పున: 

నేరారోపణ
చేయలేదు.
ఏ చట్ట విరుద్ధంగా
ప్రశ్నించనూ లేదు .
మీరన్నట్టుగానే
చూపులకు , మాటలకు గంతలు కట్టి ,
నిస్సంకోచంగానే నిర్జీవిస్తున్నా..
ఈ రోజు లాగే ప్రతిరోజు
గదినిండా
ఎవరో విరిచేసిన
సీతాకోక రెక్కలు నిండిపోయాయి.
శాంతి చిహ్నాలైన ఆ పావురాల
పచ్చినెత్తురు వాసన వ్యాపించి
గది మొత్తం ఎరుపెక్కింది.
కొన్ని ఖాళీ పేజీలు
నా చేతగానితనంను చూసి
అసహ్యించుకుంటుంటే ,
నా కన్నులు
నిద్రను మరిచి
కలను ముందేసుకొని
రేపటి నినాదాలను కన్నీటితో కడుగుతున్నాయి.
కాలం కట్టేసిన బ్రతుకులు
మళ్ళీ స్వేచ్ఛగా పురుడోసుకోవాలి.
*

రామ్ పెరుమాండ్ల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు