస్అడగతాను. హైద్రాబాదు కొచ్చిన కొత్తలో, ఫీల్డులో యెంట్రీకోసం మీరు చేసిన ప్రయత్నాగురించి కొంచెం డీటయిల్గా చెప్పండి…’’

‘‘చెప్పాను గదా! మా డాన్సు టీచరు ఫ్రెండు నన్ను కొందరు ప్రొడ్యూసర్లకు యింటర్డ్యూస్చేశాడు. అప్పుడు నాకో ఆంటీ పరిచయమైంది. పెద్దావిడ. బోలెడు సినిమాల్లో చిన్న చిన్న రోల్సు  చేసింది. ఆమెకు యిండస్ట్రీ అంతా పరిచయం. ఆమె చాలా హెల్ప్చేసింది. ఆమె పరిచయంగాకుంటే నా పరిస్థితేమయ్యేదో లుచుకుంటే భయమేస్తుంది. ఆమెకెంతో రుణపడి వున్నాను…’’

‘‘ఆమె పేరేమిటి? యిప్పుడెక్కడున్నారు?

‘‘పెద్దపాపుర్ఆర్టిస్టుగాదు లెండి. యిప్పుడెక్కడుందో నాకు తెలియదు…’’

‘‘మీ కెరియర్కంత మేలు జేసిన వ్యక్తి యిప్పుడెక్కడుందో మీకు తెలియదు.’’

‘‘పొరబాటే! కానీ హెల్ఫ్లెస్‌… యింకా యాక్టివ్కెరీర్లో వున్నాతీరిగ్గా పొరబాట్లు గుర్తుకు తెచ్చుకుని బాధపడేంత వయస్సు రాలేదింకా…’’

‘‘యిప్పుడు గూడా వర్కింగ్వుమెన్స్హాస్టల్లోనే వున్నారా?’’

‘‘లేదు. ఫ్లాట్కు సిఫ్టయ్యాను.’’

‘‘వొంటరిగానా? సేఫ్టీగాదు కదా?’’

‘‘మా అమ్మా తమ్ముడూ కొన్నాళ్లు తోడున్నారు. తర్వాత వాళ్ళూ వెళ్ళిపోయారు?’’

‘‘యెందుకెళ్ళిపోయారు?’’

‘‘అమ్మ వయసొచ్చిపోయింది. తమ్ముడికి వుద్యోగం వచ్చి బెంగుళూరు వెళ్ళిపోయాడు.’’

Painting: Rafi Haque

‘‘వాళ్ళు వెళ్ళిపోయాక…?’’

‘‘ఫ్రెండ్సూ, రిలెటివ్స్వచ్చి పోతూంటారు.’’

‘‘మిమ్మల్ని వానుకునే వాళ్ళకు మీ అడ్రస్సు తెలుసా?’’

‘‘యెందుకు తెలియదు? నాకు హెల్ఫ్చేసేవాళ్లకూ నా ప్రొడ్యూసర్లకూ, అవసరమైన క్రూ కూ తెలుసు. అందరికీ చెప్పడం కుదరదు. సెక్యూరిటీ ప్రాబ్లం…’’

‘‘మీకు పెళ్లయిందనీ, మీకో డాటర్గూడా వుందనీ, వేరే యెక్కడో హాస్టల్లో వుండి చదువుతోందనీ మా యిన్వెష్టిగేషన్లో తెలిసింది…’’

‘‘యింటర్వ్యూ చేసేముందు యిన్వెష్టిగేషన్లు గూడా చెయ్యిస్తారా మీరు? చీకట్లోకి రాయి విసిరినట్టున్నారు. అదే నిజమయితే మొగుడనే మనిషొకడుండాలి గదా? అది అడగరేం?’’

‘‘అదే లీడింగ్ కొశ్చన్‌…’’

‘‘అదే గనక నిజమైతే అబద్దమెందుకు చెప్తాను?’’

‘‘లేడీ ఆర్టిస్టుకు పెండ్లయితే రోల్స్రావు. అందుకనే రహస్య జీవితాలు ..’’

‘‘సీక్రెట్లైఫ్ఆడాళ్ళకు మాత్రమే వుంటుందా? మగాళ్ళకుండదా?’’

‘‘మీరు మళ్లీ ప్రశ్నడుగుతున్నారు? పని నాది. మీరు చెప్పాల్సింది ఆన్సరు’’.

‘‘పెండ్లంటూ చేసుకుంటే వోపన్గా అందరికీ తెలిసేలా చేసుకుంటా…’’

‘‘యిప్పుడు మీ కష్టసుఖాల్ని షేర్చేసుకోవడానికి నమ్మక పాత్రమైన ఫ్రెండ్సెవరు?’’

‘‘క్లోజ్ఫ్రెండ్సంటూ యెవరూ లేరుఫ్రెండ్స్తో తిరిగేంత తీరిక లేదు…’’

‘‘తీరిగ్గా మీ ఫీలింగ్స్షేర్చేసుకోవానుకునే రోజులొచ్చాకే పెండ్లి గురించి ఆలోచిస్తారా?…’’

‘‘మొగుడితో మాత్రం అన్నీ షేర్చేసుకుంటారా పెళ్ళాలు ? పెళ్ళాతో నయినా అన్నీ దాపరికాల్లేకుండా బతికే మొగుళ్లున్నారంటారా?…’’

‘‘మళ్లీ ప్రశ్నకే వచ్చారు మీరు! పోనీ యిది చెప్పండి, బ్రేక్వచ్చేదాకా వెనుదిరగనంటారా మీరు?’’

‘‘బ్రేక్వచ్చాక గూడా వెనక్కి తిరగాని లేదు. నన్ను ప్రూవ్చేసుకోటానికి యెన్ని అవకాశాలు న్నాయో అన్నీ కావాలి నాకు…’’

‘‘మీకలాంటి బ్రేక్త్వరలో రావాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా స్టూడియోకొచ్చి, అడిగిన ప్రశ్నకంతా, కూల్గా, కోపం తెచ్చుకోకుండా సమాధానాలు  చెప్పినందుకు మా ఛానల్తరఫునా, మా ప్రేక్షకు తరఫునా కృతజ్ఞతలు థాంక్స్‌…’’

““

యింటర్వ్యూ చేస్తుంటే యీ ఆరేళ్ళలో శ్రీ సంధ్యలో మార్పేమీ రాలేదని తెలిసిపోయింది. యీ రోజు నేనింటర్వ్యూ చేయబోతున్నది ఆమెనేనని తెలుస్తూనే అక్కడి నుంచీ పారిపోవానిపించింది. కానీ పద్మూడు యెపిసోడ్ల అగ్రిమెంటు, యెపిసోడ్కు మూడువేపేమెంటుయిప్పుడు పారిపోతే మొదటికే మోసం రావచ్చు

హేమంత్రాయ్ఆర్టిస్ట్డీటయిల్స్అంటూ వో కాగితం పడేశాడు. అందులో పనికొచ్చేవివరాలేవీ లేవు. యెప్పుడూ యింతే! అంతకంటే వివరాలు వీళ్లకు తెలియవ్‌. తెలివిగా కూపీ లాగి, లీడిoగ్కొశ్చన్లతో వూపిరి తిరక్కుండా, సెన్షేషనల్స్టఫ్లాగేస్తానని నాకు అసయిన్మెంటిస్తన్నారంతే!

సంవత్సరం దాకా వొకే కప్పుకింద బతికినా ఆమెను గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. యిప్పుడీ యింటర్వ్యూ అయిపోయాక గూడా ఆమె గురించి నేను తెలుసుకున్నది యెక్కువేమీ గాదని అర్దమైపొయ్యింది. మొగుడూ పెళ్లాలే రెండు చీకటి గుహల్లా బతుకుతారంది గదా! యీ మధ్యలో సెటయిర్లు పదునెక్కి నట్టున్నాయి.

శ్రీసంధ్యతో నాకెంత దగ్గర పరిచయముందో యెవరికీ తెవదు. పరిచయముండటానికీ తెలుసుకోడానికీ చాలా తేడా వుందని చాలా మంది తెవదుట్రాక్పైన కాంపిటీషన్లో పరిగెత్తే రన్నర్లకు పక్క వాళ్ల సత్తా తెలుసుకోడం అవసరం. కానీ యెవర్గోల్వాళ్లదయినప్పుడు పక్కవాడి గురించి తెలుసుకునే తీరికా, అవసరం యెక్కడుంటాయి? పక్కవాడి రొప్పుడయినా వినబడతందా?

స్టూడియోలోంచీ బయటికొస్తూ ‘‘జస్ట్ఓకే! సిగ్రేడ్‌… సెన్షేషనేమీ లేదు..’’ అన్నాడు హేమంత్రాయ్యిండఫరెంట్గా.

‘‘అందరూ తన్వితలా బోల్డ్గా, ఫ్రాంక్గా మాట్లాడరు…’’ అన్నాను విసుగ్గా.

‘‘యూహావ్మోర్పోకస్డ్ఆన్యింపర్షనల్తింగ్స్‌… పర్వాలేదులే! యెప్పుడూ మూడ్వొకేలా గుండదుబెటర్  క్నెక్స్ట్టైం…’’

శ్రీ సంధ్య స్టూడియో రెస్ట్రూంలోకెళ్లి ముఖం కడుక్కొచ్చినట్టుంది. యింకా మేకప్పుజిడ్డుతో ముఖం మినమిన లాడతాంది.

‘‘నాకు పనుంది సార్‌! వెళ్లాలి. నా పేమెంట్‌’’ అని అడిగింది కౌంటరు దగ్గరి కెళ్లి.

హేమంత్సిగరెట్టు వెలిగించుకుంటూ ‘‘నెక్స్ట్వీక్‌’’ అన్నాడు.

శ్రీ విద్య ముఖం వెవెబోయింది. ‘‘చంద్రప్రకాష్పేమెంటు వెంటనే యిస్తానన్నాడు. దీనికోసం షూటింగ్‌  వదులు కుని వచ్చాను టాక్సీలో…’’ కోపంతో ఆవిడ గొంతు వణుకుతోంది.

‘‘అందరికీ వన్వీక్పోయాకేకావాలoటే అనూప్నడగండి…’’

‘‘ మాట ముందు చెప్పాల్సింది.’’

‘‘మీరడగలేదే…’’

‘‘యిదన్యాయం. టాక్సీకి ఫైవ్హండ్రెడయ్యింది. యిప్పుడు వెనక్కెళ్ళాంటే మళ్లీ టాక్సీనే పివాలి.’’ ఆమె గొంతు జీరబోతోంది.

నాకేం చేయాలో తోచకపోవడంతో బయటికొచ్చేశాను.

మనుషుల్ని అంత త్వరగా నమ్మే వ్యక్తిగాదే యీమె! నాకు పరిచయమైన చాలా దినా వరకూ కాఫీకి గూడా రాలేదు. వొకే యింట్లో వున్నప్పుడు గూడా స్ట్రేంజరు గానే వుండేది. కిచెన్ను కోటలా మార్చుకుంది. చాలా దినా వరకూ లోపల   బోల్టుపెట్టుకునే పడుకునేది.

అప్పుడప్పుడూ వాళ్లింటి నుంచీ ఫోన్లొచ్చేవి. ఫోన్లో పెద్దగా అరిచేది. తర్వాత కొన్ని గంట సేపు మూడీగా వుండేది. అడిగితే హెల్ఫ్చేయాని వుండేది. కానీ తానెప్పుడూ పర్సనల్విషయాలు చెప్పేదే గాదు.

నెపడుతూనే తన షేర్రెంటు యిచ్చేసేది. హోటల్లో తింటే హెల్త్ పాడవుతందని, యింట్లోనే వండుకుందామని ప్రపోజల్పెట్టాను. వండటం తనకు బోరనీ, నేను వండేట్టయితే తనకు అబ్జెక్షను లేదనీ అంది. కావల్సిన సరుకు తెచ్చినా స్టవ్వు దగ్గరికెప్పుడూ వెళ్లలేదు. నేను వండితే ధీమాగా తినేది. సాయింత్రాల్లో యింటికొస్తూ సూపర్మార్కెట్నించీ రకరకా ఫుడ్డు పట్టుకొచ్చేది యిద్దరికీరెండు పళ్ల చక్రా లుపక్కపక్కనే తిరుగుతన్నా, వొక పళ్లు దగ్గర మాత్రం లుస్తున్నట్టు, సిపడుకోడానికి మాత్రమే యిల్లు చేరేవాళ్లం.

నా చేతనయినప్పుడు తనకు రోల్సొచ్చేలా చూశాను. ధాంక్స్చెప్పేది. తానూ నాకు కొన్ని అవకాశాలు  తీసుకొచ్చింది. నేను తాంక్సు చెప్తే పొగరుగా వూపేది. కోపమొచ్చి నేను మౌనంగా వుండేవాణ్ణి. తాను గమనించేదే గాదు.

అలా కాలo  లాగుతున్నప్పుడు ఫిజికల్గా యెలా దగ్గరయ్యామో లుచుకుంటే ఆశ్చర్యం వేస్తాంది. తనకు దగ్గరవ్వాని నేను ట్రయిచేసినప్పుడంతా అత్తిపత్తిలా ముడుచుకుపోయేది. కానీ వోసారి అనుకోకుండా దగ్గరయి పోయాం. కొన్ని క్షణా తర్వాత మళ్లీ మామూలే! మా మధ్య అటువంటి సంబంధమేమీ లేదనట్టుగా ప్రవర్తించేది. ఆవిడ కేర్పుల్గా వుక్కు కవచమేదో తొడుక్కుందనీ, దాన్ని పగగొట్టడం నా చేతగాదనీ తెలిసిపోయింది. వొకేయింట్లో రెండులోకాల్లా బతికుతున్నామన్న స్పృహయినా లేని జీవితంనేను స్యంగా వచ్చినా, కొన్ని రోజు లు రాకపోయినా ఆవిడలో ఆత్రుతన్నదే కనిపించేది గాదు. మా సాన్నిహిత్యం యాంత్రికంగా అనిపించి వికారం పుట్టేది. యెంత సహజంగా వొకయింట్లోకి చేరామో, అంతే సహజంగా విడిపోయాం.

బాగా చీకటి పడ్డంతో రోడ్లపైన వెహికల్స్లైట్లు వేసుకుని వెళ్తున్నాయి. స్టాండులో జనమెవరూ లేరు. నా వెనకే వస్తన్నట్టుగా శ్రీ సంధ్య కనిపించింది.

‘‘యెక్కడికెళ్లాలి?’’ అని అడిగాను.

‘‘అమీర్పేట..’’ అంది.

నేను టాక్సీని కేకేసి ‘‘నేనూ ఆవైపేడ్రాప్చేసివెళ్తాను’’ అన్నాను. ఆమె వచ్చి కూర్చుంది. వంచుకుని వుండిపోయింది.

‘‘హౌయీజ్లైఫ్‌’’ అడిగాను.

‘‘ఫైన్‌… గెటింగాన్‌…’’

‘‘వర్కింగ్వుమెన్స్హాస్టల్కా?’’

‘‘కాదుఫ్లాట్కు సిఫ్టయ్యానని చెప్పాను…’’ అని కాస్సేపాగి ‘‘మాకజిన్గూడా వుంది’’ అంది.

‘‘ఆఫర్స్బాగున్నాయా?’’

‘‘ఓకే…’’

‘‘యీ చానల్వాళ్ళంతే! లేటుగా పేజేస్తారు. యెగ్గొట్టరు.’’

‘‘పెద్ద అమౌంటని గాదు.. మాటపైన నిబడ్లేదని కోపం..’’

‘‘…..’’

‘‘దీని కోసం కాల్షీటు మార్చుకుని వచ్చాను. రేపు రెండు షెడ్యూల్స్  చేస్తానన్నాను. వీళ్ల పేమెంటు కోసరం గాదు.. .చానల్లో యింటర్వ్యూ వస్తే పబ్లిసిటీ గదా అని…’’

‘‘నేనూ అందుకే! యీ ప్రోగ్రాంకు బాగా రేటింగుంది. యూ ట్యూబ్లో లైక్లు  బాగా వున్నాయి. కొత్త రోల్సుకు స్ప్రింగుబోర్డులాగుంటుందనికాల్షీట్లు అడ్జెస్టు చెయ్యలేక యిబ్బందిగా వుందివీళ్లు వదటం లేదు…’’

కారు పరిగెత్తుతూనే వుంది.

యేదో అడగదలుచుకున్నట్టుగా ‘‘దెన్‌… మరి…’’ అని గొణిగింది.

నేను యేమిటన్నట్టుగా చూశాను. ఆమె తిప్పేసింది.

కారు అమీర్పేట జంక్షన్దాటాక ‘‘యిక్కడే! దిగేస్తాను’’ అందామె.

కారాగింది. ఆమె కారుదిగి ‘‘తాంక్స్‌’’ అన్నాక వో సన్నటి సందులోకి తిరిగింది.

ఆమె ఆకారం క్రమంగా చీకటిలో కలిసిపోయింది.

‘‘యింకా పొగరు తగ్గలేదు. పెండ్లాం వుద్యోగం చేసి కాపురం లాగిస్తంటేనే ఫీల్డులో తంటాలు పడుతున్నాన్నేనుయే ఆసరాలేకుండా తానొక్కతే ఫైట్చేస్తన్నానంటోంది.. అన్నీ అబద్దాలే!’’ అని కోపంగా గొణుక్కున్నాను.

బిల్లిచ్చి టాక్సీని పంపేశాక, షేర్ఆటో కోసం బస్టాండు దగ్గరికి నడవసాగాను.

*

 

మధురాంతకం నరేంద్ర

మధురాంతకం నరేంద్ర

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అందని ద్రాక్ష ఎప్పుడూ పుల్లనే! కథ బావుంది!! ధన్యవాదాలు!

 • బాగుంది .
  చివరిదాకా ఉత్కంఠ .. కొత్త వస్తువు.
  నరేంద్ర “నిత్యమూ నిరంతరమూ ” స్త్రీ పక్షపాతే .. “ముఖాముఖి” అందుకు భిన్నం కాదు 🙂

 • కథనం ప్రవాహంలా పరుగెత్తింది.

  చాలా బావుంది.

 • “బ్రేక్‌ కోసమని హద్దు దాటని వాళ్ళూ, డేంజరులో పడకుండా కేర్‌ఫుల్గా వుండేవాళ్ళూ కొందరుంటారు” – అని నోటితో చెప్పడమే కాదు, ఎలా పాటించిందో- ఈ కథలో చూపించారు నరేంద్ర గారు!
  అనూప్‌తో ఉన్నప్పుడూ నమ్మలేదు, బయటకొచ్చేకా కూడా నమ్మలేదతన్ని శ్రీ సంధ్య. అతనికి ఆ అర్హతలేదని పృూవ్ అయింది. శారీరక సంబంధం కంటే మానసిక సంబంధం విషయంలో ఎంత జాగ్రత్తపడాలో అంతా పడింది. ఒక్కర్తీ ఎలా ఈదుకొస్తోందో తెలీదు కానీ అతన్ని సరిగ్గా అంచనా కట్టిందంటే మిగిలిన విషయాల్లో కూడా తెలివిగానే ఉంటోందని – నమ్మకం వచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు