కవి ఇంట్లో
ఓ దొంగ దోచుకోవడానికి వచ్చాడు
కవి చనిపోయి
పధ్నాలుగేళ్లయ్యింది.
ప్రస్తుతం ఆ ఇంట్లో
అతని కూతురు నివసిస్తుంది.
ఆమె ఊరికెళ్లినప్పుడు
దొంగ
టీవి వగయిరాలు ఎత్తుక పోయాడు.
తనివి తీరక
మరుసటి రోజు మళ్లీ వచ్చాడు.
యధాలాపంగా
గోడ పైన కవి ఫోటోను చూశాడు,
జ్ఞాపికల దొంతరలను గమనించాడు
అంతే!
ఇది కవి ఇల్లా అని ఖంగు తిన్నాడు
పైగా తన కిష్టమైన కవి.
దోచుకున్న వస్తువుల్ని తీసు కొచ్చి
ఇంట్లో వదిలి పోయాడు
వెళ్తూ వెళ్తూ
ఇంటి గోడకు
ఓ లేఖను అంటించి పోయాడు
క్షమించమని.
నిజానికి
కవే పెద్ద దొంగ
ప్రజాహృదయాన్ని
కొల్ల గొట్టాడు కాబట్టి.
(సుప్రసిద్ధ మరాటీ కవి కీ.శే. నారాయణ సుర్వేకు అంకితం)
Add comment