పాన్ డబ్బా

ప్ కీ ఫర్మాయిష్ లో
యూనస్ ఖాన్ కు అప్పజెప్పిన చెవులు
దేహమంతా రెండు చేతులే
ఇంద్రజాలికుడిలా చక చకా మాయ చేస్తాడు..

 

భాయ్ సాబ్
“ఏక్ బడా గోల్డ్ ఫ్లేక్,
రత్న, బాబా కశ్మీరి ….”
తమలపాకులు, జర్దా
అత్తరు, చమట కలిసిన వింత పరిమళం
నాలుగడుగుల చిన్న ప్రపంచం
చుట్టూ అందంగా పేర్చిన చిన్న చిన్న డబ్బాలు
మధ్యలో చిన్నకుర్చీ సింహాసనం
అదే అతని సామ్రాజ్యం

కళ్ళతో నవ్వుతాడు
ధ్యానమేదో చేస్తున్నట్టు మరో లోకంలో ఉంటాడు.
నిశ్శబ్దం చిట్లినట్టు
పొడి పొడిగా మాటలు రాలుస్తాడు.

ఎర్రగా పండిన నోళ్ళతో
స్నేహం నిండిన కళ్ళతో
ప్రతి పాన్ డబ్బాలో
గుల్కంద్ లా తియ్యగా
మీఠా పాన్ లా మధురంగా

ఈ హైదరాబాద్ లో అడుగడుగునా
రాజ్యాలు లేని నవాబులు
దిగులు చూపుల దర్పాలు
వేళ్ళ చివర్లలో వదలని బతుకు మరకలు.

*

చిత్రం: సృజన్ రాజ్

కిరణ్ చర్ల

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • ఈ హైదరాబాద్ లో అడుగడుగునా
  రాజ్యాలు లేని నవాబులు
  దిగులు చూపుల దర్పాలు
  వేళ్ళ చివర్లలో వదలని బతుకు మరకలు…

  చాలా బాగుంది.. భయ్యా.

 • “వేళ్ళ చివర్లలో వదలని బతుకు మరకలు”
  ఈ ఒక్క వాక్యంతో పాతబస్తి గోనెపట్టా పరదా వెనకున్న చిల్లుల బతుకుచిత్రం ఆవిష్కరించావు. బాగుంది.

 • వేర్ల చివర వదలని బతుకు మరకలు…గొప్ప వాక్యం..
  పాన్ డబ్బా కవిత హైదరాబాదు ని రూపు కట్టింది.
  కిరణ్ …అభివందనాలు

 • వేళ్ళ చివర్లలో వదలని బతుకుల మరకలు చాలా బాగుంది.

 • స్నేహం నిండిన కళ్ళు.. వేర్ల చివర వదలని బతుకు మరకలు… గొప్పగా అనిపించింది . మంచి కవిత.

 • వదలని బతుకు చివరి మరకలు…
  బతుకు వేళ్ళ చివరి మరకలు…
  బతుకు చివరి వేళ్ళ మరకలు…
  మరకల చివర బతుకు వేళ్ళు…

  సూపర్ కిరణ్…

 • బావుంది
  సింహాసనం చుట్టూ చిన్న ఆర్థిక సామాజిక సామ్రాజ్యం

 • రాజ్యాలు లేని నవాబులు,
  వేళ్ళ చివర్లలో వదలని బతుకు మరకలు…
  చాలా బాగుంది అన్నా..

 • ‘వేళ్ల చివర్లలో వదలని బతుకుల మరకలు’ ఈ ఒక్క వాక్యం చెబుతోంది మొత్తంకథ! హ్మ్!

 • “వేళ్ళ చివర్లలో వదలని బతుకు మరకలు”

  హృద్యమైన కవిత ..అభినందనలు

 • వేళ్ళ చివర్లో వదలని బతుకు మరకలు!❤️❤️👍. జీవన రహస్యంతెలిపిన కవిత. బాగా నచ్చింది.
  అభివందనాలు ! జీ.

 • వేళ్ళ చివరల్లో వదలని బతుకు మరకలు….మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తోంది ఈ ఒక్క వాక్యంలో

 • आपकी परमाईस से सुर करनेवाला ऐ कविता मेरी यारी हो गही पान बनानेवालौ कि यादगार बनगहि.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు