నీటిలాంటి..

న్నది ఉంది, లేనిది లేదు
ఉన్నది లేదు, లేనిది ఉంది
ఉన్నదీ ఉంది, లేనిదీ ఉంది
ఉన్నదీ లేదు, లేనిదీ లేదు

ఇది నీటిలాంటి కవిత
గాలి లాంటి కవిత
ఎలా కావాలంటే అలా వంపు తిరుగుతుంది
మడతలు పడుతుంది, సర్దుకుంటుంది
ఎప్పుడు ఎలా కావాలంటే అలా
మార్చుకొని చదువుకోవచ్చు

అవి  ఉత్త పదాలనుకొంటే
పదాల్లోకి దారి తప్పుతావు
భావాలనుకుంటే భావాల్లోకీ
అనుభవమనుకుంటే అనుభవంలోకీ తప్పిపోతావు

నీకిప్పుడు కావలసింది
పూలు రాల్చిన కొమ్మలానో
ఆకులు రాల్చిన చెట్టులానో ఉండటం కాదు
చెట్టుని రాల్చిన ఆకాశంలా ఉండటం
ఆకాశాన్ని రాల్చిన అనంతమై పోవటం

ఉన్నావా, లేవా
ఈ పదాలతో మరో కవిత రాస్తున్నావా
ఎవరో తలుపు తట్టినట్టు
ఏదో నీ నిద్రని తట్టిన చప్పుడయితే చెప్పు

*

బివివి ప్రసాద్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • నీకిప్పుడు కావలసింది
  పూలు రాల్చిన కొమ్మలానో
  ఆకులు రాల్చిన చెట్టులానో ఉండటం కాదు
  చెట్టుని రాల్చిన ఆకాశంలా ఉండటం
  ఆకాశాన్ని రాల్చిన అనంతమై పోవటం
  -Great.

 • ఉన్నట్టనిపించేదంతా లేనట్టేనేమో! లేనేలేనట్టనిపించేదే అసలున్నట్టేమో!

 • నీకిప్పుడు కావలసింది
  పూలు రాల్చిన కొమ్మలానో
  ఆకులు రాల్చిన చెట్టులానో ఉండటం కాదు
  చెట్టుని రాల్చిన ఆకాశంలా ఉండటం
  ఆకాశాన్ని రాల్చిన అనంతమై పోవటం…..Nice lines

 • మీకూ ఆకాశానికి అనంతమైన స్నేహం సుమా…
  కవిత బాగుంది ప్రసాద్ గారు

 • నీకిప్పుడు కావలసింది పూలు రాల్చిన కొమ్మలానో ఆకులు రాల్చిన చెట్టులానో ఉండటం కాదు చెట్టుని రాల్చిన ఆకాశంలా ఉండటం ఆకాశాన్ని రాల్చిన అనంతమై పోవటం.. అద్భుతంగా ఉంది ప్రసాద్ గారు. .. నిఝమే.. అంతా భ్రమే మరి… మాయాలోకంలో ఉన్నాం.

 • పదాల్లో భావచిత్రాలు చిత్రీకరించడం గొప్పగా చేసారు –చెట్టును రాల్చిన ఆకాశం, ఆకాశాన్ని రాల్చిన అనంతం, నిద్రను తట్టిన చప్పుడు లాంటివి. 👌👌

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు