1
కవిత్వం
తెల్ల కాగితంపై
నల్లని సిరాతలం
నాజూకుగా పెంచే కుసుమం
కవిత్వం.
—
2
మణిహారం
తెరుస్తున్న
తలపులు
తీర్చిన
మణిహారం
కవిత్వం.
—
3
మంత్రం
క్షరాన్ని
అక్షరంగా మలిచే
మంత్రమే
కవిత్వం.
—
Copyright © Saaranga Books.
నల్లని సిరాతలం