మరి నువ్వు…

రేలే
ఇక్కడే ఒకమారు ఆగి
మాటాడుకుందాం
ఈ నీటి పాయల మధ్య
నున్నని ఈ రాతి ఎదను స్పర్శిస్తూ
ఈ తెల్లని మద్ది చెట్టు
మొదలులో మేను వాల్చి
నిర్మలమైన ఆకాశంలోకి
రెప్పలార్పకుండా చూస్తూ
చెప్పడమేదో మరచిపోయిన
ఏళ్ళనాటి సంగతులన్నీ
కలబోసుకోవాలనుంది!
మరి నువ్వు
అవునంటావా?
ఎప్పటిలాగే
పక్కకు ఒత్తిగిలి
కనుల ధారల మధ్య
తెలవారిపోనిస్తావా??
*

కెక్యూబ్ వర్మ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు