‘బహుజన స్ఫూర్తి ప్రదాతలు’ పై జాతీయ సదస్సు

‘బహుజన స్ఫూర్తి ప్రదాతలు’ పై జాతీయ సదస్సు

బీసీల జనగణనకు డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బహుజనులు ఉద్యమిస్తున్న సమయంలో ఈ సదస్సు అనేక ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తోంది.

హుజనుల జీవితాల్లో వెలుగు నింపడానికి తమ జీవితాలను ధార పోసిన అక్షర యోధులను స్మరించుకుంటూ వారు అందించిన బహుజన చైతన్య బావుటాను భుజానికెత్తుకొని నేటి తరం ముందుకు సాగడానికి ఒక అవగాహన, ఒక ఆలంబన కలిగించడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మెన్), తెలుగు అధ్యయన శాఖ 17 & 18 నవంబర్ 2022న రెండు రోజుల పాటు ‘బహుజన స్ఫూర్తి ప్రదాతలు’ (Bahujan Inspirational Personalities) అనే అంశంపై రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (RUSA), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జాతీయ సదస్సు నిర్వహిస్తోంది.

భారత దేశం కుల పునాదుల మీద నిర్మితమై ఉంది. ఈ దేశంలో అత్యధిక శాతం బహుజనులే ఉన్నారు. వీరంతా దేశానికి స్వాతం త్ర్యం   వచ్చిన గత 75 ఏళ్లుగా ప్రతి అయిదు సంవత్సరాల కొకసారి లేదా అర్ధాంతరంగా ఎన్నికల  ఋతువు వచ్చినపుడు లైన్ లో నిలబడి ఓటు వేసే పరికరాలుగా ఉపయోగపడుతున్నారు తప్ప తగినంత సామాజిక చైతన్యాన్ని పొందలేక పోతున్నారు. పుట్టుకతో అందరూ సమానమే అయినా కొద్ది మంది మాత్రమే చైతన్యాన్ని పొందుతూ ముందుకు సాగుతున్నారు. బహుజనులంతా గుడ్డిగా వారినే అనుసరిస్తున్నారు. బహుజనులు దాదాపు 200 కులాలుగా విభజితమై చేతివృత్తిదారులుగా, ఉత్పత్తి కులాలుగా మిగిలిపోయారు.

‘Political power is the master key’ అన్న డా. బి. ఆర్. అంబేద్కర్ మాటలను అనుసరించి, బీసీల జనగణనకు డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బహుజనులు ఉద్యమిస్తున్న సమయంలో ఈ సదస్సు అనేక ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తోంది.

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు