పాట ఎప్పుడూ……..

1
నీ జ్ఞాపకమే
ఓ పదం తనంత తానే
పుట్టుకొస్తుంది
పాదం పడకుండానే
పంకిలమవుతుందిప్రవాహాన్ని
పదే పదే కీర్తిస్తాను
నది కదా
కొత్త మట్టి తెస్తుందని
విత్తనాలు జల్లుకొనే
పదునిస్తుందనిఅకల్పమైన వాన కోసం
కల్పాల కాలం
ఎదురుచూస్తాను

పాట ఎప్పుడూ
మంద్ర స్వరంలో
వినిపిస్తూనే ఉంటుంది

చూపులు తిప్పుకున్నా సరే
నిరీక్షణ తప్పని సరి

శరత్కాలపు వెన్నెలకంటే
ముందరే వస్తుంది వాన
అరిపోయిన కుంపటి లోంచి
పుట్టుకొస్తుంది చలి

ఈ వాక్యం మొదటిదో
అఖరిదో తెలిస్తే
కవిత ముగుస్తుంది

స్మరించడానికి
అనుష్టుప్ అక్కరలేదు
తేటగీతి చాలు
అంతెందుకు
ఈ పద్యం కూడా
నీ జ్ఞాపకమే!

తల్లి పిల్లి
రాశులు కుప్పపోసి
నక్షత్రంతో వెతుక్కో
నెలల గుంపులోంచి
తిథుల పట్టిలోంచి
పుట్టినరోజు
సరి చూసుకోక్యాలెండర్ అయితే
మరీ సుఖం
నెల, తారీకు చాలుభవిష్యత్ అనే
దూరపు చుట్టాన్ని
టేరట్ పేక ముక్కలతోనో
జాతక చక్రాల
గ్రహ గతులతోనో
అంజనం వేసి
లెక్క కట్టి
మంచి చెడుల
సుఖ దుఃఖాల
కలిమి లేముల
చేటలో బియ్యం
సోది మాటలు

లీనమై
భయ విభ్రమాల
అనిహిత పథం

ఎవరు చెప్పేరబ్బా
రేపు దూరపు చుట్టమని
నిన్నా, నేడుల తోబుట్టువే కదా!
రాత్రి గడిస్తే ఉదయమే కదా!

రంగుల రాట్నం
రాక్షస చక్రం
ఇరుసు ఒరుసుకొంటూ
తానుతిరుగుతూ
నిన్ను కూడాతిప్పుకునే
తల్లి పిల్లి, కాలం.

*
చిత్రం: సృజన్ రాజ్ 

Indraganti Prasad

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు